Showing posts with label దేశభక్తి గీతాలు. Show all posts
Showing posts with label దేశభక్తి గీతాలు. Show all posts

Wednesday, September 16, 2009

తెలుగు తల్లికి వందనం

తెలుగు తల్లికి వందనం.  OU గ్రుాప్ కు పంపేను.
-------------------------------

తెలుగు తల్లికి వందనం మన
వెలుగు కీర్తికి స్వాగతం !! తెలుగు !!

తెలుగు వెలుగై తరలి వచ్చెను
పలుకు తేనెల సుధలతో
మల్లె మాలల మధుర సౌరభ
మొప్పు మాటల కళలతో !! తెలుగు !!

వేదఘోషలు ,పుణ్య గాధలు
తల్లి నడిచెడు పథములు
తెలుగు తల్లికి వెలుగునిచ్చే
కీర్తి చంద్రిక తారలు
తేటగీతులు ,ఆటవెలదులు
కంద,సీసపు మాలలు
తెలుగు పద్యపు పాదములనిడు
మేలు సిరిసిరి మువ్వలు !! తెలుగు !!

విజయనగర , కాకతీయుల
ఖ్యాతి ఆమెకు వైభవం
రత్నగర్భగ పేరుతెచ్చెను
కోటినిధుల ప్రాభవం
జాతి కవులుగ పేరుగాంచిన
సుతుల కీర్తులె తేజము
ఆంధ్రకేసరి వంటి సుతులకు
మాత ఒడి తరు కల్పము !! తెలుగు !!

మేలు సంస్కృతి నిండు ధనమే
తెలుగు తల్లికి భరణము
సంప్రదాయ , సంగీత రీతులె
వన్నె తెచ్చెడి సద్ధనం
కూచిపూడి నాత్య సంపద
కొలువు తీరిన వైభవం
తెలుగుదనమే మనకు సువరం
తెలుగు బాట అదే స్వర్గం !! తెలుగు !!