Friday, March 22, 2013

ఆగుమా...ఆగుమా...

ఆగుమా..ఽఅగుమా...
_________________

ఆగుమా .ఽఅగుమా .... మమ్ము వదలి పొకుమా...
ఎచ్చటికి  నీ పయనము , ఏమిటో మా నేరమూ ॥ ఆగుమా ॥

ఎందుకు నీ మనసులోనికి
వచ్చెనీ విచారమూ .... ॥ 2 టైమ్స్

యాగమహిమలు  , యోగమహిమలు
చూపు లీలలు నీవి కావా ....
 రాగములు , అనురాగముల చవి
చూపు సఖుడవు నీవు కావా,....
భోగ భాగ్యములిచ్చు దాతవు
నీకు ఈ వైరాగ్యమేల ....
చావు ,పుట్టుక లేని వాడవు
నీకు మృత్యువు బాధ లేలా ... ॥

ప్రాణముండగ  , ప్రాయముండగ 
క్షణము తపమును వీడలేదు ..
  మానవులమౌ మాదు  వేల్పుగ 
నీవు చూపని మహిమ లేదు 
మాదు  కొరకై , మంచి కొరకై 
మహిని శాంతిని నిలుపు చాలు 
మర్మమెరుగని సాయి సద్గురు 
త్యాగమేల..? సమర్పణేలా ..... ? ॥ 

నీవు లేవను తలపులే మా 
ఊహ కందని బాధలే .... 
నీదు పలుకులు వినని మాకిల 
బ్రతుకు వేదన , బరువులే ... 
నీవు చూపిన మమతయే మా 
మనసు మెచ్చిన చెలిమిలే .. 
నీవుగాకను ఎవరు మాకిల 
తొడు-నీడగ ..నిలుతురే .... ॥

రచన , శ్రిీమతి..
పుల్లాభట్ల జగదిీశ్వరిీముార్తి.
కల్యాణ్.

___________________________
__________________________


















మన్నింపుమా నన్ను....

మన్నింపుమా ...నన్ను...
__________________

మన్నింపుమా నన్ను ,మాధవ రామా రమణ
ధ్యాన్నింపగా నీదు , నామము తలచేనుగా

కన్నులందు నీదు రూపు  కలకాలము నిలిపెదర
అన్యమింక  ఎరుగను , నా మొరలను విని బ్రోవరా 
         
  మొరలనువిని  బ్రోవరా ॥ మన్నింపుమా ॥

అందరిలో నీ రూపము గంటి నేను దేవరా
అవతారము లెత్తు నీవు ఆదరింప రావయా
కలియుగ అవతార సాయి సర్వము నీవే గదా
ఫలియింపగ నాదు కోర్కె తీర్చి అభయమీయరా ॥
                                                                   
                                     ॥మన్నింపుమా॥   

తల్లివైన , తండ్రివైన , గురు, దైవము నీవెగా
మల్లియల మాలలతో నీ పూజలు సేతురా
మనసు నాది మందిరమై నిన్ను నిల్పె వేల్పుగా
మానస పూజలు గొనుమా ,వేద మంత్ర సేవలుగా

    వేద మంత్ర సేవలుగా ॥ మన్నింపుమా..॥

__________________________________
____________________________________




సాయి సాయని పిలచినంత

       సాయి , సాయని పిలచినంత .
_______________________________


సాయి సాయని పిలచినంత
 సమాధి నుండే పలికినాడవు
గాధలను మా బాధలను విని
 మమ్ము దయతో నేలినాడవు ॥సాయి... ॥

మానవునివలె మసలినాడవు
మాట తప్పవు ,మంచి దాతవు
మంచి మాటలు నేర్పినాడవు
మాకు గురువై నిలచినాడవు ॥ సాయి... ॥

కొలచినంతనే కరుణతోడను
వలయు ప్రేమను పంచినాడవు
మర్మమెరుగని మాదు  వేల్పై
మంచి బాటను చూపినాడవు ॥సాయి... ॥

శరణమనుచూ వేడినంతనే
వరములొసగి బ్రొచినాడవు
షిరిడి పురమున సిరుల నెలవై
స్థిరముగా నువు వెలసినాడవు ॥సాయి... ॥

______________________________
_________________________________