అందాల పూబాల
-----------------
అందాల పుాబాల వికసించె పరువాల ,
కలువ కన్నులతోడ చుాచె నాడా ఈడ ।
వింత లోకపు తీరు నెరుగనట్టిది బాల ,
ఎంతగానో మురిసె మనుగడెరుగని బేల ॥
అతోటలో పుాలు రంగు వలువల చెలులు,
వలపు వింజామరల పంచె సౌరభములు ।
మొగ్గ తొడిగిన సాటి పుాల బాలల తోడి ,
కవ్వింత తుళ్ళింత లాడి పాడెను కలసి ॥
అంత నరుదెంచెనా తోట వనమాలీ,
పుాల బాలల తెంపె వాడు దయమాలి।
విరిసి విరియని పుాల చేర్చె నంగడిలోన,
వెలగట్టి తెగనమ్మె కఱకు సందడితోన॥
చిదిమె కొందరు వాని నలిపె భోగులు మేని,
కొన్ని చేరెను గుడికి..ఎన్నొ నలిగెను చితకి।
కన్నీట మున్నీట వాడి రాలెను నేల,
ఏల పుాచితి ననుచు వగచె నలిగిన బేల ॥
రచయిత్రి
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్
No comments:
Post a Comment