Thursday, November 5, 2009

దేశభక్తిగీతాలు .

దేశభక్తిగీతం.
కల్యాణీ రాగం
*****

తల్లి భారతి తరలివచ్చెను
కావ్య మంజరి కవితలా..
మేలు మువ్వల సడుల ,సరిగమ
సప్త స్వర జతి , పదములా.. '' తల్లి ''

సస్యశ్యామల వర్ణమది ఆ
మేని గిరులా ఒంపులూ...
పైరు,పచ్చని చీరకట్టెను ,
ప్రకృతి పడతీ సొంపులూ...
నీలి మబ్బుల కురుల నిండెను
మిణుకుతారల మాలలూ..
సూర్య, చంద్రుల కాంతి కన్నుల
కరుణ నిండిన చూపులూ.. '' తల్లి ''

త్యాగరాయ శ్రీ రామదాసు ,
వాగ్గేయకారుల కీరితీ...
పుణ్యచరితపు మేటి -
రత్నాలాయె ఆమెకు సంతతీ...
గాంధి, నెహృ వంటి నేతలు
నిలుప శాంతీ, సౌఖ్యమూ ..
వీర గతినే పొందు సుతులకు
మాత ఒడి తరుకల్పమూ... '' తల్లి ''

శ్రీనాధుల, క్షేత్రయ్యల పదము-
బంగరు మకుటమూ...
విజయనగరా..కాకతీయుల
ఖ్యాతి రత్నపు పీఠమూ...
వీర పురుషుల రుధిర ధారలు
భరతమాత సుచరితమూ ..
పుడమి తల్లికి నుదుటి బొట్టై
వెలిగె ధర్మపు చక్రమూ... '' తల్లి ''

మూడురంగుల మూలమైనది
శాంతి ,ధర్మ ,సుసత్యమూ..
ఎగిరె నదిగో రాజసమ్ముగ
ఒరగనీయకు నిరతమూ....'' తల్లి ''

*****

ఎంత అందమైనది స్వాతంత్ర్యబాలా..
రంగుపూల చీరచుట్టె నీవేళా..
భరతమాత సిగనిండుగ ముద్దబంతులూ
మెడనిండుగ మెరయు చామంతి దండలూ '' ఎంత ''

సూర్యకాంతి పూల పసిమిచాయతో,
ముద్దమందారాలా నుదుటి బోట్టుతో ,
విరిసిన కలువల రేకుల కాంతి కనులతో,
లేలేత గులాబీల అధర సుధలతో '' ఎంత ''

మల్లెలు, మరువము నిండిన నీలవేణిగా..
జాజీ , కనకాంబరాలె మేని సొగసుగా..
పచ్చనీ చేలనడుమ పరిమళాల వీచిగా
పాడి,పంట సొగసుల సంక్రాంతి లక్ష్మిగా.. '' ఎంత ''

జాతి-భేదమెరుగని మన తల్లికిదే స్వాగతం ,
సమత ,మమత నిండిన సుమ-వల్లికిదే స్వాగతం ,
శాంతి - సౌఖ్యాల కల్పవల్లికి సుస్వాగతం ,
క్షమయా-ధరిత్రి భరతమాత కిదే స్వాగతం '' మూడు సార్లు ''

*****

హంకొ మనుకి శక్తిదేన వరస
*****

విశ్వశాంతి నిలుపు శక్తి మదిని పెంచుకో ..
సమత ,మమత వెల్లి విరియు బాట నెంచుకో ''..విశ్వ ''

భేదభావ మెరిగినట్టి స్నేహమెందుకూ...
బాధలోని తోడుకాని బంధమెందుకూ ..
వేదసారమంత ఎరుగ వేడుకెందుకూ..
సాటివారి తూలనాడు చదువులెందుకూ... '' విశ్వ ''

కలసి ,మెలసి శాంతి నిలుపు మంచి మనసుతో ,
చేయి ,చేయి కలిపి నడువు ధర్మనిరతితో..
మన ఝండా కీర్తి నిలుపు , మదిని భక్తితో ..
భరతమాత ఖ్యాతి పెంచు భవ్యచరితలో... '' విశ్వ ''

*****

పెళ్లిపాటలు .

