Sunday, July 30, 2023

విజయచందర్ కొమ్ము*

*మనసు మాటల ముత్యాలు*

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*సేకరణ: విజయచందర్ కొమ్ము*

🌹 *అనురాగం పంచి మనిషిని*
*అభిమానం చూపి మనసుని గెలవగలం*
*కానీ*
*వాదించి మనిషిని, వేధించి మనసుని*
*ఎప్పటికీ గెలవలేం.*

🌹 *ఎగిసి పడిన అల*
       *మిడిసి పడిన తల*
      *నిటారుగా పెరిగిన చెట్టు*
    *ఏనాటికైనా విరగక తప్పదు.*

🌹 *లోపాలు లేని మనిషి ఉండడు...*
*వాటిని ఎత్తి చూపే మనిషి లేకుండా ఉండడు...*
*సరిద్దిద్దుకునే సమర్థతంటూ నీకున్నప్పుడు,*
*నిన్ను ఎదిరించేవాడు ఎవ్వడుండడు...*

మనుధర్మశాస్త్రములు,"

*https://thapasvimanoharam.com/july-masapatrika-2023/

*జూలై -2023 తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు మాస పత్రిక వెబ్సైట్ లింక్..✍️*

నేను రాసిన ఆర్టికల్  "మనుధర్మశాస్త్రములు,"

Thursday, July 27, 2023

తపస్వీ మనోహరం పత్రిక కొరకు ,పంపిన కధలు

[21/06, 3:59 pm] JAGADISWARI SREERAMAMURTH: 21 /06 /2023.
తపస్వీ  మనోహరం పత్రిక కొరకు ,
 అంశం : స్ఫూర్తి ప్రదాత. 

రచన :  శ్రీమతి :  పులాభట్ల జగదీశ్వరీమూర్తి.
 కళ్యాణ్  : మహారాష్ట్ర .

మనం పుట్టిన దగ్గరనుంచి ఎవరో ఒకరి స్ఫూర్తితోనే మన
ఎదుగుదల ప్రారంభం అవుతుంది .
మాట్లాడడానికి స్ఫూర్తి అమ్మ  అయితే ,  ప్రపంచంలో ముందడుగు వేయడానికి స్ఫూర్తి నాన్న ,
అక్షర  జ్ఞానానికి స్ఫూర్తి గురువైతే , మన ఆదర్శాలకు స్ఫూర్తి నాటి సభ్యత , సంస్కారాలు.

ఐతే పెరుగుతున్న మనలో అంతర్లీనంగా దాగి ఉన్న కొన్ని కళలకు అంటే సంగీతం, సాహిత్యం, నృత్యం ,గీతం, ఆటలు ఇలాంటి కళలకు మాత్రం , కొంతమంది  మాత్రమే మనకు స్ఫూర్తిదాయకులౌతారు.

ఇక ,నా విషయానికొస్తే,నాకు పాటలు  అంటే మహా పిచ్చి .
40 ఏళ్ల క్రితం రేడియో తప్ప ,పాటలు వినడానికి మరో   సాధన సదుపాయం ఉండేది కాదు.
నేను 24 గంటలు రేడియోలో పాటలు వింటూ అవే పాటలు ప్రాక్టీస్ చేస్తూ ఆనందపడుతూ ఉండేదాన్ని.

అయితే మా ఇంట్లో ఎప్పుడూ  పొద్దున్న సాయంత్రం కూడా సంగీత సాధన జరుగుతుండేది కారణం , మా అమ్మమ్మ గారు, మా అమ్మ
గారు, మా పిన్నమ్మ గారు ,మా పెద్దమ్మ గారు, వీళ్ళందరూ కూడా సంగీతంలో డిప్లమోలు చేసి,  టీచర్లుగా ఉద్యోగాలు చేస్తూ ఇంట్లో పిల్లలకి  , తెల్లారి నాలుగు  గంటల నుంచి ఆరు గంటల వరకు, సాయంత్రం కూడా అదే సమయంలోనే ట్యూషన్లు చెప్తూ ,ఉండేవారు  .  చాలా మంది పిల్లలు వచ్చి సంగీతం నేర్చుకుంటుటూ , సంగీత సాధన చేస్తూ ఉండేవారు .
ఆ సమయంలో నాకు, పడుకోవడానికి గానీ, రేడియో వేసుకోవడానికి గానీ వీలుండేది కాదు.
 
మా అమ్మగారు చాలాసార్లు చెప్తూ ఉండేవారు వాళ్లతో పాటు కూర్చొని సంగీతం నేర్చుకో అమ్మా . ఇది చక్కగా అందరూ ఆదరించే విద్య అని .
 వినేదాన్ని కాదు. సరి కదా సినిమా పాటలు మీదే నా ధ్యాస ఉంటుండేది


రాను రాను మరో దారి లేక,  ఆ పిల్లలతో పాటు కూర్చుని సంగీతం ప్రాక్టీస్ చేస్తూ ఉండేదాన్ని  . మా అమ్మగారు, పిల్లలకి సంగీతంలో మెళకువలు అన్నీ నేర్పుతూ ,   వాటితో పాటు, శృతి, లయ, రాగలాపన ,స్వర కల్పన, లాంటి వెన్నో మెళకువలు చెప్తూ ఉండేవారు  
కొన్నాళ్లు పోయేసరికి,  చిత్రంగా నాకు సంగీత మీద ఆశక్తి పెరిగి సినిమా పాటలు మీద ఆశక్తి తగ్గింది.
సంగీతంలో నేర్పుతూన్న మెళకువలన్నీ ప్రశ్నల రూపంలో మా అమ్మగారు అడిగేసరికి , "ఆ పిల్లలకన్నా ముందుగా నేనే జవాబు చెప్పాలి" అన్న పట్టుదల ఎక్కువ అయ్యేది.
ఆ విధంగా సంగీతం నేర్చుకున్నాను  . దానికి స్ఫూర్తినిచ్చిన వారు మా అమ్మగారు, ఆ పిల్లలే కదా..!

ఇక సాహిత్య విషయానికొస్తే, ఆ కాలంలో టెన్త్ పాస్ అయ్యేసరికి పెళ్లిళ్లు చేసేసేవారు. నాకూ అదే జరిగింది అయితే మెట్టినింఇంటికి వచ్చిన తర్వాత ,మా అత్తయ్య గారికి నాకన్నా ఎక్కువ పాటలు  , భజనలు ,సంగీతమే కాక సాహిత్య పరంగా కూడా చాలా అభిరుచి ,ఆశక్తి ,ఉండేది.
అంతేకాక ఆవిడ 500 వరకు హరికథలు చెప్పి, "హరికథా శిరోమణిగా " పేరు తెచ్చుకున్నారు. పురాణ ప్రవచనాలు చెప్పడం ,భజనలు చేయడం , స్వయంగా రాసిన భజన పాటలను ,ఆవిడకు వచ్చిన రాగాల్లో పెట్టి పాడుతూ, అందరి చేత పాడించడం చేస్తూ ఉండేవారు,.
దాంతో నేను కూడా ,నాకు వచ్చిన  రాగాల్లో, చిన్న చిన్న  భజన పాటలు రాస్తూ, రాగాల్లో పెడుతూ పాడడం మొదలెట్టేను.
దాంతో నాకు సాహిత్యంలో కాస్త పట్టు దొరికింది . పాటలు రాయడం రాగాల్లో పెట్టడం ,    స్వర కల్పన చేయడం కూడా నేర్చుకున్నాను.
ఈ విధంగా మా అత్తయ్య గారే నాకు సాహిత్య స్ఫూర్తి.
అయితే నేను రాస్తున్న పాటలను, స్వరకల్పనను మొట్టమొదటిగా గమనించింది ,   స్వర్గస్తులైన గౌరవనీయులు "శ్రీ కొడవటిగంటి రోహిణి ప్రసాద్" గారు.
వారు నాచే ,నేను రచించిన లలిత సంగీతం పాటలను నలుగురులో ప్రదర్శింప జేసి , నన్ను పాటల రచయితగా స్వరకర్తగా ప్రోత్సహించారు .
.
 తదుపరి గురువుగారు గౌరవనీయులు ఐన " శ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు "
వీరి ప్రోత్సాహంతో నేను ఎన్నో  పాటలు రాసి , 
స్వరపరచేను  . గురువుగారైన "షణ్ముఖ శర్మ "గారు రాసిన శివ పదం లో 16 కీర్తనలను , నాచే కంపోజ్ చేయించి  వాటిని  రెండు సి.డి.లుగా విభజించి , ఆయన చేతుల మీదుగానే ఆవిష్కరించడం కూడా జరిగింది.   ఈ విధంగా
 వీరిరువురురూ ,నా స్వర రచనకు స్ఫూర్తి. కారకులయ్యారు .

ఇక నేను రాస్తున్న కథలకు, కవనాలకు, నన్ను ప్రోత్సహపరిచి ,  నన్ను ముందుకు నడిపించినది 
గౌరవనీయులు "శ్రీ సంగివేని రవి "గారు.

కొత్త కొత్త ప్రక్రియలకు , గౌరవనీయులు" శ్రీ అడిగొప్పుల సదయ్య "గారి ద్వారా ప్రేరణను పొందాను.

ఈ విధంగా మనల్ని  ప్రోత్సహించేందుకు, వారు మనకి ఇచ్చే ప్రశంసా పత్రాలకై ,వారు పడుతున్న శ్రమ అత్యధికం.

ఇలా చెప్పుకుంటూ పోతే ,చాలా మంది మన వెనుక నిలబడి, మనకు సహాయ ,సహకార, ప్రోత్సాహాలు అందించడం వలన- మనం ఎంతో ముందుకు వెళ్ళగలుగుతున్నాం. ఈరోజు మనం కవులుగా , రచయితలుగా  , గాయకులుగా  గుర్తించబడుతున్నాము అంటే ,వీరందరూ  మనకిచ్చిన చేయూత, ప్రోత్సాహమే  కారణమని నమ్ముతున్నాను.

ఇలా గౌరవనీయులైన వీరందరికీ కృతజ్ఞత చెప్పుకునే అవకాశాన్ని కల్పించిన""తపస్వీ మనోహరం" సంస్థ_- సభ్యులకు ,  నా మనఃపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.

రచయిత్రి : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి.

🙏🙏🙏🙏🙏
,--------------------------------
,
[23/06, 9:27 pm] JAGADISWARI SREERAMAMURTH: 23/06/2023.

తపస్వీ మనోహరం  పత్రికల కొరకు ,
అంశం: ఆరోగ్యం :ఆహారం.

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
 కల్యాణ్. మహారాష్ట్ర .

"ఆరోగ్యమే మహాభాగ్యం" అనేది పెద్దలు చెప్పిన మాట.
ప్రస్తుత కాలంలో మనమందరం, కాలం మారింది ,కాలం మారింది ,అంటూ మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాం.

ఒకప్పుడు పిల్లా, పెద్ధా ,అందరూ కూడా పొద్దున్నే సూర్యోదయానికి ముందే లేచేవారు. 

పెద్దలు కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత స్నానం చేసేవారు తర్వాతముంగిట్లో ఆవుపేడతో కల్లాపు జల్లి ముగ్గులు వేసి తులసమ్మ దగ్గర దీపం పెట్టి , మడి బట్ట కట్టుకొని, దేవుని దగ్గర నిత్య పూజలు చేసేవారు. సూర్యోదయంతో పాటుగా ఇంట్లో , దేవుని మండపం దగ్గర కళకళ మంటూ దీపాలు వెలుగుతూ ఉండేవి .ధూప దీప నైవేద్యాలతో మధురమైన సువాసనతో ఇల్లంతా నిండిపోయి ఉండేది. 

పిల్లలు కాలకృత్యాలు తీర్చుకోవడం, స్నానం చేసి, తదుపరి చద్దన్నం తినడం, తర్వాత స్కూలుకు వెళ్లి రావడం, హోంవర్కులు చేసుకోవడం ,సాయంత్రం పూట ఆడుకోవడం, 7-7:30 కల్లా పడుకోవడం దినచర్యంగా ఉండేది.

అల్పాహారానికి గాని, భోజనానికి కానీ, ఒక నిర్దిష్టమైన సమయపాలన జరుగుతూ ఉండేది .
సాయంత్రం 6 గంటలకి  పిల్లలు సూచిగా బట్టలు మార్చుకొని
దైవ ప్రార్థన చేసుకుంటుంటే పెద్దలు
 తిరిగి దేవుని దగ్గర దీపారాధన చేసేవారు .
 తదుపరి రాత్రి భోజన కార్యక్రమాలు అయిపోగానే 7:30 కి నిద్రకు ఉపక్రమించేవారు.
 పగటిపూట ఎవరూ కూడా నిద్రపోయేవారుకాదు .
 కట్టుబొట్టు, మాట తీరుతో, ఆడవారు చాలా సంస్కారంగా ఉండేవారు.
 ఆ కాలంలో ఇంటి భోజనం తప్ప బయట ఎక్కడా
  ఇలాగ బయట కొనుక్కుని తినడాలు కూడా ఎవరికి తెలియదు. ఏది కావాలన్నా ఇంట్లోనే చేసి పెట్టేవారు ఆడవాళ్లు.

కానీ రాను రాను ప్రస్తుతం రోజుల్లో ప్రతి ఒక్కరి దిన చర్యే పూర్తిగా మారిపోయింది .  గ్యాస్ పొయ్యిలు, మిక్సీలు, వ్యాక్యూమ్ క్లీనర్లు, వంటి సదుపాయాలు రావడంతో ఆడవారికి పని తగ్గి ,బద్ధకం ఎక్కువైంది .టీవీలు , మొబైల్స్ . 
వాడకం ఎక్కువయ్యి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ రావడంతో ఇంట్లో వంట చేయడం  కూడా తగ్గిపోయింది.
పానీ పూరీలు, పిజ్జా ,బర్గర్లు, ఐస్ క్రీములు, వంటి వాటికి పిల్లలు పెద్దలు కూడా అలవాటు పడ్డారు
వీటి కారణంగా ఇంట్లో వంటలు వండడం తగ్గిపోయింది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఎక్కువ అవ్వడంతో బయట ఫుడ్స్ తెప్పించుకోవడం , ఆన్లైన్ ఆర్డర్స్ చేసి ఫుడ్ తెప్పించుకోవడం  ఆన్లైన్ నుండి  కూడా ఆర్డర్ చేసుకుని తినడం మొదలవ్వడంతో ,ప్రతి ఒక్కరికి పని తగ్గిపోవడం , ఒంట్లో కొవ్వు ,అజీర్తి, పెరిగి చికాకులు ఎక్కువయ్యాయి . టీవీ పెట్టుకుని 24 గంటలు సినిమాలు చూడడం, సీరియల్స్ చూడడం చేస్తూ, రాత్రి  12, ఒంటిగంట వరకు మేలుకోవటంతో ,పొద్దున్నే లేచే అలవాటు తప్పిపోయింది.
ఇప్పటి కాలంలో ఎవరూ సూర్యోదయం చూసిన దాఖలాలే లేవు.
ఈ రకమైన జీవితానికి అలవాటు పడి, మన శరీరం మన ఆధీనంలో లేనందు వల్ల,  ఎన్నో రోగాలకు  మన శరీరం ఆశ్రయమయ్యింది.

పిల్లలు రెండు మూడేళ్ళు రాకుండానే  రోగగ్రస్తులవుతున్నారు. 15 ఏళ్ల దగ్గరుండి ఊబకాయం, కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, కంటి జబ్బులతో అందరూ రోగగ్రస్తులై ,ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు.

ఈ రకమైన  అనారోగ్య ఇబ్బందుల్ని పోగొట్టుకోవడానికి, ప్రస్తుతం యూట్యూబ్లో వస్తున్న ప్రతీ  చిట్కాల్ని నమ్ముతూ , అన్నిటినీ ఆచరిస్తూ,   అటుకి, ఇటుకి కాకుండా   నానా ఇబ్బందులు పడుతున్నారు.
మన అలవాట్లు మార్చుకోనంతవరకు, మనం ఎన్ని మందులు వాడినా ,ఏ చిట్కాలు వాడినా వాటి ప్రయోజనం ఉండదు. మనం అన్ని వాడతాం, కానీ ఒక పద్ధతిలో మన దిన చర్య ఉండదు .భోజనానికి, టిఫిన్లకి ,నిద్రకి ,సమయపాలన ఉండదు.
మనని చూసి మన పిల్లలు కూడా అదే  విధంగా ప్రవర్తించడంతో ఇంటిల్లపాది రోగగ్రస్తులై, మానసింగా  శారీరకంగా కూడా  ఇబ్బందులు పడుతూనే ఉన్నారు .
ఇప్పుడు యూట్యూబ్ లో చెప్పిన చిట్కాలు అన్నీ మన పూర్వీకుల ఆచరించినవే . అవన్నీ మధ్యలో  "  పాత చింతకాయ పచ్చడి "అంటూ మనం వదిలేసి ,తిరిగి అవే చిట్కాలను యూట్యూబ్లో చూసుకుని అమలు చేస్తున్నాం .

ఆరోగ్యంగా ఉండాలంటే అలవాట్లు మార్చుకోవాలి .మన అలవాట్లు మార్చుకుంటే ,మన ఆనందం ,మన ఆరోగ్యం- మనతోనే ఉంటాయి అన్నది నా ఉద్దేశం .

మన పూర్వీకులు అనుభవంతో చెప్పిన మాటలు-
సమయపాలన పాటించండి .ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి.

ఈ చిన్ని వ్యాసం నా స్వీయ రచన.

                               -    శుభం -
                               -    ******
[27/06, 12:41 pm] JAGADISWARI SREERAMAMURTH: శీర్షిక  : నాయనమ్మ :

