Sunday, April 19, 2020

కిరణ్కుమారిగారి గురించి..( పెయింటర్ ).

*ప్రపంచ కళా దినోత్సవ శుభాకాంక్షలు*....
*ఆమె చిత్రాలు మనతో మాట్లాడుతాయి*#
*నాకు* చిత్రకళ మీద అంత మక్కువ లేదు... దాని గురించి పెద్దగా తెలియదు.... అయినా ఆమె పెయింట్ చేసిన  ' భవాని నగర్ ' చిత్రాలంటే ఎందుకో మక్కువ... నేను ' భవాని నగర్' లో పుట్టి పెరగడం కారణం కావచ్చు... ఆ చిత్రాలు చూసినప్పుడల్లా నేను చుట్టేసిన ' భవాని నగర్' అంతా గుర్తుకు వస్తుంది... జిగిబిగి కరెంటు తీగలు, పాత జ్ఞాపకాలు చుట్టుముట్టేస్తాయి.... అందుకే ఆమె చిత్రాలు మనతో మాట్లాడుతాయనిపిస్తుంది. చిత్ర కళాకారులు ఎంతో మంది తిరుపతి లో ఉన్నా ఆమెకుండే ప్రత్యేకత వేరు.... ఆమె *కిరణ్ కుమారి గారు* .... పాతికేళ్లుగా నాకు తెలుసు సబ్ ఎడిటర్ గా ప్రారంభమైన ఆమె కెరీర్ .... తరువాతి కాలంలో అనేక రంగాలలో తన ప్రతిభను చాటుకున్నారు.... తనకు ఎంతో మక్కువ అయిన చిత్రకళను ఘనంగా తీర్చిదిద్దుకున్నారు.... గత 20 ఏళ్లుగా తన కుంచెను ఆపకుండా పదునెక్కిస్తున్న కిరణ్ కుమారి గారి గురించి మనం తెలుసుకుందాం...
తిరుపతికి చెందిన కిరణ్ కుమారి గారు కమ్యూనికేషన్ మరియు జర్నలిజంలో పిజి చేశారు  గత 20  సంవత్సరాలలో ఉదయం దినపత్రిక, జాతీయ, రాష్ట్ర స్థాయి ఎన్జీవోలు, చిత్తూరు వెలుగు ప్రాజెక్ట్ లో వివిధ సందర్భాల్లో పనిచేశారు.  వెలుగు ప్రాజెక్ట్ లో పనిచేస్తుండగా స్వయం సహాయక సంఘాల్లోని 'చదువురాని పేద మహిళలు' 200 మందికి శిక్షణనిచ్చి విలేకర్లు గా తయారు చేశారు వీరితో 'నవోదయం' అనే పత్రికను తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు...2001 లో ప్రారంభించబడిన 'నవోదయం' పత్రిక 'అప్రతిహతంగా' 20 ఏళ్లుగా నడుస్తోంది... ఆ పత్రిక నేటికీ నడుస్తుండటం విశేషం...
కిరణ్ కుమారి గారు... మీ గురించి ఏమైనా చెప్పండని అడిగితే.... ఎందుకు సార్....నా కంటే గొప్ప వాళ్ళు చాలామంది ఉన్నారు... చెప్పుకునే అంత గొప్ప దానిని కాదు... నా చిత్రాలు పోస్ట్ చేయండి అని 'నమ్రత'గా అంటారు... స్వతహాగానే కిరణ్ గారు 'మితభాషి',  పొదుపుగా మాట్లాడుతుంటారు...  ఆమె గురించి తెలిసిన వాళ్ళు ఆమె మిత భాషే కానీ... ఆమె సృష్టించిన చిత్రాలు గంటల తరబడి మనుషులతో మాట్లాడుతుంటాయి అంటారు ... ఆమె చిత్రకళలో జీవం ఉట్టిపడుతుంది కొన్ని సందర్భాల్లో ఇది నిజమా?... పెయింటింగా? అన్న అనుమానం  కలుగుతుంది.... అంతటి సమర్థత కిరణ్ గారి సొంతం... కళాకారిణిగా జాతీయ, రాష్ట్ర స్థాయి ఎన్జీవోలకు, కొన్ని ప్రభుత్వ సంస్థలకు, మహిళా యూనివర్సిటీ వారికి వందకు పైగా పోస్టర్లు తయారు చేసి ఇచ్చారు... మహిళలు, దళితులు, రైతాంగ సమస్యలపై ఈ పోస్టర్లు ఉన్నాయి....
సామాజిక సమస్యలపై వేసిన ఈ పోస్టర్స్ ను అనేక శిక్షణా కార్యక్రమాల్లో ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు... ఆ లింకు మీ కోసం...
https://kiranin.blogspot.com

ప్రస్తుతం స్టిల్ పెయింటింగ్స్ మీద  దృష్టి పెట్టిన కిరణ్ కుమారి గారు ... వేసిన చిత్రాలతో ....అమెరికా దేశంతో పాటు మన దేశంలోని ఢిల్లీ, బెంగుళూరు, కొచ్చిన్, చెన్నై, హైదరాబాదు , చండీఘర్ లాంటి నగరాల్లో ప్రదర్శనలు జరిగాయి... తిరుపతి బాలమందిరంలో ప్రతి ఆదివారం పిల్లలకు కథలు చెబుతూ బొమ్మలు నేర్పించే మన కిరణ్ గారు... తిరుపతిలోని పాత భవనాలు, రోడ్లు, సందులు, కరెంటు వైర్లు పై చాలా బొమ్మలు వేశారు.... ప్రపంచ కళా దినోత్సవం సందర్భంగా మన కిరణ్ కుమారి గారికి... మనమంతా శుభాకాంక్షలు తెలియజేద్దాం... కిరణ్ కుమారి గారు వేసిన బొమ్మలు చూడాలంటే  ఈ లింక్ పై క్లిక్ చేయాలి....
http://bkiranarts.com

*కందారపు మురళి*
*ప్రధాన కార్యదర్శి*
*సిఐటియు*
*తిరుపతి*

No comments:

Post a Comment