పల్లవి.
________
ఎంత మధురమీరేయి ,
ఎంత మధుర మీహాయి ,
మదిలో పన్నీటీజల్లు
కురిపించినదోయి ...!! ఎంత !!
చరణం .
________
సరిగమల సప్తస్వర...
రాగ సుధల స్వర ఝరులు ,
మలయపవన మేళకర్త లా ..
మధురిమ వీచికలు !
జన్య,మన్య స్వరభేధపు
భావ,రాగ, లయ,జతులు
ఒకటై ,పద కవితై
నా రచనకు జత కాగ ..!!ఎంత !!
రాగ చాయ రంగరింప
రసమాధురి పొంగగా..
పల్లవి,అనుపల్లవి ..
చెలులష్థచెమ్మలాడగ !
అందెలు ఘల్లని మ్రోగుచు
చరణ గతుల నలరింపగ
అందమైన పాటగా...
ఆడపడుచు అడుగిడగా...!!ఎంత !!
______________________
No comments:
Post a Comment