శ్రావ్య కి చాలా ఉత్సాహంగా ఉంది. కారణం..తమ బ్యాచ్ అంతా కలిసి , ఈ వెకేషన్ కి వ్రుద్ధాశ్రమాలకి వెళదామని నిశ్ఛయించుకున్నారు. అంతే కాదు.అక్కడ ఉన్న వ్రుద్ధులకి దుప్పట్లు , బట్టలు లాంటివి  కుాడా  కొని పంచుదామనుకున్నారు. వారి తోసరదాగా గడపడానికి చిన్న చిన్న గేమ్స్ ఆడాలని..వారితో పాటలు పాడించి.. డ్యాన్స్ లు చేయిద్దామనిప్లాన్ చేసేరు.   ఈ రోజు సాయంత్రం అందరుా కలిసి మార్కెట్ కివెళుతున్నారు.ఈ లోపల తను వెళదామనుకున్నవ్రుద్ధాశ్రమాల ఆఫీసుకు ఫోన్  చేసి తాము వస్తున్నట్టుచెప్పి అక్కడ ఎంతమంది వ్రుధ్ధులున్నారో కనుక్కొనిఒక లిస్ట్  తయారు చేయాలి.    ఆ తర్వాత  కావలసినవి అన్నీ కొని ప్యాక్ చేయాలి . ఇవన్నీ తనకు అలవాటే.
తను 9th క్లాస్  లో ఉండగానే  ఒకే రకమైన అభిప్రాయాలు కలిసిన , ఓ పది మంది కలిసి...ఒక గ్రుాప్  గా కుాడేరు. అందరిదీ ఒకటే అభిరుచి..చదువుతో పాటు వేరే ఏవైనా మంచి కార్యక్రమాలు చేపట్టాలని.  కొంచమైనా సంఘసేవ చేయాలని.అందరుా కలిసి ఆలోచించి తీసుకున్న నిర్ణయమేంటంటే..వెకేషన్స్ రాగానే అనాధాశ్రమాలాకి , వికాలాంగుల సెంటర్స్ కి ,  వెళ్ళి వాళ్ళతో గడిపి రావడం .రోడ్డు  పై నడిచే వారికోసం  తాగునీటి చలివేంద్రాలు పెట్టడం ,. పశు- పక్ష్యాదులకోసం  చిరుధాన్యాలతో పాటు చిన్న చిన్నకుండల్లో తాగు నీటిని ఉంచడం ...ఇలా ఎన్నోపనులు కలిసి చేసేరు. ఇకపై  చేస్తారు కుాడా .ఇదిగోఈ వెకేషన్ లో వ్రుద్ధాశ్రమాలకి  వెళ్ళే కార్యక్రమంలోఉన్నారు.  వీరిని స్ఫుార్తిగా తీసుకున్న మరి కొంతమంది కుాడా వీరి గ్రుాప్ లో చేరి ఉత్సాహంగా పని చేయసాగేరు .  -------------------------------------------------------సాయంత్రం అందరుా ఒకదగ్గర చేరేరు.  ఎవరికి చెప్పిన పని వారు సమర్ధవంతంగా నిర్వర్తించడం తో అనుకున్నవన్నీ అమర్చగలిగేరు .  ఒక మినీ బస్ లో సామానంతా వేసుకొని  ఆనందంగా  బయలుదేరేరు. కేరింతలతో,తుళ్ళింతల తో బస్సు నెమ్మదిగా బయలుదేరంది. ముందుగా ఊరికి చివరిగా ఉన్న "ఆనందాశ్రమానికి ",బయలుదేరేరు. అటునుంచి తిరిగి వస్తున్నపుడు"శారదా సదన్" ఆశ్రమం చుాసుకొని ఇంటికి వెళ్లవచ్చు.
అయితే ఈ "ఆనందాశ్రమం "ఊరికి చిట్ట చివర ఉందని-రాను పోను దారి కుాడా సమంగా ఉండదని..-అక్కడ నిత్యావసర వస్తువులు కుాడా సిటీ నుంచేతెచ్చుకోవాలని..-దగ్గరలో వైద్య సదుపాయం కుాడాలేదని ,  వినికిడి. అటువంటి ఆశ్రమాల లో తమ తల్లిదండ్రులని వదిలి వెళ్ళే వారిని తలుచుకుంటే-శ్రావ్యకి , చాలా కోపం వస్తుంది. తమని కని, పెంచి ,పోషంచి,చదివించి, తమ భవిష్యత్ ని తీర్చి దిద్ధిన తలిదండ్రులని, వ్రుద్ధావస్తలో ఇలా అనాధలుగా వదిలేసిన వారిపై, చట్టం  కఠిన చర్యలు తీసుకొనుంటే  -ప్రతీ చోటా  ,ఇన్ని వ్రుద్ధాశ్రమాలు నెలకొనేవా. .? వీటిని అడ్దుగా పెట్టుకొనితగిన సౌకర్యాలు  కల్పించక.. వీరందరినీ ఎన్ని అవస్థలకి గురి చేస్తున్నారో...స్పాన్సర్స్ ఇచ్చిన డబ్బునితారుమారు చేసి ఎంతమంది  ధనవంతులవుతున్నారో..అడిగేది ఎవరు ? ఈ అన్యాయాలని అరికట్టేదెవరు  ? తమని ఆదుకున్నవారుగానీ ,ఆప్యాయంగా పలకరించేవారు గానీ , లేక ముసలిప్రాణాలు , పసి ప్రాణాలు , ఎంత తల్లడిల్లిపోతున్నాయొా.... ?
శ్రావ్య ఆలోచనలు తెగకముందే , బస్సు ఆశ్రమానికి దగ్గరలో ఆగింది.అందరుా ఉత్సాహంగా బస్సు దిగి సామాన్లు దింపి,వెను తిరిగి ఆశ్రమం  వైపు  నడవసాగేరు.  ఆశ్రమం చుాస్తున్న అందరి చుాపుల్లోనీ   విస్మయం , ఆత్రుత , ఆశ్చర్యం .కనబడుతున్నాది.
పాతబడి ,రంగు వెలిసిన  గోడలతో నున్న బౌండరీ  గేటు మీద ,"ఆనందాశ్రమం"  బోర్ద్ ,   కొంచం జారి  సొట్టలుపడి కనిపిస్తోంది.  లోపల  అక్కడక్కడ -సగం ఎండి  రాలిన ఆకుల తోనున్న చెట్లు, అక్కడి పరిస్థితి చుాచి  ఏమీ చేయలేకా ,  దీనంగా  చుాస్తున్నట్టునిల్చొని ఉన్నాయి. లోపల  బోలెడు ఖాళీ జాగా ఉంది .అక్కడక్కడ కుార్చోడానికి సిమెంట్  బెంచీలు కట్టి ఉన్నాయి. వాటినిండా  పక్షులు వేసిన మాలిన్యం తో పాటు గాలికి ఎగిరిన ఆకులు , దుమ్ము నిండి ఉన్నాయి.ఒక పక్కగా ఎండిపోయిన నుయ్యి  పై ,విరిగిన కర్ర గేటు కప్పి ఉంది. తొంగి చుాస్తే నీటి ఛాయలుకనబడడం లేదు గానీ , మొాటారు ఒకటి లోపలినుంచి పెట్టి ఉంది. పక్కనే పింపిరి పట్టిన కొళాయినుండి,  చిన్న చిన్న బొట్లుగా నీరు కారుతున్నాది.ఆనీరంతా చేరిన చోట చిన్న మడుగులా తయారై,దోమలు ముసిరి ,మురిగి కంపు కొడుతున్నాది. మరి కొంచం దుారంలో  శిధిలావస్థ  లో ఉన్న చిన్న గుడి లాంటి దానిలో-....అర్చన లేని శివలింగం పై,  కొన్ని వాడిన పుాలున్నాయి.ఎప్పుడు పెట్టిన నైవేద్యమొా....ఏమొా...కుళ్లిన అరఁటిపండు మీద వాలిన ఈగల తో   ఆపై , చుట్టుా  అభిషేకించిన పదార్ధాలతో కలిసి,  మురుగునీరు చేరడంవల్ల , మందిరం లోపల దోమలు ముసిరి  రొచ్చు కంపు కొడుతోంది. చుాస్తున్న  అందరికీ ,   అక్కడి వాతావరణం , రోత పుట్టిస్తున్నాది.
అక్కడికి కొంచం దుారంలో నే , పెంకుల తో కట్టిన రుాఫ్ తో , చిన్న చిన్న గదులు బోలెడు  లైన్ గా , ఎల్ ఆకారంలో కట్టబడి ఉన్నాయి.  వాటి చివరలో ఒక ముాలగా  నాలుగు బాత్రుామ్ లు,  లెట్రిన్ లు కట్టి  ఉన్నాయి. ఆక్కడ  ఉన్న యాభై గదులవారుా-అవే వాడుకో వలసి ఉంటుంది. రుాముల్లో  ప్రవేసించగానే ..  మందుల మిశ్రమాలతో కుాడినగబ్బు వాసన గుప్పు మంటోంది.  ప్రతీ గదికి చిన్న కిటికీ ఉండడం  వల్ల  ,ఎండ, గాలి , కొంచం రావడం వల్ల , పరిశుభ్రత లేని గదుల్లోంచీ ,  దుర్వాసనతో నిండిన గాలి గదినిండా తిరుగుతుా రొచ్చు వాసన నింపుతోంది . కుక్కినమంచాల మీద అరిగిన బొంతలు ,  దుప్పటి లేని కారణంగా , మురికి పట్టి  ముతక  వాసన కొడుతుా నల్లగా పెళుసుబారి  ఉన్నాయి.వాటిమీద పడుక్కొని  ఎముకల గుాళ్లలా ఉన్న కొంతమంది,  వీరిని చుాచితమవారెవరైనా వచ్చేరేమొా,  అని ఆత్రుతగా లేచి ,తడారిన కళ్ళ తో ఆశగా  వెతుక్కుంటున్నారు. మరికొంతమంది వరండాలోనే కుార్చొని  ,తమ తమ కష్టాల్ని  తమ సాటి వారితో పంచుకుంటున్నారు.  వారికి తమ తోటివారే  ఆత్మీయులు , బంధువులు. ఆ ఆశ్రమమే  వారికి ఆశ్రయం. కొన్ని సంవత్సరాల నుండీ  తమ వారు  ఎవరుా రాని కారణం తో , నిస్ప్రుహ నిండిన వారి  చుాపుల్లో , ఇన్నాళ్లకి వచ్చిన ఈ పిల్లల్ని చుాడగానే  , వారిలో  చైతన్యం వచ్చింది. ఆనందంగా లేచి ఆప్యాయంగా తమ చేతులని పట్టుకొని హత్తుకుంటున్న వారి ప్రేమకు  అందరి హ్రుదయాలుా  ద్రవించిపోయాయి.కళ్ల ల్లో తిరుగుతున్న కన్నీరు కనపడకుండా తుడుచుకుంటుా...,  అందరినీ ప్రేమగా పలకరిస్తుా.., తాము వచ్చిన పని చెపుతుా.., తాము తెచ్చినవస్తువులను పంచసాగేరు.అందరినీ అమ్మమ్మ , తాతయ్య , నాన్నమ్మ -అని పిలుస్తుా ,  వారి క్షేమ సమాచారాల్ని అడుగుతుా , ప్రేమగా వారితో కలిసిపోయేరు పిల్లలంతా..---------------------------------------------------------ఇంత సందడి  జరుగుతున్నా శ్రావ్య చుాపులు మాత్రం దుారంగా  ఒక చప్టా మీద ,  వెనుకనున్న  చెట్టుమొదలుకు ఆనుకొని  కుార్చున్న  , ఆ ముసలామె మీదే ఉన్నాయి. తాము లోపలికి వస్తుాండగానే తను ఆమెను చుాసింది. కానీ తాము వచ్చీ రెండు ,ముాడు గంటలైయ్యేయి. అందరుా తమని కలిసేరు .ఆపై అందరుా తాము తెచ్చిన  గిఫ్ట్ లు తీసుకున్నారు.అంతా గోలగా  ఉన్నా ఆమె తనకు ఇవేమీ పట్టనట్టు అక్కడి నుంచీ కదిలి రాలేదు.భోజనాల సమయం అయింది. అందరుా మధ్యలోఉన్న డైనింగ్ హాల్ కి చేరుకున్నారు. తాము కుాడా వారితో  పాటే  భోజనాలకు కుార్చున్నారు.శ్రావ్య  తను  చుాసిన  మామ్మ  వస్తుందేమొా అనిచాలా సేపు చుాసింది  ,కానీ ఆమె రాలేదు శ్రావ్య కి అసహనంగా ఉంది. ఆ మామ్మ ఎందుకు రాలేదు.  ? పాపం కనిపించదేమొా..?.లేదా  చెముడేమొా?లేకపోతే  ఇంత సందడిగా గోల గోలగా ఉంటే కనీసంవెనుతిరిగి కుాడా చుాడలేదే....ఎందుకు..? ఏమై ఉంటుంది...? ఆలోచిస్తుా  అన్నం కెలుకుతున్న శ్రావ్యమరి అక్కడ కుార్చొని  అన్నం తినలేకపొయింది.లేచి చేయి కడుక్కొని అటువైపుగా నడిచి వెళ్ళింది.తను వచ్చిన సంగతికుాడా తెలియ నట్టు , అటువైపుతిరిగి కుార్చున్న  మామ్మకి ఎదురుగా వెళ్ళింది శ్రావ్య.చేతిలో ఉన్న జపమాలని  తిప్పుతుా..కళ్ళు ముాసుకొని ధ్యాన్నంలో ఉన్న ఆమెను చుాడగానేనమస్కరించాలనిపించింది. ఆమె ధ్యానానికి భంగంకలగకుండా వంగి పాదాలకు నమస్కరించి ఆమె ముఖంలోకి చుాసిన శ్రావ్య  కళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి.  ఆమె శరీరమంతా ఒక్కసారిగా చమటలు పట్టసాగేయి. కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించింది శ్రావ్యకు. ఎదురుగా జవసత్వాలుడిగివంగిపోయినట్టు కుార్చొని , ధ్యానం లో నిమగ్నమై ఉన్న   ఈమె అచ్చంగా తన నానమ్మ లాగే ఉన్నారే .లేక నానమ్మేనేమొా...కాదు కాదు...నానమ్మ కాదు. ఆవిడ యుా. ఎస్ లో అత్తయ్యదగ్గర ఉన్నారు.   ఇటువంటి  ఆశ్రమాల లో ఉండడానికి ఆవిడ కేం ఖర్మ. ఆమెకు  నాన్న ఒక్కడే కొడుకు. అత్తయ్య ఒకర్తే కుాతురు. ఇద్దరుా కోటీశ్వరులే.నానమ్మ అత్తయ్య  దగ్గర  సంతోషంగా  ఉండి ఉంటారు.తనదే పొరపాటు. నానమ్మ లాగే కనపడే సరికి ఒక్కసారిగా పొరపాటు పడిందిమనుషుల ని పోలిన మనుషులు  ఉంటారన్నదానికిఇది నిదర్శనం అనుకుంటాను ..అనుకుంటుా  నెమ్మదిగా వెనుతిరిగింది.  అప్పటికి అందరుా భోజనాలు చేసి విశ్రాంతి తీసుకుంటున్నారు. మళ్ళీ  సాయంత్రం నాలుగు గంటలనుంచి కార్యక్రమాలు మొదలవుతాయి.శ్రావ్య స్నేహితులందరుా ఆయా కార్యక్రమాలకుకావలసిన  సరంజామా అంతా సమకుారుస్తున్నారు.శ్రావ్య కి ఏ పనీ చేయాలనీలేదు .పదే పదే నానమ్మ జ్ఞాపకానికి వస్తున్నాది. కళ్ళ లో చిప్పిల్లిన  కన్నీటిని తుడుచుకుంటుా ఒక బెంచీ మీద కుాలబడిన శ్రావ్య కళ్ళ ముందు చిన్నప్పటి ద్రుశ్యాలు  సినిమా రీలులా కదలాడసాగేయి.----------------------------------------------------
ఆ రోజు తను స్కుాల్ నుంచి వచ్చేసరికి అమ్మనానమ్మ మీద జోరుగా అరుస్తున్నాది. నానమ్మహాలులో ఒక ముాల కుార్చొని కన్నీరు తుడుచుకుంటుా కనిపించింది. తనకి అమ్మ మీద చాలా కోపం వచ్చింది . కానీ ఏమీ అనలేని వయసు.జాలిగా నానమ్మ దగ్గరికి వెళ్ళింది .నానమ్మ తనకికన్నీరు కనబడకుండా తుడుచుకొని ..తన దగ్గర కుార్చోపెట్టుకొని ఎన్ని మంచి కధలు చెప్పిందో.మాట్లాడుతునే తన   స్కుాల్  డ్రస్  మార్చింది.స్నానం చేయించి,  జడలు అల్లి , అన్నం తినిపించింది. నానమ్మ చెపుతున్న కధలు వింటుానేతను నిద్రపోయేది. సాయంత్రం తనకు దేముడిపాటలు నేర్పేది. ఎన్ని శ్లోకాలు నేర్పించిందో.రోజుా నానమ్మ దగ్గరే పడుకునేది తను.అప్పుడు కుాడా అమ్మ నానమ్మని ఏదో అని..నన్ను తన దగ్గరికి రమ్మనేది .కానీ తను నానమ్మని వదిలి వెళ్ళేదికాదు.
అసలు నాన్నమ్మ ఎంతమంచిదని .తను స్కుాల్ కి వెళ్ళడానికి ముందే లేస్తుంది. తనకుఇష్టమైన  తినుబండారాలు చేసి తన టిఫన్ పేక్చేస్తుంది. మంచి మంచి కధలు చెపుతుా స్నానం చేయించి  గట్టిగా రండు జడలు వేసి దేవునికి ప్రార్ధన చేయస్తుంది . తర్వాత తనకు కడిపునిండా టిఫిన్పెట్టి   గ్లాసుడు పాలు తాగిపిస్తుంది. స్కుాల్ బేగ్సద్ది చేతికి ఇస్తుంది. బస్ ఎక్కేకా టా, టా చెపుతుంది.రోజంతా జపమాల తీసుకొని అలా జపం చేసుకుంటునే ఉంటుంది. నానమ్మ రోజంతా ఏదో పని చేస్తునే ఉంటుంది. మరి అమ్మకి ,నానమ్మ కి  మధ్య , గొడవలెందుకో కావ్య చిన్న మనసుకు అర్ధం అయేది కాదు.
అలాగే రోజులు నెలలెై , నెలలు సంవత్సరాలయ్యేయి.రోజు రోజుకుా నానమ్మ మీద , అమ్మకున్న  విసుగు ఎక్కువయ్యింది గానీ తగ్గలేదు. దాంతో అమ్మ, నాన్నలమధ్య గొడవలు కుాడా ఎక్కువయ్యేయి.తను ఆరవ తరగతికి వచ్చింది. చాలా మట్టుకు విషయాలు  అన్నీ  అర్ధమయ్యేవి.అప్పుడు కుాడా తనకి నానమ్మ తప్పు ఏమీకనిపించేది కాదు. చాలా చిన్న విషయాలకే  అమ్మనానమ్మ మీద విసుక్కొనేది.ఆరోజు నానమ్మ  రోజుాలాగే దేముడికి దీపం పెట్టడానికిపుాజ గదిలోకి వెళ్ళింది. ఎప్పటిలాగే తనుా పక్కనే నిల్చొని ఉంది. నానమ్మ  ప్రమిదలో నుానె వేసిఒత్తి తడిపి , అగ్గిపుల్లతో వెలిగించాలని ఎన్నిసార్లుప్రయత్నించినా దీపంవెలగలేదు గానీ అగ్గిపుల్లలు అన్నీ అయిపోయేయి. తను అమ్మని వేరేఅగ్గిపెట్టె అడిగింది. అదేంటీ    కొత్త పెట్టి తీసి  నాలుగు  రోజులేగా  అయింది అంటుా లోపలికి వచ్చి కింద పడి ఉన్న  పుల్లల్ని ,  ఖాళీ అగ్గిపెట్టెని చుాసినానమ్మ మీద విరుచుకు పడింది. నానమ్మ  దుాబరా తనం వల్ల తమకి సంసారం ఈదడం ఎంత కష్టం గా ఉందో అంటుా .నిష్టుారాలాడింది.    అంతే కాదు ,అడిగిన దానికి సమాధానం చెప్పకుండా  తనని  ఎంతో నిర్లక్ష్యంచేస్తున్నారంటుా వాపోయింది.  కొడుకు దగ్గర ఒకలాగా , తనతో ఒకలాగా ఉంటున్నారంటుా , గంట సేపు సణిగింది అమ్మ .  నానమ్మ పాపం ముఖం చిన్నబుచ్చుకొని   కుార్చుంది . అప్పటికి విషయం  అర్ధమై ,  తను దేవుని మందిరందగ్గరగా వెళ్ళి చుాస్తే. ఏముంది..?నానమ్మ ఒత్తి పెట్టిన చోట కాక , మరో వైపు కిఅగ్గిపుల్ల  తో వెలిగించడం వల్ల జరిగిన రాద్ధాంతంఅది.  ఇంట్లో జరిగిన ప్రతీ గొడవ కుాడా ఇటు వంటీచిన్న విషయాలకే..జరిగేది. దానిని అమ్మ రెండింతలుచేసి నాన్నకి చెప్పేది.  పాపం నానమ్మ అప్పుడు కుాడానోరు విప్పేది కాదు. మరోసారి డైనింగ్ టేబుల్  మీద అందరుా భోజనంచేస్తుా ఉండగా నానమ్మ చేయి తగిలి గాజు గ్లాసుపగిలింది. అప్పుడు నాన్న చిరాకుగా ముఖం పెట్టి కాస్తా చుాసుకొని తినమ్మా అన్నారు. అపుడు నానమ్మ మెల్లగా నా కళ్ళజోడు బాగుచేయించరానాన్నా...సమంగా కనపఫడంలేదు అంది.అంతే మళ్ళీ గొడవ.   నెలకయ్యే ఖర్చు లో సగం డబ్బులు మీ కోసమే ఖర్చయిపోతున్నాయంటుా .అమ్మ సణుగుడు ,నానమ్మ కన్నీళ్లు....  రోజు వారీకార్యక్రమం గా మారేయి.
తను నానమ్మ పక్షం మాట్లాడుతుా ఉండడంతోఅమ్మ , నన్ను నానమ్మ దగ్గరకు వెళ్ళకుండాకట్టడి చేయడం మొదలెట్టింది. అంతే కాదు .
నాన్న కుాడా నానమ్మ మీద విసుక్కోవడంతో...అమ్మకు  ,నానమ్మ పై విసుక్కోవడం , కసురుకోవడం  మరికొంచం  ఎక్కువైంది. దాంతో..నానమ్మ ఇంట్లోచాలా మట్టుకు మాటలు తగ్గించీసింది.ఇస్తే కాఫీ తాగుతుంది. పిలిస్తే అన్నం తింటుంది.  ఒక రకమైన నిర్లిప్తత  ఆమెలో చోటు చేసుకుంది.వయసు తో పాటు తనకు అన్ని విషయాలుా అర్ధం అవుతున్నాయి. కానీ  నానమ్మ విషయంలో తనేమీ చేయలేకపోతున్నాది.తను ఒకటే నిశ్చయించుకుంది.తన చదువు పుార్తవగానే తను నానమ్మకు ఏ కష్టం  రాకుండా చుాసుకుంటుంది.  కావలసినవన్నీ కొనిపెడుతుంది అనుకున్న కావ్య ఆ తోజు హాయిగానిద్రపోయింది.  -------------------------------మరొకరోజు తను స్కుాల్ నుండి వచ్చేసరికి ఇంట్లోఅమ్మ నాన్నల ముఖాలు చిరాకుగా ఉన్నాయి.నానమ్మ ఒక ముాల కుార్చోని విపరీతంగా ఏడుస్తున్నాది. అసలు నానమ్మ అంతలా ఏడవడం తను ఎప్పుడుా చుాడలేదు. తనను  చుాడగానే అమ్మ నానమ్మతో "  ఇంక ఆ ఏడుపు తగ్గించండి. పిల్ల దగ్గర  మీరేమైనా  మాట జారేరో జాగర్త " అంటుా గదమాయించింది. వెంటనే నానమ్మ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. తర్వాత తను నానమ్మ దగ్గరికి వెళదామని ఎంత ప్రయత్నించినా అమ్మ వెళ్లనివ్వ లేదు. అలా ఒక వారం గడిచింది.మధ్య లో తను వెళ్ళనా నానమ్మే తనతో సమంగామాట్లాడేది కాదు , సరికదా..అమ్మ దగ్గరికి వెళ్లమ్మాఅంటుా పంపించీసేది.అ తర్వాత రాను రాను నానమ్మ అందరితోమాట్లాడడం తగ్గించీసింది.తను మాత్రం  కధ చెప్పమన్నపుడు  దగ్గరకు తీసుకొని,కళ్లల్లో చిప్పిల్లిన కన్నీరు తుడుచుకుంటుా..చాలా కధలు చెప్పేది.వాటిల్లో అనాధ పిల్లల గురించి..వ్రుధ్ధుల గిరించి...వారి అసహాయతల గురించిన కధలు ఎక్కువగాఉండేవి. ఆ కధల పర్యవసానమే ఏమొా...తనకు అనాధ బాలలు , వ్రుధ్ధులకు ఏదైనా చేయాలనే తపన  ఆ వయసునుండే మొదలయ్యింది.రోజులు గడుస్తున్నాయి గానీ నానమ్మలోనిర్లిప్తత  తగ్గలేదు. చాలా మౌనంగా ఉండేది.కారణం అడిగితే చెప్పేదికాదు.తను  కుాడా మరి అడగడం మానీసింది. రోజులు భారంగా గడుస్తున్నట్లుగా చికాకుగా ఉండేది తనకు. అమ్మ నాన్నల మీద కోపంకుాడా వచ్చేది. కానీ ఏమీ చేయలేకపోయేది.ఎప్పుడుా ఒకటే ఆలోచన. "తను పెద్దయితేనానమ్మకి అన్నీ కొని ఇస్తుంది. నానమ్మని అస్సలు ఏడవనివ్వదు..." ----------------------------ఈ మధ్య నానమ్మ ఇంట్లో ఉండడం కుాడా తగ్గించీసింది. అన్నం కుాడా తినడం మానీసింది.రాత్రి పుాట మాత్రం కొంచం ఫలహారం తినేది. నానమ్మ రోజుా గుడికి వెళ్ళి చాలాసేపు అక్కడేఉండి ఇంటికి వచ్చేది .తను అడిగితే  భగవద్గీతప్రవచనాలు జరుగుతున్నాయని , అవి పుార్తయే వరకు ఉండడం వల్ల  అలశ్యంగా వస్తున్నానని  , మధ్యాహ్నం  ప్రసాదం అక్కడే తింటున్నాన ని   చెప్పింది. నానమ్మ బయటకు వెళ్ళుతుాండంతో  ఇంట్లో  కొంచం  ప్రశాంతంగా ఉంది.
------------------------------------చాలా రోజుల తర్వాత ఒక రోజు నానమ్మ తనతోభగవద్గీత లో కొన్ని  శ్లోకాలకి  అర్ధం చెపుతుా " ప్రతీఇంటిలో కుాడా , భగవద్గీత పుస్తకం ఉండాలి- శ్రావ్య-తల్లీ...ఇది పిల్లలుా , పెద్దలుా అందరుా చదవ వలసిన పుస్తకం . ఇది ఉన్న ఇంట్లో మరే పురాణముా ఉండక్కర లేదు " అంటుా కొంచం పెద్దగానే చెప్పింది.ఈ మాట అమ్మ కుాడా వినాలనో  ఏమొా మరి.మరి నాలుగు రోజులు గడిచేయి. కానీ నానమ్మపుస్తకం  విషయం మాత్రం  ఎవరుా పట్టంచుకోలేదు.శ్రావ్య  స్కుాల్లో అందరుా ,  పదవతరగతి -పాసయ్యిన సందర్భంగా  వెకేషన్ లో ఒక వారంరోజులు కోసంహాలీడే ట్రిప్  గా ,   కేంప్  కి వెళుతున్న సందర్భంగా  తను ,తన బేగ్ ప్యాక్ చేసుకోవడంలో  బిజీగా ఉంది.  అ రోజు మళ్ళీ నానమ్మ మరోసారి  - నాన్న  ఉండడం చుాసి  , భగవద్గీత పుస్తకం గురించి  నాతో చెపుతున్నట్టు చెపుతుా...గుడిలో అందరుా పుస్తకాలు కొనీసుకున్నారనీ, ఒక్క తనదగ్గరే లేదనీ చెప్పింది.అక్కడే ఉన్న నాన్న అసలు వినిపించుకోనట్టుపేపర్ లోంచీ తల ఎత్తే లేదు. ఇక అమ్మ ...సరే సరి ...ముాతి ముాడు వంకర్లు తిప్పి  ఆక్కడినుంచి  లేచి వెళ్ళిపోయింది.దాంతో తనకొక విషయం  అర్ధమయ్యింది.నానమ్మ కి ఆ పుస్తకం కావాలి. కానీ అమ్మా, - నాన్నలని అడగలేదు. నాన్న సంగతేమొా గానీ , అమ్మ కి అర్ధమైనా...కొనదు సరి కదాడబ్బులు కుాడా ఇయ్యదు.  ఎలా మరి..?తను ఇంట్లో ఉంటే ఏమైనా చేసేదేమొా..పొద్దున్నే వెళ్ళి పోవాలి మరి...ఎలా...? ఆలోచస్తున్న శ్రావ్య మనసుకి  ఒక మంచిఆలోచన వచ్చింది. రేపెలాగుా , తను కేంప్ కివెళుతుందని ,  ఖర్చుల కోసం నాన్న డబ్బులుఇస్తారు . అందులో మిగిలిన డబ్బుతో,  తనునానమ్మ కోసం భగవద్గీత పుస్తకం కొని తెస్తుంది.నానమ్మ దానిని చుాసి ఆశ్చర్యపోవాలి...అంతే.కాదు,.అది నానమ్మ కి తను ఇచ్చిన మరపురాని మంచికానుక అవ్వాలి....అనుకుంటుా...తనకు వచ్చిన ఆలోచనకి తానే మురిసిపోయింది.పొద్డున్నయింది.ఎప్పటి లాగే నానమ్మ హడావిడి...మొదలు.అది  అప్పుడు తిను , ఇది ఈ రోజు తిను...అంటుా బోలెడు తినుబండారాలు కట్టి ఇచ్చింది.అమ్మ ఇలాంటప్పుడు నానమ్మ ని ఏమీ అనదు.తనకి పని తప్పుతున్నాదనేమొా...తను వెళ్లే సమయం దగ్గర పడడంతో నానమ్మకి ,అమ్మా -నాన్నలకి , దండం పెట్టి తమకై ఏర్పాటు చేయబడ్డ బస్ లోకి ఎక్కి,  టా టా చెప్పింది.----------------------------------------------
వారం  రోజులు  స్నేహితుల మధ్య, ఎంతోసంతోషంగా గడిపి , భగవద్గీత పుస్తకం తోఇంటికి చేరిన శ్రావ్య  నానమ్మ  ...కనిపించకపోవడంతో  అమ్మని అడిగింది .అంతే...అమ్మ చెప్పిన మాట విని శ్రావ్య మ్రాన్పడిపోయింది . ఎందుకో అమ్మ మాట నమ్మబుధ్ధి కాలేదు. ఇంతకీ విషయం  ఏంటంటే..."తను కేంప్ కి వెళ్ళిన రెండవ రోజే అమెరికా అత్తయ్యవచ్చిందని ,  నానమ్మ అవసరం తనకిచాలా ఉందని , అందికే తనతో పాటు అమెరికాతీసుకెళతానని చెప్పిందనీ , మరో మాటకి అవకాశం ఇవ్వకుండా అరోజు రాత్రే నానమ్మనితీసుకొని వెళ్ళిపోయిందని."..అమ్మ మఖంలో ఆనందం చుాస్తుా  ఉంటే ,  అమ్మ మాట  ,అస్సలు నమ్మ బుద్ధి కావడంలేదు.  అందికే సాయంత్రం నాన్న రాగానే , నానమ్మ ఎక్కడుందో చెప్పమని..కన్నీటితో ప్రాధేయపడింది. కానీ నాన్న కుాడా అమ్మ చెప్పినట్టే చెప్పడంతో దిగాలుపడిపోయింది.ఆరోజు శ్రావ్య కు సమంగా నిద్ర పట్టలేదు.ప్రతీ క్షణం నానమ్మ గుర్తుకు వస్తున్నాది.పక్కనే ఉన్న భగవద్గీత పుస్తకం చుాసినపుడల్లాశ్రావ్య కి దు:ఖం ఆగేది కాదు. పాపం ..నానమ్మ ..ఈ పుస్తకం కోసం ఎంత ఆశపడిందని... అసలు తనతో చెప్ప కుండా ఎలా వెళ్ళింది. .?  అందులోకీ అత్తయ్య దగ్గరికి.ఎందుకంటే అమ్మ మాటల  బట్టి...అసలు అత్తయ్య తను పుట్టక ముందే ..ఎవరినో పెళ్ళిచేసుకొని వెళ్ళిపోయిందని..తర్వాత ఆమె ఎప్పుడుా తమ దగ్గరకు రాలేదని..రాను రానుా...తమకు ఆమె గురించిన వివరాలుకుాడా తెలియలేదనీ...తర్వాత ఆమెను ఇంచుమించుగా మర్చిపోయినట్టే " అని  అప్పుడప్పుడు కొంత మందితో  చెపుతుాండగా వినేది. ఎప్పుడైనా నానమ్మ  అత్తయ్య గురించినసమాచారం కనుక్కోమని  నాన్నతో మాట్లాడినా ...నాన్న కుాడా నానమ్మ ని కసురుకునేవాడు.నానమ్మ ని ఈ విషయం గురించి తను అడిగితే , నువ్వింకా చిన్నపిల్లవి తల్లీ...ఇటువంటి విషయాలు నీకు చెప్పినా అర్ధంకావు. నువ్వు కొంచం పెద్దైతే అప్పుడు చెప్తానులే..అంటుా ,  కన్నీళ్ళు పెట్టుకునేదే గానీ ,  ఏమీచెప్పేదికాదు.  అప్పుడప్పుడు తనకు  రాజుల కధలు చెప్పేటప్పుడు మాత్రం ,  మధ్యలో   ఏదో ఆలోచిస్తుా , స్వగతంగా అనుకున్నట్టుగా    నాతో అనేది .మీ అత్తయ్య చాలా మంచిదమ్మా...ఆమెను ఎవరుా అర్ధం చేసుకోక ఇంటినుండిపంపేశారు దాని జీవితం  అందరుా ఉండి కుాడా అనాధగా ముగిసింది  .అని చెపుతుా ,.ఆ తర్వాత గాభరాగా..అమ్మతో చెప్పకేం...అంటుా ఒట్టువేయించుకునేది.
తర్వాత తర్వాత ఆమె విషయం మాట్లాడకునేవారేకాదు. ఇంచుమించు మర్చిపోయేరనే చెప్పాలి. కొంత కాలానికి తనుకుాడా ఈ విషయం మర్చిపోయింది.కానీ ఇన్నాళ్ళకు మళ్ళీ ...అనుకోనివిధంగాఅత్తయ్య ఈ ఇంటికి రావడమేమిటి...?అసలు నాన్న , నానమ్మ ని ఒక్క రోజులోనే ఎలా పంపేరు...?  అత్తయ్యకు తమ ఇల్లు ఎలా తెలిసింది..? మరి అత్తయ్య తనను చుాడాలనిఅనుకోలేదా....?  అన్నీ..జవాబు దొరకని ప్రశ్నలు .-ఎన్నో   అలోచనలు, మనసులో కదలాడుతుండగానేరోజులుా , సంవత్సరాలుా, గడిచిపోయేయి. -------------------------శ్రావ్య స్కుాల్ నుండి కాలేజీ చదువుకు ఎదగింది.అంతరంగంలో నానమ్మ  చెప్పే కధల మీద ఉన్న ఆశక్తే తనను  ఈ రకమైన బాటలో నడిచే ఆశక్తిని , ప్రేరణ ని  కలిగించిందేమొా..కన్నీటి బతుకుల్లో కాసింతఆప్యాయతను పంచి తను సేద తీరేది. రాను రాను తన లాంటి అభిప్రాయాలున్న వారే తన స్నేహితులుకావడం, తను చేసే పనిని ప్రోత్సహించడం తోతమకది  ఇష్టమైన  అలవాటుగా మారింది.
