బాంగారు మా పాపకు శ్రీరామరక్ష .
-----------------------------------------
శశి పున్నమి కళలు పంచ
మృధు తారల తళుకు
-----------------------------------------
శశి పున్నమి కళలు పంచ
మృధు తారల తళుకు
మేని మెరుపులు కాగా
పలు వన్నెల కాంతులతో
పదునారగు కళల వెలుగు
పలు వన్నెల కాంతులతో
పదునారగు కళల వెలుగు
పాపను కనరే ॥
పూరించిరి శంఖములదె
భావించిన బిరుదు
పూరించిరి శంఖములదె
భావించిన బిరుదు
భాగ్య ఫలముల నిడగా
పేరెంచిరి సురలు, మునులు
దీవించిరి దేవతలదె
పేరెంచిరి సురలు, మునులు
దీవించిరి దేవతలదె
దీర్ఘాయువులన్ ॥
విద్యలందు మేటిగమను
పెద్దలందు
విద్యలందు మేటిగమను
పెద్దలందు
ప్రేమనుగొను పేరెన్నికతో
శుద్ధమైన సంస్కారపు ,
శుద్ధమైన సంస్కారపు ,
సాంప్రదాయ పద్ధతినిల
శుభములు గొనుమా॥
సంగీతము, సాహిత్యము
రంజిల్లెడు నాట్యగతులు
సంగీతము, సాహిత్యము
రంజిల్లెడు నాట్యగతులు
రసములు కాగా
సుందర వదనారవింద-
అందములానందహేల -
సుందర వదనారవింద-
అందములానందహేల -
నందరు గనరే ॥
శ్రీవాణియె కరుణింపగ
సిరులతల్లి శ్రీలక్ష్మియె
శ్రీవాణియె కరుణింపగ
సిరులతల్లి శ్రీలక్ష్మియె
సంపదలిడగా....
శ్రీగౌరియె దీవించెను
సౌభాగ్యములిలను పొంద
శ్రీగౌరియె దీవించెను
సౌభాగ్యములిలను పొంద
సంతోషముగా ॥
బాలభాను కిరణరీతి
వేల నుతుల కీర్తి వెలుగు
బాలభాను కిరణరీతి
వేల నుతుల కీర్తి వెలుగు
వేడుకలిడగా....
లీలలెన్నొ చూపించుచు
బాల వేల వసంతాల -
లీలలెన్నొ చూపించుచు
బాల వేల వసంతాల -
వర్ధిల్లెనుగా ॥
____________________________
పాపకు నామకరణ మహోత్సవ సందర్భ సమయం లో
నాన్నమ్మ (పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి)
ఆశీర్వదిస్తూ .. ప్రేమతో జల్లిన పద్యాక్షతలు .
____________________________
పాపకు నామకరణ మహోత్సవ సందర్భ సమయం లో
నాన్నమ్మ (పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి)
ఆశీర్వదిస్తూ .. ప్రేమతో జల్లిన పద్యాక్షతలు .
No comments:
Post a Comment