శీర్షిక .
డొక్కా సిీతమ్మ.
----------------------
అనుపిండి శంకరుని అర్ధాంగి నరసమ్మ
ఆ దంపతుల ముద్దు బిడ్డ సీతమ్మ..!
రామచంద్రాపురపు రాగాల పుార్ణమ్మ
మండపేటకు మల్లి ఆ పుాల రెమ్మా..।॥
తల్లిదండ్రులులే గురువులందాల కొమ్మకుా
కధలు, పాటల , పద్య కళలు దేలా...
సంప్రదాయపు రీతి , సద్ధర్మ నిరతి నదె
"వస"గ పోయగ వారు , వర్ధిల్లె సీత..॥
పిన్న వయసునె వేగ స్వర్గస్థురాలాయె.
చిన్నదానీ తల్లి చింతగాదే...
పెద్దరికమును బుాని చేసెడిది పనులన్ని
బద్ధురాలై మెలగె బాల్యమందు ॥
సర్వ గుణ సంపన్న నిరతాన్న దానగుణ-
ఘన సాంద్ర కరుణ- మయి అమ్మ సీతమ్మ ॥
ఏ యేటికాయేడు ఉప్పొంగ గోదారి
దాపురించెడిదంట , వరద..కరువు ..
లేదనక నందరికి అన్నమెట్టెడిదంట
అన్నపుార్ణగ తాను అమ్మ సీత ॥
వేద పండితుడతడు , ఎనలేని ధనవంతు-
డాతడొక పేరున్న పెద్ద రైతు ,
గోదావరీ తీర...గన్నవరపుా వాసి
ఇంటి పేరదె ""డొక్కా "" జోగన్న ఘనుడుా ॥
వేద చర్చకు బోయి , వెరసి వరదలొ జిక్కి
ఆకలోపగ లేక అలమటించీ..
నరసమ్మ దంపతుల దాన నిరతిని యెరిగి॥
వెరువకను చనిరంట ఆతిధ్యమునకు ।॥
అతిధి దేవునిగాంచి ఆ పుణ్య దంపతులు
ఆతిధ్యమొసగిరిీ ఆనందమొలుకా...
అతధి మర్యాదలకు లోటు రానీయకా
అన్ని విధులను గుార్చె నతివ సీతమ్మా ॥
మొదటి జుాపులోనె ముదమంది వలచెనదె
ముదిత సీతనుజుాచి మొాహ మలర
పెద్దలాశీర్వచన శోభలతొ జంటగా
మెట్టినింటికి జేరె డొక్కా- సీతమ్మా ॥
ఆదర్శ దంపతులు గా పేరుగాంచిరీ...
ఆప్యాయ-తాదరణ నిధుల పంచీ..
అతిధి మర్యాదలా తేలియాడుచు , మేలు-
నిత్యాన్నదానమును నెరపి వారు.॥
సత్య నియమ ముగాను
నిత్య భోజన కర్మ..
యజ్ఞముగ చేసిరా
పుణ్య దంపతులు ॥
నిరతాన్నధాత్రిగా పేరు గాంచెను తల్లి
మాత్రు ప్రేమను పంచు మానినీ శ్రీ
"అన్నపుర్ణ "ను పేరు సార్ధకము జేసుకొనె
దాత డొక్కా సీత ధరణిలోనా॥
మనిషిగా తన జన్మ సార్ధకమ్మాయెగా
డొక్కావా-రింటిపే-రామెనిలిపే...
పాఠ్యాంశములయందు, గ్రంధ చరితగ నిలచి
ఇలలోన తన కీర్తి వెలుగు నింపే ॥
ఆమెనెరుగని వారు ఈ ధరణిలో లేరు
కీర్తి శిఖరములేలు పుణ్య చరితా...॥
నీకు నీవే సాటిగా...కీర్తు లేలేవు
జేలు తల్లీ నీకు జనని సీతమ్మా ॥
డొక్కా సీతమ్మ గారికి ' గౌరవ వందనములతో.....🙏🙏
రచన, శ్రీమతి,
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.
-------------------------------------------------
No comments:
Post a Comment