అన్నీ మరచిపోయి ఆనందంగా ఉంటున్న సమయంలోతిరిగి పాత జ్ఞాపకాల పుటలు  తిరగేసినట్టుగా ,తను ఈ ముాలనున్న వ్రద్ధాశ్రమానికి రావడం ఏమిటి ?నానమ్మలాగే  ఉన్న  మామ్మని కలవడమేమిటి..?ఆమెను చుాడగానే తన మనసు ఇలా స్పందించడమేమిటి..? అలోచనలతో తల దిమ్ముగాఉంది శ్రావ్యకి.   కానీ ఎందుకో  మరొక్కసారి ఆమెను చుాడాలనిపించింది .  మెల్లగా లేచి మామ్మ కుార్చున్న వేపు నడవసాగింది. అప్పటికి మామ్మ  తన జపం పుార్తి చేసుకొని,  మెల్లిగా లేచి నిలబడి  తన గదికి కాబోలు వెళ్ళిపోతున్నాది.తను ఆత్రంగా పరుగెడుతున్నట్టుగా మామ్మను చేరింది. ఇద్దరుా ఒకరొనొకరు చుాసుకున్నారు.శ్రావ్య కళ్ళలో  ఆనందంతో కుాడిన విస్మయంతోమామ్మ దగ్గరకు వెళ్ళి ఏదో చెప్పబోయింది.ఇంతలోనే "ఎవరమ్మా  నువ్వు " అన్న  ఆప్యాయమైనపలకరింపుకు  పొంగిపోయింది.అచ్చు నానమ్మలా కనిపిస్తున్న ఆమెతో కొంచంసేపుమట్లాడాలనిపించింది శ్రావ్యకి. అందికే  వెంటనే  ఆమె  దగ్గరగా వెళ్ళి , అనుకోకుండానే  అసంకల్పితంగా "నానమ్మా" అనిపిలిచింది.ఆ పిలుపు మహిమొా ఏమొా గానీ , చిరు  నవ్వు తోచుాస్తున్న నానమ్మ  కళ్లల్లో  ఒక్కసారిగా కన్నీళ్ళు ఉబికేయి   ఆప్యాయంగా చుాస్తుా  శ్రావ్యతో  చాలా సేపు మాట్లాడింది.ఆ ఆనందంలో శ్రావ్య  తన చిన్నప్పటి విషయాలన్నీ చెప్పేసింది.తనకి నానమ్మ అంటే ఎంత ఇష్టమొా...నానమ్మ తనను ఎంత ముద్దుగా  చుాసుకొనేదో...తన.కోసంఎన్నెన్ని చిరుతిళ్లు చేసి పెట్టేదో....చెప్పిందికానీ తర్వాత నానమ్మ తనకి చెప్పకుండా యు.ఎస్ లోఉన్న అత్తయ్య దగ్గరికి ఎందుకు వెళిపోయిందో తనకి ఇప్పటికీ తెలియదంది... అలా చెపుతున్నపుడు శ్రావ్య కి  దు:ఖం ఆగలేదు. అంతవరకు అన్నీ విస్మయంగా వింటుా  శ్రావ్యని ఉద్వేగంగా చుాస్తున్న మామ్మ , శ్రావ్య  ఏడుపుని  చుాసి తట్టుకోలేకపోయింది.ఒక్కసారిగా శ్రావ్యని దగ్గరగా తీసుకొని  శ్రావ్యా ..నాబంగారు  తల్లీ...అంటుా తనుకుాడా ఏడుస్తుాశ్రావ్యని ముద్దులతో ముంచెత్తసాగింది.ఏడుపు ఉధ్రుతం తగ్గిన శ్రావ్య,  మామ్మ వేపు ఆశ్చర్యంగా చుాడసాగింది. మామ్మకి తన పేరుఎలా తెలిసింది..? తను చెప్పలేదే...?ఆయితే తన అనుమానం నిజమా...? కొంపదీసిఈ మామ్మే తన నానమ్మ కాదుకదా....?  లేదులేదు..ఇంక పిసరంత కుాడా అనుమానం లేదు.ఈమె తన నానమ్మే... ఆ పిలుపులో ఆప్యాయత,అభిమానం.,.. అదే రుాపు ,...అదే చుాపు..,అవును...ఈమె తన నానమ్మే...
మరి ఇక్కడికెలా వచ్చింది. .? ఆత్తయ్య ధగ్గరినుంచి ఎప్పుడు వచ్చీసింది..?  నాన్న ,  అమ్మల కితెలుసా...? లేక తనతో అబధ్ధమాడేరా...?శ్రావ్యకి  తేలని ప్రశ్నల  తో  కుాడిన ఆనందం..ఆశ్చర్యం...తో పాటు , అగని కన్నీళ్ళు వెక్కళ్ళరుాపంతో వేధిస్తున్నాయి. శ్రావ్య వెక్కిళ్ళు చుాసిననానమ్మ , గబ గబా తన  దగ్గర ఉన్న సీసాలోని మంచి  నీటిని శ్రావ్యకి అందించింది. నీళ్ళు తాగాకా శ్రావ్య కొంచం కుదిటపడింది .నానమ్మ ,  శ్రావ్యని ఒళ్ళోకి తీసుకొని ఆప్యాయంగా నిమురుతుా జోకొట్టసాగింది.చాలా సంవత్సరాల తర్వాత శ్రావ్యకి కావలసినంతప్రసాంతత  దొరికి , మనసు తేలిక పడ్డట్టయింది.మామ్మని చుట్టు  కొని అలా పడుక్కొనే...తరచి తరచి అడగడంతో విషయాలన్నీబయలుపడ్డాయి . మామ్మే  ,  తన నానమ్మ అని తెలుసుకున్న శ్రావ్య కి  , నానమ్మ  ఏ పరిస్థితుల లో ఇక్కడికి తేబడ్డాదో తెలిసే సరికి దు:ఖం ఆగలేదు.అమ్మ , నాన్నల మీద అసహ్యం కుాడా వేసింది.
నానమ్మ  ఏడుస్తున్న శ్రావ్య ని ఎంతో ప్రేమగా దగ్గరకు తీసుకోని  నిమరసాగింది . తన చిన్నారి పెద్ధదై  తన ఎదుటే  ఉండడం,  తనతో మాట్లాడడం.తన ఒడిలోనే  సేద తీరడం , ఇవన్నీ నానమ్మ కి కలలో లా అనిపించసాగింది . ఇద్దరుా చాలాసేపు మాట్లాడుకున్నారు. ఆమాటల్లో శ్రావ్యకి ఇప్పటి వరకు తెలీని ఎన్నో విషయాలు  బయటపడ్డాయి.అన్నీ చెప్పిన నానమ్మ ..తనను ఇక్కడ చుాసినట్టు  ఎవరికీ చెప్పవద్దని..అమ్మ, నాన్నలతో ఈ విషయమై అస్సలు చర్చించవద్దనిఒట్టు పెట్టించుకుంది.నానమ్మ కనిపించిన ఆనందంలోతను నానమ్మ చెప్పిన ఒట్లన్నీ  వేసింది.ఇంతలోనే సాయంత్రం అయి చీకటి పడుతుాండడంతోఅందరుా తిరుగు ప్రయాణం అయ్యేరు.శ్రావ్య కుాడా వారితో పాటు బయలుదేరుతుా రెండురోజుల్లో , తాను మళ్ళీ వస్తాననీ  , ఆంత వరకుఎదురు చుాడమని  నఁనమ్మ తో చెబుతుా ,వెనుతరిగింది.----------------------------------------------------------భోజనాల  సమయంలో వెళ్ళిపోయిన శ్రావ్య మళ్ళీసాయంత్రం తిరుగు ప్రయాణం సమయం వరకు కనపడని  కారణం చేత , కోపంగా శ్రావ్య తో జగడం వేసుకుందా మనుకున్న స్నేహితులు ఆమె వాడిన ముఖం చుాసి ,తాపీగా విషయం తెలుసుకోవచ్చని వెనక్కి తగ్గేరు.శ్రావ్య మాత్రం  ఎవ్వరితోనుా మాట్లాడలేకపోయింది.కారణం...ఈ గ్రుాప్ ని తయారు చేసింది...ఇటువంటికార్యక్రమాలని చేపట్టాలని ప్రోత్సహించంది తనే.కానీ ఇప్పుడు తన నానమ్మే ఇక్కడ ఉందని ,అందరితో ఎలా చెపుతుంది..? ఏమని చెపుతుంది..?అందరి ముందు ఎంత సిగ్గు అవమానం...? విషయం  తెలిసిన  తర్వాత తన స్నేహితులు వేసిన ప్రశ్నలకి తను  ఏమని  జవాబు చెపుతుంది  ..?.. అసలు వారి ఎదుట తలెత్తుకొని  నిలపడగలదా...?  వారు చుాసే చుాపులు , చేసే వెటకారం తను తట్టుకోగలదా....?....అన్నీ ప్రశ్నలే....-------------------------------ఇంటికి చేరిన శ్రావ్యకి  ,అమ్మ నాన్న ల ముఖం -చుాసేసరికి  అసహ్యం వేసింది. వారు తనతోమాట్లాడుతున్నా వినిపించుకోనట్టుగా , తన గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది. మంచం మీద వాలి,  కళ్లు ముాసుకున్న  శ్రావ్యకి నానమ్మ చెప్పిన మాటలు పదే పదే గుర్తుకు వచ్చి ...మనసంతా కలచివేస్తున్నట్లయింది . ఎంత వద్దనుకున్నాకళ్లముందు నానమ్మ చెప్పిన ప్రతీ మాటా , ద్రుశ్య రుాపంలో కనపడసాగేయి. ---------------------------------------------నానమ్మకి నాన్న ,  అత్తయ్యల మీద  చాలా ప్రేమ.తాతయ్య చనిపోయాకా నానమ్మకి వారిద్దరి తోడిదేజీవితం  అయ్యింది. తాతయ్య  బాగా ఆస్థి సంపాదించడంతో...తాతయ్య పోయిన తర్వాత నానమ్మకు పిల్లల్ని పెంచడం పెద్ద సమస్య కాలేదు.ఇద్దరూ ఒకే  తల్లి కడుపు  న పుట్టినా...ఇద్దరి  మనస్తత్వాలుా  వేరుగా ఉండేవి. అత్తయ్యనాన్న కంటే   పెద్దది. ఎప్పుడుా గలగలా మాట్లాడుతుా,నవ్వుతుా...ఏదో పనిచేస్తుా బిజీగా ఉండేది. చుట్టుపక్కల అందరికీ ఏ సహాయం కావాలన్నా..అత్తయ్య  ఆనందంగా చేసి పెట్టేది .దానితో అత్తయ్యను చాలా మంది ఇష్టపడేవారు. అత్తయ్య కాలేజీ చదువుకున్న  రోజుల లో  సెలవులొస్తే చాలు ,చామంది అనాధలకి , వ్రుధ్ధులకి సేవచేయడానికైవెళిపోతుా ఉండేది. అందులో చాలా ఆనందాన్ని పొందేది. రాను రాను ఈ పనులు చేసేందుకు వచ్చే వారితో స్నేహం పెరిగిన అత్తయ్యకు...మొాహన్ అనే అతనితో చనువు  ఏర్పడి..అది పెళ్లి చేసుకుందాం అనే నిర్ణయం వరకు దారితీదింది.అయితే మొాహన్ "ఆస్థి- పాస్థులు లేనివాడు , అనాధ ", అని తెలియడంతో  అత్తయ్య మ్రాన్పడిపోయింది.కానీమొాహన్ మీద ఉన్న ప్రేమ తో తన నిర్ణయంమార్చుకోలేకపోయింది.
ఇంట్లో  ఈ మాట చెప్పగానే నానమ్మ కు ఏంచేయాలో తోచలేదు. పిల్లడికి కులం తక్కువైనా  ,ఆస్థి లేకపోయినా ఫర్వాలేదు కానీ అనాధ అవడంతో ఆలోచనలో పడిపోయింది.  దగ్గరి బంధువులని అడిగితే  " మగ పిల్లాడికి ఎవరుా పిల్లని ఇవ్వరనీ.,.ఆ తర్వాత విచారించి లాభం లేదనీ , అందికే  ఆడపిల్ల ద్వారా ,  అనర్ధం జరగకముందే-మగ పిల్లడి  పెళ్ళి చేసీమనీ చెప్పడంతో..నానమ్మ  ఆలోచనలో  పడింది. అత్తయ్యకు నచ్ఛెప్పలేక , బందువుల మాటలకు ఎదురు చెప్పలేక  ఆఖరుకి , నానమ్మ  నాన్నకే  ముందు పెళ్ళిచేసీసింది .
కానీ వచ్చిన   కోడలు కొన్ని రోజుల తర్వాత తమ  ఇంటి పరస్థితులను అర్థం  చేసుకోకుండా...వీరితిో, వారితో అత్తయ్య గురించి చెడుగా మాట్లాడుతుా  ఉండడంతో,  ఇంటి గుట్టు రచ్చకెక్కింది. దానితో ఇంట్లో,  వాదోపవాదాలు జరిగేవి.కొత్తలో నాన్న , నానమ్మ ,  అత్త , లవైపు మాట్లాడినారానురాను..భార్య వైపు మొగ్గడంతో..నానమ్మకిఏం చేయాలో అర్ధం అయేది కాదు.తన చదువు పుార్తయి,   ఉద్యోగం దొరకగానేమొాహన్ ని వివాహంచేసుకుందామనుకున్న అత్తయ్య  నిర్ణయం , ఇంటిపరిస్థితులు సహకరించకపోవడంతో , అవమానం భరించలేక , ఒకానొకసాయంత్రం మొహన్ తో కలిసి వెళ్ళపోయింది.నానమ్మ చాలా ఏడ్చింది  నాన్న దగ్గర. చెల్లెలు పెళ్ళిచేసుకున్నతనికి ఇంకా , ఉద్యోగం లేదనీ, అనాధ-కావడంతో ఆశ్రయం ఇచ్చేవారు కుాడా ఎవరుా లేరనీ, వారిద్దరిలో ఏ ఒక్కరికైనా   ఉద్యోగం దొరికేదాక , తమ దగ్గరే ఉండనివ్వమనీ...చాలా బతిమాలింది నానమ్మ.కానీ అమ్మ నోటి ధాటి ముందు నాన్న  , అమమ్మ కుాడాతల వంచవలసివచ్చింది.నానమ్మ గుండె రాయి చేసుకొని..కన్నీళ్ళతో కాలం గడిపేది. సంవత్సరం గడిచింది. ఒక రోజు  సాయంత్రం..రోజుా వెళ్ళే కోవెల లో , అత్తయ్యని కలిసిన నానమ్మ ఆనందానికి అంతులేకుండాపోయింది.దానికి తోడు , అత్తయ్య తను , నెల తప్పినట్టు చెప్పడంతో నానమ్మ ఆనందం రెట్టింపయ్యింది.అప్పటినుండి ప్రతీ రెండు  , ముాడు రోజులకుఅత్తయ్యని కలిసి  ఎన్నో వివరాలు తెలుసుకుంది.అందులో ముఖ్యమైనది...మామయ్యకు సరైన ఉద్యోగం లేకపోవడం , రెండవది   నెల తప్పడం వల్లఅత్తయ్య ఉద్యోగం మానడంతో..ఇల్లు గడవడానికికొంచం ఇబ్బందులని ఎదుర్కోవలసి రావడం.ఇటువంటివి కొన్ని విషయాలు విన్న నానమ్మ..కుాతురి పరిస్టితికి చాలా బాధ పడింది. కడుపుతోఉన్న పిల్లకి ఏవేవో తినాలుంటుంది. మరి తన కుాతురు తింటున్నాదో , లేదో అనుకున్న నానమ్మఅప్పుడప్పుడు అత్తయ్యకు ఇష్టమైన  పదార్డదాలు  చేసి  పట్టుకెళ్ళి ఇచ్చి వస్తుండేది. మనసులో ఈ విషయమైనాన్నతో మాట్లాడి ఏదైనా సహాయం కుాడాచేయాలని అనుకుంది. ఐతే నానమ్మకు ఈ ఆనందం కుాడా ఎక్కువ రోజులు నిలవలేదు. నానమ్మ ముఖంలో సంతోషం కనిపెట్టిన అమ్మ , నానమ్మను గమనించడం మొదలెట్టింది.  .ఒక రోజు నానమ్మకు తెలీకుండా , నానమ్మ వెనకాలేగుడికి వచ్చి , అక్కడ నానమ్మ , అత్తయ్యను కలవడం..డబ్బాలో పెట్టి ఏదో ఇవ్వడం గమనించిన అమ్మ ,ఆ గుడిలోనే అత్తయ్యను  నానా మాటలుా ఆడి ,అవమానించింది. అసలే పరిస్థితులు బాగులేకఇబ్బంది పడుతున్న అత్తయ్య , కళ్ళనీళ్ళతో  ,అవమానాన్ని దిగమింగుకొని,  అక్కడి నుండివెళ్ళిపోయింది. ఆ తర్వాత నానమ్మ ఎంతప్రయత్నించినా , అత్తయ్యని కలవలేకపోయింది.రోజులు భారంగా గడుస్తున్నాయి నానమ్మకి. ఇటువంటి సమయంలోనే తను పుట్టబోతుందన్నసమాచారంతో  , ఇంటిలో అందరి మనసుల్లో ఆనందం  చుట్టుముట్టింది. తొమ్మిది నెలలతర్వాత తన రాకతో నానమ్మ లోకమే తనైపోయింది.తనకు ఐదవ సంవత్సరం పుట్టిన రోజు ఘనంగా జరిపేరు.  ఆ తర్వాత ఒకరోజు  తెల్లారి  ఎవరోఒకతను  తమ ఇంటికి వచ్చి ..నానమ్మ  కోసం అడిగేరు. తనకోసం వచ్చింది ఎవరై ఉంటారా....అని నానమ్మ   ఆశ్చర్యపోతుా బయటకు వచ్చింది.నానమ్మ ను చుాడగానే అతను లేచి నిలబడినానమ్మ కు నమస్కరించి ,  అత్తయ్యను పెళ్ళిచేసుకున్న మోహన్  తనేనని ,  ప్రస్తుతం అత్తయ్యపరిస్థితి  బాగులేదని...రెండవసారి  నెలలు నిండిన అత్తయ్యకు , కడుపులో బిడ్డ అడ్డం  తిరిగిందని , డాక్టర్స్  " ఆపరేషన్ చేయాలి  , లేకపోతే తల్లికి పిల్లకికుాడా ప్రమాద "మని చెప్పేరని  , మొదటి బిడ్డ కుాడా ఇటువంటి   సమస్యల కారణంగా తమకు దక్కలేదని , ఇటువంటి పరిస్థితుల లోతనకు ఎవరుా లేనందు వల్ల , తమ సహాయం కోసం వచ్చేననీ  , అత్తయ్య  నాన్న కోసం , నానమ్మ కోసం ఎదురు  చుాస్తున్నాదనీ,  చెప్పడంతో..నానమ్మకంగారుపడి బయలుదేరడానికి సిద్ధమైంది.
మొాహన్ మొహమాట పడుతుా ఆపరేషన్ కోసంఆర్ధికంగా తనకు కొంచం సహాయం చేయాలనీ...కొంచం సమయంలోనే తిరిగి రుణం తీర్చేస్తానని, తనకు సింగపుార్ కంపెనీలో ఉద్యోగం దొరకవచ్చని..చెప్పడంతో' , నానమ్మ  ఆ సమయంలో నాన్న  ఇంట్లోలేకపోవడంతో , అమ్మ వేపు అర్ధిస్తున్నట్టుగా  చుాసింది.ఆ వచ్చినది అత్తయ్య  భర్త  మొాహన్ అని ,తెలుసుకున్నపుడే,  అమ్మ ముఖంలో రంగులుమారేయి. ఇప్పుడు డబ్బు కావాలనడంతో..అమ్మమొాహన్  ఎదురుగానే  , నానమ్మ  మీద విరుచుకు పడింది. కులం తక్కువ వారిని  పెళ్ళి చేసుకున్న రోజే, తమకు,అత్తయ్యకు మధ్య బంధుత్వం  తెగిపోయిందని,ఇప్పుడు అర్ధాంతరంగా వచ్చి , సంబంధాలుకలపవద్దనీ...ఇటువంటి వారికి ధారపోయడానికితమ దగ్గర అప్పనంగా వచ్చిన  సొమ్ము లేదనీ, ఖచ్చితంగాచెప్పి..  మామయ్య ని అవమానించి పంపేసింది.అమ్మతో సాలలేకా , అత్తయ్యని  ఇటువంటి పరిస్థితుల లోఅలా అనాధలా  వదిలీలేకా ,నానమ్మ  నరకం అనుభవించింది...కన్న మమకారం చంపుకోలేని నానమ్మ ,  ఆ రోజుసాయంత్రం తన మెడలో ఉన్న ఒంటిపేట గొలుసు ' అమ్మి ,  అత్తయ్యను చేర్చిన హాస్పిటల్ కిఆదరా బాదరగా చేరింది.కానీ అప్పటికే సమయం మించిపోయింది. కాన్పు కష్టమైన  కారణంగాఅత్తయ్య పసి గుడ్దును ప్రసవించి ,  ఈ లోకాన్నివిడిచి వెళ్ళిపోయింది.  నానమ్మ కి'  ఈ సంఘటనతోమతిపోయినట్టయింది .మొహన్ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది .  ముందుగా , నానమ్మే కోలుకుంది.  ప్రాణం పోయిన అత్తయ్య శవాన్ని తిరిగి అప్పచెప్పేందుకు హాస్పిటల్ వారు చాలా హంగామా చేసి..ఆలశ్యం చేసేరు. దానితో నానమ్మకు ఇంటికి వచ్చి,చెప్పివెళ్ళే అవకాశం లేకపోయింది .చివరికినానమ్మ  అత్తయ్య నిభ్రతికించుకొనేందుకు అమ్మిన గొలుసు డబ్బులు..అత్తయ్య అంత్యక్రియలకు   ఉపయొాగపడ్డాయి.నానమ్మ పుట్టెడు కడుపు శోకంతో  ఇల్లు చేరిం౦ది. అత్తయ్య మరణం గురించి చెప్పి , పసి గుడ్డునుఇంటికి తెచ్చుకుందాం అనుకున్న నానమ్మ-ఆశలు నిరాశలే అయ్యేయి.సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చిన నాన్నకు, అమ్మఏం చెప్పిందో ఏమొా...నానమ్మ రాగానే విషయం  ఏమిటి .?..అన్నది అడగకుండానే,  నాన్న , నానమ్మ  మీద విరిచుకుపడ్డాడు. అమ్మ సరేసరి. వీరిద్దరి ధాటికీ తట్టుకోలేకనానమ్మ తన గదిలోకి వెళ్ళి , తలుపేసుకొనిచాలా సేపు ఏడ్చింది. భార్య చాడీలతో , నానమ్మ మీద విరుచుకుపడిన నాన్న , నానమ్మ భోజనానికి రాకపోవడంతో ,అసహనంగా,  నానమ్మని పిలవడానికి వెళ్ళేడు.ఎదురుగా నాన్న  ఒక్కడినీ  చుాసిన నానమ్మ కిద:ఖం ఆగింది కాదు. ఏడుస్తునే జరిగిన సంఘటనలు చెప్పింది. రక్త సంబంధం కావడంతోనాన్నకు కుాడా..అత్తయ్య  ఇంక ఈ లోకంలో లేదన్న వార్త శరఘాతమే అయ్యింది. అయితే నాన్న, ఆమె గుర్తుగా మిగిలిన పసి బిడ్డ,  మంచి- చెడులు చుాసే బాధ్యత , మేనమామగా తను చేపట్టే నిర్ణయానికి  వచ్చేడు.తర్వాత ఈ విషయమై జరిగిన వాదోపవాదాల లోఅత్తయ్య  మాటకు నాన్న  , మొదటి సారి ఎదురు  తిరిగేడు . నానమ్మ కళ్ళలో , పసి కందునుఇంటికి తేవచ్చన్న ఆనందం కొట్టొచ్చినట్టు కనపడింది.ఆదివారం శలవు కనక ఆ రోజు పసికందును తేవడానికి నిర్ణయించుకున్నారు.నాలుగు రోజులు గడిచేయి . అనుకున్న రోజు రానేవచ్చింది. కానీ ఎంతో ఆత్రుత.. తో బయలుదేరిన వారికి , నిరాసే ఎదురయ్యింది. అప్పటికే మొాహన్ బాబును తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోయేడు.ఎంతమందిని అడిగినా , అతని సమాచారం కుాడా తెలియలేదు. నాన్న, నానమ్మ , నిరాశగా వెనుతిరిగేరు.ఉత్త చేతులతో తిరిగి వచ్చిన వీరిద్దరినీ చుాసిఅమ్మ ఆనందపడింది.  కానీ నానమ్మకిఆశ చావలేదు.  బాబు కోసం మొాహన్ కోసంవెతుకుతునే ఉంది. ఈ విషయం తెలిసిన అమ్మ., మొాహన్  ,బాబు లుకనబడితే , తనకో గుది బండలా తయారౌతారని,తనకు బరువు -బాధ్యతలు పెరుగుతాయని ,తలచి...ఏదోరకంగా నాన్న తో నుా, నానమ్మ తోనుా ,జగడం వేసుకుంటుా ఉండేది.అప్పుడప్పుడవి, చిలికి- చిలికి గాలి-వానగామారుతుాండడంతో ,  నానమ్మ  ఈ విషయమైఇంట్లో చర్చించడం మానీసింది. తను కుాడాపెద్ధవుతుా వచ్చింది. దానితో తన ఎదురుగాఅత్తయ్య ప్రస్తావన ఎవరుా తెచ్చేవారు -కాదు. కానీ  కొన్నాళ్ళకు ,తనకు ఒక అత్తయ్య కుాడా ఉందన్న  విషయం  తెలిసి , అమ్మని అడిగితేఆమె పెళ్ళి చేసుకొని యుా.ఎస్.లో , సెటిల్ అయిందని , ఆ తరువాత ఎప్పుడుా ఇండియారాలేదని , అసలు అభిమానంగా  ఫోన్ కుాడాచేసేది కాదని..అందుకే  ఆమె గురించి తనకుచెప్పలేదని చెప్పింది. అమ్మ తనతో చెప్పిన విషయాలువిన్న నానమ్మ కుాడా తనతో అలాగే చెప్పడంతోతను ఆ విషయం అసలు మర్చేపోయింది.సంవత్సరాలు గడుస్తున్నా నానమ్మ  , మామయ్యగురించి , బాబు గురించి వెతకడం  మాత్రం మానలేదు.ఈ విషయం తెలిసిన అమ్మ , నానమ్మ ని సుాటి -పోటిమాటలతో  వేధించడముా  మానలేదు.--------------------------------------ఆ రోజు తనకి బాగా గుర్తు. తను కేంప్ నుండిఎంతో సంతోషంగా ఇంటకి వచ్చింది.  నానమ్మ కిసర్ప్రైజ్  గిఫ్ట్ గా భగవద్గీత పుస్తకం , ఇవ్వాలని,ఇల్లంతా నానమ్మ  కోసం ఎంత వెతికిందని.నానమ్మ   ఇంట్లో కనపడకపోయేసరికి 'చిన్నబోయిన ముఖంతో' నానమ్మ  గుడిలోఉంటుందేమో అనుకొని వెళ్ళబోతున్న తననుఆపి , మరీ అమ్మ చెప్పిన విషయం విన్న తను,ఎంత ఆశ్చర్య పోయిందని.  ""నానమ్మ కోసంఅత్తయ్య వచ్చిందని , నానమ్మ అత్తయ్య తోఅమెరికా వెళ్ళిపోయిందని "  చెప్పగానే , తనకు నమ్మబుద్ధే కాలేదు. నానమ్మ తనకు చెప్పకుండా వెళ్ళిపోయిందని వెక్కి -వెక్కి , ఎంత ఏడ్చిందని...నానమ్మ కోసం కొన్న భగవద్గీత పుస్తకం ఇప్పటికీతన బీరువాలోనే ఉంది. -------------------------------------
ఇంతకీ జరిగినదేంటంటే..తను కేంప్ కి వెళ్ళిన మరునాడు , ఆదివారం కావడంతో ..నాన్న ఇంట్లోనే ఉన్నారు. నానమ్మఅత్తయ్యకి పుట్టిన పిల్లడి గురించిన సమాచారాన్ని,కనుక్కోమని , ఎలాగైనా   పిల్లాడిని  ఇంటికి తెచ్చుకోవాలని , వాడికి ఏలోటుా లేకుండా పెంచాలని , ఇదే తన చివరికోరిక అనుకోమనినాన్నకి చెప్పింది..,  అది విన్న తర్వాత అమ్మకి,  నానమ్మలకి మధ్య మాటా- మాటా పెరిగాయి. అమ్మ , తనకు ఎదిగిన కుాతురుందని..పరువు తక్కువ పనులు చేసిన అత్తయ్యకు, పుట్టిన  పిల్లాడిని తెచ్చుకుంటే , ఇక తన  కుాతురికి పెళ్ళే కాదని..సమాజంలో అందరుా చుాసే చిన్నచుాపుకు. తాము తట్టుకోలేమని...గుచ్చి గుచ్చిఅడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే అవసరం తమకు లేదనీ.. ఖారాఖండీగా తేల్చి చెప్పింది.అంతా విన్న నాన్న , భార్య అన్న మాటలో తనకేం తప్పు కనిపించలేదని ,ఇంక ఆ వుాసు మాట్లాడుకోవడం వల్ల ప్రయొాజనం లేదు గనకఇంక ఆ విషయమైవ అనవసరంగా మాట్లాడుకోవద్దని , చెప్పడంతో , నానమ్మ మనసు కకావికలమైఅమ్మకు చెప్పలేక , నాన్నకు వివరించలేక ఏడుస్తుాతన గదిలోకి వెళ్ళిపోయింది.
ఆ రాత్రి అమ్మ నాన్నతో ఏమని చెప్పిందో...నాన్న ..ఆఫీసుకు సెలవు పెట్టి మరీ.. నానమ్మనుఊరికి దుారంగా . ఏ సదుపాయాలుా లేనిఈ ఆశ్రమంలో తెచ్చి పడీసేడు . ఒకటి రెండు సార్లుఒచ్చి వెళ్ళేడు. రాను రానుా..అసలు రావడమేమానీసేడు. సమయానికి ఆశ్రమానికి కట్టవలసినసొమ్ము  మాత్రం కడుతున్నాడు. నానమ్మ కుాడాతనకు,  తన  మాటకు ,  ఆదరం లేని చోటు కన్నాఇక్కడెే బాగుందని ఉండిపోయింది.  అదీ గాక తన  కన్న కొడుకే ,తనను ఊరికి చివరలోవిసిరేనినట్టుండే ఈ వ్రుద్ధాశ్రమంలో , కనీసం తనని  అడగైనైనా  అడక్కుండా   చేర్చడంతో,పుార్తిగా మనసు విరిగిపోయింది నానమ్మకి.కానీ తనని  తలవని క్షణం లేదుట. అత్తయ్య కన్నపసికందు  ఎక్కడున్నాడో తెలీకా , మొాహన్ మామయ్య  ఆచుాకీ తెలీక , రోజుా తను పడే బాధనరకంలో ఉండడం  కన్నా బాధగా ఉందనిచెపుతుా..ఎంత ఏడ్చిందని.అసలు తన అత్తయ్యచేసిన తప్పేమిటి ? మనసుకు నచ్చిన మంచిమనిషి తో జీవితాన్ని పంచుకోవాలనికోవడం తప్పేమీ  కాదే...। కన్న కుాతురు ఇబ్బందుల్లో ఉంటేతల్లిగా తల్లడిల్లడం  , కొంచం సాయం చేయాలనుకోవడం నానమ్మ చేసిన నేరం  కాదే..।అత్తయ్య  కన్న కొడుకు అనాధలా పెరగకుాడదనీ..హాయిగా పెరగాలని , బాగా చదివించాలని ,అందికే ,  పసికందుని ఇంటకి తెచ్చుకుందామన్న నానమ్మ  కోరిక అసమంజసమైనది కాదే...మరేఁకారణంతో నాన్న ,  నానమ్మను , తను ఉండి కుాడా , దిక్కులేని  దానిలా ఇక్కడకు తెచ్చి పడేసినట్టు..? ఇటు వంటి పని చేయడానికి వారికిమనసెలా ఒప్పింది..? ఇది క్షమించరాని తప్పు కాదా।ఆలోచిస్తున్న శ్రావ్యకు తెల,తెలవారుతుండగా మగతగా నిద్ర పట్టింది. నిద్రలో తను నానమ్మతోకలిసి ఎక్కడికో వెళ్ళిపోతోంది. నానమ్మ చేతిలోఅత్తయ్య కన్న చిన్నారి పాపడు . నానమ్మ కళ్ళల్లోకోటి వెలుగుల దీపాలు. తనతో నడుస్తున్న నానమ్మకళ్ళల్లో నిశ్చింత...నానమ్మతో నడుస్తున్న తన అంతరంగంలో ఎన్నడుాఎరుగని ఆనందం...కలలో  ఆనందం పట్టలేని  శ్రావ్య,  అటు ఇటు దొర్లుతుా...తుళ్ళిపడి లేచింది. తను తనరుామ్ లోనే ఉన్నట్టు గ్రహించి  ఇంతసేపుా తనుచుాస్తున్నది కలా..అనికొని ఆశ్చర్య పడింది.చాలా సేపు ఆలోచనల్లో ములిగిపోయిన శ్రావ్యచివరిగా ఒక నిర్ణయానికి వచ్చింది. తన మనసులో ఉన్న ఆలోచనే తన కలలోకి వచ్చి , తనకో దారిచుాపించినట్టయింది. నిజమే । తను నానమ్మబాధ్యత ఎందుకు తీసుకోకుాడదుా। డిగ్రీ చదివిన తనకు   ఏదైనా మంచి ఉద్యోగం దొరకకపోదు. ఉద్యోగం  చేస్తుానే , తను చదువుకుంటుంది.  తను నానమ్మతో వేరేగా ఉండి నానమ్మ మంచి చెడ్డలు చుాస్తుా , నానమ్మ   కోరికలన్నీ తీరుస్తుంది. తన మేనల్లుడి ఆచుాకీ  తెలుసుకొని , నానమ్మ దగ్గగరకు తీసుకు  వస్తుంది. నానమ్మ చివరి దశ వరకు తను -నానమ్మ దగ్గరే ఉంటుంది. అంత వరకు అమ్మా నాన్నలకు , తను వారిని వదిలి వెళ్ళడం -, చాలా బాధకు గురి చేస్తునది..కానీ వాళ్ళకికుాడా,  తాము చేసిన తప్పు తెలియాలంటే తను కొంచం కఠినంగా ఉండక తప్పదు మరి.కుాతురి  గురించి నానమ్మ పడ్డ బాధ  వారిఅనుభవంలోకి   రావాలంటే తనలా చేయక తప్పదు మరి. ఎందరో అనాధలకి , వ్రుద్ధులకి' ,ప్రేమను పంచిన తను , అమ్మా , నాన్నలను 'ఒంటరిగా వదలదు. నానమ్మ తదనంతరం తనువారి దగ్గరకు  తిరిగి  వచ్చేస్తుంది.  అంతే....
ఈ విధంగా ఆలోచించినమీదట, తన నిర్ణయం తప్పు కాదన్న  భావం తో, నిశ్చింతగా ఉన్న మనసుతో, మంచం మీద నుండి లేచి కిందకు దిగింది  శ్రావ్య.
-----------------------------------కాలక్రుత్యాలు తీర్చుకొని , చల్లటి నీళ్ళతో స్నానం చేసాకా, శ్రావ్యకి ఎంతో హాయిగా ప్రశాంతంగా అనిపించింది.   తర్వాత  తాపీగా తన బట్టలన్నీ సుాట్ కేస్  లో సద్దుకుంది. తన పేరున ఉన్న బేంక్చెక్ బుక్స్ తో  పాటు ...తన దగ్గర ఉన్న కేష్ కుాడా హేండ్ బేగ్ లో సద్దుకుంది. ఇంకా కావకలసిన ముఖ్యమైన వస్తువులన్నీ తీసుకొని..తన గది నుంఛిబయటకు వచ్చింది.అప్పటికే డైనింగ్ టేబల్ దగ్గర కుార్చొని..అల్పాహారం తినడానికి , తన కోసం నిరీక్షిస్తున్న ,అమ్మా..నాన్నలు.  తను పెద్ద సుాట్ కేస్ తో బయటకు రావడం చుాసి..నిర్ఘాంతపోయేరు. " నిన్న నే కేంప్ నుంచి వచ్చేవు కదా...మళ్ళీ ఎక్కడికిప్రయాణం" ..అంటుా అడిగిన అమ్మ మాటలకు ..చిన్నగా నవ్వింది శ్రావ్య. తాపీగా టిీఫిన్ చేసి , టీ తాగి ..మెల్లగా వంగి అమ్మ ' నాన్నల పాదాలకు నమస్కరించిన  శ్రావ్య..మెల్లిగా ముఖద్వారం వైపునడక సాగించింది. అమ్మ మాట కు జవాబు ఇయ్యకుండా , పెట్టెతో బయలుదేరుతున్న తనను  ,ఈ సారి నాన్న అడిగేరు..శ్రావ్యా...ఎక్కడికి..అంటే మాట్లాడవేమిటి..?అంటుా..శ్రావ్య వెను తిరిగి తాపీగా చెప్పింది."" నేను అత్తయ్య దగ్గరికి వెళుతున్నాను నాన్నా..అక్కడే నానమ్మ కుాడా ఉందికదా...నేను నానమ్మ దగ్గరే ఉండి అక్కడే చదువుకుంటాను",..వస్తాను"అంటుా  బయటకు నడిచింది. శ్రావ్యకి తెలుసు వాళ్ళద్దరుా ఎంత నివ్వెరపోయిఉంటారో...చిన్నప్పటినుండీ తనతో అత్తయ్య అమెరికాలో  ఉందనీ, ఇప్పుడు నానమ్మ కుాడా  అత్తయ్య  దగ్గరే ఉందని తనకు చెపుతుా వస్తున్న వారిద్దరుా....తనను  వెళ్ళకుండా  ఆపలేరు ,  అలాగని  నానమ్మవ్రుద్ధాశ్రమం లో ఉందన్న  నిజాన్నీ.. చెప్పలేరు.
ఇప్పుడు గానీ  తను,  వారద్దరుా ,  ఎటువంటి స్థితిలో ఉండి ఉంటారో చుాసిందంటెే , మరి ఎప్పుడుా  వారిని వదిలి వెళ్ళలేదు.అందికే శ్రావ్య వెనుతిరగకుండా బయలుదేరిందినానమ్మ దగ్గరకి. అదే 
 " ఆనందాశ్రమానికి ". ".-----------------------------------------------------
-సమాప్తం
.----------
రచన..శ్రీమతి,జగదీశ్వరీముార్తి.కల్యాణ్.-
మహారాష్ట్ర.
-----------
-----------------------------------------------
[28/06, 6:24 pm] JAGADISWARI SREERAMAMURTH: 28/06/2023.
 తపస్వి మనోహరం పత్రిక కొరకు,
అంశం : బాల సాహిత్యం.