Kalyanam Paatalu

పెళ్లిపాటలు.
*****
పెండ్లి పిలుపు
*****

కల్యాణము చూతమురారండీ ...
శ్రీ వేంకట రమణుని '' కల్యాణము''

మంటపమున ముత్యాల ముగ్గులివె
మంగళకరమగు వేద మంత్రమిదె
అంబరమున ముక్కోటిదేవతలు
సంబరపడుచూ దీవెనలొసగిన '' కల్యాణ ''

సిరికల్యాణపు బొట్టునుపెట్టీ .....
నుదుటను మణి బాసికమును గట్టీ ....
సోగసౌ బుగ్గను చుక్కను బెట్టీ ...
పెండ్లీ కొడుకై నిలచిన గిరిపతి '' కల్యాణ ''

సిగ్గుల సిరిమెడ సూత్రము గట్టీ...
మంగళకరమౌ మట్టెలు బెట్టీ...
సోయగమున సతి చేతులబట్టీ..
మంగాపతిగా వేలసిన శ్రీ హరి '' కల్యాణ ''

నవరత్నములను తలపైపోసీ...
నవరసముల నళినాక్షిని బట్టీ ..
జవరాలికిసిగ జాజులు జుట్టీ..
శృంగారమునే నెరపిన శ్రీపతి '' కల్యాణ ''

యిరువురు భార్యల నురముననుంచీ ..
మురిపెపు నగవుల ముడుపులదోచీ ...
కరుణతో కరముల నభయమునిచ్చీ..
యిడుముల బాపుట కిలవెలసిన హరి '' కల్యాణ ''








*****
పెండ్లి కొడుకు రాక .
*****
రాగం =హంసద్వ్హని
*****
వచ్చెనదే ఘనుడూ...సిరీ...
మెచ్చిన శ్రీకర శుభద మనోహరుడూ '' వచ్చె ''

రాజసమున రారాజుల పోలీ ..
నిజసతి నేలగ , నిఖిలోత్తముడూ...
ద్విజులకు మ్రొక్కీ, దీవెన లందగ
నిజసతి దోడ్కొన నిలచినవాడూ...'' వచ్చె ''

సతి నెరచూపులా చిక్కినవాడూ
సరస శృంగారమూ నెరపెడువాడూ
చిరునగవుల చెలి , హృదినిలచినవాడూ
సరి సతి నేలినా , సర్వోత్తముడూ.. '' వచ్చె ''

యిలవెలసిన హరి యిందిరా రమణుడూ
వైకుంఠ ధాముడూ నారాయణుడూ....
అల శేషాద్రిపై వెలసిన మాధవుడూ ...
ఆపద మ్రొక్కులూ దీర్చెడివాడూ ..'' వచ్చె ''

*****

రాగం = మిశ్రఖమాస్ .
*****
గౌరీపూజ .
*****

పేరంటాండ్లనడుమా పెండ్లికూతురూ
పాల బుగ్గల్లో సిగ్గులతెర పెండ్లికూతురూ ,
పసుపు పారాణీ పాదాలా పెండ్లికూతురూ ,
మెరపు మేని సొగసు నిండారగ పెండ్లికూతురూ.. '' పేరం ''

పట్టుచీర సింగారపు పెండ్లికూతురూ..
పెట్టె కల్యాణపు బొట్టు నుదుట పెండ్లికూతురూ,
జుట్టె సిరిమల్లెలు జడనిండుగ పెండ్లికూతురూ..
యిట్టె సిగ్గు బుగ్గచుక్క మెరయు పెండ్లికూతురూ.. ''. పేరం ''


కిల,కిల నవ్వుల నడుమా పెండ్లికూతురూ..
కళలు పదునారూ నిండిన సిరి పెండ్లికూతురూ..
తలచి శ్రీ గౌరికి పూజలిడిన పెండ్లికూతురూ..
పసుపు , కుంకములా నోమునోచె పెండ్లికూతురూ '' పేరం ''

బుట్టలోన కూరుచున్న పెండ్లికూతురూ ,
మామ బుట్టనెత్త సిగ్గుపడే పెండ్లికూతురూ..
చలువ సౌభాగ్యము నొడినిపట్టె పెండ్లికూతురూ
మదిని మాంగళ్యపు వరము కోరు పెండ్లికూతురూ '' పేరం ''

మెత్తని మెల్లని అడుగుల పెండ్లికూతురూ ,
ప్రియుని పెండ్లాడగ వచ్చెనదే పెండ్లికూతురూ ,
తలను తలంబ్రాలు , సూత్రపుమెడ పెండ్లికూతురూ
విభుని జట్టిగొనీ చేయిపట్టె పెండ్లికూతురూ..... '' పేరంటాండ్ల ''

*****

మోహనరాగం .
*****
తోటసంబరం.
*****

శ్వాగతమిడగా రారే చెలులూ..
వచ్చెనదే వియ్యాలవారూ.... '' స్వాగత ''

కప్పురపు మాలలూ , వేయరె మెడలో..
జాజులు ,మల్లెలూ ,తురమరె జడలో...
వాడని వీడెమూ , వేడ్కగ నిచ్చీ ...
ఆటల, పాటలా... ఆనందముగా....''..స్వాగత ''

పసుపు , కుంకుమలూ , పలు అత్తరులూ ..
విరిపారాణి , పన్నీటి గంధములూ...
ప్రేమతోనిచ్చీ...భామల తోడ్కొని ,
విడిదికి రమ్మనీ వేగ పిలువరే.... '' స్వాగత ''

