Thursday, March 26, 2020

పద్యాలు.

సుభాషితాలు.
ఆటవెలది.
------------
ఇన( సుార్య) గణ త్రయంబు, ఇంద్ర ద్వయంబు,
హంస (సుర్య) పంచ కంబు ఆటవెలది.
--------------------------
కామ క్రోధ లోభ  గుణముల విడనాడి
నీతి నిష్ట  నిత్య నియమ ముగను
నాతి, జాతి ,సుాక్తి నాదరిం చుటె వేత్తి
నదియె మేలు మాట తేనె ముాట॥*****

కట్టు బాట్లు లేని కోర్కెల నేలగా॥
అప్పు చేసి పప్పు  కుాడ దేలా*****
వట్టి మాట లేల,  విడువరా గములెల్ల
తప్పు ఒప్పు లెరిగి  తగ్గు మింక॥ 

రొట్టె 'పాలు తిన్న రోగమ్ము రాదురా 
భోగి వౌతె నీవు రోగి వౌదు
మితము,సాత్వి కమగు బోనమ్ము బలమురా
మొాహ మింక వీడి మనుమ మహిని॥

ఆలి ,తల్లి ,చెల్లె, లటులవా రలెస్త్రీలు
ఆట బొమ్మ కాదు హద్దు మీర
మగువ కంటి వెంట కన్నీరు చిలికినా****
కరగు నంట సిరులు ఘనము సుాక్తి ॥

రేపు రేప నుంచు వెనుకాడ తగదురా
చేయు పనికి జంకి జాల మేల
రేపు జేయు పనిని రోజులో పుారించు***
కార్య సిద్ధి గల్గి కలుగు జయము.॥

పనికి రాని మాట పతనమ్ము జేసేది 
నలుగు రెదుట నతిగ నుడువ వలదు
ఓర్పు గల్గి నీవు నేర్పరై  మసలుకో
అనువు కాని చోట అధిక మనక ॥*****

ఋచులు గల్గి నట్టి భక్ష్యమ్మె భాగ్యమా
నమ్మి మేటి ఋచుల మెచ్చ బోకు
చవుల నేలు జిహ్వ జఠరమ్ము జెరుపురా
నిజము నెరిగి మసలు నీవు సుమ్మా॥

అమ్మ నాన్న లిద్ద  రౌదురి లనువేల్పు
కమ్మ నైన ప్రేమ కనగ నీవు
నమ్మి నట్టి వారి నగుబాటు చేయకుా
అన్న మెట్టు బసకు కన్న మట్లు ॥.****

కామ జీవి వౌచు కరకురో  గములేల
బతుకు దుర్భ రముగ బ్రతుక నేల
అడుసు ద్రొక్కి కాళ్ళు కడగే వదేలరా***
ఫలిత మేమి లేని పరుగింక  చాలు ॥

పాపి వౌచు కర్మ ఫలముగా, పదుగురున్
పోరి, కోప గించ పరుష మేల
నీవు చేయు తప్పు నినుకాల్చు నిత్యమ్ము
పాము పడగ నీడ పడక  యట్లు ॥****

బాగ జుట్టు కోసి  పొట్టి వలువ కట్టి
సిగ్గు శరము లేని జాణ వౌచు
పురుషు లందు పుణ్య పురుషులే లేరంచు***
శోక మిప్పు డేల చరిత హీన ॥

అల్పు గుాడి నీవు ఆర్జించినది లేదు
దరికి జేర్చ బోకు దుష్ట  యఖుల
నివురు గప్పు నీరు నిలిచిముం చెడెదిరా***
తరిమి వారి వీడి తరలి రమ్ము॥

అల్ప బుధ్ధి కలిగి  ఆడంబరము లేలు
బ్రతుకు బ్రతక నేల కతక నేలా
స్వల్ప నియమ మెంచు సౌఖ్యమ్మె  సుఖమురా
పరువు లేని బతుకు బరువు సుమ్మీ॥*****


 
తామస గుణముల వీడియు
కామము క్రోధము లవీడి కరుణను గల్గిన్
నీమము లనుపా టించిన.......
రాక్షస రక్కసి "కరోన " రాదిక దరికిన్ ॥ 

ఆటవెలది.
---------------
ఆక లేయ స్థన్య పానమ్ము తాగించి
చిట్టి నడక  నేర్పె చిందు లేయ
అట్టి మేటి దైవ మిలలోన లేదయా
"అమ్మ" ఆమె పేరు, ఆది గురువు.॥

సాక రుాక దెచ్చి , సంసార  మునునెట్టి
చదువు లెన్నొ నేర్ప, జతన మెంచి (జతనమొార్చి)
సర్వ మొార్చి సకల  సౌఖ్యమి చ్చిన దాత
"నాన్న" గాదె ఇలను, నగధ రుండు ॥

కర్త యౌచు కార్య భారమ్ము  మోయుచుా
యుక్తి  బాధ్య తలను కావి డెత్తి
విత్తు కొరకు వయసు పణముగా పెట్టేటి
భర్త గాదె , కర్మ బద్ధు డిలను ॥

మగువ కంటి వెంట కన్నీరు చిలుకంగ
కరగు నంట సిరులు , గిరులు మహిని 
తరుగు నంట సుఖము తగవింట పెరుగును
కలత మార్ల కొంప జగడ పుారు॥

నలుగు రందు మీరు నగుబాటు కావద్దు
నలుని రాణి నాల్క నాట్య మాడ
కంద అంద ములను గణములన్ నేర్వంగ
తరగ బోదు మీదు ధనము గుణము ॥
తేటగీతి..****
పుట్టి నింట ముద్దు బిడ్డగా పెరిగేటి
పాప పెళ్ళి తోడ పరుల ధనము
అత్త యింటి వంశ -గౌరవము నిలబెట్టి
పుట్టి నింటి పేరు  పరువు నిలుపు ॥
---------------------------------------------

రచన.శ్రీమతి 
పుల్లాభట్ల జగదిీశ్వరిీముార్తి.
కల్యాణ్.
------------

[3/29, 22:44] iswarimurthy: 
ఆటవెలది.
కవిత లల్ల నెవరి కడుపునిం డెడిదంచు
అన్న మెట్ట నతడు ఆర్తు లకును
తలపు నెంచు తోడ తరుణంబి దేయంచు 
కలము వీడె ధర్మ  కర్మ జేయ॥

[3/30, 22:55] iswarimurthy:
కందం.
 శ్రీనా ధునిక్రుప గోరుచు
ఆనా ధునిచర ణములను అహరహ ములునే
ధ్యానా నందము నొందుచు
అర్చిం తునుభ  క్తితోడ  అఘహరు నతనిన్॥



 








No comments:

Post a Comment