Saturday, January 21, 2023

సప్త తాళ కీర్తనలు. Index ..

Sapta Tala Keerthanalu.
*************************
Written by Srimati : Pullabhatla Jagadiswari Murthy.
(Swara kartha).
Sangeetam by : Pullabhatla Jagadiswari Murthy.
Singer : Sri : Nihal.


1. Dhyana keerthana :
Hima shaila sute..pahi Lalite...
Ragam : Purvi Kalyani .
Talam : Adi Talam.
--------------------
2. Saraswathi Prardhana.
Song : Nirupama guna sadani Vani...
Ragam : Kalyani .
Talam : Adi Talam.
-----------------------
3.  Keerthana : Akhilandeswari Shive....
Ragam : Nata .
Talam : Chaturasra jati  Dhruva Talam.
---------------------------
4. Keerthana :
Sree Raja Rajeswari Shive Sankari
Ragam : Maya malava gowla
Talam :  Chaturasra jati Mathya Talam.
------------------------------------
5. Keerthana : Saranagata vatsale..Sankari Shive..
Ragam : Aabhogi Ragam .
Talam : Chaturasra jati Jhampe Talam.
------------------------------------
6..Keerthana : Shivanandamaya lahari  Saankari....
Ragam : Hamsaanandi Ragam.
Talam: Chaturasra jati Rupaka Talam.
-----------------------------------
7..Keerthana : Bala Tripura Sundari....
Ragam : Todi Ragam.
Talam: Chaturasra Jati  Triputa Talam.
-------------------------------------
8. Keerthana : Padma lochani Bhavani....
Ragam : Sankarabharanam Ragam.
Khanda jati  Ata Talam.
-----------------------------
9..Keerthana : Rajatachalaagra Nilaye...Amba..
Ragam : Madhyamavathi Ragam 
Talam : Chaturasra Jati Eka Talam.
-----------------------------------
10. . Keerthana: Sree Raja Rajeswaree...Shive...
Ragam : Sreeragam .
Talam : Khanda Jati Eka Talam.
(Mangalam).

----------------------------------

Monday, January 16, 2023

తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య వారపత్రిక వెబ్సైట్ లింక్..* ✍️

https://thapasvimanoharam.com/weekly-magazine15-01-2023/
*15-01-2023 తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య వారపత్రిక వెబ్సైట్ లింక్..* ✍️
రచయితలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు సంక్రాంతి శుభాకాంక్షలు 💐🎊

Monday, January 9, 2023

గణతంత్రదినోత్సవం. (జనవరి 26th రిపబ్లిక్ డే.).

*మనోహరి మహిళా మాసపత్రిక కొరకు*
*తేది :⁠- 09/01/2023*
*అంశం :⁠- జనవరి 26, రిపబ్లిక్ డే సందర్బంగా*
*విభాగం :⁠- వ్యాసం*
*శీర్షిక :⁠-  గణతంత్ర దినోత్సవం*
*రచన :⁠- మాధవి కాళ్ల*

భారతదేశంలో గణతంత్ర దినోత్సవాన్ని భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజుగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం జనవరి 26ను భారత గణతంత్ర దినోత్సవంగా జరుపుతారు. 1950 జనవరి 26న భారత ప్రభుత్వ చట్టానికి (1935) బదులు భారత రాజ్యాంగం దేశపరిపాలనకు మార్చడాన్ని భారత గణతంత్ర దినోత్సవం అంటారు. భారత రాజ్యాంగ సభలో 1949 నవంబరు 26న రాజ్యాంగం ఆమోదం పొందగా భారతదేశం స్వతంత్ర గణతంత్రంగా ఆవిర్భవించేందుకు 1950 జనవరి 26లో దీనిని ఒక ప్రజాతంత్ర పరిపాలన పద్ధతితో పాటుగా అమలులోకి తీసుకురావాలని నిర్ణయించారు.