తేనెలమాటలా, మన్నన పిలుపులా..
పంచరె తీయనీ పానీయములూ...
మచ్చిక మీరగ , ముచ్చట తీరగా...
అంగన లీయరె హారతులూ ..... '' స్వాగత ''

*****
వియ్యాలవారి కయ్యాలు.
ఆడపెళ్లివారిపాట.
*****

ఏడనుంచి వచ్చిరి , వియ్యాలవారూ...
మేడ,మిద్దెలుగల మావూరికి వేంచేసారూ ..
వల్లెపెట్టి ఏర్చి కూర్చి మంచి మాటలాడేరూ
మా తల్లి చక్కదనపు , మల్లి చేబట్టేరూ...'' ఏడ ''

బియ్యేలా, ఎం. యేలా వంశమన్నారూ..
పెండ్లికొడుకుగారి నత్తిమాట స్ఠైలన్నారూ..
పిల్లమెడలోనా గుళ్లపేరు వేస్తామన్నారూ..
వల్లమాలిన మాటల్లు చెప్పి మోసపుచ్చేరూ ..'' ఏడ ''

నల్లకోటు జాబంటూ నసబెట్టేరూ..
'' నల్లి '' వారి పట్టుబట్ట తప్ప కట్టమన్నారూ..
నలుగు ముతక నేత బట్టలతో విడిదికొచ్చేరూ
నాసి రకపు , సెంటు , సింగారాల్ బడాయి పోయేరూ..'' ఏడ ''

కట్నాల్ , గిట్నాల్ మాకసలే వద్దన్నారూ..
కుర్రవానిపేర '' క్వాలి '' సొకటి చాలన్నారూ
పిల్లపేర కొంత '' భూ '' దానం చేయమన్నారూ
వద్దు, వద్దంటూ గొంతెమ్మల కోర్కెల్ల్కోరేరూ.... '' ఏడ ''

ప్లేటు భోజనాలు తప్ప , చేయమన్నారూ
రేటు నూరైనా స్వీట్లు , హాట్లు కావాలన్నారూ..
చేటు చెప్పుకుంటే , చేతుల్నాకి చిందులేసారూ
చాటు ,మాటునస్వీట్లన్ని దాచి దొరకిపోయేరూ '' ఏడ ''

పిల్లతోడ రండంటూ పట్టుబట్టేరూ ...
పెద్ద యిల్లు మాది చోటుకొరత లేదన్నారూ..
మురికి లోగిల్లో , ముతకబొంత మూలవేసారూ
నల్లికాట్ల రాత్రి , నిద్రలేమి మాకు చేసారూ '' ఏడ ''

పొలము ,పాడి మాకుందని పోరి చెప్పేరూ
పోట్ట నిండనట్టి టిఫిను పెట్టి తుర్రుమన్నారూ
గల్లంతై , గంటెడైన పాలుపోయనట్టి మడ్డి
కాఫీలూ మాకిచ్చీ మాడబెట్టేరూ '' ఏడ ''

*****
మగపెళ్ళివారి పాట .
*****
ఆనందభైరవి రాగం.
*****

ఎంత గదుసువారు ఆపెళ్లివారూ... .
మంచి మాటలతో మమ్ము మోసపుచ్చినారూ...
అంచనాకుమించి ఆశ చూపించినారూ...
ఎంచి ,ఎంచి మంచి వలను మాకు వేసినారూ '' ఎంత ''

పనీ, పాటా వచ్చుననీ , పిల్లమాట చెప్పినారు ,
ఆట ,పాట లందు మేటి , గుణము మంచిదన్నారూ ,
చదువు సంధ్యలందు తెలివితేటలు మెండన్నారూ
అందమందు ఆ రంభకు తీసిపోదన్నారూ '' ఎంత ''

పెళ్ళిచూపులందు చీర చుట్టబెట్టి తెచ్చినారు ,
మొగము నెత్తి చూపమంటె '' సిగ్గు'' పిల్ల కన్నారూ ,
పాట పాడమంటె '' బిడియ '' మొదలలేదన్నారూ,
పెండ్లి కానివ్వమనీ తొందరెంతొ చేసారూ '' ఎంత ''

పనీ, పాట మాటలేదు , సిగ్గు, సరము అసలు లేదు
మాట కరకు, మనిషి దుడుకు ,మంచినెంచు బుద్ధి లేదు
కట్న, కానుకల్లు లేవు , కారునలుపు , నమ్మలేరు ,
చదువు సున్న, తెలివి కన్న, ఒళ్లుబద్ధకము మిన్న '' ఎంత ''

