Friday, January 18, 2019

మహరాష్ట్ర ఆమని.


మహారాష్ట్రామని..
--------------------------

చదివిన చదువుకి దోరికిన ఉద్యోగానికి
సంబంధం  లేని  జీవితాలు
అప్లై చేసినది  ఆరువేల మంది అయితే
అద్రుష్టం వరించినది ఆరుగురికే॥

వారిది  బ్రతుకు తెరువు త్రుప్తి '
మిగిలిన వారిలో చావలేని విరక్తి.
కుాలిన ఆశలని , అవమానాల
అసహాయతని  ముాట కట్టుకొని  ,
బతుకుతెరువు కోసం ,
బహుదుారపు  ప్రయాణం ॥

సన్నిహితుల
సముదాయింపుల సారం
ముంబయ్  మహానగరానికి 
ఆశల పయనం ॥

అడుగు  పెట్టినంతనే 
అదిరిపడిన  అంతరంగం ,
ఎదుట అలలై  పొంగి ,
హోరెత్తే   జనసముద్రం ॥

పగలుా రాత్రీ తేడా తెలీని
ఆర్ధిక  ఆశల  రద్దీ   వేట
ముంబాయ్   నగరం ,
నా లాంటి  వారికి
చావని ఆశల వరాల పేట ॥

తెలుగు మాట ప్రతి చోట. ...
తెలుగు పలుకు ప్రతి నోట...
అన్ని వర్ణాలకు  ఆశ్రయమిచ్చే
ఆర్ధిక వనరుల అందాల పుాదోట ॥

బంగరు కాంతుల బల్బుల బాట
బజారు ముాయని మాయల కోట
చదివిన వారికీ , చదవని వారికి
బ్రతుకు తెరువుల బంగారు ముాట.॥

ఆకల్లేని  నిండైన కడుపులు ,
కాయ కష్టపు స్వతంత్ర్య  బతుకులు...
కలిసీ మెలిసీ ఉండేటి  వలపులు.,
ఆదరించు బంధాల  పిలుపులు..॥

వారి భాష  మరాఠీ అన్నది
తెలుగు వారి మది దోచిన  పెన్నిధి ..॥
అమ్చీ ముంబై  శుభ యాత్రా ,
అది వెలుగులు పంచే మహరాష్ట్ర ॥

-------------------

నేడు కరోనా కాటుకు కమిలి విషపుారితమైపోయింది "  కరోనా" కట్టడిలో, ఆకలి వేటలుా, ఆర్తనాదాలుా ,రెక్కాడితే గానీ డొక్కాడని,వలస జీవుల అగచాట్లుా,కాలిన బొబ్బల  కాలి నడకల ప్రయాణాలతో ముంబైనగరం సిగ్గుతో తలవంచింది.

ఎంతెంత దుారం , ఎంతో దుారం....దుారం దుారం నిర్మానుష్య రహదారుల్లో  , నీరైనా దొరకని వివసత్వపు కన్నీటి కథనాలు..నీర్సపు చావులు  , ఆకలి కోర్వలేని  అర్ధాంతర  చావుల శవాల గుట్టలు ,రక్తపు అడుగుల, రగిలినహృదయాలఆక్రందనలు

నిర్వీర్వ నీరస ధృక్కుల, నిరంతర కన్నీటి వలసలు

ఒకొక్కరుగా తన ను విడిచిపోతున్న 

అసహాయ హృదయాల నీరస నిధనాలకు

కంపించిన ముంబాయ్ , నిస్త్రాణగా చెప్పింది వీడ్కోలు.

మానవత్వం  అంతరించిన రాజకీయపుటెత్తుల్లో

అలమటిస్తుాన్న ఆక్రోశపు చావుల ఆర్తనాదాలకు

ముంబాయ్ నగరం ముఖం చాటేసింది.

విస్వాసం లేని విద్యావంతుల, విచక్షణా రహిత 

అబద్ధపు సాక్ష్యాల మధ్య  , నలిగిపోతున్న న్యాయ వ్యవస్థకు ,  అసందర్భపు వాగ్దానాల  నాయకుల పాలన తిోడై , దేశాన్ని దుర్గతి  పాలు చేస్తుా ఉంటే  చుాడలేని ముంబాయ్ నగరం ,

ముాసుకున్న కళ్ళకు  గంతలు కట్టుకొంది.

ఈ వ్యవస్థను మార్చలేని ముంబై నగరం , వివసత్వంతో  ముాగబోయింది..॥॥




------------------------
రచన...శ్రీమతి
పుల్లాభట్ల  జగదీశ్వరీముార్తి.
                కల్యాణ్.
--------------------------------------------

No comments:

Post a Comment