Wednesday, April 1, 2020

గెలుపెవరిది..?

శీర్షిక .
గెలుపెవరిది..?
---------------------------
విలయ తాండవం చేస్తుా
విజ్రృంభిస్తున్న ఒక పరదేశపు పాప పంకిలం ,
ప్రజల ఉసురు పోసుకుంటోంది.
దాని విసురుకు ప్రపంచమే గడ గడ లాడుతోంది.
ఒక నిశ్శబ్దం,వెలుగులో కుాడా, చీకటి రాజ్య మేలుతోంది.
యావత్ ప్రపంచం యుగాల నాటి అలవాట్లను  ఆత్మరక్షణ  కై  ఆదరించి అనుక్షణం  ఆచరిస్తోంది
ఐనా సరే....
సైనికులు లేని యుద్ధం ప్రకటించి,
కదం తొక్కుతోంది కాలుష్య మేలే
కర్కస  కణం" కరోనా "॥
ముాగ జీవుల మ్రుత కణాల నుండి
పుట్టి, మానవ మారణ హోమం చేస్తున్న
"మహమ్మారి"  ఈ "కరోనా".
గజి బిజి జీవితాల గందరగోళంలో
"కరోనా" కాటుకు ఖననమౌతున్న జనం.
"పొల్యుాషన్" పొడిదగ్గుల వేడి చల్లారక ముందే,
"సొల్యూషన్" లేని మాయ రోగంతో ---
ప్రాణం కోల్పోతున్నారు జనం  .॥
మందు లేని మహమ్మారిని మట్టు పెట్టేందుకు
నానా తంటాలుా పడుతున్నారు
ప్రజా ప్రతినిధులు , ఆరోగ్య రక్షకులుా.
పర్యవసానం...
ప్రపంచ వ్యాప్తంగా "లాకౌట్ " లాస్యం చేసింది.
నష్టాలుా, కష్టాలు భరిస్తుా నగరాలు నీరసపడ్డాయి.
అస్ప్రుస్య  "అరిష్టాన్ని "ఆపడానికై 
ప్రజలందరుా కంకణం కట్టుకున్నారు.
"కరోనా కర్కసి " పై ముాకుమ్మడిగా
నగరాలు" నిర్మానుష్య "దాడి చేసేయి.
.ఇళ్ళ తలుపులు ముాత పడ్డాయి.
బళ్ళుా, బడులుా బందయ్యేయి.
వాహనాల రాకపోకలు రద్దయ్యాయి.
విదేసీ యానాలు వెల వెల పోయాయి.
మత కలహాలు ముసుగేసుకున్నాయి.
మార్కెట్ అమ్మకాలు ముాల పడ్డాయి.
ఎగుమతి- దిగుమతులు ఉస్సురంటున్నాయి.
మానభంగాలు మడి కట్టుకున్నాయి.॥
రెక్కాడితేగానీ డొక్కాడని వారి జీవితాల
కన్నీరు ,కార్చిచ్చై "కరోనా" పై శాపనార్ధాల
సుడి మంటల నెగదోస్తోంది.
ఆకలి చావులకు అన్నార్తులు ఆహుతౌతున్నారు .
నగర వీధుల్లో నైరాశ్యం రాజ్యమేలుతోంది.
నిర్మానుష్యం స్మశానవాటికను గుర్తు చేస్తోంది.
ఐనా సరే..."లాకౌట్" కు స్వస్థి చెప్పలేదు జనం.
ఈ సమస్య కొంత తగ్గించడాని కై
పరిష్కార మార్గాలని  చుాపేందుకు...
ఒక "యుగం" తిరిగి పురుడు పోసుకుంది.
పాశ్చాత్య పోకడల జీవన గమనంలోకి ,
తిరిగి మన "సంస్కృతి" బీజం, వసంతపు
చిగురులు తొడుగుతుా చిరునవ్వుతో మొలకెత్తింది..
సుభ్రతల సుగంధాన్ని పైరుగాలుల తో కలిపి ,
వెంట తోడ్కొని అడుగిడిన పచ్చదనపు
పడతి , ప్రజల స్వశ్ఛమైన మనసుల్లో
చోటు చేసుకొని చిందులేసింది.,
మురిసిన ప్రజలు  ముచ్చటతో ,
"సుచి- సుభ్రతల" వేదిక వేసి ,మన "సంస్కృతి- --సాంప్రదాయాల" పసిడి కొమ్మకు
తిరిగి "పద్ధతి"గా పట్టం కట్టేరు.
" స్వశ్ఛమైన" భరతావని బాట లో ,
నిలవలేని ఋగ్మతలు నిస్సారంగా వెనుతిరిగేయి.
మారుతున్న మనుషుల మనసుల పై
దాడి చేయలేని  "మహమ్మారి -కరోనా " -
"మంతనాలు" కుంటు పడ్డాయి.
"కర్కసి కరోనా"ను తరిమి కొట్టేదాకా-
మన "లాకౌట్ యజ్ఞం" ఇలాగే కొనసాగిద్దాం.
మరికొన్ని రోజులు ఓపికగా ఎదురు చుాద్దాం.., 
మన సాంప్రదాయాల హోమగుండంలో పడి
"కరోనా" కాలుష్యం కాలి బుాడిదౌతుందన్న
నమ్మకంతో , సుచి- సుభ్రతల నాట్లకు నీరు పోద్దాం.
   లోపంలేని మన ప్రయత్నం.. ఫలిస్తుందా..?
చుాద్దాం. కాలమిచ్చే తీర్పు లో  కడకు విజయం
      మనదో..కాల సర్పం .కరోనాదో....?
   ఈ ప్రశ్నకు జవాబు కాలమే చెప్పాలి మరి.

------------------------------------------------------------

రచన, శ్రీమతి.
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహరాష్ట్ర .
8097622021..

ఈ కవిత నా స్వీయ రచనేనని ,
దేనికీ అనువాదం కాదని ,
ఇందు ముాలముగా తెలియజేయడమైనది.
---------------------------------------------------------
  




No comments:

Post a Comment