అమ్మ
-------
తన రక్త మాంసాలను
నా ఆకార వికాశానికి ధారపోసి ,
తొమ్మిది నెలలు తన జఠరంలో
పదిలంగా దాచీ సంరక్షించిన ,
అమ్రుతమయి. "అమ్మ "
భూమిపై పడిన క్షణంలో ,
నాలో. కదిలే భావాలకు నాందిగా
పలికే మొదటి పలుకు
అ..ఉవ్ ••వా..•లో ఇమిడిన.,
ఓంకారధ్వని. " అమ్మ "
తనలో నున్న
రక్త స్రావాలను ,
క్షీర రసాలుగా. మార్చీ -
ఆకలి తీర్చిన కారుణ్య ఖని ,
అన్నపూర్ణ. " అమ్మ " వచ్చీరాని నడకతో.
నిలదొక్కుకోలేని నాకు
చేయూతనిచ్చీ -
అడుగులు నేర్పిన
మార్గదర్శి. " అమ్మ " ,
నా విజ్ఞాన వికాసానికై
తోడ్పడుతూ ,
నా భవితవ్యానికి
పూలబాట వేసిన -
గురుమూర్తి అమ్మ".
చెడు సావాసాలతో,
రోగాల పాల్పడిన నాకై,
తన జీవితాన్ని
పణంగా పెట్టిన ,
జీవన సమిధ " అమ్మ. "
అంత్య. సమయం లో ,
(గంగమ్మలో ముాడు
మునకలు వేయగానే)
నా పాపాల దుర్గంధాన్ని
తనతో పాటుగా తీసుకుపోతుా
శాంతిగా సాగిపోయే
పవిత్ర - క్షమా ధరిత్రి. " అమ్మ "
నన్నో ఒడ్డుకు చేర్చి
నాకు అందని తీరాలకి
సాగిపోతూకూడా -
న్నాశీర్వదించే -,
దేవత "అమ్మ "
-----------------------------------------------------------
కవిత పేరు
శక్తి స్వరుాపిణి-
" అమ్మ".
రచన , శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి.
కల్యాణ్.
(మహరాష్ట్ర ).
8097622021.
-----------------------------------------
No comments:
Post a Comment