కళ్ళుమెల్ల , బొజ్జపిల్ల , ఎత్తుపళ్ల నోరు మళ్ల ,
పిప్పిపన్ను జతగూడెను , అందానికి తోడుమళ్ల ,
ఫెళ్లుమన్న నవ్వు , పోతురాజు తిండి కాదు కల్ల ,
ఖర్మ| మాకు లేదు దారి, పిల్ల నేలుకొనగ నిల్ల '' ఎంత ''

*****
అప్పగింతలపాట.
*****
ఆనందభైరవిరాగం
*****

''పుల్లాభట్లా'' రింటీ పుత్తడిబొమ్మా...
కల్లా, కపటములెరుగని కోమలివమ్మా..
ఉల్లాసములాతేలెడి అందాలకొమ్మా,
''సరిపిల్లీ ''వారింటా అడుగిడవమ్మా....
మాముద్దులగుమ్మా.....

కొత్త కోర్కెలు మదిలో కలగంటీవమ్మా..
అత్తింటీ మురిపాలూ అందుకోవమ్మా..
అత్త,మామల ముద్దు -మురిపాల పూరెమ్మా,
పుట్టినింటీ పేరూ ,నిలబెట్టవమ్మా...
మాముద్దులగుమ్మా....

''రఘురాముని'' ఏలికలో రతనాల బొమ్మా....
విభునీ చిత్తములెరిగీ మసలుకోవమ్మా...
'' భాస్కర, సుభద్రమ్మ'' ల, ముద్దుల కోడలివమ్మా..
మరపించెదరూ మమ్మూ , భయమేలనమ్మా..
మాముద్దులగుమ్మా '' పుల్లా''

*****
చుట్టాల సందడి .
పెళ్లిభోజనాలు .
*****

వివాహ భోజనమ్ము వింత వంటకమ్మురా..
వియ్యాలవారి యింట భలే రుచులపంటరా '' వివాహా''

ఒహొహ్హొ | నేతి లడ్లు , అహహ్హ రసపు చుట్లు ,
బొబ్బట్లు వహరె బూరల్ తీపి పాయసమ్మురా..
ఇహిహ్హి బాసుందీలూ.. ఇవిగివిగొ కోవా పాలూ,
జిలేబి , జాంగ్రి వరుసదొంతు లరిసె లివేరా ...''. వివాహ ''

మిరపబజ్జీల్ ,పకోడీలు , పప్పు వడలురా..
పులిహోర , దప్పడాలు ,వడలు తినగ రండిరా..
సాంబారు ,రసము వరెవ్వా , పొడికూర అరటిదవ్వ ,
ఈ పనసపొట్టు ఆవ , గుత్తి వంకాయ్ భలేరా .. '' వివాహా''

ఈ దోసఆవకాయా , పులుపూట నిమ్మకాయా..
గోంగూర నేతి పోపు, రుచుల గడ్డపెరుగురా..
ఐస్ క్రీము ఆఖరంటా.. తినపోతె ఒప్పరంటా...
ఇంటింట పెళ్లివంట అదే..మనకు పంటరా... '' వివాహ ''


ఈ వంటకం ముచ్చట్లూ ..తిన,తినగ ఆయాసాలూ..
తీర్చంగ తాంబూలాలు , వక్కపొడులు ఇవిగొరా ..
తిన్నింటివారి యింటా , పెరుగునులే పాడి ,పంటా
దీవెనలు ఇత్తురంతా , '' వర్ధిల్లు కొత్తజంటా ''... '' వివాహ॥



సాగన పు పాట

కంటిపాప నీవమ్మా మా ఇంటికీ...కన్నుల నీరిడకమ్మా  ఏ నాటికీ...
మెట్టినింటి దీపమై..ఏలు..రాణివై..పుట్టినింటి పేరు నిలుపు  
ఏనాటికీ ..నీ..పుట్టినింటి  పేరు నిలుపు ఏనాటికీ..॥
అత్త, మామ లోనె చుాడు 
అమ్మా నాన్ననీ...
ప్రేమతోడ చేయుమమ్మ
వారి సేవనీ....
ఆడబిడ్డ  నీ బిడ్డగ నెంచి సాకుమీ..  ఆమె
నీ దరిని పొందాలి తల్లి ప్రేమనీ....
మసలుకోమ్మ మంచిగాను
ఇరుగు..పొరుగుతో..
మంచి ఇల్లాలిగ పేరుగాంచు
నీ నడత తో..॥ 2 ॥
పుట్టినింటి  జ్ఞాపకాలు 
తీపి గురుతులే....ఇకపై
అత్తింటి గౌరవమే నీకు కీర్తిలే
కలసి మెలసి ఉండుటే శాంతి..సౌఖ్యముా..
కట్టుకున్న వాని వలపదే
నీకు స్వర్గముా..
మెట్టినింటి లక్ష్మిగా
పేరు తెచ్చుకో...
పుట్టినింటి  పేరు  నిలుపు
మంచి దారి నెంచుకో...॥2॥ ॥ కంటిపాప ॥



గణపతి ప్రార్ధన .