                 జనవరి 26 నే ఇందుకు ఎంచుకోవడానికి చారిత్రికమైన కారణం ఉంది. 1930లో భారత జాతీయ కాంగ్రెస్‌ పూర్ణ స్వరాజ్‌ని ఆ రోజే ప్రకటించుకుంది. అందుకు సంపూర్ణ స్వరాజ్యమైన రాజ్యాంగం అమలు ఈ రోజున చేయాలని నిర్ణయించారు.
భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుంచి గెలుపొందిన రాజనీతివేత్తలు, రాజకీయ నేతలు, వివిధ రంగాల నుంచి నామినేట్ చేసిన నిపుణులు కలిసి భారత రాజ్యాంగాన్ని చర్చలు, నిర్ణయాల ద్వారా రాశారు. 1946 నుంచి 1949 వరకూ ఈ బృందం భారత పార్లమెంటు హాలులో సమావేశమై చర్చలు చేశారు. జనవరి 26ను గణతంత్ర దినోత్సవంగా జరుపుకొన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు. ఆ రోజును స్వాతంత్ర్య దినోత్సవంగా వ్యవహరించారు. ఐతే దేశ స్వాతంత్ర్య దినం బ్రిటీషర్లు స్వయంగా నిర్ణయించడంతో నెహ్రూ తదితర జాతీయోద్యమనేతలు జనవరి 26ను దేశ గణతంత్ర దినోత్సవంగా చేశారు. భారత పార్లమెంటు హాలులో సమావేశమై చర్చలు చేశారు. జనవరి 26ను గణతంత్ర దినోత్సవంగా జరుపుకొన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు. 

గణతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ప్రభుత్వం, ప్రజలు ఘనంగా నిర్వహిస్తూంటారు. జనవరి 26 తేదీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ సెలవు దినంగా ప్రకటిస్తారు. దేశరాజధాని న్యూఢిల్లీలో జెండా ఎగరేసి ప్రసంగిస్తారు. విశాలమైన గ్రౌండ్ లో దేశంలోని ఎన్నెన్నో రాష్ట్రాలను, ప్రభుత్వ శాఖలను ప్రతిబించేందుకు వీలుగా వివిధ రాష్ట్రాల చిహ్నాలతో పెరేడ్ చేయిస్తారు.
అప్పట్లో డా.బీ.ఆర్ అంబేడ్కర్ నేతృత్వంలో రాజ్యాంగాన్ని రచించడం జరిగింది.
29వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ రాష్ట్ర శకటం తొలిసారిగా గణతంత్ర వేడుకల్లో పాలుపంచుకున్నారు
సైనిక, వాయు, నౌకా దళాలకు చెందిన పూర్తిస్థాయి మహిళా దళాలు రాజ్‌పథ్‌లో కవాతు చేస్తారు.


హమీ పత్రం :⁠- 
                      ఇది దేనికి అనువాదము , కాపీ కాదు.

Thursday, January 5, 2023

యతి మైత్రి అక్షరాలు .

ఈ క్రింది అక్షర వర్గాలలో ఒక వర్గంలోని అన్ని అక్షరాలూ పరస్పరం యతి మైత్రిలో ఉంటాయి.

అ, ఆ, ఐ, ఔ, హ, య, అం, అః
ఇ, ఈ, ఎ, ఏ, ఋ
ఉ, ఊ, ఒ, ఓ
క, ఖ, గ, ఘ, క్ష
చ, ఛ, జ, ఝ, శ, ష, స
ట, ఠ, డ, ఢ
త, థ, ద, ధ
ప, ఫ, బ, భ, వ
ణ, న
ర, ల, ఱ, ళ
పు, ఫు, బు, భు, ము, పొ, ఫొ, బొ, భొ, మొ
ఇతర నియమములు
సవరించు
హల్లుల యతి మైత్రి పాటించేటప్పుడు వాటితో కూడిన అచ్చులకు కూడా యతి మైత్రి పాటించాలి. అంటే: "చ", "జ" ఒకే యతి మైత్రి వర్గంలో ఉన్నా "చ"కి "జి"తో మైత్రి కుదరదు.
హల్లులకి యతి మైత్రి లేకపోయినా, అవి రెండూ ఋ అచ్చుతో కలిస్తే వాటి మధ్య యతి చెల్లుతుంది. ఉదాహరణకు, "ద"కు "గ" యతిమైత్రి లేకపోయినా, "దృ"కు "గృ"కు యతి కుదురుతుంది.
సంయుక్తాక్షరాలు వచ్చిన చోట, యతి కోసం ఏ అక్షరాన్నైనా గణించవచ్చు. ఉదా: "క్రొ" మొదటి అక్షరం అనుకోండి. యతి మైత్రి కోసం దీన్ని "కొ"గా గానీ "రొ"గా గానీ భావించ వచ్చు.
ప్రతి వర్గములో చివర ఉన్న అనునాసిక అక్షరానికి (ఙ, ఞ, ణ, న, మ), ఆ వర్గంలో ముందు ఉన్న నాలుగక్షరాలతో అవి బిందు పూర్వకములైతే యతి చెల్లుతుంది. ఉదాహరణకు, తథదధన వర్గములోని అనునాసికమైన "న"కు "కంద" లోని "ద"కు యతి చెల్లుతుంది. ఉచ్చారణ పరంగా "కంద"ని "కన్ద" అని పలుకుతాం. అందువలన "న్ద"లోని "న"తో యతి కుదురుతుంది.