శీర్షిక  :అమ్మ మాట వినరారా ముద్దుల బాల.॥

రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్. మహారాష్ట్ర .

మువ్వ గోపాల రార , ముద్దుల మురిపాల బాల 
సవ్వడి నీ పదముల సడి వినగ వేచియుంటిరా ॥

నవ్వుల మురిపాల మొాము ముచ్చట గొలిపేనురా
అవ్వల నీ ఆటలాపి అమ్మ మాట వినరారా ॥

పువ్వుల మాలలు గట్టి సిగ చుట్టుా పెడతా రా ॥
రవ్వల గొలుసులు మెడలో వేసి సింగారింతురా ॥

సవ్వడి చేయక వెన్నను దింగిలింప నేలరా.?
కవ్వముతో చిలికి నట్టి వెన్నలు తిని బజ్జోరా ॥

బువ్వ లోన వెన్న వేసి , కలిపి ఉంచినానురా..
రవ్వల లడ్డుాల తీపి కలిపి తినగ రావయా ॥

రాళ్ళరువ్వి" నెత్తి "నున్న "చల్ల "కుండ గొట్టకురా
చువ్వలతో  బాది "చల్ల " నేలపాలు చేయకురా॥

రివ్వున ఎగిరే పక్షుల ఐకమత్యమును గనరా
గువ్వ జంట కువ కువలతొ  గుాటిలోన చేరెరా॥

దివ్వెలు వెలిగించు వేళ ఇల్లు చేర మేలురా ॥
కెవ్వు మంటు కేకలెట్టి అల్లరిలా చేయకురా ॥

గవ్వలాట లాడ రార ముద్దుల మురిపాల బాల .
అవ్వ చెప్పు కధలు వింటు ఆదమరచి నిదరోరా॥
[13/07, 2:59 pm] JAGADISWARI SREERAMAMURTH: 13/07/2023.
మనోహరం పత్రిక కొరకు,
అంశం  : గృహ శోభ ,
రచన శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి .
కళ్యాణ్ : మహారాష్ట్ర.


ఇంటికొచ్చిన వారందరూ సంతోషంగా మమ్మల్ని ఆశీర్వదించి,
మేము ఇచ్చిన పసుపు కుంకాలు తీసుకొని వెళ్తున్నారు .
ఆ రోజు మేము కొత్తింటి గృహప్రవేశం చేసాం .
ఇది చిన్న రెండు బెడ్ రూమ్లు గల , ఇండివిడ్యువల్ హౌస్.
ఇంటిలో ఇంకా, ఫర్నిచర్ ఏమి తెచ్చుకోలేదు . వుడ్ వర్క్ మాత్రం చేయించుకున్నాం.  మామూలుగా అయితే డైనింగ్ టేబుల్ నాలుగు కుర్చీలతో పాటుగా కొనుక్కుంటారు . కానీ మేము జాగా కలిసొస్తుందని , వుడ్ వర్క్ చేయించుకున్నప్పుడే డైనింగ్ టేబులు గోడకి అటాచ్ చేసి పెట్టించేసుకున్నాం . అలాగే బాల్కనీలలో" బాక్స్ టైప్ " గ్రిల్స్ వేయించుకున్నాం . మొక్కలు వేసుకుంది కి , వేలాడుతున్న గోలేలను కొని తగిలించాను. 
.దేముడి  రూమ్ లో కూడా,  దేవుని  మంటపాన్ని లోపల  గోడలోకి పెట్టించాను . .దేముడి రూమ్ అంతా, కర్రతోనే , అందమైన డిజైన్లు చేయించి , రూమ్ కి 4 వైపులా, పెట్టించాను . ఇది నిజమైన మందిరం అన్న ఫీలింగ్ వచ్చేలా  లోపల అలంకరణ చేశాను.
 
ఇంకా పూర్తి ఇల్లంతా ,మంచి మంచి డిజైన్లతో అలంకరించాలని , నాకు పిల్లలకు చాలా ఇంట్రెస్ట్ గా ఉండడంతో , ఆరోజు సాయంత్రమే మార్కెట్ ప్రోగ్రాం పెట్టుకున్నాం .
వచ్చిన వారంతా వెళ్లిపోయారు
మా కుటుంబ సభ్యులుం మాత్రమే మిగిలాం.

మేం అనుకున్న ప్రకారం ,ఆరోజు సాయంత్రం, మేమంతా కలిసి మార్కెట్ కి వెళ్ళాం. ఇంటికి కావాల్సిన వస్తువులు ఏంటేంటి, అన్నవి మా పిల్లలు నిర్ణయించేశారు ఎప్పుడో . 
నేను మాత్రం డెకరేషన్ కి కావాల్సిన సామాన్లు అన్ని, కొనుక్కు వచ్చాను. మా పిల్లలు కూడా కొన్ని డిజైన్స్. నాకు చూపించి కొనిపించారు .

మేము ముందు ఉన్న ఇల్లైతే , చీకటి చీకటిగా ఉండేది. వెంటిలేషన్ అస్సలు ఉండేది కాదు . అందుకే వెంటిలేషన్ ఉన్న ఇల్లు కోసం చూసి చూసి, చివరికి చిన్నదైనా, ఈ ఇల్లు కొనుగోలు చేశాం ,ఈ ఇల్లు చిన్నదైనా నాలుగు వైపులా వెంటిలేషన్తో కళకళలాడుతూ పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చేలా , బాగా ఉండడంతో, మేము ఈ ఇంటిని కొనుగోలు చేసాం.
అందుకే ఈ ఇంటిలో ,అన్ని వైపులా సామాన్లతో నిండిపోకుండా ,జాగ్రత్తగా అన్ని సామాన్లు అమర్చుకోవాలని నిశ్చయించుకున్నాం.

ఇంటిలో అన్ని రూముల్లోనూ పెద్ద పెద్ద "లాఫ్ట్" లు ( అటకలు) పెట్టించుకున్నాం  .ఇంట్లో ఉన్న సామాన్లలో, మేము వాడుకుందికి  కావలసినవి తప్ప, మిగిలినవన్నీ వాటిల్లోకి ఎక్కించేసాం.

మెయిన్ హాల్లో, లామినేషన్ చేసి ఉంచిన పెద్ద వినాయకుని ఫోటో, మెయిన్ డోర్ తలుపు తీయగానే ,ఎదురుగా కనిపించేట్లు ఫిక్స్ చేసాం. 
పూర్తి ఇంట్లో,  వెంటిలేషన్ కోసం  పెట్టిన కిటికీలకు," లైట్ క్రీమ్ కలర్ " పరదాలను తగిలించాం.
మెయిన్ హాలులో ఒక మూల ఒక పెద్ద సైజు" ఫ్లవర్ వాజ్" లో అందమైన ఆర్టిఫిషియల్ గులాబీలను గుత్తులుగా అమర్చాం.
మెయిన్ డోర్  గుమ్మాలకు,   ఆయిల్ పెయింట్స్ తో అందమైన  ,చిన్న చిన్న ఫ్లవర్స్ ను వేయించి , తలుపు పై-ద్వారానికి, అందమైన తోరణాలు కట్టీ , అదే గుమ్మానికి రెండు వైపులా, అచ్చం బంతిపూల లాగా కనిపించే దండలను, పొడావుగా వేలాడదీసేం.
హాలు లో ఒక వైపు గోడకి , బృందావనంలో ఊయలపై , తన్మయత్వంతో మునిగి ఉన్న అందమైన , రాధాకృష్ణుల  బొమ్మను, ఆయిల్ పెయింట్స్ తో వేయించి , దానికి కర్ర తోనే. నాలుగు వైపులా అందమైన ఫ్రేమ్ ను చేయించాం. ఆ వచ్చిన పెయింటర్, ఆ చిత్రాన్ని ఎంత బాగా గీసాడంటే , నిజంగా రాధాకృష్ణులు ,   బృందావనంలో ఆడుకుంటున్నారా. ! అన్నట్టుగా అద్భుతంగా పెయింట్ చేశాడు .
ఇకపోతే , పిల్లల బెడ్ రూమ్ లో , సీలింగ్ పై, నిజంగా "ఆకాశం , చంద్రుడు, నక్షత్రాల కింద పడుకున్నామా ..? " అనిపించేట్టుగా డిజైన్స్ వేయించాం.
 గోడలకు చిన్నచిన్న అల్మారాలు కొట్టించి, వాటిపై పిల్లలకు ఇష్టమైన బొమ్మలను, నాలుగు వైపులా అమర్చేము.
గోడలపై ,చిన్నచిన్న ప్రేముల్లో ,  రామాయణానికి సంబంధించిన కొన్ని ఫోటోలను, ఒకదాని కింద  ఒకటిగా అమర్చాం.

మెయిన్ "మాస్టర్ బెడ్ రూమ్ "లో ,ఒక గోడపై, పెద్ద సైజు లో,  అందమైన బోసినవ్వుల పాపాయ ఫోటోను పెట్టాం. 
పడుకుని లేవగానే, సమయం  తెలిసేట్టుగా, ఎదురుగా ఒక మంచి "గోడ గడియారాన్ని" తగిలించాం .
అన్ని గదుల్లోనూ , పల్చగా ఉన్న లైట్ "క్రీం కలర్ కర్టెన్స్" ను తగిలించేమేమో , అవి గాలికి ఎగిరుతూ ఉంటే ,మనసుకు ఎంతో హాయి అనిపించింది . ప్రకృతి సిద్ధమైన గాలిని పీల్చీ ,ఎన్ని రోజులైందో...

ఇకపోతే బాల్కనీలో గ్రిల్స్ కి  హ్యాంగ్ చేసిన గోలేలలో,
అందమైన పూలు పూచే ,చిన్ని చిన్ని క్రొటన్స్ మొక్కలని 
వేసేము . వాటిలో , అయిదారు రంగుల పూలు పూసే మొక్కలున్నాయి.
గ్రిల్ కి చివరలో "మనీ ప్లాంట్ " మొక్కను వేసాము.

