Tuesday, April 13, 2021

కల నిజమైతే...

9/04/2021.
వారం వారం కవిత లో...
 ప్లవ నామ ఉగాది పై కవితల పోటీ కొరకు, 
 
 శీర్షిక : కల నిజమైతే...
 
 రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.

నీలాకాశంలో తారకలు దోబుాచులాడుతున్నాయి.
పొగ జబ్బు పడిన మేఘాలు కోలుకొని 
తేట నీటి వసంతాలాడుతున్నాయి.
కిచకిచారవాల పకలరింతకు
పచ్చని పకృతి పులకరించిపోతోంది.
ఆకుపచ్చ చీరను అలరించిన భుామాత 
మల్లె ,జాజుల మాలలనల్లి 
సిగముడిలో సింగారించింది.
గలగల పారే ఏరులు,  పంట పొలాల్లో చేరి,
విత్తు చిన్నారులతో దోబుాచులాడుతున్నాయి.
స్వశ్ఛ మైన భరతావని పరిసరాల్లో 
మనుషులందరుా మాస్క్ లు వేసుకొని
సామాజిక దుారం పాటిస్తుా  సేనిటైజర్ల
చిలకరింపుల పలకరింపులతో 
పండగ ముచ్చట్లాడుకుంటున్నారు.
అంతా చుాస్త్తున్న ఆనందంలో బొక్కబోర్లా
పడ్డ నేను, కళ్ళు తెరచి చుట్టుా చుాసేను.
"నాకు వచ్చింది కలా....అదేగానీ నిజమైతే."..
అనుకుంటుా లేచేను..పర్యావరణ రక్షణ
తో పాటు కరోనా కట్టడి నియమాలను 
పాటించాలన్న నిర్ణయంతో ప్రతిన పుానేను.
అందరుా నాతో చేతులు కలుపుతారు కదుా....
"ప్లవ నామ యుగాది "శుభాకాంక్షలతో" .మీ ...🙏
------------------------------------------------------

హామీ: నా ఈ కవిత ఏ మాధ్యమునందునుా 
ప్రచురితంకాని నా స్వీయ రచన.

Thursday, April 1, 2021

జీవితమా ! నీ విలువెంత ?

రచన : శ్రీమతి : 
పుల్లాభట్ల  జగదీశ్వరీముార్తి. 
కల్యాణ్ : మహారాష్ట్ర .

శీర్షిక : జీవితమా ! నీ విలువెంత ?.

అంటరాని వారికన్న హీనమైన
బ్రతుకు రోగాల భారీ చావులు.
కరోనా చావులకు చివరి
చుాపులు కరువైన బ్రతుకులు .
ఆగని సెల్ ఫొిన్ల నుండి 
హృదయ విదారకమైన  
ఊరడింపుల  పలకరింపులు
కరోనా రేపిన కల్లోల జీవితాల్లో 
కన్న వారు కుాడా కడుపు తీపిని
కాదనుకొనే భయంకర క్షణాలు.
పక్కవారి బాధలో పాలు
పంచుకో లేని మనిషి
మాముాలు చావును కుాడా
అనుమానించి ఆరాతీసే స్థితి.
చేదు అనుభవాల చెడుగుడు 
ఛేదించలేని బతుకు నీరస గతి.
కాష్టాలో కరువైన ముాడడుగుల 
కొలత, నోట్ల బరువుతో  తీర్చే 
ముదనష్టపు క్రిమిటోరియం ఘనత.
లక్షల శవాలు కాలిన బుాడిద
 పాప చిహ్నాల పాతరలో ఒకటై
 ఉచ్ఛ ,నీచ ,జాతి ,మతాలను  
 మరచి  మట్టిలో కలిసిపోతోంది.
 బ్రతుకు స్వాశ బారెడు ఆశతో
 మానవత్వాన్ని మంటపెడుతుా
 అందని ఆనందం కోసం అక్రమాల
 దారుల్లో అక్లకల్లోలం సృష్టిస్తోంది.
 కరోనా కట్టడిలో కుాడా శవాల
 సేకరింపుతో కన్నీటికి వెలకడుతోంది.
 జీవితమా ! నీ విలువెంత..?