Thursday, April 20, 2023

సిసింద్రీలు.

20/04/2023.
సిసింద్రీ.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్. మహారాష్ట్ర .

ఓ లక్ష్యం .

జీవితంలో పైకి ఎదగాలన్న ఆశయ సాధనకు సాక్ష్యం .
 జీవన సాఫల్యతకు మార్గదర్శకమైనది ఓ లక్ష్యం..

హామీ :
పై సిసింద్రీ నాస్వీయ రచన.



21/04/2023.
సిసింద్రీ.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
 కల్యాణ్. మహారాష్ట్ర .

ఓ కిరణం :
 చీకటిలో కలలుగన్న ఆశల అందాల పుావుల హారం.
 చిరు దీపమై ఆశయసాధనకు దారి చుాపుతున్న  
 వెలుగుల దారం.
 .
హామీ :
పై సిసింద్రీ నాస్వీయ రచన.

Monday, April 17, 2023

మనోహరి పత్రిక మీదనా అభిప్రాయం.

15/04/2023.
మనోహరి పత్రిక మీద
నా అభిప్రాయం.
రచయిత్రి :
శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్: మహారాష్ట్ర .
8097622021.

నా అభిప్రాయం :

నేను రచయిత్రిగా అప్పుడప్పుడే  చిన్న గుర్తింపు వస్తున్న రోజులవి .
నేను నా సాటి స్నేహితులతో కలిసినప్పుడు ,
అందులో చాలా మంది , తాము" పాడిన  పాటలు" యుా ట్యుాబ్ "  లో అప్లోడ్ చేశామనో , తాము రాసిన ఫలానా  "వ్యాసం ", ఫలానా పుస్తకంలో  వేశారనో , తాము రాసిన "ఆర్టికల్ " ఫలానా పేపర్ లో వచ్చిందనో  గొప్పగా చెపుతుా ఉంటే ,నేను  కుాడా వారిలా చెప్పుకునే రోజు ఎప్పుడు  వస్తుందో అని ఎదురు చుాసేదాన్ని.
చాలా ప్రక్రియలు అద్భుతమైన నియమాలతో అలరిస్తుా...
కవిగా ఎదుగుదామనుకున్న ఎందరికో స్ఫుార్తినిచ్చే రీతిలో
  కవుల కలాలకు పదును పెడుతుానే  ఉన్నాయి.
కానీ అన్నింటికి  నిర్దిష్ట సమయం నిర్ణయింపబడి ,
పగలు  ఏడు గంటలనుండి రాత్రి తొమ్మిది లోపల రాసిన ప్రక్రియను పంపాలన్న నియమం ఉండడం వల్ల చాలా ప్రక్రియలు రాయలేక ,వదలలేక సమయం చాలక చాలా  బాధగా ఉండేది .
అటువంటి సమయంలోనే "మనోహరి మహిళా పత్రిక" మా ముందుకు వచ్చింది.
కేవలం "మహిళలకు మాత్రమే  "అవకాశం కల్పిస్తుా ...
అనేక రకాల అంశాలతో ప్రోత్సహిస్తుా...రెండు ముాడు రోజుల వ్యవధినిస్తుా కవయిత్రుల పాలిటి కొంగుబంగారమయ్యింది.
కధలు , కవితలు , వ్యాసాలు, ఆర్టికల్స్ , పాటలు , ప్రేమ లేఖలు, చందమామ కధలు , జోక్స్ , వంటా వార్పులు , వంటింటి చిట్కాలు , పాటకు పల్లవి ప్రాణం వంటి ఎన్నో అద్భుతమైన అంశాలతో మా ముందుకు వచ్చింది.
అంతేకాదండోయ్ ...
వారం వారం రాసే రచనలలో ఉత్తమమైన అంశాలకు
ప్రథమ ,ద్వితీయ, తృతీయ, స్థానాలతో పాటు , తగిన
పారితోషికాన్ని కుాడా  అందజేస్తుా ఆనందింపజేస్తోంది.
ఎందరో కవయిత్రులకు  తమ తమ ఇంటిపనులను పుార్తి చేసుకొని , తమకు నచ్చిన అంశాలను చక్కగా రాసుకొనే
అవకాశం కల్పించడమే కాక , వారు రాసిన  అంశాలను .
"మహిళా మనోహరి పత్రికలోను " తపస్వీ మనోహరం
వారి "వెబ్ సైట్ల" లోనుా  ప్రచురిస్తుా, మహిళలకు ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని కలిగిస్తుా అలరిస్తోంది.
మేము రాసే ప్రతీ  రచనను చదివి , ఎంపిక  చేసి
ప్రచురణకు సిద్ధం చేసే కార్యక్రమంలో, "మనోహరి" 
వారి సహ బృందం వారు చేసే కృషి అభినందనీయం .
ఇంత మంచి పత్రికను మాముందుంచి మమ్ము ప్రోత్సహిస్తున్న" మనోహరి మహిళా పత్రిక " కార్యవర్గ సభ్యులకు నా హృదయ పుార్వక ధన్యవాదాలు.
చదువరులంతా మా రచనలు చదివి మమ్ము ప్రోత్సహిస్తుా
"మనోహరి మహిళా" పత్రికను ముందుకు నడిపిస్తారని ఆశిస్తుా,ధన్యవాదాలతో....🙏






మనోహరి మహిళా మాస పత్రిక వివరాలు

ఇది శ్రీ కార్తిక్ నిమ్మగడ్డ గారు స్థాపించిన తపస్వి మనోహరం సంస్థలో మూడవ పత్రిక.. మనోహరి మహిళా మాస పత్రికలో రచనల కొరకు క్రియేట్ చేసినది.

