[10/9, 10:55] iswarimurthy:
శీర్షిక....
విత్తనం వేదన.
------------------
భుామాత అట్టడుగు పొరల్లో
పైకి రాలేని నిస్సత్తువతో-
వలవలా ఏడుస్తోంది-
వెల కట్టలేని విత్తు చిన్నారి.॥
బీడువారిన భుామాత -
ఎండిన పగుళ్ళ లోంచి,
ఆత్రుతగా చుాస్తోంది-
మేఘడు పంచే అమ్రుతం కోసం.॥
కొన్ని సంవత్సరాలైంది-
తల్లి తరువు హత్య గావించబడి.
పోతుా పోతుాచెప్పిన చెట్టు తల్లి మాట,
చెవుల్లో మారు మొాగుతునే ఉంది.॥
మొక్కై, విరులు పంచి,
మానై , నీడ నిచ్చి ,
మొాడయ్యేలోగా మరన్ని-
విత్తులను కానుకగా ఇయ్యమంది.॥
అజ్ఞానం తో తమ ఉనికిని
నాశనం చేస్తున్న మానవాళిని
మన్నించి , ఆకలి తీర్చే -
అమ్మ గా ఆదరించమంది.॥
ప్రక్రుతి మాతకు పచ్చదనం-
రైతన్నకు జీవన ధనం-
మానవాళికి- కడుపునిండే -
కమ్మదనం ,ఇమ్మంది.
అమ్మ చెప్పిన మాట కోసం ,
మొలకెత్తాలనే సంకల్పంతో,
తేమ నిండిన మట్టి తడికై,
మేఘుని ఆగమనాన్ని -
ఆకాంక్షిస్తుానే ఉంది.॥
అంతలోనే విత్తు బాల -
కళ్ళముందు చీకట్లు కమ్మేయి.
కఠిన హ్రుదయాల కర్కశ చర్యలకు,
మరో చెట్టు తల్లి ' నేలకొరిగింది.॥
పోతుా పోతుా మరిన్ని-
చిన్నారి విత్తులను-
జారవిడిచి, గొప్పగా పలికింది.
"మేలుగా, మొలకెత్త "మని.॥
కొన ఊపిరితో దీవించింది-
పుష్పంచి, సౌరభాలు పంచమని,
ఫలించి, పరుల కడుపు నింపమని.
మొక్కగా ఒదిగి ఉండమని.
మౌనంగా ఎదగమని॥
రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.
------------------------
[10/9, 11:18] iswarimurthy: భుామాత అట్టడుగు పొరల్లో
పైకి రాలేని నిస్సత్తువతో
వలవలా ఏడుస్తోంది
వెల కట్టలేని విత్తు చిన్నారి.
బీడువారిన భుామాత
ఎండిన పగుళ్ళ లోంచి
ఆత్రుతగా చుాస్తోంది
మేఘడు పంచే అమ్రుతం కోసం.
కొన్ని సంవత్సరాలైంది
తల్లి తరువు హత్య గావించబడి.
పోతుా పోతుాచెప్పిన చెట్టు తల్లి మాట
చెవుల్లో మారు మొాగుతునే ఉంది.
మొక్కై, విరులు పంచి,
మానై , నీడ నిచ్చి ,
మొాడయ్యేలోగా మరన్ని
విత్తులను కానుకగా ఇయ్యమంది.
అజ్ఞానం తో తమ ఉనికిని
నాశనం చేస్తున్న మానవాళిని
మన్నించి , ఆకలి తీర్చే -
అమ్మ గా ఆదరించమంది.
పాడిచ్చే పశువులకు
అకువై ఆహారం కమ్మంది.
ఆరోగ్యపు ఓషధులకు-
తీపిదనపు తేనె నిమ్మంది.
ప్రక్రుతి మాతకు పచ్చదనం-
రైతన్నకు జీవన ధనం-
మానవాళికి- కడుపునిండే
కమ్మదనం ఇమ్మంది.
ఇంటింటా గడపలక్ష్మి గా
కొలువుదీరమంది.
పైరు పంటనై నిలచి-
వంట -కలపగా ఆహుతవ్వమంది॥
మండుటెండలో
చల్లని నీడ నిచ్చి,
అలసిన బాటసారుల
బడలిక తీర్చమంది.
పరోపకారమే జన్మకు
పరమార్ధమంది.
బతికింది కొన్నాళ్ళైనా-
జన్మ ,సార్ధకం చేసుకోమంది.
పుాల పరిమళాల తో-
విరి -హారాలుగా మారి,
వేల కొలువుల పాదాలపై
ఒదిగి ,వడలి పొమ్మంది.
అమ్మ చెప్పిన మాట కోసం
మొలకెత్తాలనే సంకల్పంతో
తేమ నిండిన మట్టి తడికై
మేఘుని ఆగమనాన్ని
ఆకాంక్షిస్తుానే ఉంది.
అంతలోనే విత్తు బాల
కళ్ళముందు చీకట్లు కమ్మేయి.
కఠిన హ్రుదయాల కర్కశ చర్యలకు
మరో చెట్టు తల్లి ' నేలకొరిగింది.
పోతుా పోతుా మరిన్ని
చిన్నారి విత్తులను
జారవిడిచి, గొప్పగా పలికింది.
మేలుగా, మొలకెత్తమని.
కొన ఊపిరితో దీవించింది-
పుష్పంచి, సౌరభాలు పంచమని,
ఫలించి పరుల కడుపు నింపమని..
మొక్కగా ఒదిగి ఉండమని.
మౌనంగా ఎదగమని॥
రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.
------------------------
No comments:
Post a Comment