Kalaabhyaam – Ganapati Prarthana
కలాభ్యాం చూడాలంకృత శశికలాభ్యాం
నిజతఫ;ఫలాభ్యాం , భక్తేషు ప్రకటితఫలాభ్యాం,
భవతుమే శివాభ్యాం , హస్థోక త్రిభువన శివాభ్యాం ,
హ్రదిపునర్భవాభ్యాం , ఆనంద స్ఫురదనుభవాభ్యాం ,
నతిదియం నతిదియం ...........

శివశక్త్యాత్మకరూపా చిద్విలాస గణపతీ
భవభయహర విఘ్నహర వీరశక్తి గుణపతీ
గణనాయక నాదరూప మోదకప్రియ బాలరూప
రిద్ధి , సిద్ధి , వరప్రదాత సకల విజయ సారధీ '' శివ ''

సకలశాస్త్ర గుణనిధాన , సర్వవేద సమసమాన ,
సారవంత ఏకదంత సుర,నర, పూజిత అనంత
కామరూప చామరకర్ణా - గజముఖ వక్రతుండ
లంబోదర ఆదిపూజ్య శంభుతనయ ధర అభేద్య ''శ్హివ ''

పాశ చాప, బాణధరా ఫాలతిలక శొభిత వర
శుక్లాంబర 'ధర షణ్ముఖ ప్రియ అనుజా దనుజ దూర
మూషికవాహన ముఖ్యా గణనాయక సాధుమిత్ర
ధరపాలిత దివ్యనేత్ర మునిజనసేవిత సుగాత్ర ''శ్హివ ''












నాటరాగం .
రూపకతాళం .
*****

సంగీత సార్వభౌమం భజే |
సరసగానలోలం త్యాగరాజం || సంగీత ||

తిరువాయురపురనివాసం ,ఊ .....
ఆ.......ఆ.........ఆ..........ఆ......." తిరు "
రామబ్రహ్మసుతం , శాంతకుమారం |

మధ్యమకాలం .
*****
పంచాపకేస రామనాధానుజం ఊ.... '' పంచాప ''
పంచాపకేస రామనాధానుజం , సం -
తత శ్రీరామ భక్తం, సత్ బ్రాహ్మణకులజం || సంగీత ||

వరనారద యతిరాజనుతం , స్వ-
రార్ణవ గ్రంధానుగ్రహితం |
స్వర, రాగ సుధారసగాత్రం , పంచ -
రత్నాది కృతీ , కృత కర్తం - సం -

గీత జ్ణాన రత్నం , శ్రీ -
రామచంద్ర కృప పాత్రం -
గీత రసిక మిత్రం , సత్
గురు శ్రీ త్యాగరాజం || సంగీత ||











రాగం = కల్యాణి .
ఆదితాళం
ఆరోహణ= సరిగమపధనిస |
అవరోహణ= సనిధపమగరిస ||.
*****
సా..స నిధపమ పధపమ గరిగమ
శ్రీ . .గౌ . రీ . . . . పు . . . . .
పా..ధ నిధపమ గరిగమ పా.ధని |
త్రం..వి . . . . . . ఘ్న. నా . శక |
సరిగరి సనిధని సరిసా . నిధమధ
లం ... బో . దర సుగుణా. కరవర
నిసనీ . . . ధని సనిధప మపధని |
దే . . . . . ధర శుభఫల దా.యక |

ధా . . ధ నిధా . . గమధని ధా . . .
శ్రీ . . క రుణా. . . . లో . లా. . .
నిరిసా . నిధపా . మరిగమ పా . . .
భూ. . . తా. దీ. గణ పా. లా . . .
మపధని ధపమప ధనిసా . . . ధని
పా . . . లిం .పగ రా . రా. . . ధర
సరిసా . నిధనిస నీ . ధప ధా . . ని |
సుగుణా. కరశుభ దా .యక రా . . ర |

మధ్యమకాలం .
*****
సా . . ని రిసా . ని ధనీ . ధ పమగమ
పా. . ధ నిధపమ గరిగమ పా .ధని |
సరిగా. రినిరీ . నిధమధ నిసనీ .
ధనిసరి సా . నిధ నిసనీ . ధమధని || శ్రీ..||

చరణం.
*****
నీ . . . . . ధని సనిధమ గరిగమ
నీ . . . . . వే . . . . . తొలిదై .
పా . . . . . మప నిధమపా . ధనిస |
వం . . . . . మ . మ్మూ. .కా . వ . వే |

నీ . . . . . సా . . . నీ . ధా . పా .
మా . . . గా. . . మా. . . . పా . ధ || నీవే ||