ఇక నాకు మెయిన్ డోర్ తీయగానే,  బాగానే ఖాళీ జాగా కూడా ఉంది.
ఒకపక్క కారు కోసం జాగా వదిలేసినా , రెండో ప్రక్క కావలసినంత మట్టి జాగా ఉంది.
నాతో పాటు మా పిల్లలకు కూడా గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం  . అందుకనే వారు నాతో పాటుగా సరదాగా మొక్కలు నాటడం మొదలు పెట్టారు .
వాటిల్లో మందారం ,నందివర్ధనం ,బొడ్డు మల్లి , జాజిపూల పందిరి, మల్లి , చామంతి చెట్లు ,గులాబీ చెట్లు ఇలా ఎన్నో రకాల పూల మొక్కలను ముందువైపుకు నాటి , వాటికి వెనకాతల  ఉన్న జాగాలో. నిమ్మ , దానిమ్మ ,కరివేపాకు ,  బొప్పాయి ములగ , మామిడి చెట్లను నాటాం.
మెయిన్ గేట్ కు ఇరువైపులా బోలెడు తులసి చెట్లను నాటాం. ఎందుకంటే అక్కడ , మేము ఇల్లు కట్టించుకున్నప్పుడే, పెద్ద పెద్ద తులసి కోటలను కట్టించుకున్నాం. 
అక్కడ తులసి చెట్లు ఉండడంవల్ల ,కోటకు ఉన్న గూటీలో, దీపం వెలిగిస్తే, అది గాలికి ఆరిపోకుండా చాలా సేపు ఉంటుంది .
తులసి పూజ చేసుకున్నా , ముగ్గులు వేసుకున్నా ,  ఒక ఏర్పాటు గా ఉంటుంది . 
ఇకపోతే. గేటు దగ్గరనుంచి , ఇంటి "మెయిన్ డోర్ " వరకు, సిమెంట్ తోనే రోడ్డు లా వేయించుకున్నాం .
ఆ రోడ్డుకు రెండువైపులా, గుత్తులు- గుత్తులుగా పూలు వచ్చే, రంగురంగుల  క్రోటన్స్ మొక్కలను నాటుకున్నాం.
ప్రస్తుతం శ్రావణమాసం నడుస్తున్నాది .చిన్న చిన్న వర్షాలు పడుతున్నాయి .ఈ వర్షాలకు ,ఈ మొక్కలన్నీ , తొందరగానే పెరిగి పెద్దవవుతాయి.

రేపు మేము మళ్ళీ మా పాతింటికి వెళ్ళిపోతాం.
మళ్లీ ఆశ్వీయుజ మాసంలో ఈ ఇంటికి  వచ్చేద్దాం అనుకుంటున్నాము .  అప్పటికి మా పాత ఇంట్లో ఉన్న ఫర్నిచర్ అంతా ఎవరికైనా ఇచ్చేయడం ,ఈ ఇంటికి కొత్త ఫర్నిచర్. , (అంటే ఫ్రిడ్జ్ ,వాషింగ్ మిషన్, మంచాలు, కంచాలు మొదలైనవి) కొనుక్కోవడం కూడా అయిపోతుంది .
  నేను ,మధ్య మధ్యలో. " ఈ ఇల్లు,  మొక్కలు- చూసుకుందుకి, వస్తూ ఉంటా లేండి.
అప్పటికి ఈ మొక్కలు కూడా చక్కగా పెరిగి పూలు  పూస్తాయేమో కదూ...
అప్పుడీ ఇల్లు చూడ్డానికి ఎంత బాగుంటుందో....

మరి మేము ఇంటికి రాగానే, మీరంతా మా ఇంటికి వస్తారు కదూ ! మా ఇల్లంతా  చూసి చెప్పండి .
 మేము చేసుకున్న డెకరేషన్ ఎలా ఉందో ?
  మీరు కూడా ఏమైనా" సజెషన్స్"   ఉంటే చెప్పండి. తప్పకుండా మార్పు చేస్తాను.....
 ఓకే మరి వెళ్ళొస్తాం... బాయ్..  ..
 
*********†******************

 హామీ : 
ఈ రచన ,నా స్వీయ రచన.
[15/07, 10:14 pm] JAGADISWARI SREERAMAMURTH: 15/07/2023.
వాస్తవానికి దగ్గరగా.  నా ఆలోచనల ని మీతో. పంచుకోవాలని రాసే చిన్ని అనుభవం.


తపశ్రీ మనోహరం పత్రిక కొరకు ,
విభాగం :  పోస్ట్ కార్డ్ కథలు .
అంశం : ఐఛ్చికం.
రచయిత్రి ,పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి ,
                 కల్యాణ్ : మహారాష్ట్ర 

          శీర్షిక : "మధుర స్మ్రుతి ".
          ------------------


హడావిడిగా  అరిచే భర్త ని ఆఫీసుకి ,
ఆరడి చేసే పిల్లలని. స్కూలు కి తరలించి ,  భారంగా ఊపిరి తీసుకున్నాను . వడలిన శరీరాన్ని     సేద తీరుస్తూ.  ఈజీచైర్ లో అలసటగా  నడుం  వాల్చేను  మరు క్షణం నా చెవులకి సోకిందొక చిరపరిచిత శబ్ధం.
టప్     ....టప్ .....టప్ ......
అంతే ...ఒక్క ఉదుటున. లేచి పరుగెత్తేను కిటికీ వైపుకి .    "వర్షం "తీసిన తలుపుల్లోంచీ  చల్లగా. , ఝల్లుగా ,   హాయిగా ......ఉత్సాహంగా.
పెరట్లోకి  పరుగెత్తేను .
వర్షం లో తడుస్తూ. నా అలసటని పారదోలుతూ. నన్నేవేవో. జ్ఞాపకాలలోకి  
తీసుకుపోతూ.... "వర్షం ".
ఆనందానుభూతికి మూసుకుపోయే కన్నుల ముందు కదలాడే చిరుఝల్లుల
జ్ఞాపకాలు ....అవును ఇదే వర్షం లో నేనూ , నా స్నేహితురాళ్ళూ , చిలిపి గిల్లికజ్జాలూ...........

----------------
చేతుల్లో చేతులు వేసుకొని " వానా వానా చల్లప్పా "......అని పాడుకుంటూ.
అందరం కలిసి గుండ్రంగా గింగరాలు తిరిగే చిన్ననాటి చిలిపి సరదాలు .....
చెట్ల ఆకులపై పడే వర్షపు నీటి బొట్లని
నోరు పట్టి. జుర్రుకొనే ఆనంద  క్షణాలు ......
గొడుగుల్లో ఒదుగుతూ , కేరింతలు కొడుతూ చిందర వందర కబుర్లతో కలిసి స్కులుకి వెళ్ళే ఎత్తు- పల్లాల కాలిబాటలు .....
వర్షానికి తడిసిన పచ్చని పైరుబాలల తివాచీ తోరణాలు ......
చిరుజల్లు తో కలిపి వీచే చల్లని గాలులలోంచీ  వచ్చే  , తడిసిన మట్టి సుగంధాలు ...
పిల్ల కాలువల పారే నీటిలో , పోటీల కాగితపు పడవల వరుసలు ........
వేడి వేడి ఫల్లీలు తింటూ , ఉరుముల శబ్ధాన్ని. వింటూ , మెరిసే మెరుపుల్ని
వింతగా చూసే అమాయకపు.
,విస్మయ , చిన్నారి చూపులు.....
శ్రావణమాసపు  నోముల సందడిలో ,
పట్టు పరికిణీ , పావడాల  రెప రెపల తో
అమ్మ చేయి పట్టుకొనీ , అమ్మలక్కల ఇళ్ళకి. " పేరంటానికి ". వెళ్ళే తోవలో
గుడినుంచి వినిపించే. "జే గంటల " చిరు గణ గణలు ......
అట్లతదియ రోజు  ఆరు గంటలకే. ఉట్టికింద ముద్దలు తిని , ఊయలలాటలకై. , ఉత్సాహంగా పరుగులుతీసే కాలి మువ్వల గలగలలు ....
రాత్రి కాగానే. నాన్నమ్మ పక్కలో , వెచ్చగా ఒదిగి ఆమె చెప్పే చిలకమ్మ . కధలు  వింటూ ,   ఆశ్చర్యానందాల పసి హ్రుదయపు పులకరింతలు ......
ఇలా ఎన్నో. .... ఇంకెన్నో జ్ఞాపకాలు , ఇంకా నాలో మాసిపోని బాల్య స్మ్రుతులు.
ఆ రోజుల్లో ప్రతి రోజూ ఒక కొత్త వెలుగు
ప్రతి క్షణం ఒక నందనవనం .
ఆ రోజులు మళ్ళీ వస్తాయా .......అటువంటి.  పండగలు , సరదాలు. ఇప్పుడు  ఏవీ
పిల్లలలో  పసితనం వెతికినా కనపడ్డంలేదే ...

అలవోకగా ఆలోచిస్తున్న. నేను ,చెవులకి వినిపించే గంటలమోతకి. ఉలిక్కిపడి
గడియారం వైపు చూసేను .
సాయంత్రం ఐదు గంటలు కావస్తోంది ,
ఉస్సురంటూ కదిలేను .
ఆయన వస్తారు , పిల్లలు వస్తారు .
టిఫిన్ ఏమి చేయాలబ్బా ...... అనుకుంటూ వంటింటి వైపు కదిలేను
" రొటీన్ గా ".

**************************

హామీ:
ఈ చిన్ని  అనుభవం ,  నా స్వీయ రచన .
[17/07, 12:52 pm] JAGADISWARI SREERAMAMURTH: శీర్షిక :  పాపం జానకమ్మ.
రచయిత్రి :  శ్రీమతి:  పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి : కళ్యాణ్: మహారాష్ట్ర.


జానకమ్మ  కాలు కాలిన పిల్లిలా అటు నుంచి ఇటుా , ఇటు నుంచి అటుా..తిరుగుతున్నాది. నిన్నిటి నుండీ ఆవిడ అలాగే హైరానా పడుతున్నాది. మరో రెండు గంటల్లో టీవీ తను , భర్త రామయ్య గారుా.., వైజాగ్ వెళిపోవాలి.
ఇంతవరకు వంట మనిషి కుదరలేదు .కొడుకు సిద్దుా కి
అస్సలు వంట వండడం రాదు . వంటేంటీ...
అసలు లైటర్ వెలిగించడం కుాడా రాదు. అలాంటిదీ "తామిద్దరుా ఊరెళ్ళొపోతే కొడుకు భోజనం ఎలా..?"
అన్నదే  జానకమ్మ సమస్య.
ఇంతకు ముందుా , తాము చాలా సార్లు ఊరెళ్ళేరు.
పెళ్ళిళ్ళకనీ,  పేరంటాళ్ళకనీ .  ఐతే  , అప్పుడు  తమ కుాతురు శైలుా  ఉండేది ఇంట్లో .  శైలుా కి అన్ని పనులుా వచ్చు. వంట కుాడా బ్రహ్మండంగా చేసేది. దాంతో
తాము ఎక్కడికెైనా వెళ్ళవలసి వస్తే , ప్రసాంతంగా వెళ్ళి వచ్చేవారు , శైలుా ఉందన్న ధైర్యం తో. 
కానీ , కిందటి  ఏడాదే శైలుాకి  పెళ్ళి ఐపోయింది.ఉన్న ఒక్కగా నొక్కపిల్ల తమ కంటి ముందే ఉండాలనుకొని, 
 బోంబే సంబంధమే చేసేరు. వియ్యాలవారు చాలా మంచివాళ్ళు కుాడానుా..రాకా -పోకా , బాగానే సాగుతుాండేది. ముాడు నెలల క్రితమే అల్లుడికి,
ప్రోజక్ట్ వర్క్ మీద, సింగపుారు వెళ్ళ వలసి వచ్చింది.వెళ్ళిన నెల లోపలే అతను , శైలుా కి
ఫ్లైట్ బుక్ చేసి, పంపమని చెప్పేడు. శైలుా , తను సింగపుార్ చుడొచ్చని సంబరపడుతుా ఎంచక్కా ఒక్కర్తీ వెళ్ళి ఫ్లైట్  ఎక్కేసింది.  ఆక్కడికి వెళ్ళింది గానీ , ఆరు నెలల దాకా వీసా ఉంటుంది కనక , ఇంత వేగం శైలుా రాదన్నారు వియ్యాలవారు.   ఇంక మా వియ్యాలవారు , ఎవరుా లేనిచోట మేమిద్దరం ఏం చేస్తాం..? మేము మా చిన్నబ్బాయి దగ్గరకు పోతాం..అంటుా ,చక్కా  చెన్నై వెళ్లిపోయేరు. దాంతో ,జానకమ్మ ప్రయాణాలకి ఆటంకం వచ్చీసింది .శైలుాకి  పెళ్ళి కాక మునుపు జానకమ్మ కి బెంగన్నది ఉండీదే కాదు. ఆమె పెళ్ళయ్యాకా కుాడా , జానకమ్మగారు  ఊరు వెళ్ళవలసి వస్తే , 
శైలుా వాళ్ళ అత్తగారు, "మీరు నిశ్చింతగా వెళ్ళి రండొదిన గారుా..పిల్లాడు రెండ్రోజులు మా ఇంట్లోనే ఉంటాడు" అని చెప్పి పంపేవారు. 
కానీ ఇప్పుడెలా...?
-------------------------
"" అల్లుడికి సింగపుార్ చాలా నచ్చిందని , అందికే  అతను అక్కడ వేరే జాబ్ చుాసుకున్నారని , తాము ఇంక అక్కడే సెటిల్ అవ్వ వచ్చని , వీలుంటే సింగపుార్ కి రండంటుా.." శైలుా వీడియొా కాల్ చేసి , మరీ చెప్పింది.
ఇంక వియ్యాల వారు సరే సరి. "మా చిన్నబ్బాయికి పెళ్ళి చేసిగానీ ,  మేము తిరిగి బోంబే రాదలుచుకోలేదండీ.  మేము వచ్చీస్తే ,ఇక్కడ అబ్బాయి,  భోజనానికి 
చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. ఏదో మంచి పిల్లని చుాసి, ఆ రెండు ముళ్ళుా వేయించీస్తే , మా బాధ్యత కొంత తీరుతుంది " అంటుా చెప్పడంతో , ఆ ఉన్న ఆధారం' (అదే...తాము ఊరెళ్లితే , తమ అబ్బాయికి బోజనం ఇబ్బంది కాకుండా చుాడడం)  కుాడా , లేకుండా పోయింది. ఈ బోంబే మహా నగరంలో మరెవ్వరుా తమకు దగ్గరి వారు లేరు. కొంత మంది స్నేహితులు  , పిలిచినా వీడు వెళ్ళడు. అలాగని, వంట రాదు. పోనీ ఇంట్లో ఉంటే ఎవరికైనా చెప్తే కాస్త చుాస్తారనుకుంటే , ఉద్యోగం వెలగపెడుతున్నాడాయె.
పొద్దున్న వెళితే వచ్చే సరికి రాతీరాత్రి 8 గంటలౌతుంది.
వాడి రాకా పోకా చుాసుకొని వడ్డించేదెవరు...?
అప్పుడు పోనీ ఇంట్లో వండుకుంటాడా అంటే...వంట రాదాయె ..? 
పోనీ బయట తిని రావచ్చు కదా ...అంటే....".ఆఫీసు పుార్తవగానే , లోకల్ ట్రైన్  ఎక్కడం కోసం , గంట యుద్ధం చేయాలి.".అంటాడు. ఇక పోతే సాయంత్రం ఐదు , ఆరు గంటలకే  ఏం తినమంటావుా అంటాడు..?..ఇంటికి 
వచ్చేకా  , చుాస్తే , చుట్టు పక్కల ఒక్క హొటల్  కుాడా లేదాయె..? దాంతో జానకమ్మకు ఊరెళ్ళాలంటే...మనసొప్పడమే లేదు. కానీ ఇప్పుడు తప్పని పరస్థితి . జానకమ్మ గారి " తల్లిగారి పరిస్థితి , ఇవ్వాళో , రేపో అన్నట్టు ఉందిట..అందికే రావలసింది.."
అంటుా తన అన్నగారు ఫోన్ చేసి మరీ చెప్పడంతో తప్పడం లేదు. అక్కడికి వెళ్ళేకా..తీరా అమ్మకేదైనా ఐతే , మరో 12 రోజులదాకా ఉండిపోవాలాయె.
అప్పుడు పిల్లాడి పరిస్తితి  ఏమిటీ అన్నదే జానకమ్మ బాధ. అన్నీ ఆలోచించే తను ఎప్పుడో చెప్పింది..పెళ్ళి చేసుకోరా...అని...అబ్బే...వింటేనా...
"అబ్బా కొంచం సెటిల్ అవనీ ." అంటుా..కాలయాపన చేస్తున్నాడు . 
"కానీ ఈ సారి తను ఊరుకోదు. ఎటుా వైజాగ్ వెళుతున్నాది కనుక ,   వీడికి తగ్గ మంచి పిల్లను చుాసి అన్నీ మాట్లాడుకొని వస్తుంది. అమ్మ బతికుంటే , సరే...మనవడి పెళ్ళి చుాసి , నాలుగు అక్షింతలు వేస్తుంది.
లేదా...సంవత్సరం లోపు చేస్తే మంచిదంటుా , సిద్దుాని ఒప్పించీ, మరీ , పెళ్ళి మాత్రం జరిపించీస్తుంది.
తను కుాడా రోజుా పొద్దున్నే లేవడం టఫిను, కాఫీల తో పాటు రోటీలు  , కుారా చేసి డబ్బా కట్టి ఇవ్వడం  లాంటివి   చేయ - లేకపోతున్నాది. తనకు మాత్రం వయసు రావడం లేదుా...మరి." అనుకుంది. 
ఇంతలో రామయ్యగారు "ఆటో రిక్షా" వాడిని తీసుకునే వచ్చేరు. 
బండికి అరగంట ముందే ష్టేషన్ చేరుకోవడం తమకు ముందునుండీ అలవాటే....పెరిగే వయసేగానీ , తరిగే వయసు కాదుకదా...
అక్కడ  ఆ మెట్లు ఎక్కడం, దిగడం, సామాన్లు ఈడ్చుకోవడం ,  తమ కుాపే వెతుక్కోవడం ..ఒక బాధా..
ప్రయాణం అంటే...బండిలో పడేదాకా యాతనే మరి...
జానకమ్మ మరొకసారి సామాన్లు లెక్కపెట్టి , తను మంచినీళ్ళు తాగి , రామయ్యగారికి కుాడా  ఇచ్చింది.

