SreeSakti Lalita
శ్రీశక్తి అయిన లలితావైశిష్థ్యం .
---
శ్లోకం :
ఓంకార శృతిరూపయా-
కమలజం పుష్ణాతియా నిర్మితా |
విష్ణోశ్చాపి దశావతార సుకృతిం
వ్యాపారయంతీశ్రియా |
జ్వాలా ఫాలతయాభవం ,
లయవిధా వజ్జీవయంతీ శివై: |
సాశక్తిర్లలితా ప్రసీదతు మయి ,
శ్రీభూతిసంధాయినీ ||
నిర్గుణ పరభ్రహ్మ అయిన ఆదిశక్తి మొట్టమొదట " ఓంకార " నాదంతో వ్యక్తమయినట్లు "ఆర్ష వాజ్మయి " చెపుతోంది . మూడువేదాల సమాహారమైన అ+ఉ+మ అనే అక్షరసంయోగశక్తి ఒకటే సకల శృతి ప్రపంచానికి మూలాధారం .
ఆతల్లి తన ఇచ్చా శక్తితో శృష్థిసంకల్పం చేసి బ్రహ్మని శృష్థికర్తగాచేసి , వేదశక్తిని ప్రసాదించి , తాను ఆ శక్తిని వాగ్రూపంగా అందుకొని వాగ్దేవిగా నిలచింది . అలాగే విష్ణువునందు అనుగ్రహశక్తిని , బుద్ధిని వహించి , శృష్థిరక్షణకై అనేక అవతారాలు ఎత్తే సౌభాగ్యాన్ని ప్రసాదించేందుకై లక్షీశక్తిగా విలసిల్లింది .
అటుపిమ్మట అహితాన్ని లయం చేయడంకోసం శివుని నుదుట అగ్నినేత్రం కల్పించి , తానే దహనశక్తిగామారి నిమిత్తమాతృడైన ఈశ్వరునిచే లయకర్మలు చేయిస్థున్నాది . ఇలా ఆతల్లి ఇచ్చాశక్తి , జ్నానశక్తి , క్రియాశక్తులుగా తననుతాను విభజించుకొని త్రిమూర్తుల కార్యనిర్వాహణను పరిపూర్ణం కావిస్తున్నది .ఈశక్తి ఒకొక్క మన్వంతరంలో్ ఒకొక్క రకంగా అవతరించీ , కొన్ని ధర్మాలను ఉపదేశించింది . అవే మన శాస్త్ర్త్రాలుచెప్పిన సదాచారాలు . ఈమె స్వయంభువ మన్వంతరంలో్ బ్రుగుమహర్షి కూతురుగా పుట్టి భార్గవిగా ఖ్యాతికెక్కింది . ఈ ఒక్క జన్మయే ఆమెకు యోనిజన్మ . మిగిలిన అవతారాలలో ఆమె అయోనిజ .
" స్వారోచిష " మన్వంతరంలో అగ్నినుంచీ,
" ఔత్తమ " మన్వంతరంలో జలరాసినుంచీ,
" తామస " మన్వంతరంలో భూమినుంచీ ,
" రైతవ " మన్వంతరంలో మారేడువృక్షంనుంచీ,
" చాక్షుప " మన్వంతరంలో సహస్రదళపద్మంనుంచీ,
" వైవస్వత " మన్వంతరం లో క్షీరసాగరంనుంచీ ఉద్భవించింది .
దుష్థ్థ- శిక్షణకు , శిష్థ్థ-రక్షణకు పలురకాలుగా మానవులకు అర్ధ , పరమార్ధాలను స్ఫురింపజేస్థూ అవతరిస్థున్న అపరమాత్మైకస్వరూపిణి ఆ త్రేలోక్య, త్రిమూర్తి స్వరిపిణి శ్రీమాత .
'' ఓం తత్ సత్ ''
Navaavarana Slookams
|| ధ్యానం ||
ధ్యాయేత్ ఆది మధ్యాంత రూపిణీ ,
అఖండైక రస వాహినీ, |
అష్థాదసా పీఠ అఘనాసినీ, దేవి ,
ముక్తిప్రదాయినీ, సంగీతరసపోషిణీ ||
అరుణ కిరణోజ్వలాకాంతిరసభాసినీ,
అ,క,చ,ట,త,ప వర్గాది గుణభేదినీ , |
అంబ యంత్రాది ,కాది,సాది,
మంత్రాది వసనీ ,కామేశి శివకామినీ ||
1. త్రైలోక్యమోహన చక్రం .
ఆనందభైరవి రాగం .
*****
సర్వానందకరీం ,జయకరీం ,
త్రిపురాది చక్రేశ్వరీం |,
శర్వాణీ షడ్చక్రభేదకరీం ,శివసతీ,
నిగమాదిసంవేదినీం ||
మహిషాసురాది దైత్యమర్దనకరీం ,
భయహరీం, అణీమాద్యష్థ సిద్దేశ్వరీం |,
'' త్రైలోక్యమోహనచక్ర'' నిలయీం ,
సురనుతాం,'' ఆనందమయి భైరవీం'' ||
2 సర్వాశాపరిపూరకచక్రం ,
కళ్యాణి రాగం.
*****
'' సర్వాశాపరిపూరకచక్ర ''నిలయే ,
శర్వాణి శివవల్లభే .|
శ్రీవాణీ, రమా ,సేవితపార్స్వయుగళే ,
పర్వేందుముఖి పార్వతే ||
దూర్వాసార్చిత దివ్యపాదయుగళే ,భగవతే,
భవ,బంధ,భయ మోచకే |
ఉర్వీతత్వాది స్వరూపిణీం , చైతన్యఖనీం ,
'' కళ్యాణి '', ఘనరూపిణీం ||
3 . సంక్షోభణచక్రం .
