Monday, September 28, 2009

శ్రీశక్తి అయిన లలితావైశిష్థ్యం .

శ్లోకం :
ఓంకార శృతిరూపయా-
కమలజం పుష్ణాతియా నిర్మితా |
విష్ణోశ్చాపి దశావతార సుకృతిం
వ్యాపారయంతీశ్రియా |
జ్వాలా ఫాలతయాభవం ,
లయవిధా వజ్జీవయంతీ శివై: |
సాశక్తిర్లలితా ప్రసీదతు మయి ,
శ్రీభూతిసంధాయినీ ||

నిర్గుణ పరభ్రహ్మ అయిన ఆదిశక్తి మొట్టమొదట " ఓంకార " నాదంతో వ్యక్తమయినట్లు "ఆర్ష వాజ్మయి " చెపుతోంది . మూడువేదాల సమాహారమైన అ+ఉ+మ అనే అక్షరసంయోగశక్తి ఒకటే సకల శృతి ప్రపంచానికి మూలాధారం .

ఆతల్లి తన ఇచ్చా శక్తితో శృష్థిసంకల్పం చేసి బ్రహ్మని శృష్థికర్తగాచేసి , వేదశక్తిని ప్రసాదించి , తాను ఆ శక్తిని వాగ్రూపంగా అందుకొని వాగ్దేవిగా నిలచింది . అలాగే విష్ణువునందు అనుగ్రహశక్తిని , బుద్ధిని వహించి , శృష్థిరక్షణకై అనేక అవతారాలు ఎత్తే సౌభాగ్యాన్ని ప్రసాదించేందుకై లక్షీశక్తిగా విలసిల్లింది .

అటుపిమ్మట అహితాన్ని లయం చేయడంకోసం శివుని నుదుట అగ్నినేత్రం కల్పించి , తానే దహనశక్తిగామారి నిమిత్తమాతృడైన ఈశ్వరునిచే లయకర్మలు చేయిస్థున్నాది . ఇలా ఆతల్లి ఇచ్చాశక్తి , జ్నానశక్తి , క్రియాశక్తులుగా తననుతాను విభజించుకొని త్రిమూర్తుల కార్యనిర్వాహణను పరిపూర్ణం కావిస్తున్నది .ఈశక్తి ఒకొక్క మన్వంతరంలో్ ఒకొక్క రకంగా అవతరించీ , కొన్ని ధర్మాలను ఉపదేశించింది . అవే మన శాస్త్ర్త్రాలుచెప్పిన సదాచారాలు . ఈమె స్వయంభువ మన్వంతరంలో్ బ్రుగుమహర్షి కూతురుగా పుట్టి భార్గవిగా ఖ్యాతికెక్కింది . ఈ ఒక్క జన్మయే ఆమెకు యోనిజన్మ . మిగిలిన అవతారాలలో ఆమె అయోనిజ .
" స్వారోచిష " మన్వంతరంలో అగ్నినుంచీ,
" ఔత్తమ " మన్వంతరంలో జలరాసినుంచీ,
" తామస " మన్వంతరంలో భూమినుంచీ ,
" రైతవ " మన్వంతరంలో మారేడువృక్షంనుంచీ,
" చాక్షుప " మన్వంతరంలో సహస్రదళపద్మంనుంచీ,
" వైవస్వత " మన్వంతరం లో క్షీరసాగరంనుంచీ ఉద్భవించింది .
దుష్థ్థ- శిక్షణకు , శిష్థ్థ-రక్షణకు పలురకాలుగా మానవులకు అర్ధ , పరమార్ధాలను స్ఫురింపజేస్థూ అవతరిస్థున్న అపరమాత్మైకస్వరూపిణి ఆ త్రేలోక్య, త్రిమూర్తి స్వరిపిణి శ్రీమాత .

'' ఓం తత్ సత్ ''

No comments:

Post a Comment