శీర్షిక .
జీవిత పోరాటం.
----------------------+
భగవంతుడు మనకిచ్చిన
గొప్ప వరం , ప్రతీ కష్టాన్నీ..
తాత్కాలికంగా మరచిపోవడం ॥
నిన్నటి నెత్తుటి గాయం , ఈ రోజు
ఉపశమనంతో, రంగుమారుతుంది.॥
గడచిన కష్టకాలపు స్మృతులు,
గడిచిపోతున్న సమయ -గమనానికి
చెల్లా చెదురై , మెదడు పొరల్ల్లో
అంతర్లీన జ్ఞాపకాలై నిలిచిపోతాయి.॥
లేమి తనపు కన్నీటి మరకలు,
సంపాదన నిండిన సంతృప్తి నవ్వుల
మాటున , వెలిసి, వెల-వెలబోతాయి.॥
బీదరికపు పాత చెలిమి ఛాయలు,
కొత్త దనపు,కాంతి మాద్యాల మార్పుకు
మనసులో నే మరుగుపడిపోతాయి.॥
విరహవేదన నిండిన అంతరంగం,
మరో ప్రేమ కాసారంలో మునిగి
పద్మరాగమై పరిమళిస్తుంది.॥
ఎవరుా లేరన్న ఒంటరితనం,
ఆశల ఆలోచనల విహంగమవుతుంది.॥
అన్నీ కోల్పోతుా కుాడా,
ఆశలు-ఆశయాల పయనం,
పరిమళాల సుమ వీచికయై,
మధురమైన స్వాంతన కలిగిస్తుా,
మజిలీదాకా నెట్టుకు వెళ్తుానే ఉంటుంది.॥
నీదైనా' నీ చేతిలో లేని జీవితం
ఏ రోజు, ఎలాగుంటుందో తెలీని ,
బ్రహ్మ రాతల, బంధాల నిలయం.॥
అన్ని అవాంతరాలనుా అధిగమించి
ఆనంద స్వప్న లోకాల్లో పయనిస్తుా- '
ఎడారిలో ఒయాసిస్సును చేరుకోవాలనే-
తపన నిండిన, సద్దుబాటు సాధనం.
ఇది.! పోరాటాల పరుగు పందెం.
ఎందుకంటే..ఇది , కష్ట- సుఖాలు
కలబోసిన "జీవితం.".
-----------------------------------------
రచన, శ్రీమతి -
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. ( మహరాష్ట్ర ).
---------------------------------------
---------------------
No comments:
Post a Comment