Thursday, February 27, 2020
సమయం గడిచిపోతోంది.
Tuesday, February 4, 2020
హోం వర్క్స్ లేని స్కుాలు.
Monday, February 3, 2020
యుగాది కన్య.
యుగాది కన్య.
--------------------
యుగానికి ఆది నుండీ
యుగాది కన్య ఆగమనాన్ని-
ఆహ్వానిస్తున్న ఆమని చెలుల,
అంతరంగంలో
అలజడి మొదలైంది ॥
ప్రతీ సంవత్సరం ప్రక్రుతి మాత
ఒడిలో సేదదీరడానికి , తమతో
కలిసి -మెలిసి అడడానికి ,
అందమైన ఆశల పల్లకి నెక్కి
ఆత్రంగా వచ్చే తమ
యుగాది నెచ్చెలిని ,
పచ్చని ఆకుల తోరణాలతో,-
నిండిన ,పుడమి వనంలోకి,
పైరు పచ్చని తివాచీపై-
పరచిన సుమధుర
సౌరభాల నిడు
రంగుపుాల,ఆసన మిడి ,
రాచ మర్యాదల తో,
రంజింపజేసి....
గిరుల -ఝరుల నుండి
జాలువారే- నిశ్ఛల- నిర్మల
నదీ - నదముల నుండి
పారే చన్నీటి చిలకరింపుల,
తేనీటి, దాహమిడి ,
తేట తెలుగు పాటలతో..
చిరు నవ్వుల పుాతలతో..
సిరి మువ్వల, సందడు లిడు
వింజామర వీచికలతో
సేద దీర్చి, ....
సుక పిక రవాల సుందర -
కోలాహల, సందడులతో,
కోయిల పాడిన వసంత -
గీతికల, వందన సత్కారాలతో.
మురిసే మయుారి-
మురిపాల నాట్యాలతో,
వేప ,మామిడి పుాతల
మత్తు పరిమళాల
అత్తరు సౌరభాలతో,
వన- కన్యల వలపు
పలకరింపుల-
మంగళ గీతాల
మేళ తాళాల తో,
షడ్రుచి పాకాల -
సార విందులతో,
సంత్రుప్తి పరచి,
సాదర ఆహ్వానం -
పలికే ..రోజులు,
ఏ ఏటి కాఏడు -
తరిగి పోతున్నాయి.॥
మనిషి మనుగడకై
పాటుపడే తమ జీవితం,
మనిషి స్వార్ధానికి-
బలై పోతున్నాది.॥
జన జీవనం పెరిగింది.
కొండలు చరియలు విరిగేయి.
వనాలు తరిగేయి.॥
కాలుష్యంతో నీలాకాశం
నల్లబడింది. పచ్చని
తరువులు కుాలేయి.
గుాడులేక ,పక్షులు
విల విల లాడుతున్నాయి.॥
నీరు లేని మట్టి
నిస్సారమై ..బీడుబారి
బావురుమంటున్నాది.॥
రైతుల ఆత్మహత్యలతో
పచ్చని పంట పొలాలు-
దిక్కులేని దిబ్బలుగా
మారిపోయాయి.॥
పరిమళించే పుాల అందాలు
పైశాచిక కబంధ హస్తసల లో
నలిగి నలిగి..అమ్మకాల
బేరాలకు , అహుతైపోతున్నాయి.॥
కాలుష్య వాతావరణం
పెరిగి...,
వనాల వైభవం తరిగి...,
వసంత చెలులు,
విల విల లాడుతున్నాయి.॥
పచ్చని తరువులు లేని,
అందవిహీనమైన -
బీడు భుామిపై-తమ
యుగాది నెచ్చెలి
నాహ్వానించి ,
మొాడు బారిన కొమ్మలతో
మొండి ఆసనమేసి ,
ఎండిన నదులలో -
పారని జలాల పాకుడు
నీటిని..దాహమిడి,
కెమికల్ పుాసిన-
విషపు ఫలాల విందును,
ఎలా అందించాలి.. ?॥
తరిగిన మానవత్వపు
మమకారాల-
విరిగిన మనసుల
ఆక్రోశపు ఆశ్రమాల లో
ఎలా సేదదీర్చాలి..?॥
వావి -వరసలు లేని-
పాప క్రుత్యాల, పైశాచిక
విలయ తాండవ నాట్యాన్ని
అమె ఎదురుగా...
ఎలా ప్రదర్శించాలి..?॥
పసిపాపల పై జరిగే-
అత్యాచారపు ఆగడాల
ద్రుశ్యాలని ....
అమె కంట పడడకుండా
ఎక్కడ దాచి పెట్టాలి..?॥
అడుగంటిన మంచితనం,
ఆత్మీయత లేని మమకారం
అమ్మతనం , ఆడతనం
మరచిన , సంస్కారహీనపు
సమాజంలోకి..తమ ప్రియ
నెచ్చెలిని ఎలా ....
ఆహ్వానించాలి..?॥
ఎలా..?.ఎలా.?.ఎలా..?
ఇలా ఎవరి ఆలోచనల్లో
వారుండగానే..ఆడుతుా-
పాడుతుా అడుగిడింది
యుగాది నెచ్చెలి,
ఉరుకులతో పరుగులతో...॥
మన భారతీయ సంస్క్రుతి-
సాంప్రదాయాల్ని..మళ్ళీ
మనకు తెలియచేసేందుకు.
మన పండగల ప్రసస్త్యాన్ని-
వివరించి , మన సంప్రదాయ
సంపదను పెంపొందించేదుకు.॥
ఆరు ఋతువుల
అద్భుత ఉపయొాగాల్ని,
ఆరు ఋచుల ఓషధి లో
దాగి ఉన్న ఆరోగ్య
సుాత్రాలను వివరించేందుకు,
అద్బుత సందేశాల
మేలు పలుకులతో,
ప్రక్రుతిమాత ఆడ పడుచు
వత్సరానికోసారి..వయ్యారంగా
నడుస్తుా..నవొోదయ కిరణాలతొో
మనకోసం వస్తోంది.॥
ఏదేశమేగినా , ఎందుకాలిడినా
మరువకుమీ ..పుడమితల్లి
మట్టి సార మహిమలనీ..
మరువకుమీ సద్ధర్మపు
సంప్రదాయ నిరతినీ..
చెరపకుమీ ప్రక్రుతి వన
సంపదలిడు సుధలనీ..
చేయకుమీ పతనము లిడు,
కాలుష్యపు కర్మలనీ...
అని పాడుకుంటుా....
అదిగో... "శార్వరి "
నామ విశ్వ కాంత...
వస్తొంది --వస్తొోంది,
నవరసాల సొగసులతో...
పరవశాల పొంగులతో..
-------------------------
రచన , శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్..(మహరాష్ట్ర ).