జీవితం పరిసమాప్తమైన వెంటనే జీవుడు-
మరొక జన్మకై ,మాత్రుగర్భం లోకి చేరేందుకు నెట్టబడ్డాడుొ
చిన్న కణ రుాపంలో, మల -ముాత్రాదుల మధ్య
కొట్టుమిట్టాడుతుా..బయటకు దారి కానరాని ,
చీకటి నిండిన మురికి నీటిలో తేలుతుా "పున్నామ-
నరక" బాధను అనుభ విస్తున్న భావన తో ,తలవంచి
నా మునుపటి జన్మ , పాప క్రుత్యాలు
తలచుకొంటుా, కర్మ ఫలాన్ని అనుభవించడానికి,
ఊపిరాడని, ఇరుకు జీవితానికి అలవాటు
పడడానికి రాజీ పడ్డాను .
ఇంతలో ఎవరో నన్ను అక్కున చేర్చుకొని ..
అప్యాయత తో అలరించిన భావన. దుర్గంధపు
ఊబి నుంచి నన్ను లాగి , నా చుట్టుా ఒక రక్షణ కవచం చుట్టి , ఆ పొరలో నన్ను చేర్చి ఊరడించిన భావన.
ఆ దేవత ఎవరో..శతకోటి వందనాలు ఆమెకు.॥
నా పాప కర్మ కొంచ తగ్గినట్టుండే ఆనందం,
అనుభవించేంతలోనే "క్షుద్బాధా పీడితుడి నయ్యేను.
కళ్ళు విప్పలేని నా బలహీనత తో చుట్టుా తిరుగితుా
కదల లేని ఇరుకు పొరలో ఈదుతుా, తేలుతుా..
దుర్వాసనా భరితమైన ఉమ్మి నీటిని గుటకలు వేస్తున్న
నన్ను ,ఎవరో ఆప్యాయంగా తడుముతున్న భావన.॥
నా శరీరం పెరుగుదల కోసం, తాను తిన్న అహారపు
సారాన్ని ,నా నాభినుండి ,పంపేందుకు , బలమైన
తన ఆహారపు నాళాన్ని, నా నాభిలోనికి చొప్పించి, ఆకలి తీర్చే జీవామ్రుతాన్ని ,అడగకుండానే-
నాకు అందిస్తున్న భావన..
ఆ దేవత ఎవరో..శతకోటి వందనాలు ఆమెకు.॥
ఎదుగుతున్న నా భారానికి సాగుతున్న కవచపు..పొర.
పెరుగుతున్న బరువుకు,నాఉనికి నాకే భారమైన చెర .
పెరిగే మెదడును తాకుతున్న బాహ్య తరంగాల సవ్వడి
చిరునవ్వుల గలగలల , ప్రేమ పుారిత స్పర్శాభావం.
నాలో ఏదో పులకరింత.నా నాడుల ప్రేరేపించే
నిత్య నిస్వార్ధ నియంత.
ఆ దేవత ఎవరో..శతకోటి వందనాలు ఆమెకు.॥
శబ్ధగ్రహణ శక్తి పుంజుకుంటోంది. సప్త స్వర పేటికా-
తరంగాల ఓంకార ధ్వని ,నాలో నాదానికి ప్రేరణౌతోంది.
ఆశ్చర్యానందాల తో ద్వనిని ఆస్వాదిస్తున్నాను.
శబ్దాన్ని గ్రహిస్తున్న నా వీనులకు, వినిపిస్తున్న
కమ్మని పిలుపు."కన్నా, నా బుజ్జీ, నా తండ్రీ.".అంటుా నాకై ,వినిపించే నవ చైతన్యపు అనురాగ సంబోధన.
నాతో బంధాన్ని పెనవేసుకుంటున్న..
ఆ దేవత ఎవరో..శతకోటి వందనాలు ఆమెకు.॥
రోజుకో పలకరింత , నాలో రేగే పుకరింత .
ఆమెను ఎలాగన్నా చుాడాలన్న కోరికల కలవరింత
నేను శతవిధాలుగా బయటకు రావాలన్న ప్రయత్నంతో
నేను చేసే భీభత్సవానికి బాధనిండిన బేలతనపు -
ఆక్రదన .చిన్ని కాళ్ళతో చిందులు వేసే సమయంలో...
చిరు నిట్టుార్పుల బాధాతరంగపు ప్రకంపనలు..
నేను చేసే అల్లరిని అత్యంత సహనంతో భరిస్తుాన్న..