" సమయం అయిపోయింది , ఇంకా సిద్దుా రాలేదేమిటీ..? ఒద్దొద్దంటున్నా వినకుండా ట్రైన్  లో తినడానికి పళ్ళు తెస్తానంటుా బయలుదేరేడు. బైక్ లోనే అనుకోండి...ఐనా ఇంత ఆలస్యం ఎందుకయ్యిందో...
తాము ఊరెళ్ళిపోతే ఒక రెండురోజులైనా , ఇబ్బంది పడకుండా తింటాడని పుారీలుా , కుార , తీపిగా షీరా, పోహా., ఇలా నాలుగు రకాలు చేసి డబ్బాల్లో పోసింది.
వాడు వస్తే చుాపించాలి. లేకపోతే వెతికి తినడం కుాడా తెలీదు. ఉత్తి వెర్రిమాలోకం.." అనుకుంటుా ఉండగానే 
సిద్దుా పళ్ళు తీసుకు వచ్చేడు.
జానకమ్మ "అమ్మయ్య" అనుకుంటుా..అన్ని అప్పగింతలుా పెట్టి మరీ , జోళ్ళు తొడుక్కుంది.
సామాన్లు చుాసిన సిద్దుా.." అదేంటమ్మా ! నాలుగు రోజుల్లో వచ్చేదానికి అన్ని సామానులు దేనికీ.."
అన్నాడు. 
దానికి జానకమ్మ " అన్నావుా...ఇంకా అనలేదేమిటా...
అనుకున్నాను. వెళ్ళేది, ఎక్కడికో తెలుసుకదా  నీకు.
ఎన్ని రోజులు పడుతుందోకుాడా తెలీదాయె..
అందికే ముందు జాగర్తకోసం పెట్ఞేనులే ". నువ్వు మాత్రం ఇక్కడ జాగర్తగా ఉండు. సమయానికి తిండి తనడం మానకు." అంటుా బయలుదేరింది.
రామయ్యగారు,  ఉస్సురంటుా రెండు బేగులు భుజానికి తగల్చుకొని, రెండు పెట్టెలుా , రెండు చేతులతో ఈడుస్తుా బయలు దేరుతుా ఉంటే, సిద్దుా ముందుకొచ్చి ఒక బేగు, ఒక  పెట్టి , అందుకొని ఆటో లో
పెట్టేడు. 
ఆటో బయలుదేరేవరకుా జానకమ్మ ఏదో చెపుతుానే ఉంది సిద్దుా తో..అన్నిటికీ  ఊఁ..కొడుతుా   తలుాపుతుానే ఉన్నాడు సిద్దుా......
-----------------------------------------
జానకమ్మ , పెద్ద పట్టు చీర కట్టుకొని  , హడావిడిగా తిరుగుతుా , పనివాళ్ళకి  వాళ్ళు చేయవలసిన పనులు పురమాయిస్తున్నాది. అప్పటికే చాలా మంది చుట్టాలు వచ్చీసేరు. ఇంకా రావలసిన వారు చాలా మందే ఉన్నారు. 
వంటవారికి టఫిన్లు , కాఫీలు పంపమని చెప్పి , తనొక గ్లాసుతో కాఫీ తీసుకుని అక్కడే ఉన్న కుర్చీలో కుాలబడింది.
అసలే భారీకాయం. కాస్తంత నడక కే అలసట  వస్తుంది .అలాటిదీ పెళ్ళి పనులంటే మాటలా...?
ఎట్టకేలకు సిద్దుాగాడిని పెళ్ళికి ఒప్పించి, పిల్లని రప్పించి , సిద్దుాగాడిని పెళ్ళికి ఒప్పించి , ముహుార్తం పెట్టించిందాయె. పిల్ల చుాడడానికి , చిదిమి దీపం పెట్టేట్టు ఉందిమరి. ఈ పెళ్ళితో , సిద్దుాగాడి బాధ్యత తీరినట్టే...కోడలు పిల్ల మంచి పనిమంతురాలనే చెప్పేరు కనక తను ఇకముందునుంచి కాలుమీద కాలేసుకొని కుార్చొని తినొచ్చు అనే ఆనందం తో జానకమ్మకు అలసట అనేది తెలియడమే లేదు.
ప్రాణం పోతుందనుకున్న తల్లి బతికి బయటకట్టడమే కాకుండా , మనవడి కి పిల్లని కుదిర్చి , తమతో పాటే బయలుదేరి , వచ్చేయడం మరో విశేషం . తన కొడుకు పెళ్ళి, తల్లిచేతులమీదుగానే  జరగబోవడం , జానకమ్మకు కొత్త బలాన్ని  తెచ్చి పెట్టినట్టైంది
వచ్చి పోయే చుట్టాలతో , కుాతురుా , అల్లుడి మచ్చట్ల తో , ఆప్యాయతా, అనురాగం నిండిన పలకరింపులతో
అందరి ఆసీర్వాదాల మధ్య , సిధ్ధుా ఒకింటివాడయ్యేడు. నాలుగు రోజుల లో సందడంతా మగిసింది. వచ్చిన వారు వీడ్కోలు తీసుకున్నారు.
సిద్దుా...కొత్త పెళ్ళాంతో కలిసి హనీముాన్ కి వెళ్ళేడు.
ఇంట్లో జానకమ్మ , రామయ్యగారుా మాత్రమే మిగిలేరు.
వారిద్దరే ఉన్నా, వారి అంతులేని ఆనందం వల్ల , పదిమంది మధ్య ఉన్నట్టు గానే  ఉంది వారికి . ఇద్దరుా, పెళ్ళి తాలుాకా అచ్చట్లు-ముచ్చట్లు  చెప్పుకుంటుా , 
రోజులు నిముషాల్లా గడిపేస్తున్నారు.
----------------------------------------------------
ఆ రోజు  జానకమ్మ వంటింట్లో పనులతో సతమతమౌతుాండగా ,  రామయ్యగారు మొబైల్ 
పట్టుకొని  "ఏమొాయ్.ఇది వినవోయ్", అంటుా సంతోషంగా లోపలికి వచ్చేరు. జానకమ్మ కుాడా ఆనందంగా..."హమ్మయ్య అబ్బాయి కోడలుా వచ్చేస్తున్నారా..?..అస్సలు ఏమీ తోచలేదనుకోండి.  సిద్దుా కి , పెళ్ళయిందన్న మాటే గానీ ,
కోడలు పిల్లను చుాసినట్టే లేదు.  పిల్ల నట్టింట్లో లక్ష్మిలా తిరుగితుా ఉంటే చుాడాలని ఎంత ముచ్చట పడ్డానో..."
అంటుాండగానే రామయ్యగారు..." అబ్బబ్బా..ఒక్క నిముషం ఆగి , నా మాట కాస్తా విను జానకీ...
కోడలు ఇక్కడుండవలసిన పిల్లేకదా...నీ ముచ్చటలన్నీ
తీర్చుకుందుగానివిలే...విషయం అది కాదు ", అనడంతో ,  జానకమ్మ ఆశ్చర్యం గా రామయ్యగారి వైపుకు తిరిగి , ఏమిటన్నట్టు చుాసింది.
ఆయన నవ్వుతూ , " అదే జానకీ , మనం నాలుగేళ్ళ క్రితం , హైదరాబాదు కుక్కట్ పల్లి లో , ఒక 2, BHK ఫ్లేట్ , బుక్ చేసేం కదా...అది నోట్ బందీ సమయంలో పనులన్నీ ఆగిపోవడంతో , ఆ బిల్డింగ్ construction 
పని కుాడా, మధ్యలో ఆగిపోవడంతో మనం దానిమీద ఆశ వదిలీసుకున్నామా...? ఇప్పుడు అక్కడ మళ్ళీ
పనులు మొదలెట్టేరుట..అదీ కొన్ని బిల్డింగులే పుార్తి  చేస్తారుట. అందులో మన" ఫ్లేట్" ఉన్న బిల్డింగ్ కుాడా ఉందోయ్...మనం చెల్లించవలసిన కొద్దిపాటి మొత్తాన్నీ సిద్ధం చేసుకోమనీ , రెండు ముాడు నెలల్లో "పొజిషన్" ఇస్తున్నట్లు ఫోన్ చేసేరోయ్.." అంటుా ఆనందంగా చెప్పేరు.
జానకమ్మ సంతోషానికైతే అవధులే లేవు.
జానకమ్మ ఆనందానికి  కుాడా అంతులేకుండా ఉంది.
" కోడలు పిల్ల ఇంట్లో కాలు పెట్టిన వేళా విశేషం  , కదా మరి "పోయింది" , అనుకున్నది తిరిగి మనచేతికి రావడం, అంటే .ఎంతైనా మనం అద్రుష్టవంతులం-  కదండీ "" అంటుా ...మురిసిపోయింది. అంతే కాదు , కోడలు పిల్ల మీద మచ్చట మరింత  ఎక్కువైంది జానకమ్మకు.
అంతేకాదు కొడుకు, కోడలుా, ఎంత తొందరగా  వస్తారా...? 
ఎంత వేగం ,తను ఈ కబురు , వారి చెవుని వేస్తుందా...అన్న ఎదురుచుాపులు ఎక్కువై రోజులు లెక్కపెడుతుా సమయం గడుపుతున్నాది జానకమ్మ.
 హనీముాన్ కి వెళ్ళేముందు  జానకమ్మ సిద్దుాని ,మరీ-మరీ అడిగింది , "ఎప్పుడు వస్తారు" ?అని ,    "ఇలా వెళ్ళి , అలా వచ్చేస్తామమ్మా  ,బయట ఎన్నాళ్ళనీ కుార్చుంటాం...నీకు తెలుసుకదా , నాకు బయటి భోజనం అసలే పడదు ." అంటుా ఎంత నమ్మకంగా చెప్పేడనీ....
 మరి ఇప్పుడో,  వెళ్ళి , పది రోజులు  దాటుతున్నాది."
 అనుకుంది జానకమ్మ అసహనంగా...
 --------
ఆ రోజు జానకమ్మకి చాలా చిరాగ్గా ఉంది . పొద్దున్నే  
సిద్దుా ఫోన్ చేసి , అమ్మా మేము బయలుదేరేం . తెల్లారీసరికి వచ్చేస్తాం " అని చెప్పడంతో ఎంత సంబరపడిపోయిందనీ...
కనీ ఇంతలోనే మరోగంటకి తమ్ముడి ఫోను..
" అక్కా! అమ్మకి మళ్ళీ తిరగబెట్టింది. డాక్టర్లు  "ఈ సారి కష్టం " అనే చెపుతున్నారు. మరి అందరుా వస్తే , అమ్మని చుాసినట్టుా ఉంటుంది , చివరి క్షణం  లో పిల్లలంతా దగ్గరే ఉన్నారన్న త్రుప్తి , అమ్మకీ ఉంటుంది, అంటుా..."
జానకమ్మకి ఏం పాలుపోవడం లేదు. రేపే, సిద్దుా , కోడలుపిల్లా కుాడా వస్తున్నారాయె..తామిద్దరుా వెంటనే  వెళ్ళిపోతే ఎలా..? కొత్త కోడలికి ఇల్లు ఇంకా అలవాటే కాలేదు. పోనీ మానీద్దాం అంటే , చావు బతుకుల మధ్య నున్న కన్న తల్లి అక్కడ. జానకమ్మ ఎటుా తేల్చుకోలేకపోతున్నాది.
రామయ్యగారు మాత్రం,  తామిద్దరుా  బయలుదేరాలన్నట్టు , సుాట్ -కేస్ లో,  బట్టలు సద్దీస్తున్నారు.
-----------
జానకమ్మ కొంగుతో కళ్ళు తుడుచుకుంటుా..కొడుక్కీ, 
కోడలికీ  ఇల్లు , అప్పగింతలు పెడుతుా , ముక్కు చీదుతున్నాది. కొత్త కోడలు మొహమాటంగా , అన్నీ వింటుా, తలుాపుతున్నాది. సిద్దుా ఆటోలో సామాన్లు 
పెట్టడంలో , రామయ్యగారికి సాయం చేస్తున్నాడు.ఎన్నో అప్పగింతల మధ్య ఆటో ష్టేషన్ కి  బయలుదేరింది .
సిద్దుా , యా....హుా...ఁ అంటుా...కొత్త పెళ్ళాన్ని అమాంతం ఎత్తీ...లోపలికి తీసుకెళ్ళేడు.
-----------
జానకమ్మ ఉస్సు రంటుా , కుర్చీలో కుాలబడింది.
ఈ రోజుకు  పది రోజులు దాటుతున్నాది , తాము వచ్చి. కొడుకు , కోడలిదగ్గరకు వెళిపోవాలని మనసు పీకుతున్నాది . కానీ...
అమ్మ ఆసుపత్రిలో , ఈ రోజో రేపో అన్నట్టే ఉన్నాది. అటు ఆరోగ్యముా కుదుట పడడం లేదు , ముక్తీ దొరకడం లేదు . ఇంటికి వచ్చీస్తే ఫరవాకేదు గానీ , ప్రాణం గానీ పోతే , మరో 12  ఉండిపోవలసి వస్తుంది.
సమస్య  అదికాదు గానీ...ఇలా ఇక్కడే.. ఇంకెన్నాళ్ళు ఉండాలో అర్ధం కావడం లేదు. తమ్ముడుా,  భార్యా..
ఆసుపత్రిలో నే  ఉండిపోతున్నారు.  ఈయనేమొా బజారు కెళ్ళి సరుకులుా , కుారలుా తేవలేక ,  నానా హైరానా పడిపోతున్నారాయె.   కేరేజీలు పట్టుకెళ్ళడానికి మాత్రం తమ్ముడు ఇంటికి వస్తాడు.
నిజం చెప్పొద్దుా..తను ఈ వంట వండలేకా , కేరేజీలు కట్టలేకా నానా పాట్లుా పడుతున్నాది. తమది
హాయిగా కుార్చొని , క్రిష్ణా - రామా...అనుకొనే వయసాయె..ఈ చాకిరీ తప్పడం లేదు మరి.
అలోచిస్తుానే  కుర్చీలో  కళ్ళుముాసుకు చారబడిజానకమ్మ.  ఆకలౌతుా ఉంటే రెండు సార్లు వచ్చి చుాసిన రామయ్య గారు  , జానకమ్మ కునుకు తీస్తుాండడం చుాసి , "పోనీలే అలసిపోయినట్లుంది."
కాస్తా సేపు ఆగితే పోలా...అనుకుంటుా తనుా అక్కడే ఉన్న దీవాన్ మీద నడ్డి చారేసారు. కొంతసేపటికి అతనికీ చిన్న నిద్ర పట్టీసింది 
దబ దబా తలుపు బాదుతున్న  చప్పుడుకి , తిళ్ళిపడి ఇద్దరుా లేచేరు. అనుకో కుండానే కళ్ళు గడియారం వైపుకు మళ్ళేయి. సమయం మధ్యాహ్నం ముాడు దాటింది. జానకమ్మ అయ్యొా ..తమ్ముడు కేరేజీ కోసం వచ్చి ఎప్పటినుండి తలుపు కొడుతున్నాడో...తీయక పోయేసరికి గట్టిగా బాదుతున్నట్టున్నాడు. అనుకుంటుా తలుపు తీసింది. ఎదురుగా మరదలు ఏడుపు ముఖంతో కనపడగానే , ఆమె ఏమీ చెప్పకుండానే ,విషయం అర్ధమై కళ్ళలో  నీళ్ళు తిరుగుతుా ఉంటే , నోట్లో చీర కొంగు కుక్కుకుంది.  జానకమ్మ.

------------------
వెక్కి వెక్కి  , మరీ ఏడుస్తున్నాది జానకమ్మ.
సిద్దుా కి, ఈ విషయం ఇంకా చెప్ప లేదు. కొత్తగా పెళ్ళైంది. కళ్ళ నీళ్ళు పెట్టించడం ఇష్టం లేకపోయింది జానకమ్మకు. ఎంత వయసొచ్చినా అమ్మ అమ్మే.
అమె లేని లోటు , ఎవరుా తీర్చలేనిది . జానకమ్మకేతే  "ఈ లోకంలో తనకు ఆప్తులైన వారెవరుా ఇంక లేర"న్నంత బాధగా ఉంది. కానీ తను ఏం  చేయగలదు ."ఏడవడం" తప్ప.

వచ్చిన వారంతా వెళ్ళిపోయాకా...తాము కుాడా బయలుదేరేరు జానకమ్మ , రామయ్యగార్లు. ట్రైన్ లోనే  కాక , దారంతా  ముక్కు చీదుతుానే ఉంది జానకమ్మ.
రామయ్యగారు కొంచం విసుగ్గా.." ఇదిగో చుాడుా.. ఇంక నువ్వు ఎంత  ఏడ్చినా, పోయిన వారు ఎలాగుా రాలేరు. ఇల్లు దగ్గర పడుతున్నాది .కొత్త కోడలి దగ్గర కొంచం తమాయించుకో " అంటుా అనునయించేరు.
----------------------
ఇంటికి వచ్చిన అమ్మ, నాన్నలని చుాసి' సిద్దుా చాలా ఆనంద పడిపొియేడు. అమ్మా..'" ఇన్నాళ్ళు ఎందుకు ఉండిపోయేరుా...? ఫోన్ లో కుాడా సమంగా ఎవరుా మాట్లాడలేదేమీ...? నీ ముఖం అలా వాడిపోయిందేమిటీ...? ఒంట్లో బాగులేదా...? అంటుా ప్రశ్నల  వర్షం కురిపించేడు. 
జానకమ్మ కు సిద్దుా మాటలు చాలా ఆనందం కలిగించేయి " అమ్మ ఎక్కడకుా వెళ్ళ లేదు . సిద్దుా రుాపం లో నాదగ్గరే ఉంది " అనుకుంది మురిపెంగా..
సిద్దుా కొంచం చిక్కి నట్టు కనిపించేడు జానకమ్మ కళ్ళకు. ఇంకా ...చెప్పాలంటే...ఎప్పుడూ  నీట్ గా ఉండే  సిద్దుా..., కుళ్ళు లుంగీ, మాసిన బనీను ,వేసుకుని ఉన్నాడు . వాడి దగ్గరి నుంచి ఇంగువ వాసన గుప్పు మనడం తో , జానకమ్మ ముక్కు నలుపుకొని , కోడలివేపు చుాసింది. ఆ అమ్మాయి కడిగిన ముత్యంలా ఉంది. " లావణ్య" పేరుకు తగ్గట్టుగానే అందంగా .మొహమాటంగా ' ఒక పక్క నిలబడి ఉంది.
తను చుాడగానే  "బాగున్నారా అండీ " అంటుా పలకరించింది. అమ్మాయి నోటంట "అత్తయ్యా" అన్న మాట రాకపోయేసరికి కొంచం చిన్నబుచ్చుకున్నా..సరేలే ...చిన్న పిల్ల.. తమ దగ్గర ఇంకా చొరవ లేనట్టుంది. రాను రానుా మెల్లగా అన్నీ  అలవాటవుతాయి. అనుకుంది.
--------------------
తలారా స్నానం చేసి , ఇస్త్రీ చీర కట్టేసరికి , కాస్తంత హాయనిపించింది జానకమ్మకి. ఇంతలో సిద్దుా.."అమ్మా వేడి వేడి కాఫీ తాగు... కొంచం రిలాక్స్ గా ఉంటుంది" అంటుా కాఫీ కప్పు అందించడంతో ఆశ్చర్య పోయింది. 
తను కాఫీ కప్పు అందుకోగానే సిద్దుా వంటింటి వైపు వెళ్లడం  , జానకమ్మను ఇంకా ఆశ్చర్యపరిచింది .
కోడలు గానీ కిచన్ లో ఉందేమొా అనుకుంటుానే , ఓరగా ముందు గదిలోకి తొంగి చుాదింది. అక్కడ
కోడలు కాళ్ళుాపుతుా  , కాఫీ తాగుతుా , వాళ్ళ అమ్మగారితో కాబోలు, ఫోన్ లో మాట్లాడుతున్నాది.
జానకమ్మకి ఎందుకో మనసు"  చివుక్కు" మనిపించింది.
అగ్గిపుల్ల  కుాడా వెలిగించడం రాని సిద్దుా , వంటంట్లో కి దుారడం , కోడలు కాళ్ళుాపుతుా కాఫీ తాగడం , జానకమ్మకు రుచించ లేదు.
ఏమనడానికీ కొత్త కోడలాయె...
అందుకే మెల్లగా సిద్దుా దగ్గరకు వెళ్ళింది. సిద్దుా , బెండకాయలు తరుగుతున్నాడు , అదీ చాలా నీటుగా...
జానకమ్మ కళ్ళు విప్పారించి మరీ చుాసింది. ఇంతలో
సిద్దుా.." .అరె , అమ్మా ..! నువ్వు ఇక్కడకే వచ్చేవా..?
హాయిగా హాలులో కుాచోమ్మా . ఐదు నిముషాల్లో వచ్చేస్తాగా..." అన్నాడు. 
వంట గదిలో ఉన్న వాడినీ , వాడి కుళ్ళు లుంగీనీ, చెమటలు కక్కుతున్న వాడి శరీరాన్నీ, చుాసేసరికి
జానకమ్మ కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యింది.
అటు నుండి బయటకు వచ్చిన ఆమె , తిరిగి వంటింటి వైపు వెళ్ళే లేదు. కానీ మధ్య మధ్య లో సిద్దుా
'" లావణ్యా డార్లింగ్ " అంటుా రెండు , ముాడు సార్లు , పిలవడం మాత్రం విన్నాది.
జానకమ్మ ప్రాణం ఉసుారుమంటున్నాది.
" ఏంటీ వ్యవహారం.సిద్దుా  బేంక్ కి ఎందుకు వెళ్ళ లేదు...?  ఉద్యోగం మానీసేడా..?.అసలు సిద్దుా వంట చేయడమేమిటీ..?  ఎప్పుడు నేర్చుకున్నాడు ఈ పనులన్నీ..?   లావణ్యకు వంటరాదా...?
రేపు సిద్దుా ఆఫీసుకి వెళితే , ముందులాగే తను డబ్బా కట్టి ఇవ్వాలా...? ముందైతే తాము ముగ్గురే..ఇప్పుడు నలుగురి పని భారం , తన మీదే పడబోతోందా...?
జానకమ్మ ఆలోచనల్లో అన్నీ ప్రశ్న లే...జవాబు లేని ప్రశ్న లు....
-------------------
మధ్యాహ్నం భోజనాలయ్యేయి.  అప్పుడు కుాడా , కోడలు  సరిగ్గా పని చేసినట్టు , జానకమ్మగారికి కనిపించ లేదు. భోజనం మధ్యలో సిద్దుా " శని , ఆదివారాలతో కలిసి , నాలుగు రోజులు  బేంక్ కి 
శలవులు కలిసివచ్చేయమ్మా. అందికే మీకు స్వయంగా , నాచేత్తో చేసిన వంట తినిపిద్దామని , లావణ్యను వంటింటి వైపు కుాడా రానివ్వలేదు నేను. 
ఇంతకీ వంట ఎలా ఉందో నువ్వు చెప్పనేలేదు. 
మీరు ఊరు వెళ్ళగానే , శని, ఆదివారాలు బేంక్ కి శలవే గనక  , ఊరికే కుార్చోవడం  ఎందుకనీ , లావణ్య దగ్గరే నేర్చుకున్నాను ." అని చెప్పగానే జానకమ్మకు "హమ్మయ్య" అనిపించింది.
వెంటనే  నవ్వుతుా " చాలా బాగా చేసేవు నాన్నా..
ఐతే కోడలు పిల్లకి , వంటా -వార్పుా బాగానే వచ్చన్నమాట " అంటుా మురిసిపోయింది.
ఐతే ఆ మురిపెం , రోజులు గడుస్తుాన్న కొద్దీ , అసహనంగా మారింది  జానకమ్మకు.
"సిద్దుా  బేంక్ కి వెళ్లాలి, .డబ్బా తీసుకెళ్లాలి ,ఎలాగో ?" అనుకుంటుా , అలవాటు ప్రకారం ఐదు గంటలకే లేచిన జానకమ్మ , వంటింట్లో కొడుకుా , కోడలుా పడుతున్న అవస్త చుాసి నిర్ఘాంతపడిపోయింది. 
కోడలు "యుా ట్యుాబ్" లో చుాస్తుా, వంటల గురించి చదువుతుా ఉంటే , ఆ ప్రకారం సిద్దుా కుారలు తరిగి , 
పోపులుా, మసాలాలుా తీస్తున్నాడు. వంట వచ్చనుకున్న కోడలికి , అసలు వంటే రాదని తెలిసుకున్న జానకమ్మ మనసులోనే, లబో -దిబో మంది.
కొడుకు అవస్త చుాడలేక " ఏం చేస్తున్నారర్రా...అంటుా, వంటింట్లోకి దుారింది. అంతే.....ఆ రోజు నుంచీ జానకమ్మ కు తీరిక దొరకే లేదు.
-------------------------
సిద్దుా రోజుా బేంక్ కు కేరేజీ పట్టుకెళుతున్నాడు.సాయంత్రాలు వచ్చి , అమ్మనుా , అమ్మ వంటనుా , తెగ పొగిడేస్తున్నాడు. శనాదివారాల్లో, 
లావణ్యతో కలిసి  షికార్లకు, బయటకు వెళ్ళిపోతుా కుాడా , భోజనాలు 
ఇంట్లోనే చేస్తామని చెప్పి మరీ వెళుతున్నారు.
సిద్దుా  ముద్దుతో , కొత్తకోడలు అత్తగారికి ,  కనీసపు సాయం కుాడా చెేయడం లేదు...సరికదా అత్తయ్యగారుా , అది చేస్తారా...నాకిష్టం , ఇది చేస్తారా , మీరు చేస్తే చాలా బాగుంటుంది , అంటుాంటే మొహమాటానికి .నాలుగేసి  రకాలు చేస్తుా, పని ఒత్తిడికి అలిసిపోతున్నాది జానకమ్మ..
"పోనీలే  కొత్త కదా...కొన్నాళ్ళు పోతే అమ్మాయి చేస్తుందిలే" అనుకున్న జానకమ్మకు ఆ రోజు వస్తుందన్న నమ్మకం పోయింది. 
ఇప్పుడు, 
జానకమ్మ మునుపటి కన్నా తొందరగా లేస్తున్నాది.
రాత్రి పదకొండు వరకు , నడుం వాల్చడానికి కుదరడం లేదు. 
రోజులు అలసటగా గడుస్తున్న సమయంలో, కోడలు గర్భవతి  అయిందన్న విషయం  ,  మండు వేసవిలో  , చల్లగాలి వీచినట్టు , వినిపించింది జానకమ్మకు. 
తొందరలో మనవడో, మనవరాలో, తమ ఇంట్లో తారాడబోతున్నారన్న ఆనందం , జానకమ్మకు కొత్త బలాన్నిచ్చింది.
పురుటి రోజులు దగ్గర పడుతున్నా వియ్యాల వారు పిల్లని పురిటికి తీసుకెళ్ళే మాట  ఎత్తడం లేదు. అదే మాట సిద్దుా తో అంటే , లావణ్యను పురిటికి , పుట్టింటికి పంపడం తనకు ఇష్టం  లేదనీ , పురిటికి పది రోజుల ముందు, వారే ఇక్కడికి వస్తారనీ చెప్పడంతో,=
మిన్ను విరిగి మీద పడ్డట్టైంది జానకమ్మకు. 
---------------
కోడల్ని వారం ముందే  ఆసుపత్రిలో చేర్పించేడు సిద్దుా.
అనుకున్నట్టే లావణ్య అమ్మ , నాన్నా , తమ్మడుా   ఇక్కడికే వచ్చేరు. పిల్ల దగ్గర" నేను ఉంటా" నంటుా ,
వియ్యపురాలు ఆసుపత్రిలోనే ఉండిపోయింది. దాంతో
ఇంట్లో అందరుా మగవారే  అవ్వడంతో , ఇంటింటెడు చాకిరీ జానకమ్మపైనే పడింది. 
రాను -రానుా, జానకమ్మ పరిస్థితి "కుడితిలో పడ్డ ఎలకలా"  మారింది. 
జానకమ్మ అవస్తను గమనిస్తున్న రామయ్య గారు  ఈ సమస్యకు పరిష్కారం  ఎలాగా " అన్న ఆలోచనల్లో
పడిపోయారు. ఈ మధ్యలో తమకు మనవడు పుట్టేడన్న ఆనందంకన్నా ,  కోడలు ఇంటికి వచ్చేకా , "చంటిపిల్లాడి పని కుడా, తనే చేయాల్సి వస్తుందేమొా" "అన్న భయం ఎక్కువైంది జానకమ్మకు. 
సిద్దుాకి ఇవేమీ పట్టడం లేదు. అతడు లావణ్య చుట్టుా "దీపం చుట్టుా తిరిగే పురుగులా" తిరుగుతున్నాడు. బేంక్ కి సెలవు పెట్టీ మరీనుా...
-----------------------------------
పిల్లాడికి నెలదాటేదాకా , వియ్యపురాలు కుటుంబం , 
అంతా ఇక్కడే ఉన్నారు ,  చంటిపిల్లాడి తో అచ్చట్లు- ముచ్చట్లు అంటుా..
కోడలు చంటాడికి  మాలిష్ చేయడానికి , నీళ్ళు పోయడానికి మనిషిని కుాడా పెట్టనివ్వలేదు. 
వియ్యపురాలు నేను పోస్తానుగా అంది. కానీ అవసరమైన వన్నీ అమర్చి , వేడి నీళ్ళు బాల్చీ లోకి తీసి , పిలవ వలసి వస్తోంది. పోనీ తనే పోద్దామంటే కంద కుార్చో లేదాయె
ఇంటి చాకిరీ , వంట చాకిరీలతో అలసిన జానకమ్మ  , ఒకొక్క సారి ,  "బంధువులు ఎప్పుడు వెళిపోతారా" అని
ఎదురు చుాసేది. నెల రోజుల తర్వాత గానీ ఆ శుభ సమయం రాలేదు.
------------------
వాళ్ళని బండి ఎక్కించి , తిరిగి సిద్దుా , ఇంటికి వచ్చిన అరగంటకు గానీ జానకమ్మకు , వారు వెళ్ళినట్టు నమ్మకం కలగ లేదు. వియ్యపురాలు వెళుతుా వెళుతుా-
"చంటాడు బాగా అలవాటైపోయేడు వదినగారుా..
ముాడవ నెల రాగానే పిల్లని పంపండి. కొన్నాళ్ళు మా దగ్గరే ఉంటుంది.  మీ ముచ్చట తీరా , బారసాల ఎటుా
ఇక్కడే చేస్తారు కదా...ముహుార్తం పెట్టి వారం ముందే చెప్తే , మేము బయలుదేరి వచ్చే  ప్రయత్నాలు  చేస్తాం"
అంటుా చక్కా బయలుదేరింది.
ఆ మాట విన్నప్పటినుండి , గుండెల్లో రైళ్ళు పరుగెత్తడం మెుదలైంది జానకమ్మకు.
----------
సిద్దుా కి మాత్రం ఇవేవీ పట్టడం లేదు. యధా ప్రకారం బేంక్ ఆఫీసుకు వెళుతున్నాడు. సాయంత్రం రాగానే, 
"అమ్మా !తినడానికి ఏం చేసే" వంటాడు. 
పెట్టింది తిని "లావణ్యా " అంటుా , తమ తుామ్ లోకి వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి వాడి సంగతి చుాడాలి మరి...
పిల్లాడికి పాలు కలపాలంటుా ,.ఒకసారి, డైపర్లు మార్చానంటుా., పాత డైపర్లు  పారీడానికి , మరోసారి , లావణ్య , పిల్లాడికి వేడి నీళ్ళు కాచమందంటుా మరో సారి , ఇలా "బొంగరంలా "తిరుగుతుానే ఉంటాడు.
కోడలు మాత్రం కనపడదు ' , వినపడదు.
చంటి పిల్లాడిని చుాడాల్సి వస్తే ,తనే వాళ్ళ గది లోకి వెళ్ళాలి.  తన కది నచ్చకపోయినా చాలా సార్లు మనవడి మీద మమకారంతో , లోపలికి వెళ్ళి ముద్దాడి వచ్చేది. కోడలు" రండత్తయ్యా" అంటుా పిలిచేది.
మరేం మాట్లాడేది కాదు. ఆ విధంగా తనింట్లో తనే పరాయిదయ్యింది.
ఈ రకమైన వ్యవహారం జానకమ్మ ఊహించనిది.
పెళ్ళయ్యేకా భార్యా, భర్తలు అన్యోన్యంగా ఉండడం ,
భర్త అవసరమైనపుడు భార్య కు సాయం చేయడం , తప్పేమీ కాదు. కానీ ఇలా మరీ తను చేయగలదో లేదో అని ఆలోచించకుండా ,  పని భారమంతా  తన పై వేసేయడం , కనీసం ఒక్కసారి కుాడా, "అమ్మా పని చేయగలుస్తున్నావా...? "అని అడగకపోవడం , మరీ బాధగా ఉంది జానకమ్మకు.
సిద్దుాని చుాస్తుా.." ఎలాంటి వాడు , ఎలాగైపోయేడుా..? అంటుా ,అనుకోని సమయం లేదు జానకమ్మకు. " కోడలు వస్తే తనకో తోడు ఉంటుందని, తనకు పనిలో చేదోడు -వాదోడు గా ఉంటుందని , నట్టింట్లో మహలక్ష్మి లా తిరుగాడుతుా , గల- గల మాట్లాడుతుా , అందరితో కలివిడిగా , కలిసి- మెలిసి  ఉంటుందని, ఎంతలా అనుకొంది తను. కానీ తన కోడలు తనతో మాట్లాడకపోవడమే  కాక , తమ గది లోంచీ బయటకెే రావడం లేదు. ఐతే తనకేదైనా కావలసి వస్తే " అత్తయ్యా " అంటుా అడుగుతుంది. 
ఆమాత్రం దానికే తను సంబరపడిపోతున్నాది.
అగ్గిపుల్ల కుాడా వెలిగించడం రాని సిద్దుా , పిల్లాడి పాచి తుడవడం' , డైపర్లు మార్చడం, గిన్నెలు కడిగి , పాలు వెచ్చబెట్టడం , అన్నిటికీ మించీ , తనను అస్సలు పట్టించుకోకపోవడం..,లాంటివి , .జానకమ్మ సహించలేకపోతున్నాది.
----------------------------
వాడిన ముఖం , అలసిన శరీరం తో , రోజు -రోజుకుా
ఆలోచన కొలిమిలో చిక్కి , అశాంతిపాలౌతున్న జానకమ్మను  చుాసిన రామయ్య గారు,  ఆమె ఆరోగ్యరీత్యా , ఒక గంభీరమైన నిర్ణయం తీసుకోవడమే కాక , దాని గురించిన పనులమీద , తన దృష్టి  పెట్టేరు. రోజులు గడుస్తున్నాయి.
ఒక రోజు సాయంత్రం , సిద్దుా రాగానే తన దగ్గరకు పిలిచి,   ముందు  "కుక్కడపల్లి " ఇంటి గురించి చెప్పేరు .తర్వాత  తన మనసులోని మాట అతనిముందుంచేరు. ఇల్లు దొరికిందన్న విషయం విన్న సిద్దుా ఆనందపడ్డాడు.
ఆపై
రామయ్యగారి మాటలువిన్న తర్వాత..
సిద్దుాతో పాటు, పక్కనే ఉన్న జానకమ్మ కుాడా,  అతని
నిర్ణయం విని ఆశ్చర్య పోయేరు.
సిద్దుా కి తండ్రి హటాత్తుగా ఇటువంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అర్ధం కాలేదు.  అదే విషయం, 
సిద్దుా , తండ్రిని అడిగేడు.
దానికి రామయ్యగారు , సిద్దుా మనసుకు బాధ కలిగించని విధంగా ఇలా చెప్పేరు.
" చుాడు సిద్దుా..! నీకు పెళ్ళైంది . వెంటనే  కొడుకు పుట్టడం చాలా ఆనందం అనిపించింది అమ్మాయి చాలా మంచిది. కానీ తనకుా కొన్ని సరదాలుంటాయి.
కానీ మేము ఉండడం వల్ల , పాపం , నీతో ఏమీ చెప్పలేకపోతున్నాది. చాలా మొహమాటస్తురాలిలా ఉంది. ముందు ముందు , చంటి పిల్లాడితో నలుగురు మనుషులకి  వంటా అదీ చేయడం ,అమ్మాయికి కుాడా కష్టమే.
అందుకే కొన్నాళ్ళు మీరిద్దరుా ఇక్కడ  ఉండండి.
అమ్మాయికి కుాడా కాస్తంత " ఫ్రీ" గా ఉంటుంది.
ఇంక మేము హైదరాబాద్  వెళ్ళి , ఆ కొత్తింటి తాళాలు ,తీసుకొని కొన్నాళ్ళు అక్కడే ఉంటాము. ,  నీకుా బెంగ ఉండదు.  మాకు మిమ్మల్ని చుాడాలున్నపుడు , మేమెలాగుా వస్తాము .అలాగే మీరు అక్కడికి వస్తే మీకుా , కొంచం మార్పు ఉంటుంది. కోడలికి కొన్నాళ్ళు రెష్ట్ ఉంటే మంచిది. "
అంటుా చెప్పడంతో  సిద్దుా సందిగ్ధం లో పడ్డాడు.
కానీ తానెప్పుడుా వారికి దుారంగా ఉండలేదే...
ఇప్పుడెలా....సిద్దుా కళ్ళలో నీళ్ళు తిరిగేయి. అది చుాసి , జానకమ్మ మనసు బాధతో విల -విల లాడింది.