ధా . . ధ పమగమ పా . . ధ నిధపమ
గా . . మ పధనిధ మా . . రి గమపధ || నీవే ||

పధనిధా . పమపా . ధనిధ రిసనీ .
ధనిసనీ . ధపమ పా . .ధ మపధని
సరీ . గ రిసనిరీ . నిధమ ధనిసనీ
. రినిధ మగరిసా . రిగమ పధనిస || నీవే ||

సా . . . . . నిరి సా . నిధ పమగరి
సా . . . . . ధని సా . రిగ మగరిపా
. మగరి గధపా . మగరిస రిగమరీ
. గమప ధమపధ నిసరిసా . నిధని
సరిగా . మగరిస నిరినిధ మధనిస
గరిసా . నిధపా . గరిసా . రిగమధ || నీవే || .


Chakravaakam Raagam
చక్రవాకం రాగం
ఆదితాళం
*****
ఆరోహణ = సరిగమపధనిస ||
అవరోహణ= సనిధపమగరిస ||

పా . . మ పమగరి సమగరి సనిధని
శ్రీ . . స . ద్గు .రు . సా . . యి . నా.
సా . . . . . నిధ నిసరిగ సరిగమ
ధం . . . . . స . ర్వే. . . శం . . . ||
పధపమ గరిపమ గరిసరి గరిగమ
స . . . . . న్ను . తి . జే. . . . .
పమపధ నిధపమ పధనిసా . నిధమ
సి . తి . . . . . రా . . . . దే . వ || శ్రీ ||

పా . ధని ధపమప ధనిధా . పమపా .
పా . . . . . లిం . . . . . పా . . .
ధనిధప ధనిసని రిసా . . గరిసా .
రా . . వే . . . లా . . . . దే . వా .
నిధనిస నిగరిస మగరిసా . నిధప
షిరిడీ . ని . . . వా . . . . సా . .
మగరిస రిగరిగ మపమరి సరిగమ
కరుణా . లో.. ల సా .. యి దే . . వ || శ్రీ ||

పా. పసా . సపస నిధపా . మగరిస
మా.మపా . పమప ధనిధప మపధని
సా . గరి గమగరి సా. నిధ నిసనిరి
సా . నిధ పసనిధ పమగరి సరిగమ || శ్రీ ||


చరణం .
*****
ధనిసా . నిధనిసా . నిగరి సా . . .
గురుసా. ర్వభౌ.మా . మ. . మ్మూ ..
నిధపా . మపధని ధపమప నిధమా.
కా చే . . . దొర. నీ. . . వే

పా . . . ధా . . . నీ . . . ధా . పా .
మా . . . గా . . . రీ . గా . మా . పా . || గురు ||

ధా . నిధా . మగమ పధనిధా . సనిధ

పా . . మ పధనిధ మా. . గ మపధని || గురు ||


నిధనిప ధనిసని ధనిసగ రిసా. ని
పధనిస గరిగమ గరిసని ధపధని
సగరిస నిరిసని ధనిధప మపధని
సనిధప ధనిసరి గరిసా . సనిధమ || గురు ||

సా . .రి గమగరి సనిరిస నిధనిస
పా. . ధ నిధమప ధనిధమ గమపా .
సరిగమ పా గమ పా .ధని ధసనిధ
గరిసని ధరిసని ధపసని ధపమప
ధనిధప మగరిస సరిగరి గమగమ
పమపధ పధనిధ నిసనిరి సనిధమ || గురు











SreeSakti Lalita

శ్రీశక్తి అయిన లలితావైశిష్థ్యం .
---
శ్లోకం :
ఓంకార శృతిరూపయా-
కమలజం పుష్ణాతియా నిర్మితా |
విష్ణోశ్చాపి దశావతార సుకృతిం
వ్యాపారయంతీశ్రియా |
జ్వాలా ఫాలతయాభవం ,
లయవిధా వజ్జీవయంతీ శివై: |
సాశక్తిర్లలితా ప్రసీదతు మయి ,
శ్రీభూతిసంధాయినీ ||

నిర్గుణ పరభ్రహ్మ అయిన ఆదిశక్తి మొట్టమొదట " ఓంకార " నాదంతో వ్యక్తమయినట్లు "ఆర్ష వాజ్మయి " చెపుతోంది . మూడువేదాల సమాహారమైన అ+ఉ+మ అనే అక్షరసంయోగశక్తి ఒకటే సకల శృతి ప్రపంచానికి మూలాధారం .

ఆతల్లి తన ఇచ్చా శక్తితో శృష్థిసంకల్పం చేసి బ్రహ్మని శృష్థికర్తగాచేసి , వేదశక్తిని ప్రసాదించి , తాను ఆ శక్తిని వాగ్రూపంగా అందుకొని వాగ్దేవిగా నిలచింది . అలాగే విష్ణువునందు అనుగ్రహశక్తిని , బుద్ధిని వహించి , శృష్థిరక్షణకై అనేక అవతారాలు ఎత్తే సౌభాగ్యాన్ని ప్రసాదించేందుకై లక్షీశక్తిగా విలసిల్లింది .

