🌹☘🌷🌿🍁🍃🌸🌴🌺🎋🌻🌾🌳🦋🎋🌹🍀🍁
చిత్రం: చిట్టెమ్మ మొగుడు
గానం: ఏసుదాస్
రచన: జాలాది
నిండుకుండలా నీళ్ళోసుకుంటాదీ
నీలాలకొండా...
పండులాంటి ముద్దుపాపడ్ని కంటాదీ
తెల్లారకుండా...
పుట్టినోడల్లా సూరీడంటా
పుడమితల్లికాడు కొడుకేనంటా
అమ్మకడుపులో ఆడేదేమో తొమ్మిది నెలలంటా
దుమ్ములోన కలిసిపోయేటందుకు
నూరేళ్ళ గడువంటా...
ఇది బతుకమ్మ నడకంటా!
అమ్మ చేతులా మొలతాడు కడితే
మొనగాడైనోడు
ఆ మొలతాడు కొలతే మెడతాళి కట్టి
ఆలి మొగుడౌతాడు
పేగు మడతలో ఊగులాడుతూ
ఉలికులికి పడతాడు
చిలిపిగెంతులా బంతిలా
చిరుడొక్కన తంతాడు
నిప్పులోన కలిసి పోయేనాడు
తలకొరివి పెట్టగ వచ్చానంటాడు
పుట్టమీద చెట్టు పురుడోసుకుంటే
పువ్వు పూసెనంటా
ఆ పువ్వులోనే ఒక బెమ్మదేవుడు
పుట్టుకొచ్చేనంటా
అందమైన జనమ కోసమే
ఆదిశక్తి పుట్టెనంటా
అండ పిండముల తల్లిగా
అది ఆడదయ్యనంటా
కట్టుకున్నదే కనలేనంటే
కాలమేడ్చెనంటా
బిడ్డ పాపలేని గొడ్రాలైతే
ఈ భూచక్ర మెట్టా తిరిగేదంటా....
🌹🌿🌷🍀🌻🍃🍂☘🌾🌴🍁🌳🦋🎋🌺🌿🌸🍃
No comments:
Post a Comment