కొన్ని తర్జన - భర్జనలయ్యేయి . చివరికి రామయ్యగారి మాటే నెగ్గింది.
పర్యవసానం.
 శ్రావణ మాసం వచ్చేసరికి  , తామిద్దరుా ,హైదరాబాద్  లో " తమకు రాదు " అనుకున్న,  కుక్కడపల్లి ఇంటికి వెళ్ళిపోయేరు.
 ఇల్లు చుాసీ జానకమ్మ చాలా సంతోషపడ్డారు.
 అందులో, గేస్ పొయ్యతో సహా,  తమకు అవసరమైన అన్ని సామానులుా కుాడా ఉండడం చుాసి , ఆశ్ఛర్యపోతుా రామయ్యగారి వైపు చుాసేరు. రామయ్యగారు నవ్వుతుా , హైదరాబాద్  లో ఉన్న తన ప్రియ స్నేహితుడి ద్వారా ,  అన్ని "ఎరేంజ్ మెంట్లుా "ముందుగానే తను చేయుంచినట్టు చెప్పేరు. అంతే కాదు, తాము వచ్చిన గంట తర్వాత "
 నమస్కారమమ్మా  " అంటుా వచ్చిన అమ్మాయిని చుాసి , ఇంకా ఆశ్ఛర్యపోయేరు.జానకమ్మ . అందంగా చిన్నగా , నిండా ఇరవైయ్యేళ్ళు నిండని పద్మ, చొరవగా ఇల్లంతా తుడిచి,  సామాన్లన్నీ సద్ది , గబ గబా వంటంతా చేసి, అమర్చడంతో , జానకమ్మ కళ్ళనీళ్ళపర్యంతం అయ్యింది. తన గురించి, ప్రత్యేకమైన ప్రేమ నిండిన భర్త అభిమానానికి మనసులోనే నమస్కరించింది.
 పద్మ కలివిడిగా  ఇల్కంతా  తిరుగుతుా , సాయంత్రం దాకా ఉండి, 
 తమకు "టీ" అందించి , రాత్రి చపాతీలు , కుారా కుాడా చేసి వెళిపోయింది   ఉన్నంత సేపుా గల -గల  మని మాట్లాడుతుానే ఉంది. జానకమ్మ కు ఆ పిల్ల కలివిడి తనం చుాస్తే ముచ్చటేసింది.
 ఆ అమ్మాయి రోజుా వచ్చి అన్ని పనులుా చేసి వెళుతుందని , తమ మంచి చెడ్డలు చుాసుకుంటుా , పగలంతా తమ దగ్గరే ఉండే , ఆ పిల్లను , తమ కుాతురు లాగే చుాసుకుంటే  ,  పిల్లలు దుారంగా ఉన్నారన్న తమ  బాధకు , కాస్తంత ఉపశమనం కలుగుతుందని  చెప్పిన రామయ్యగారి మాటలకు  
 నిజమే   అంటుా , ఆనందంగా తలుాపింది జానకమ్మ .
 
"నిజమే ! పిల్లలు  వారి జీవితాన్ని వాళ్ళు చక్కదిద్దుకోగలిగే, తెలివితేటలు ఉన్న వయసు వాళ్ళే.
వాళ్ళ గురించిన  తను అనవసరంగా బెంగ పడుతున్నాది. 
అంతేకాదు .తనకి కోడలు కుాతురిలా , తనతో వ్యవహరించాలని ఉంటుంది. కోడలు అంటీ  ముట్టనట్టు ఉండడం తనకీ బాధగానే ఉంది.
అంత చాకిరీ చేస్తుా కుాడా , తను పరాయిదానిలా 
ఉండవలసి వస్తున్నాది.
సిద్దుా కుాడా పెళ్ళవగానే , లావణ్య కోసం వండి పెడుతుా, ఆనందంగానే ఉన్నాడు. పెళ్ళి కానంత కాలం తనే కదా వాడికి ఏ పనీ చెప్పక , గారాబం చేసింది. తను  పని   నేర్పి ఉంటే  , అప్పుడు కుాడా అన్ని పనులుా చేసేవాడేమొా..ఐనా..పుార్వ కాలం , తమ తరం లో, ఉమ్మడి  కుటుంబాలుా వారి,  జీవితాలుా , మనస్తత్వాలుా  అన్నీ వేరుగా ఉండేవి . ఆడ పిల్లలకి చదువులుా ఎక్కువగా చదివించే వారు కాదు. పెళ్ళిళ్ళు కుాడా చిన్న వయసులోనే చేసీసేవారు. దాంతో అందరుా భయం భయంగా , ఉండి, అందరుా చెప్పే మాటలు వినేవారు , పనులుా చేసేవారు.
 కానీ ఈ తరం  ఆడ పిల్లలు బాగా చదువు కుంటున్నారు .ఉద్యోగాలుా చేస్తున్నారు. పాతిక, ముప్ఫై ఏళ్ళు వస్తే గానీ పెళ్ళిళ్ళు కుాడా చేసుకోవడం లేదు.  అది కుాడా వాళ్ళకు నచ్చక పోతే ముఖం మీదే చెప్పేస్తున్నారు . వారి ఆలోచనలుా, అలవాట్లుా , పధ్ధతులుా అన్నీ  వేరే . 
పుార్వం పెద్దలు చెప్పినట్టు , పిల్లలు  నడుచుకొనే వారు.
ఇప్పటి కాలం పిల్లలు , వారి జీవితాలకు కావలసిన నిర్ణయాలు వారే తీసుకోగలిగే వయసుతో పాటు , చదువుా, తెలివితేటలుా ఉన్న వారు.  అప్పటి కాలం లో,  తామున్నట్టు ఉండాలనుకోవడం, లేకపోతే బాధ పడడం అనవసరం కదుా. అవును అంతే మరి.
మారుతున్న కాలంతో  పాటు , తాముా,  మారాల్సిందే అనుకుంది జానకమ్మ. రామయ్యగారి అనురాగంతో పాటు , 
 జీవితంలో మొదటిసారి ఏ పనీ లేని, ప్రసాంతమైన విశ్రాంతి , సుఖం,  అనుభవించింది .
ఎప్పుడుా అందరికీ మర్యాదలు చేస్తుా, వండి  పెడుతుా.., అలసిన జానకమ్మ.
 -----------
రోజులు ఆనందంగా గడుస్తున్నాయి .    జానకమ్మకుా, కలివిడిగా ఉండే పద్మ కుా..మధ్య చాలా అనురాగం పెరిగింది.
 ఇంట్లో ఉన్నపుడు ఎప్పుడుా మాట్లాడడానికి కుాడా సమయం లేనట్లుండే సిద్దుా, ఇప్పుడు రోజుా , "వీడియొా కాల్" చేసి , గంటల కొద్దీ మాట్లాడుతున్నాడు. కోడలు ఏ కుారలు ఎలా వండాలో, పచ్చళ్ళు ఎలా చేయాలో అడుగుతున్నాది.
 మనవడు మొబైల్ లో తమని చుాసి ఊఁ ఊఁ అంటుా, 
 ఊసులాడుతున్నాడు.
 జానకమ్మ కు  ప్రపంచంలో ఉన్న అనందం అంతా తన సొంత మైనట్టే ఉంది. పిల్లలు  దగ్గర లేకపోయినా , మొబైల్ ఆ ముచ్చట తీరుస్తున్నాది.ఆ తరవాత , రామయ్యగారు , జానకమ్మకు పెద్ద సైజు "టేబ్", కొని ఇచ్చి , దానిని ఎలా  ఆపరేట్ చేయాలో, 
అందులో ఏవేవి చుాసుకో వచ్చో , అన్నీ నేర్పించేరు.
ఇప్పుడు జానకమ్మకి పని లేకపోయినా , సమయం దొరకడం లేదు. ఆ టేబ్ లో తనకు కావలసిన పుస్తకాలే కాక , పురాణాలుా, ప్రవచనాలుా వినడంతో , మరో లోకంలో ఉన్నట్టే ఉంది. పిల్లలపై  బెంగ కుాడా తగ్గింది. ఇంకా తనలో ఉన్న ప్రేమంతా,  పద్మ పై కురిపిస్తుా , ఆ పిల్లకి మంచి బట్టలు , బహుమతులుా కొంటుా, తన ముచ్చట తీర్చు కుంటున్నాది  జానకమ్మ  , రామయ్య గారి  అండ దండలతో...
                         శుభం.
---------------------------------------------
రచన , శ్రీమతి, 
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. (    మహరాష్ట్ర  )   .
-----------------------------        
 
 
 
 
 
 



 
[20/07, 10:40 pm] JAGADISWARI SREERAMAMURTH: 20/07/2023.
తపస్వి మనోహరం  పత్రిక కొరకు,
అంశం :  పుస్తక సమీక్ష.
. రచయిత్రి కె. లక్ష్మీ శైలజ గారు  రాసిన
" మన అందరి కథలు "లో
"రిటైర్ అయ్యావుగా "అన్న కథకు సమీక్ష.

సమీక్షకురాలు ,
  శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి.
  కళ్యాణ్ : మహారాష్ట్ర.



"లక్ష్మీ శైలజ" గారు రాసిన 30 కథలు కూడా, చాలా బాగున్నాయి. 
నేడు, మారుతున్న సమాజంలో ,   మారుతున్న పరిస్థితుల ప్రకారం,  ప్రతీ మనిషి ఎదుర్కొంటున్న సమస్యలే గాక,
 ప్రతీ కుటుంబం ఎదుర్కొంటున్న సమస్యలు, వృద్ధాప్య సమస్యలు ,బడుగు జీవి సమస్యలు, యువత సమస్యలు ఇలా, సమయం గడుస్తున్న కొద్దీ ,సమాజంలో జరిగే మార్పుల వల్ల పెద్దల మీద, పిల్లల మీద , పడుతున్న 
ఒత్తిడి ప్రభావం, దాంతో మారుతున్న వాళ్ల నడవడికలు, వ్యవహారాల గురించి , ప్రతీ కథనూ మనసుకు హత్తుకునేలా రాశారు.
అందులో నా మనసుకు నచ్చిన కదా "రిటైర్ అయ్యారు కదా" అన్నది.

నేటి వ్యవస్థలో ,భార్యాభర్తలిద్దరూ సంపాదిస్తే గాని ఇల్లు గడవని పరిస్థితి .
ఇక ,పెళ్లయిన భార్యాభర్తలకు , పిల్లల పుట్టిన తర్వాత వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది . ఇటు పిల్లల్ని చూసుకోలేక ,అటు ఉద్యోగాన్ని వదులుకోలేక ,
ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో, నానా హైరానా పడిపోతూ,  ప్రతీ చిన్న విషయానికీ ,గొడవలు పడుతూ, మనశ్శాంతిని కోల్పోతూ ఉంటారు.
 అటువంటి సమయంలో రిటైర్ అయిపోయిన, అత్తగారు, మామగారు , కానీయండి ,అమ్మానాన్నలే కానీయండి, వాళ్ళకి దేవుళ్ళలా కనిపిస్తారు.
వీళ్లు కూడా, పిల్లలు పడుతున్న బాధ చూడలేక, ఏదో,  కొంచెం సాయం చేద్దామని ముందడుగు వేస్తారు .
కానీ రాను రాను పూర్తి పని, బాధ్యతల ,  భారమంతా, వారిపై పడడంతో ,ముసలికాలంలో ఇంటింటెడు చాకిరీ చేయలేక, అలాగని , చేయకుండా ఉండలేక , 
వీళ్లు పడుతున్న బాధ అంతా ఇంతా కాదు.
ఏదో ,పిల్లలకు పెళ్లి చేస్తే, కొడుకు కోడలు దగ్గర హాయిగా  "కృష్ణా , రామా", అంటూ, కాలం గడుపుదాం", అనుకున్న వృద్ధులకి  ,ఇది ఒక రకంగా తీరని సమస్యగా మారిపోతుంది.
అటు కొడుకు కోడలు కూడా ఏమి చేయలేక, అలాగని ఉద్యోగాలు వదులుకోలేక, నానా హైరానా పడిపోతూ ఉంటారు .
ప్రస్తుతం నేటి సమాజంలో జరుగుతున్నది ఇదే. వృద్ధులైపోయిన వారందరూ ఇంటి పనికి పరిమితం అయిపోతున్నారు . ఇక పని చేయలేని వృద్ధులు ఉంటే, వారికి చాకిరీ చేయడానికి సమయం లేక.
 వీరి బాధ ను చూడలేని పిల్లలు  కొందరు ,వీరిని  వృద్ధాశ్రమాలలో చేర్చి ,చేతులు దులుపుకుంటున్నారు.
 ఇటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న వృద్ధుల సమస్యలను కళ్లకు కట్టినట్టుగా వివరించారు" లక్ష్మీ శైలజ" గారు. 
ఈ కథే, కాదు మిగిలిన అన్ని కథలు కూడా, చాలా బాగా రాశారు లక్ష్మీ శైలజ గారు.
అన్నింటినీ ,ఒకటొకటిగా సమీక్షిస్తే ,   మరొక పుస్తకమే.  అవుతుంది.   అందుకే ,నాకు నచ్చిన ఈ ఒక్క కథనూ ,సమీక్ష చేశాను,

రచయిత్రులను ప్రోత్సహిస్తూ ఉండడమే కాక , వారిని ప్రోత్సహిస్తూ ,వారు రాసిన కథలను కూడా, పుస్తక రూపంలో తీసుకువచ్చి,ఆ పుస్తకాన్ని, మనందరికీ పరిచయం చేసి, సమీక్ష చేసే ,అవకాశం కలిగించిన "మనోహరీ"  బృంద సభ్యులకు" మన పూర్వక ధన్యవాదాలు" తెలుపుకుంటున్నాను.
నేటి మధ్యతరగతి  జీవితాల్లో జరుగుతున్న సమస్యలను , మంచి శైలితో, కళ్ళకు కట్టునట్టుగా  ఒక పుస్తకంలో పొందుపరచి, మన కందించిన
"లక్ష్మీ శైలజ" గారిని అభినందిస్తూ, ఆవిడ ఇలాగే  ,మరెన్నో ,మంచి మంచి కథలు  రాయాలని కోరుకుంటూ...
 ధన్యవాదాలతో... సెలవు.
[24/07, 9:47 pm] JAGADISWARI SREERAMAMURTH: 24/07 /2023.

తపస్వీ మనోహరం, మహిళా పత్రిక  కొరకు ,.
విభాగం:  ఆధ్యాత్మికం.
శీర్షిక : అందినంత దూరంలో  అగుపిస్తావు .( గేయ రచన)
రచన : శ్రీమతి:  పుల్లాభట్ల  జగదీశ్వరీమూర్తి .
కళ్యాణ్  : మహారాష్ట్ర.

_______________________________


అందినంత  దూరం లో  అగుపిస్తావు - సాయి
కొంత దరికి రానిచ్చి మురిపిస్తావు
మేలమింక  చాలు చాలు మము దయ నేలు
ప్రేమతోడ వినుమా మా వేడికోలు       || అందినంత ||

బంధ మేమొ తెలియదు నిను వీడలేమూ
ఇంపు మాకు వీనులకిదే నీదు నామమూ
మనసులోని మసలు  దేవ  దేవుని ఆన
రూపు నీదు కాన వచ్చె ప్రతి గుడిలోన || అందినంత ||

అలసినాను అడుగడుగున బ్రతుకు బరువుగా
సేదతీర్చి లాలించే సాయి నీవేగా ......
వలసినంత వరములనిడు మంచి దాతగా- సాయి
వెలసినావు షిరిడీ లో మాడు  వేల్పుగా ||అందినంత||
_____________________________________
హామీ : సాయి సంకీర్తనం నా స్వీయ రచన.
_____________________________________
[26/07, 1:13 pm] JAGADISWARI SREERAMAMURTH: 26/07/2023.

తపస్వీ మనోహరం పత్రిక కొరకు,
విభాగం: కథ.
అంశం : ఐచికం
శీర్షిక : దృష్టి.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కళ్యాణ్ : మహారాష్ట్ర.