శంకరాభరణం రాగం .
*****
అనంతకోటి బ్రహ్మాండనాయకీం ,
''సర్వసంక్షోభిణీం'', బ్రహ్మాణి బహురూపిణీం |
అనంగాద్యుపాసినీం అనంగకుసుమాం,,
అంబ అష్థ్థాదశాపీఠికాం ||
హస్తే అంకుశ,చాప, బాణ, ధనుధరీం ,
జయకరీం తత్త్వప్రదే , శాంకరీం |
శతసహస్రరత్నమణిదీప్తీం,మందేస్మితేందువదనాం ,
' శంకరాభరణవేణీం '' ||
4 .సకలసౌభాగ్యచక్రం .
కాంభోజిరాగం .
*****
నమ: అంబికాయై , నమ:చండికాయై ,
నమ : ఓంకార, హ్రీంకార, బీజాక్షరై |
నమ '' కాంభోజ''చరణే ,చతుర్దశభువనే ,
'' సకలసౌభాగ్య '' శుభదాయినే ||
నమ:కల్మషహరణే కలిసంతరణే ,
చతుర్వర్గ ఫలదాయినే ......|
నమ: కామేశ్వరీ, కాళికే, ఘనకపాలికే,
సకల భువనాంతర్గతపాలికే ...||
5 . సర్వార్ధసాధకచక్రం .
భైరవిరాగం .
*****
'' సర్వార్ధసాధకచక్ర '' నిలయే,
బహిర్దసాదిచక్రవలయే, బహురూపికే ''భైరవే'' |
నిత్యశుద్ధే, ముక్తబుద్ధాభేద్య, సత్ --
చిదానందమయి సాత్వికే ||
త్త్ర్రైమూర్తి త్రిగుణాత్మికే ,ధరనుతే ,
క్షిత్యాదిశివశక్తి స్వరూపాత్మికే. |....
కదంబవనవాటికే, త్రిభువనపాలికే,
దేవి త్త్వ్రైలోక్యరక్షాళికే ,,,,,||
6. సర్వరక్షాకరచక్రం .
పున్నాగవరాళిరాగం .
*****
దశరాదివినుతే గురుగుహవిదితే , దేవి-
దశశక్తి దైత్యాళికే ..... |
''సర్వరక్షాకరీ '', సర్వసంపత్కరీ , దేవి ,
కైలాశరమణేశుమణి సాత్వికే ||
దశకళాత్మికే , దశరసాత్మికే ,దేవి -
సంగీత, సాహిత్య , రసపోషికే.....|
అతిమధురవాణీ ,'' పున్నాగవరాళివేణీ ''
పాహి | సర్వజ్ఙే శివకామినీ....||
7 . సర్వరోగహరచక్రం .
శహనరాగం .
*****
రాజీవనయనే ,.. రాకేందువదనే ,
''శహన'' రాగోత్సాహి లయరంజనే |
స్వాత్మానుభోగినీ , శుభరాజయోగినీ
దేవి ,ఓంకారి, హ్రీంకారి ,జనమోదినీ ||
అతిరహస్యయోగినీ "సర్వరోగహరచక్రస్వామినీ ''
దేవి వాగ్దేవతారూపి విద్యాఖనీ |
కోదండధారిణీ , వీణాసువాదినీ , దేవి -
శరణార్తిశమనీ , సుసౌదామినీ ..||
8 . సర్వశిద్ధిప్రదచక్రం .
ఘంటారాగం .
*****
ఆవాహయే దేవి , అరుణోజ్వలే, అంబ -
దైత్యాళి , జయకాళి , జగదంబికే ....|
సర్వ శక్త్యాత్మికే , దేవి సుకసారికే దివ్య ,
'' ఘంటామణిఘోష '' కవాటికే.......||
నఖోదితవిష్ణు , దశరూపికే , దేవి
దశాకరణ శబ్ధాది అంతర్లయే |
సర్వాత్మికే , సర్వరక్షాకరీ, '' సర్వ -
వరశిద్ధిప్రదదాయి '' త్రిపురాంబికే ||
9 .సర్వానందమయచక్రం .
ఆహిరిరాగం .
*****
జయతి జయతి అంబే, శృంగారరస కదంబే ,
శివకామేశ్వరాంకస్థ - బింబేందుబింబే....|
చింతామణిద్వీప మంచస్థ్థితే , దేవి -
చిద్బింబ , శివరూపి , చక్రస్థితే......... ||
కమలాంబికే దేవి విమలాత్మికే ,
''సర్వ ఆనందమయి'' రూపలలితాంబికే |
శాకంబరీ, దేవి శాతోదరీ జనని ,
దుర్గా,రమా, వాణి సతి సాత్వికే ||
జమంగళం |, దేవిం శుభ మంగళం ||
నిత్య జయ మంగళే , శక్తి కురు మంగళం ||
ఓం | భూ: శాంతిప్రదే | భువన శాంతి ప్రదే |
భూత , ప్రేతాది - గ్రహపీడ శమనహ్రదే .....|
సకలసౌభాగ్య ప్రద పూర్ణమయి మంగళే |
ఓం.......శాంతి:......శాంతి: ......శాంతి:. . ||
రచన -
పుల్లాభట్ల జగదీశ్వరి .
No comments:
Post a Comment