అటుపిమ్మట అహితాన్ని లయం చేయడంకోసం శివుని నుదుట అగ్నినేత్రం కల్పించి , తానే దహనశక్తిగామారి నిమిత్తమాతృడైన ఈశ్వరునిచే లయకర్మలు చేయిస్థున్నాది . ఇలా ఆతల్లి ఇచ్చాశక్తి , జ్నానశక్తి , క్రియాశక్తులుగా తననుతాను విభజించుకొని త్రిమూర్తుల కార్యనిర్వాహణను పరిపూర్ణం కావిస్తున్నది .ఈశక్తి ఒకొక్క మన్వంతరంలో్ ఒకొక్క రకంగా అవతరించీ , కొన్ని ధర్మాలను ఉపదేశించింది . అవే మన శాస్త్ర్త్రాలుచెప్పిన సదాచారాలు . ఈమె స్వయంభువ మన్వంతరంలో్ బ్రుగుమహర్షి కూతురుగా పుట్టి భార్గవిగా ఖ్యాతికెక్కింది . ఈ ఒక్క జన్మయే ఆమెకు యోనిజన్మ . మిగిలిన అవతారాలలో ఆమె అయోనిజ .
" స్వారోచిష " మన్వంతరంలో అగ్నినుంచీ,
" ఔత్తమ " మన్వంతరంలో జలరాసినుంచీ,
" తామస " మన్వంతరంలో భూమినుంచీ ,
" రైతవ " మన్వంతరంలో మారేడువృక్షంనుంచీ,
" చాక్షుప " మన్వంతరంలో సహస్రదళపద్మంనుంచీ,
" వైవస్వత " మన్వంతరం లో క్షీరసాగరంనుంచీ ఉద్భవించింది .
దుష్థ - శిక్షణకు , శిష్థ -రక్షణకు పలురకాలుగా మానవులకు అర్ధ , పరమార్ధాలను స్ఫురింపజేస్థూ అవతరిస్థున్న అపరమాత్మైకస్వరూపిణి ఆ త్రేలోక్య, త్రిమూర్తి స్వరూపిణి శ్రీమాత .

'' ఓం తత్ సత్ ''


Navaavarana Slookams

|| ధ్యానం ||

ధ్యాయేత్ ఆది మధ్యాంత రూపిణీ ,
అఖండైక రస వాహినీ, |
అష్థాదసా పీఠ అఘనాసినీ, దేవి ,
ముక్తిప్రదాయినీ, సంగీతరసపోషిణీ ||

అరుణ కిరణోజ్వలాకాంతిరసభాసినీ,
అ,క,చ,ట,త,ప వర్గాది గుణభేదినీ , |
అంబ యంత్రాది ,కాది,సాది,
మంత్రాది వసనీ ,కామేశి శివకామినీ ||

1. త్రైలోక్యమోహన చక్రం .
ఆనందభైరవి రాగం .
*****
సర్వానందకరీం ,జయకరీం ,
త్రిపురాది చక్రేశ్వరీం |,
శర్వాణీ షడ్చక్రభేదకరీం ,శివసతీ,
నిగమాదిసంవేదినీం ||

మహిషాసురాది దైత్యమర్దనకరీం ,
భయహరీం, అణీమాద్యష్థ సిద్దేశ్వరీం |,
'' త్రైలోక్యమోహనచక్ర'' నిలయీం ,
సురనుతాం,'' ఆనందమయి భైరవీం'' ||

2 సర్వాశాపరిపూరకచక్రం ,
కళ్యాణి రాగం.
*****
'' సర్వాశాపరిపూరకచక్ర ''నిలయే ,
శర్వాణి శివవల్లభే .|
శ్రీవాణీ, రమా ,సేవితపార్స్వయుగళే ,
పర్వేందుముఖి పార్వతే ||

దూర్వాసార్చిత దివ్యపాదయుగళే ,భగవతే,
భవ,బంధ,భయ మోచకే |
ఉర్వీతత్వాది స్వరూపిణీం , చైతన్యఖనీం ,
'' కళ్యాణి '', ఘనరూపిణీం ||
3 . సంక్షోభణచక్రం .
శంకరాభరణం రాగం .
*****
అనంతకోటి బ్రహ్మాండనాయకీం ,
''సర్వసంక్షోభిణీం'', బ్రహ్మాణి బహురూపిణీం |
అనంగాద్యుపాసినీం అనంగకుసుమాం,,
అంబ అష్థ్థాదశాపీఠికాం ||