ఆ దేవత ఎవరో.. ఆమెకు శతకోటి వందనాలు.॥
ఆ ప్రేమామ్రృత ముార్తిని చుాడాలన్న తపన..
ఆమె తన కోసం పడే వేదనను మించినదై..
గాడాంధకారపు చీకటి నిండిన ఇరుకు బస నుంచి ,
వెలుగుల వెలికి రావాలన్న పట్టుదల ,పంతానికి-
పగిలిన పొర, చీకటి నుండి కలిగించిన విముక్తి.॥
ఒక్కసారిగా చెర విడిన చైతన్యంలో నిండిన ఆనందం.
పేగులు పెళ్ళగించుకొని , కాళ్ళతో తన్నుతుా,
ఉదరాన్ని చీల్చుకొని, బయటకు రావాకన్న నా ప్రయత్నానికి, బాధను ఉగ్గపట్టి, తన విడుదలకై సహకరంచిన..
ఆ దేవత ఎవరో.. ఆమెకు శతకోటి వందనాలు.॥
భుామి మీద పడకుండానే, సుతి మెత్తని చేతులతో
సున్నితంగా తనను అక్కున చేర్చుకొని, ఆనందాశ్రువులతో తన రాకను ఆహ్వానించి,
ఆర్తితో తన ఒడిని చేర్చుకొని, ఒద్దికగా ఒడిసి పట్టిన
ఆ దేవత ఎవరో.. ఆమెకు శతకోటి వందనాలు.॥
ఎక్కడి నుంచి ఎక్కడకు వచ్చి పడ్డానో తెలియని-
అయొామయ స్థితిలో,అసహాయం నిండినభయంతో
ఏకధాటిగా ఉవాఁ..ఉవఁ...అంటుా ఏడుస్తున్న నన్ను
చుాసి, "ఎందుకు కన్నాఏడుపు".ఆకలేస్తోందా.అంటుా
అడగకనే తన రక్తస్రవాలను క్షీర రసామ్రుతంగా మార్చి, తనకు స్తన్యమిచ్చి, ఆకలి తీర్చిన ,ఆ అమ్రుతమయ.
దేవత ఎవరో.. ఆమెకు శతకోటి వందనాలు.॥
తనపై కురిసే ముసి ముసి నవ్వుల ముద్దుల ముాటలు.
గోల-గోలగా, మమతల జల్లుల మనసైన చేతలు.
లీలగా వినిపించే తన వీనులకు ,అర్ధమయ్యే మాటలు.
ఎవరో అంటున్నారు."అమ్మ దగ్గరబజ్జున్నావా."అంటుా.
ఒక్క సారిగా ఉలిక్కి పడ్డాను.దేవత పేరు విన్నాను.
నవమాసాలుా నన్ను మొాసి, నాతో పాటుగా నరక-
యాతనలు అనుభవిస్తుా, పున్నామ నరక గుహ్యంలో
తనకు రక్షణ నిచ్చి, ఆకలి తీర్చన ఆ పుణ్యముార్తి...
పేరు...అ,ఊ, మ, అవుమ...అ...ఉమ్ ..మ....
..అమ్మ ..అమ్మా...అమ్మా...అంటుా వల్లించేను.
ఒక్కసారిగా నా కళ్ళు క్రుతజ్ఞత తో వర్షించేయి.
ఆర్ద్రత నిండిన గొంతు తో ఆర్తిగా పిలిచేను...
(అమ్మా)... ఉవాఁ ఉవాఁ.... అంటుా..
నా బాధ అర్ధం కాని "అమ్మ" నన్ను ఆర్తిగా
అక్కున చేర్చుకుంది. ఏడుస్తున్నాననుకొని ....॥
తన వెచ్చటి పరిష్వంగంలో ఇముడ్చుకొని,
నా చుట్టూ పెనవేసిన చేతులతో, నన్ను పరి-
రక్షిస్తున్న ఆ ప్రేమైక శక్తి స్వరుాపిణి "అమ్మ" కు,
ఆ జన్నాంతర ఋణగ్రస్తనై , ఉంటానన్న సంకల్ప నిర్ణయం తో , ఆమె ఒడిలో , వెచ్చగా ఒదిగి ,
నిశ్చీతగా నిద్రపోయేను.
---------------------------------------------------
అమ్రుతానందమయులైన "అమ్మ "లకు ప్రేమతో...
రచన, శ్రీమతి,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.. (మహరాష్ట్ర .)
--------------------------------
No comments:
Post a Comment