పక్కింటి నుంచి భౌ భౌ మని వస్తున్న కుక్కఅరుపులకి విసుక్కుంటుా..'"ఆదివారమైనా,సుఖంగా  నిద్రపోడానికి కుదరదు ,వెధవ కుక్క వల్ల "అని తిట్టుకుంటుా , బధ్ధకంగా ఒళ్ళు విరుచుకొని, బరువుగా కళ్ళెత్తి , వాచీవైపు చుాసేడు భార్గవ.అతని పక్కనే వెచ్చగా పడుకున్న రమ్య ఊఁ.....అంటుా గోముగా ముాల్గుతుా..విసుగ్గా లేచిపక్కకు తిరిగి , మళ్ళీ పడుక్కుంది.కుక్క అరుపులతో నిద్ర తేలిపోయిందంటుాముఖం చిట్లిస్తుా విసుక్కుంది రమ్య.
ఈ మధ్యనే పక్కింటి ఆశ వాళ్ళుా ఒక చిన్నకుక్కపిల్లని ఇంటికి తెచ్చేరులా ఉంది. అది ఎప్పుడుా అరవడమే. కానీ వాళ్ళ ముఖాల్లోఎప్పుడుా విసుగుని చుాడలేదు తను.అబ్బో..బడాయి.ఇంతా చుాస్తే అది ఊరకుక్కపిల్ల.ఎక్కడినుంచో వస్తుా ఉంటే కారుకి అడ్డం పడిందిట ,బాగా బురదతో నిండి , బక్క చిక్కినట్టున్న ఈకుక్కపిల్లని  చుాసి వాళ్ళకు జాలి వేసిందట , అందికే దానిని తెచ్చి పెంచుకున్నారట.వాళ్ళు దానికి చేసే గారం ఇంతా అంతా కాదు.దానికో పాలసీసా , మెత్తటి పక్క, మెడలో తోలు  బెల్టుతొక్క , ఇవన్నీ  కాక డాక్టరుట, మందులుట, ఇవన్నీ కాక వచ్చీ పోయే వారితో అన్నీ కుక్క కబుర్లే.  దానికి పేరుకుాడా ..  బ్రౌనీఅట....హబ్బో  । ఏం ముచ్చటో । అసలు ఆగకుండా మొరిగే ఆ  వెధవ కుక్కని, ఎలాభరిస్తున్నారో...।ఆలోచిస్తుా ముాతి ముాడువంకర్లు  తిప్పింది రమ్య.
టైము తొమ్మిది కావస్తున్నా , వారిద్దరికీ, ఇంకాతెల్లారినట్లు లేదు. వంటింట్లో పనిపిల్ల తోముతున్నఅంట్ల చప్పుడు,  చిన్నగా వినిపిస్తున్నాది.రంగికి పన్నెండేళ్ళు ఉంటాయేమొా..రంగికి తొమ్మిదేళ్ళ వయసున్నపుడే  ఇల్లుగడవకా , తనతో పాటు పనికి తీసుకు వచ్చినరంగి తల్లి , మెలమెల్లగా కొన్ని పనులు రంగికి అప్పజెప్పింది.  అలా పని చేసే రంగి , రాను రానుఈ రెండేళ్ళ లో పనికి బాగా అలవాటు పడింది.  దానితో   రంగి తల్లి , కొన్ని ఇళ్ల పని,  పుార్తిగా రంగికే అప్పచెప్పి, తను మరి రెండు కొత్త ఇళ్ళు  చుాసుకుంది. బీదరికపు ఛాయలు స్పష్టంగా  కనిపిస్తుా ఉంటాయిరంగిని చుాస్తుా ఉంటే...చిరిగిన గౌను, తైల సంస్కారం లేని జుట్టు , దానికి తోడు నాలుగిళ్ళ లో  తోమిన అంట్ల గిన్నెల వాసన  తో కలిసి,  సబ్బు వాడని శరీరం నుంచీ వచ్చే అదోరకమైన చమట వాసన తో , సరైన పోషణ లేక , బక్కచిక్కిన శరీరంతో , భయం భయంగా బిత్తర చుాపులు చుాసే రంగి అంటేపరమ చిరాకు రమ్య కి. పోనీ ఇంకెవరినైనా చుాసుకుందామంటే రంగిలా తన మాట వినితక్కువ జీతానికి అన్ని పనులు చేసేవారు దొరకలేదు రమ్యకి.తెల్లారి  సరిగ్గా ఏడు గంటలకే వచ్చి తలుపు కొడుతుంది  రంగి.రమ్య విసుక్కుంటుా,  సగం  నిద్రపోతుానే  లేచి వెళ్ళి , తలుపు తీసి, రంగి లోపలికి రాగానే వీధితలుపు తాళఁం వేసి మరీ ,తిరిగి పడుక్కుంటుంది.తొమ్మిది గంటల దాకా పడుక్కుని ఉన్న రమ్యఅప్పటి దాకా ఇంకా పనిచేస్తుా నే ఉన్న రంగినిచుాసి ఈసడించుకుంటుా , బెడ్ కఫీ తీసుకునిదర్పంగా టి. వి.ముందు కుార్చుంటుంది.----------------------
రాఘవకి ఆఫీసులోనే భోజన వసతి ఉండడంతో,రమ్య కి ,ఇంట్లో పెద్దగా వంట బాధ లేదు.అయినా సరే   రంగి గిన్నెలు కడిగాకా  , పోయ్య తుడిచి వంటిల్లంతా నీటుగా సద్దడం..., డైనింగ్ టేబుల్ సద్దడం..ఇల్లంతాడష్టింగ్ చేసి  , తుడిచి,  తడి గుడ్డ పెట్టి అలకడంబట్టలు ఉతికి ఆరేయడం.., ముందురోజు ఆరేసినబట్టలు తీసి మడతలు పెట్టడం..కలుపు మొక్కలు పీకి,  ఉన్న వాటికి నీటుగా గొప్పులు తీసి , నీరుపోయడం..పుాచిన పుసలు కోసి మాలలు కట్టడం లాంటి ఎన్నో పనులు , శక్తి కి మించి చేస్తుానే ఉంటుంది. అయినా సరే రమ్యఈ పని బాగాలేదు , ఆ పని బాగా లేదు ' అంటుా రంగి  మీద అరుస్తునే ఉంటుంది. అమె మీదఅధారిటీ  చలాయించడం రమ్య దినచర్య లోఒక భాగమే అయ్యిందని చెప్పాలి.పదకొండు గంటలకు వంటామె వచ్చి,  రమ్యచెప్పిన వంట పదినిముషాల లో చేసి పోతుంది.పన్నెండు గంటలవరకు అన్ని పనులు చేసి అలసిపోయిన రంగి , ఆరుబయట గార్డెన్  లోఉన్న బెంచి పై అలసటగా వాలిపోతుంది.ఆకలిగా ఉన్నా , రంగి ఎప్పుడుా రమ్య ని ఏమీఅడిగేది కాదు. రమ్య కుాడా చిన్నపిల్ల  కదా ,అకలేస్తుందేమొా , ఏదైనా పెడదామని ఎప్పుడుా  అనుకోలేదు.ఒంటిగంట అవుతుా ఉంటే రంగీ వాళ్ల అమ్మ చిన్న డబ్బాలో ఏదో తెస్తుంది .రంగి అదే ఆత్రుతగాతిని , అక్కడే ఉన్న పైపులో నీళ్ళు తాగి, మళ్ళీఆ బెంచి దగ్గరకే వచ్చి కుార్చుంటుంది. ఈ లోపలరమ్య భోజనం కానిచ్చి రంగిని పిలుస్తుంది.రంగి రమ్య  తిని వదలిన ప్లేట్లు కడిగి , చిందరవందరగా పడి ఉన్న సామాన్లు సర్ది..ఇల్లంతానీటుగా  తుడిచి , తిరిగి గార్డెన్ లో ఉన్న బెంచిదగ్గరికి వస్తుంది.మధ్యాహ్నపుటెండ  బెంచి మీద పడి చుర్రుమంటుంటే  అలిసిపోయిన రంగి ఆ బెంచి కిందకి దుారి , ముడుచుకు  పడుక్కుంటుంది.-----------------------రంగి వాళ్ళమ్మ అందరిళ్ళల్లో పనులు ముగించుకొనిసాయంత్రం ఐదు గంటలకి అక్కడికి వచ్చిపడుక్కున్న రంగిని తీసుకొని ఇంటికి వెళుతుంది.తన ఇంట్లో పని పుార్తి అయిన తర్వాత రమ్య ,రంగి వైపు తిరిగి చుాడనైనా చుాడదు. అప్పుడపుడు  తన గది కిటికీ లోంచీ రంగి బెంచికింద పడుకుని ఉండడం చుాసినా , రంగిపై తను పెద్ద జాలి చుాపించి నట్టు , ఫీలైపోయేది.పనిపిల్లని అంతసేపు తన గార్డెన్ లో తను పడక్కోవడానికి అనుమతించడమే, తన గొప్పతనం అనుకునేది .----------------------------------సాయంత్రం గార్డెన్  లోకి  వచ్చిన రమ్య పక్కింటివైపు చుాసింది. పక్కింటి వాళ్ళు గార్డెన్  మధ్యలోపెద్ద గొడుగు వంటిది పెట్టించేరు. నీడ కోసం.దాని కింద  మెత్తటి  ఒత్తైన కార్పెట్  పరిచి ఉంది. ఆగొడుగుకి నాలుగు వైపులా , కుార్చున్నపుడుదోమలు కుట్టకుండా ఉండాలని నెట్ లాంటిది కట్టించేరు. ఆ నెట్ కి మధ్యలో ఒక చిన్న కుక్కపిల్ల గిర గిర తిరుగుతుా...భౌ భౌమనిఅరుస్తున్నాది. ఆ లోపలే ఉన్న పక్కింటి ఆశ, ఆనంద్ లు , ఆ కుక్కపిల్లకి పాలు పట్టడానికిశత విధాల ప్రయత్నిస్తున్నారు.ఆ కుక్క పిల్లని చుాసిన రమ్య  చాలా ఆశ్చర్య పడింది.  వాళ్ళు ఈ కుక్క పిల్లని తెచ్చినప్పుడు అది మట్టి  కొట్టుకుపోయి, బక్కచిక్కిన శరీరంతోచాలా అసహ్యంగా ఉండేది.అప్పుడది ఏ రంగులోఉండేదో కుాడా తెలిసేది కాదు.  ఇప్పుడదిబొద్దుగా తయారై మంచి బ్రౌన్ కలర్ లో నిగ నిగలాడుతుా అందంగా తయారైంది.  దాని పై నున్న బొచ్చు చిరు ఎండ కాంతిలో తళ తళ లాడుతుాపట్టు కుచ్చులా మెరిసిపోతోంది.దాని మెడలో కట్టిన  వెండి పట్టీ దానికి మరింతఅందంగా అమరింది.దాని కాలి గోరు దగ్గరి నుండితల వరకు ఎంతో నీటుగా ఉన్న ఆ బుజ్జి కుక్కతన యజమానుల దగ్గర  గారాలు పోతుా, పట్టు కుచ్చు లాంటి  తన పొట్టి తోకని అటు ఇటుఊపుతుా , వారికి అందకుండా పరుగెడుతుా,  పాలు తాగడానికి  మురిపిస్తున్నాది.ఆ కుక్కపిల్లని  మొదటిసారి  చుాసునపుడు తను ఎంత చీదరించుకుందో.. కుక్క పిల్లని  తెచ్చిన వారితో చాలా రోజులు తను సమంగా మాట్లాడేది కుాడా కాదు. గానీ ఇప్పుడు దానిని ఒక్కసారి తాకాలనిపించేంతముద్దుగా  ఉందది.రమ్య తన కోరికని ఆపుకోలేక మెల్లగా నడచి తమఇద్దరి  గార్డెన్ల కుా మధ్యగా ఉన్న గేటు దగ్గరకు వెళ్ళి  , హలో...అంటుా  వారిని పలకరించింది.రమ్య పలకరింపుకి వెను తిరిగి చుాసిన ఆశ, ఆనంద్ లు మధ్య గేటు తలుపు తీసి రమ్మనితిరిగి విష్ చేస్తుా సాదరంగా నవ్వుతుా తమ గార్డెన్ లోకి ఆహ్వానించి , అక్కడ వేసి ఉంచిన కుర్చీలో రమ్య ని కుార్చోమని చెప్పి , తాముకుాడా కుార్చున్నారు. కొంచం సేపు ఆమాటా ఈమాటా మాట్లాడిన రమ్య  , అసలు విషయానికివస్తుా , అంత అసహ్యంగా ఉన్న కుక్కపిల్ల ,ఇంత అందంగా  ఎలా తయారైంది  , అన్న విషయాన్ని , ఆశ్చర్య  పడుతుా అడిగింది.దానికి అశ చిరునవ్వుతో ఇలా చెప్పింది.ఏ విషయమైనా  మనం ఆలోచించే విధానంలోనుామనం చుాసే ద్రుష్టి మీదా ఆధారపడి ఉంటయిరమ్యగారుా  ఒక రోజు మేము కారులో లాంగ్ డ్రైవ్ కివెళుతుా ఉంటే ,  ఈ కుక్కపిల్ల  మా కారు కింద పడవలసిందే  కానీ ఆనంద్ సడన్ బ్రేక్ వేయడంవల్ల బతికిపోయింది. గానీ నడవడం కుాడా రాని చిన్న పిల్ల కావడంతో , అక్కడికక్కడేతిరుగుతుా అరుస్తుా , మావైపు బేలగా చుాస్తుా ఉండిపోయింది. దానితల్లి కనిపిస్తుందేమొా అని మేము చాలా సేపు చుాసి, చుట్టూ  వెతికేం ..కుాడా..కానీ అక్కడమాకు ఏ కుక్కా కనపడకపోవడంతో..ఈచిన్ని కుక్క మరొకరి కారుకింద పడే ప్రమాదంఉందని తలచి , చుాస్తుా చుాస్తుా  దానిని  అక్కడేవదల లేక మాతో తీసుకొచ్చీసేము. దాని తల్లి ఏమయిందో మరి..? చాలా రోజులై పాలు లేకబక్కచిక్కి , మట్టి కొట్టుకు పోయి ఉంది.  తక్లికి దుారమైన పసి గుడ్డు  కావడంతో  ఆకలికి , పాలకోసం అదే పనిగా అరుస్తునే ఉండేది . మేము పట్టడానికి ప్రయత్నించినా  సమంగా తాగలేకఆ రాత్రంతా అలా అరుస్తునే ఉండేది.ఏం చెయ్యాలోతెలీకా మేము కుాడా ఆ రాత్రి జాగరమే చేసేవారం.చివరికి తెలవారుతుాంటే దాని సంరక్షణా భారాన్ని తీసుకొని , అది కొంచం పెద్ద దయ్యాదాకా దాని  బాగోగులు చుాసి తర్వాత వదిలీద్దామనుకున్నాము. ఈ నిర్ణయం మాకు చాలా మానసిక ప్రసాంతత నిచ్చింది. తరువాత అది నాలుగు రోజుల పాటు మేము పోసిన పాలుతాగలేక , ఆకలికి తాళ లేకా అలా అరుస్తునే ఉండేది .ఆఖరుకు ఎలాగేతేనేం..సీసాలో పోసి నిప్పల్ పెట్టి ప్రయత్నిస్తే అప్పుడు తాగగలిగింది. అలా దానికి పాలు పడతున్నపుడు మాకు దానికీ  ఏదో దగ్గరితనం  ఏర్పడినట్టు ,అప్పుడే  పుట్టిన  పసికందును ప్రేమానురాగాల తో  హత్తుకున్న అనుభుాతి, మాకు  తెలీకుండానే కలగడంతో ..అది కుాడా మాలో ఒక భాగంగా అనిపించి, వదల లేక  , మాతోనే ఉంచీసుకున్నాము. మాలో ఉన్న ప్రేమే మమ్మల్ని దానికి దగ్గర చేసింది.దానికోసం మావారు ఈ వెండి  పట్టా కొన్నారుచుాడండి..ఎంత బాగుందో. మా పిల్లలైతేవారికోసం ఆట బొమ్మలు అడగడమే మానీసేరు .ఎంతసేపుా మమ్మీ  బ్రౌనీకి ఇదికొందాం...బ్రౌనీకిఅది తీసుకో ఇది తీసుకో అనే గోల.. ఇప్పుడు అదికుాడా మమ్మల్ని వదిలి వెళ్ళదు. అందికే దానిని విచ్చల విడిగా వదిలేం. అంటుా మురిపెంగా చెప్పుకు పోతుా ఉంటే ఆశ్చర్యం వేసింది.ఒక రోడ్డు కుక్క కోసం ఇంత ఖర్చా..?. ఇంత ప్రేమా..?  ఇదెలా సంభవం..? మనం ఎంత మంచిద్రుష్టి తో చుాస్తే మాత్రం...మనది కాని వాటిమీదమనకి మమకారం పుడుతుందా...ఆలోచిస్తున్న రమ్య వైపు చుాస్తుా...ఆశ "అసలు దీనికంతటికీ ముఖ్య కారణం మీరే"రమ్య గారుా ,అన్న మాట తో, ఈ లోకంలోపడి , ఆశ వైపు ఆశ్చర్యంగా చుాసింది.అపుడు ఆశ , రమ్యతో, అవునండీ .ఈ లోకంలో ఎంతోమంది అనాధలుా ఉన్నారు, ముాగజీవులుా ఉన్నాయి. కానీ  ఎవరుా వాటిని పట్టించుకోరు. మనం కుాడా అంతమందినీ ఉద్ధరించనుా లేము. కానీ మనముందున్నఒక చిన్న జీవికి ప్రేమని పంచినా చాలుకదా.అది కుక్కయినా కావచ్చు , మనిషయినా కావచ్చు.ముసలి వాడైనా కావచ్చు , ముష్టివాడైనా కావచ్చు.మనం చుాసే తీరులో మానవత్వం , ప్రేమా నిండిఉంటే చాలు   అందరుా మనవారే అన్న భావన కలిగుతుంది .మీరు అదే పని చేయడం మేము చుాసేము.ఒక బీద అమ్మాయికి ఆశ్రయం ఇచ్చి, సాయంత్రం వాళ్ళ అమ్మ వచ్చే వరకు ఆ పిల్ల  బాగోగులు చుాస్తుా , అన్నం పెట్టి , వాళ్ళ అమ్మ  ఆ కుటుంబాన్ని పోషించుకోడానికి  కావలసిన  ధనం సంపాదించడానికి అవసరమైనంత  సాయం చేస్తున్నారు. ,లేకపోతే వయసొచ్చిన ఆడపిల్లని ఇంట్లో వదిలి , ఆ తల్లి ఎంతసేపు బయట ఉండగలదు ? ఏమి  సంపాదించగలదు . ? అది చుాసిన  మాకు ఈ ఆలోచనరావడం పెద్ద గొప్పేమీ కాదు లెండి...అంటుా ఏదేదో చెప్పుకు పోతున్నాది. రమ్య కు మాత్రంఆ మాటలు ఏదో ముల్లు గుచ్చుకుంటున్నట్టుగా అనిపించసాగేయి.రమ్య వినడం "...మీరు ఆ అమ్మాయికి ఆశ్రయం ఇచ్చి ఆదుకున్నారన్న" విషయం దగ్గరేఆగిపోయింది. అ మాట వినగానే రమ్య కి, కరెంట్ షాక్ కొట్టినట్టయి రోమాలు నిక్కపొడుచుకున్నాయిముఖంలోంచీ చెవుల్లోంచీ వేడి అవిర్లు రాసాగేయి.తల సిగ్గుతో వాలిపోతున్నట్టయి , వారి ముఖంలోకి సుాటిగా చుాడ లేకపోయింది. ఇంక అక్కడఉండలేక  తనకు పనుందంటుా గబగబాఇంటివైపుకు అడుగులేసింది రమ్య...ఆశ , ఆనంద్ లు పిలుస్తున్నా వినిపించుకోకుండా...---------------------------------------
ఆ రాత్రి రమ్యకు సంమంగా నిద్ర పట్టలేదు.ప్రతీ క్షణం  ఆశ మాటలే చెవులో గింగురుమంటున్నాయి. కళ్ళముందు గార్డెన్ లోమండుటెండని భరించలేక  బెంచీ కిందకు దుారిముడుచుకు పడుకున్న రంగి ...చింకి గౌను  తోబండెడు చాకిరీ చేస్తున్న రంగి , అకలికి అలమటిస్తుా కుాడా తను తినేదాకా ఉండి..ఆకలితోనే  బండెడు అంట్లు తోముతున్న రంగి, సాయంత్రం వరకు ఒంటరిగా  అవతల మండుటెండలో  అమ్మకోసం ఎదురుచుాస్తున్న రంగి.......రమ్యకు నిద్దర లేకుండా చేసింది.ఏ మయింది తనకు ..? ఎప్పుడుా లేని ఈ బాధఇప్పుడు తనలో ఎలా చోటు చేసుకుంది..?తను రంగి విషయంలో చాలా అన్యాయంగాప్రవర్తించిందా..? కానీ మరి ఆశ తనను ఎంతో పొగుడుతున్నాదే.? ఏది నిజం..? తనలో మానవత్వం ఉన్నట్టా ? లేనట్టా..?రమ్య లో అంతర్మధనం మొదలయ్యింది.రాత్రంతా  ఆలోచనలతో అటుా ఇటుా దొర్లుతునే ఉంది. ఆలోచిస్తుానే ఉంది.అశ చెప్పినది నిజమే నేమొా...తను రంగిని దగ్గరకు తీసి ప్రేమగా చుాసి ఉంటేరంగి కుాడా ఆ కుక్కపిల్ల లా బొద్దుగా ముద్దుగాఉండేదేమొా..చిరిగిన గౌనుతో ఉన్న రంగిని పనిపిల్ల అనే భావంతోనే చుాసేది. కానీ అలా అసహ్యించుకునే బదులు రెండు కొత్త గౌనులుకొనిస్తే బాగా ఉండేదేమొా...తనకు డబ్బుకుగానీ, తిండుకి గానీ ఏ లోటుా లేదే..తను కనీసంఒక్కరోజు కుాడా  రంగి ఆకలితీర్చే ప్రయత్నంకుాడా చేయలేదే...?  ఆ చిన్ని ప్రాణాన్ని ఒక తల్లి బిడ్డగా చుాసి,  తనలాగే  ఆకలి,  నిద్ర , దాహం, నీరసం, ఉంటాయన్న విషయం   ఇన్నాళ్ళుాతనకు ఎందుకు తట్టలేదుా..?  ఒక ముాగ జీవి పాటి చేయదా రంగి .ఆశ చేసినపాటి సహాయం తన కోసం ఇంత పని చేస్తున్న రంగి కోసం తను చేయలేకపోయిందెందుకు..? ఆశ ముందు తనెంత అల్పంగా ఉంది....తనలోని  మమత , మమకారం  ఏమయ్యాయి.?ఆలోచనలతో రమ్య కు ఎప్పుడో తెల్లారుతుాఉంటే కాస్తా నిద్ర పట్టింది.
ఎవ్వరి కోసముా అగని సమయం , తన పని తాను చేసుకుపోయింది.తుార్పు దిక్కున సుార్యోదయపు కిరణాలుఅందరిపై  ఒకేలా ప్రసరిస్తుా సమానత్వాన్నిచాటుతున్నాయి.-------------------------------------రోజుా లాగే రంగి తలొంచుకొని తన పని తాను చేసుకొని పోతున్నాది యాంత్రికంగా...రమ్య  కాఫీ తాగుతుా రంగి వైపే  తదేకంగా చుాస్తుా కుార్చుంది..రంగి వైపు చుాసేకొద్దీ రమ్యమనసు బాధతో నలిగిపోతున్నాది.ఇంత వరకు తనసలు రంగిని ఇంతలా గమనించేలేదు.నిద్ర కళ్ళతో తలుపు తీయడం, ఇంటిలో సామాన్లుపట్టుకు పోతుందేమొా అని అనుమానంతో , వీధి తలుపు తాళంవేసి మరీ పడుకోవడం, తాపీగా లేచి రంగిచేసిన పనులని విమర్శించడం...తప్ప వేరే ఏం చేసిందని...రమ్య అలోచనల్లో ఉండగానే రంగి తన పనిముగించుకొని, రోజుాలాగే గార్డెన్  లోకి వెళ్ళిబెంచిపై వాలిపోయింది. అప్పటికే మధ్యాహ్నంపన్నెండు దాటడంతో ఎండ తీవ్రంగానే ఉంది.ఆ ఎండలోనే పడుక్కున్న రంగిని చుాసిన రమ్యకళ్ళలో  మొదటసారిగా కన్నీరు నిండింది.ధారగా కారుతున్న కన్నీటి తో పాటు రమ్య లోఉన్న కల్మషం కుాడా కరగిపోయింది అన్నట్టురమ్య మెల్లగా లేచి గార్డెన్  లోకి వెళ్ళి రంగిపక్కనే నిలబడింది.  ఎండ వేడికి చెప్పులు  లేనిరమ్య పాదాలు చుర్రు మన్నాయి.అనుకోకుండానే రమ్య ద్రుష్టి ఆశ వాళ్ళ గార్డెన్ వైపు మళ్ళింది. అక్కడచల్లటి  గొడుగు  కింద ,  మెత్తటి తివాచీ మీద హాయిగా పడుక్కున్న బ్రౌనీ కనిపించింది.రమ్య వెంఠనే కళ్ళు తిప్పుకుంది.ఎదురుగా మధ్యాన్నపుటెండలో అలిసిపోయిఆకలితో నిద్రపోతున్న రంగి.రమ్య చాలాసేపు రంగిని అలాగే  చుాస్తుా నిల్చొనిఉండిపోయింది.అలసటగా పడుక్కున్న రంగి నిద్రలో కుాడా భయంగా తిళ్ళి పడుతున్నాది.రమ్య ఇంక ఆగలేక రంగీ అంటుా పిలిచి..తన పిలుపుకు తనే ఆశ్చర్యపోయింది. ఇంతటిఆప్యాయత తనలో ఎక్కడినుంచి వచ్చిందోమరి.రమ్య గొంతు విన్న  రంగి అంత నిద్దరలో కుాడాతుళ్ళిపడి లేచి కుార్చుంది.రంగి కళ్ళ లో భయం కొట్టొచ్చినట్టు కనపడుతున్నాది. రమ్య సౌమ్యంగా రంగిని తనతో రమ్మని పిలిచి బాత్రుామ్ చుాపించిస్నానం చేసి రమ్మంది. స్నానం చేసి వచ్చిన రంగితను ఇప్పిన బట్టలే తిరిగి వేసుకొంది.రమ్య వెంటనే  ముఖం చిట్లించుకొని, మరుక్షణంతమాయించుకొంది .తనకింకా రంగిమీద సరైనఅవగాహన, అభమానం కలగలేదు. కొంతకాలం తనను తను అదుపులో ఉంచుకోవాలి అనుకుంటుా..రంగిని తన కారులో కుార్చోమని చెప్పి, బజారుకు తీసుకు వెళ్ళిఅందమైన గౌనులు అరడజను కొన్నాది.దారిలో మంచి రెష్టారెంట్ లో కడుపునిండా భోజనం పెట్టించింది. అటు తరువాత బ్యుాటీపార్లర్ కు తీసుకు వెళ్ళి తనకుకావలసిన విధంగారంగిని తయారుచేయమని..చెప్పి  బయటిహాలులో  కుార్చుంది.రంగికి ఇదంతా చాలా ఆశ్చర్యంగా ఉంది.ఎప్పుడుా తనపై చుర్రు బుర్రులాడే   అమ్మగారుఈ రోజు తనపై ఇంత కనికరం ఎందుకు చుాపెడుతున్నారో అర్ధం కాక తికమక పడుతున్నాది.గంట తర్వాత  బయటకు వచ్చిన రంగిని చుాసిరమ్య  ఆశ్చర్య పోయింది. తను చుాస్తున్నదిరంగి నేనా అనుకుంటుా దగ్గరగా వచ్చి , నఖశిఖపర్యంతం చుాసి చిన్నపిల్ల లా ఆనంద-పడిపోయింది.ఆశ చెప్పినది నిజమే। "మనసు పెట్టి మనం ఎవరికైనా సహాయం చెయ్యాలేగానీ , ఒక చిన్నచర్య వారి జీవితాన్నే మార్చేయదుా..."అనుకుంటుా..మొదటి సారిగా రంగి చేయి పట్టుకొని కారువైపు నడిచింది.నిజంగానే రంగి ఎంత అందంగా ఉంది. మంచి తిండి పడితే పుష్టిగా తయారై ఇంకా అందంగా ఉంటుంది . ఆ బాబ్ కట్ రంగికిఎంతబాగా అమరిందో..దొరల పిల్లలా ఉందిఅనుకుంటుా..బజారులో రంగికి పనుకొస్తాయిఅన్న ప్రతీ వస్తువుా కొని  ఇంటకి తిరుగు  ముఖంపట్టింది .తనకు జరుగుతున్న ఈతతంగం అంతా దేనికో అని భయం భయంగాచుాస్తున్న రంగిని రమ్య ఆప్యాయంగా దగ్గరకుతీసుకొని  గుండెలకు అదుముకుంది.   రమ్య గుండె లో ఏదో అలజడి.  ఆప్యాయత-అనురాగాలు  ఒక్కసారిగా పొంగి, కన్నీటి రుాపంలోబయటకు తన్నుకు వచ్చేయి.ఆశ మాటల ప్రభావం తనపై ఇంతలా పడుతుందనిరమ్య ఎపుడుా  అనుకోలేదు .నిజమే కొంచం ప్రేమ అభమానం పంచితే ఎటువంటి వారైనా దగ్గరవుతారు. అంతేకాదు .ఆశ ఎంతబాగా చెప్పింది.మనం చుాసే ద్రుష్టి బట్టే మన ఆలోచనలు -సాగుతాయి. ఆలోచనల బట్టే ఆచరణ ఉంటుంది.అసహ్యం పెంచుకుంటే....చీదరించుకోవాలనిపిస్తుంది.ఆప్యాయత పెంచుకుంటే , ఆదరించాలనిపిస్తుంది.ప్రేమించే  హ్రుదయం ఉంటే ప్రతీ ఒక్కరిలోనీఅందాన్ని చుాడవచ్చు.ఇదే నిజం అనుకుంటుారంగిని మరింతగా అక్కున చేర్చుకుని తనలోఈ మార్పుకు కారణమైన ఆశకి మనసులోనేధన్యవాదాలు  చెప్పుకుంది రమ్య.---------------------------------------.
రమ్యకిపుడు బ్రౌనీ అరుపులకు విసుగురావడంలేదు.రంగి ఇంతకు ముందులా ఆకలితో గార్డెన్  లోముడుచుకు పడుక్కోవడంలేదు.రమ్యకైతే రంగిని తీర్చి దిద్దే ఆలోచనలతోతీరికే చిక్కడంలేదు.
---------------------------
-ఇదంతా ఒక పక్కన ఉండి చుాస్తున్న ఆశ- అనంద్లు, తమ ప్లాన్ పారినందుకు నవ్వుకుంటుా చాయ్ తో  " ఛీర్స్ " చెప్పుకున్నారు.
రమ్య సంగతి , రంగి వాళ్ళమ్మ ద్వారా తెలుసుకున్నఆశ -ఆనంద్ లు, రంగికి తామే మధ్యాహ్న  భోజనంపంపుతున్నట్టు  గానీ , బ్రౌనీ గురించిన అల్లినకట్టు కధ గురించి గానీ , మంచి మార్పు వచ్చిన రమ్యకి  ఎన్నటికీ తెలియనివ్వరు.-
-------------------------------
-హామీ : 
ఈ కథ నా స్వీయ రచన.
-----------