హస్తే అంకుశ,చాప, బాణ, ధనుధరీం ,
జయకరీం తత్త్వప్రదే , శాంకరీం |
శతసహస్రరత్నమణిదీప్తీం,మందేస్మితేందువదనాం ,
' శంకరాభరణవేణీం '' ||

4 .సకలసౌభాగ్యచక్రం .
కాంభోజిరాగం .
*****

నమ: అంబికాయై , నమ:చండికాయై ,
నమ : ఓంకార, హ్రీంకార, బీజాక్షరై |
నమ '' కాంభోజ''చరణే ,చతుర్దశభువనే ,
'' సకలసౌభాగ్య '' శుభదాయినే ||

నమ:కల్మషహరణే కలిసంతరణే ,
చతుర్వర్గ ఫలదాయినే ......|
నమ: కామేశ్వరీ, కాళికే, ఘనకపాలికే,
సకల భువనాంతర్గతపాలికే ...||

5 . సర్వార్ధసాధకచక్రం .
భైరవిరాగం .
*****
'' సర్వార్ధసాధకచక్ర '' నిలయే,
బహిర్దసాదిచక్రవలయే, బహురూపికే ''భైరవే'' |
నిత్యశుద్ధే, ముక్తబుద్ధాభేద్య, సత్ --
చిదానందమయి సాత్వికే ||

త్త్ర్రైమూర్తి త్రిగుణాత్మికే ,ధరనుతే ,
క్షిత్యాదిశివశక్తి స్వరూపాత్మికే. |....
కదంబవనవాటికే, త్రిభువనపాలికే,
దేవి త్త్వ్రైలోక్యరక్షాళికే ,,,,,||

6. సర్వరక్షాకరచక్రం .
పున్నాగవరాళిరాగం .
*****

దశరాదివినుతే గురుగుహవిదితే , దేవి-
దశశక్తి దైత్యాళికే ..... |
''సర్వరక్షాకరీ '', సర్వసంపత్కరీ , దేవి ,
కైలాశరమణేశుమణి సాత్వికే ||

దశకళాత్మికే , దశరసాత్మికే ,దేవి -
సంగీత, సాహిత్య , రసపోషికే.....|
అతిమధురవాణీ ,'' పున్నాగవరాళివేణీ ''
పాహి | సర్వజ్ఙే శివకామినీ....||

7 . సర్వరోగహరచక్రం .
శహనరాగం .
*****

రాజీవనయనే ,.. రాకేందువదనే ,
''శహన'' రాగోత్సాహి లయరంజనే |
స్వాత్మానుభోగినీ , శుభరాజయోగినీ
దేవి ,ఓంకారి, హ్రీంకారి ,జనమోదినీ ||

అతిరహస్యయోగినీ "సర్వరోగహరచక్రస్వామినీ ''
దేవి వాగ్దేవతారూపి విద్యాఖనీ |
కోదండధారిణీ , వీణాసువాదినీ , దేవి -
శరణార్తిశమనీ , సుసౌదామినీ ..||


8 . సర్వశిద్ధిప్రదచక్రం .
ఘంటారాగం .
*****
ఆవాహయే దేవి , అరుణోజ్వలే, అంబ -
దైత్యాళి , జయకాళి , జగదంబికే ....|
సర్వ శక్త్యాత్మికే , దేవి సుకసారికే దివ్య ,
'' ఘంటామణిఘోష '' కవాటికే.......||

నఖోదితవిష్ణు , దశరూపికే , దేవి
దశాకరణ శబ్ధాది అంతర్లయే |
సర్వాత్మికే , సర్వరక్షాకరీ, '' సర్వ -
వరశిద్ధిప్రదదాయి '' త్రిపురాంబికే ||

9 .సర్వానందమయచక్రం .
ఆహిరిరాగం .
*****

జయతి జయతి అంబే, శృంగారరస కదంబే ,
శివకామేశ్వరాంకస్థ - బింబేందుబింబే....|
చింతామణిద్వీప మంచస్థ్థితే , దేవి -
చిద్బింబ , శివరూపి , చక్రస్థితే......... ||

కమలాంబికే దేవి విమలాత్మికే ,
''సర్వ ఆనందమయి'' రూపలలితాంబికే |
శాకంబరీ, దేవి శాతోదరీ జనని ,
దుర్గా,రమా, వాణి సతి సాత్వికే ||

జమంగళం |, దేవిం శుభ మంగళం ||
నిత్య జయ మంగళే , శక్తి కురు మంగళం ||

ఓం | భూ: శాంతిప్రదే | భువన శాంతి ప్రదే |
భూత , ప్రేతాది - గ్రహపీడ శమనహ్రదే .....|
సకలసౌభాగ్య ప్రద పూర్ణమయి మంగళే |
ఓం.......శాంతి:......శాంతి: ......శాంతి:. . ||

రచన -
పుల్లాభట్ల జగదీశ్వరి .