ఇక్కడ సోమవారం నుండి శనివారం వరకు వివిధ టాస్క్ లు ఇచ్చి రచనలు సేకరిస్తాము. 

వచ్చిన రచనల్లో అన్ని ఒకే పత్రికలో వేయలేము కనుక.. కొన్ని మనోహరి పత్రిక కొరకు.. మరి కొన్ని తపస్వి మనోహరం వార మాస పత్రికల కొరకు తీసుకుంటాము. అలాగే మరికొన్ని రచనలు తపస్వి మనోహరం వెబ్సైట్ లో పోస్ట్ చేస్తాము. (లింక్ గా ఇచ్చినవి వెబ్సైట్ లో పోస్ట్ చేయగానే అవి గ్రూప్ లో పెడతాము.) ఇక పత్రిక కొరకు సెలక్ట్ చేసినవి ఒక నెల లోగా పత్రికలలో వేస్తాము.

Thursday, April 13, 2023

Mail ID.

నా మెయిల్  ID of Airtel  mobile phone
India@990.

Wednesday, April 12, 2023

సభ్యులందరికీ విజ్ఞప్తి*

**సమూహంలోని సభ్యులందరికీ విజ్ఞప్తి*
 
గ్రూప్ సభ్యులెవరూ మోడీ, సోనియా, రాహుల్, కేజ్రీవాల్ లేదా ఏ రాజకీయ నాయకుడు లేదా రాజకీయ పార్టీ ఫోటో ఫార్వార్డ్ చేయకూడదు. పూణే, ముంబై, చెన్నై & ఢిల్లీలో 260 మందికి పైగా గ్రూప్ అడ్మిన్లు జైలుకు పంపబడ్డారు. పోలీసులు వాట్సాప్ చూస్తున్నారు. శ్రద్ద పెట్టవలసిందిగా ఒక తక్షణ విజ్ఞప్తి....! సైబర్ క్రైమ్ అన్ని గ్రూప్ ఫోల్డర్‌లను చూడటం ప్రారంభించిందని అందరికీ సమాచారం అందుతోంది. మీరు రూపొందించిన సమూహాన్ని తొలగించండి లేదా గ్రూప్ సభ్యులను హెచ్చరిస్తారు. మత, రాజకీయ, సామాజిక వ్యవస్థ లేదా చెడు చిత్రాలు లేదా వీడియోలను అపహాస్యం చేసే ఎలాంటి సందేశాలను పోస్ట్ చేయవద్దు.
వ్యక్తిగత వివరాలు, వ్యక్తిగత, జాతీయత, మతం, శాఖ, రాడికల్, ఆచారాలు మరియు భౌగోళిక ప్రాంతానికి సంబంధించిన ఎలాంటి హానికరమైన సందేశాన్ని పంపవద్దు. ఇది చట్ట ప్రకారం నేరం. ముంబైలోని సైబర్ క్రైమ్ వీడియో మరియు ఫోటోను షేర్ చేసిన వాట్సాప్ గ్రూప్‌లోని 36 మంది సభ్యులను అరెస్టు చేసింది. అందుచేత గ్రూప్ మెంబర్స్ అందరూ ఇలాంటి మెసేజ్‌ల పట్ల జాగ్రత్త వహించాలని తెలియజేసారు. ఇది నాన్ బెయిలబుల్ నేరం, దీనికి 7 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ సమాచారం ప్రజల ప్రయోజనాల కోసం. తప్పకుండా చదవండి. ఒక ముఖ్యమైన సమాచారం: ప్రజలు వాట్సాప్‌లో హిందువులు మరియు ముస్లింలపై వ్యాఖ్యలను పోస్ట్ చేస్తున్నారు. మతం మరియు మత సమూహాలపై తప్పుడు వ్యాఖ్యలు చేసే వ్యక్తిని ట్రాక్ చేయడానికి మరియు CPC యొక్క సెక్షన్ 44-58 కింద చర్య తీసుకోవడానికి ఒక దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేస్తారు మరియు అతని IP చిరునామాలను ట్రేస్ చేయడం ద్వారా అతని ఇంటిని గుర్తించడం ద్వారా మరియు ఎటువంటి వారంటీ లేకుండా అరెస్టు చేయబడతారు. అలాంటి సందేశాలు గ్రూప్‌లో ఉంటే గ్రూప్ అడ్మిన్‌లకు సెక్షన్ 59 వర్తింపజేయబడుతుంది. కాబట్టి మీరు గ్రూప్ అడ్మిన్ అయితే అటువంటి వ్యక్తిని మొదటి సందర్భంలో గ్రూప్ నుండి తొలగించండి, తద్వారా మీరు ఇబ్బందులను నివారించవచ్చు. దయచేసి ఈ సందేశాన్ని అన్ని సమూహాలకు, స్నేహితులు మరియు బంధువులకు ఫార్వార్డ్ చేయండి, తద్వారా వారు అప్రమత్తంగా మరియు తమను తాము రక్షించుకుంటారు.