Tuesday, October 6, 2009

మలయమారుతం , ఆదితాళం

పరమపదమునకు సోపానమూ శ్రీ
వేంకటపతి దివ్య గుణగానమూ ..
పదమున కైవల్య పథమును చూపెడు
కరుణాంతరంగుని శుభనామమూ || పరమ ||

పరమాత్ముడు శ్రీ వైకుంఠధాముడు
ధరవెలసిన కలియుగ దేముడూ ..
తిరుమలశిఖరాన వెలసిన భూధవుడు
యిడుముల బాపేటి పరంధాముడూ || పరమ ||

పదునారు కళలతో పరిపరి విధముల
అలరారు శృంగార రసలోలుడూ ..
శ్రీదేవి , భూదేవి యిరుగడల సేవింప
లోకాల పాలించు జగధీశుడూ ........|| పరమ ||

శంఖ, చక్రాదులను చక్కగధరియించు
పంకజనాభుడు పరమాత్ముడూ....
ముడుపులగైకొని మూలముతానని
కైవల్యమునుచూపు కమలాక్షుడూ .|| పరమ ||

No comments:

Post a Comment