Tuesday, July 21, 2020

గరిమెళ్ళ సత్యన్నారాయణ

గరిమెళ్ళ సత్యనారాయణ

స్వాతంత్య్ర సమర యోధుడు,నిష్కళంక దేశభక్తుడు, శ్రీకాకుళం జిల్లాముద్దుబిడ్డ.

జన్మస్థలం: శ్రీకాకుళం జిల్లా లోని నరసన్నపేట తాలుక పిరియా అగ్రహారం వద్ద గోనెపాడు లో ఓ సాధారణ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు.ఈయన ప్రాధమిక విద్య  ప్రియాగ్రహారంలో సాగింది.బందరు, విజయనగరం, రాజమండ్రి నగరాలలో చదువుకుని బి ఏ పట్టా అందుకున్నారు గరిమెళ్ళ.గంజాం జిల్లా కలెక్టర్ గారి వద్ద గుమాస్తాగా పనిచేశారు. తరువాత విజయనగరం జిల్లా ఉన్నత పాఠశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు.
మహాత్మా గాంధీ గారి పిలిపు మేరకు  ప్రజా నిరాకరణోధ్యమం లో పాల్గొన్నారు.
ఈ శతాబ్ధపు జాతీయ గేయ సాహిత్యంలో మేటి తార శ్రీ గరిమెళ్ళ సత్యనారాయణ. భారత దేశ స్వాంతంత్రం కోసం పోరాడారు. బ్రిటీష్ సామ్యవాదానికి వ్యతిరేకంగా అనేక కవితలు వ్రాసి ప్రజా చైతన్యం కలిగించారు. వీరు రచించిన #మకొద్దీ_తెల్లదొరతనము జన హృదయాలను ఆకట్టుకుని ఆంధ్ర నాట ప్రతీ నోటా ఈ గేయం వినిపించింది, ఈ పాట ఆనోటా ఈనోటా చక్కర్లు కొట్టి.. చివరకు ఆనాటి బ్రిటీషు కలెక్టరు బ్రేకన్ చెవినపడింది. ఆయన గరిమెళ్ళను పిలిపించి పూర్తి పాట పాడమనగా.. గరిమెళ్ల అద్భుతంగా పాడారు. బ్రిటిష్ కలెక్టర్ తెలుగు రాకపోయినా.. ‘పాటలో ఎంతట మహత్తర శక్తి ఉంది.. సామాన్య ప్రజల్ని చైతన్యపరుస్తుంది’ అని పేర్కొన్నాడట. అయితే ఈ పాట రాసినందుకు బ్రిటిష్ వారు 1922 లో ఒక ఏడాది కారావాసం శిక్ష వేశారు.దేశభక్తి కవితలు వ్రాసి జైలుశిక్ష అనుభవించిన వారిలో ప్రధముడు గరిమెళ్ళ. .ఆయన ఖారగరం లో ఉన్నప్పుడు వారికి ఐన వారు భార్య, తండ్రి, తాత అందరూ కనుమూసారు. భారతదేశంలో  బ్రిటిష్‌ యువరాజు వెల్స్‌ వచ్చినప్పుడు గరిమెళ్ళ 'ఏమయ్యా యువరాజా ఎందుకొచ్చావు', అంటూ దొరల దోపిడీ పాలనను తీవ్రంగా నిరసించే గేయాన్ని రాశాడు.ఆయనంత ప్రసిద్ధినొందిన జాతీయకవి ఆ రోజుల్లో మరొకరులేరు. తెలుగునాట జాతీయ కవిత్వానికి ఒరవడి పెట్టిన గరిమెళ్ళ సత్యనారాయణ గారు ఓ గొప్ప జాతీయ గేయ కవిసార్వభౌముడు, పాత్రికేయుడు. తన కవితా పటిమతో జన చైతన్యం కలిగించిన నిరుపమాన దేశ భక్తుడునూ. ఆయన గేయాలు బ్రిటీషర్లను బెంబేలెత్తించాయి. ఈ నిరుపమాన దేశ భక్తుడి గేయాల ద్వారా జన హృద్యయాలలో దేశ భక్తి చైతన్యం చేస్తున్నందుకు చెరశాలలో నిర్భందించినా, వీరి గేయాలాపనలు ఏమాత్రం తగ్గించలేక పోయారు. అది ఇంకా రాజుకుందే కాని ఏమాత్రం తగ్గ లేదు.

ఉద్యోగం వదిలేశాక కొంతకాలం ప్రియాగ్రహారంలో గ్రంథాలయ కార్యదర్శిగా పనిచేశాడు.వివిధ పత్రికలకు, ఆలిండియా రేడియోకి రచనలు చేసి కొంత గడిస్తున్నా ఆయన అవసరాలకు ఆ డబ్బు చాలలేదు. చివరి దశలో కడు పేదరికం అనుభవించారు. ఒకవైపు పేదరికం, మరోవైపు అనారోగ్యం ఆయనను బాగా దెబ్బతీశాయి. చివరిదశలో ఒక కన్నుపోయింది. పక్షవాతం వచ్చింది. స్వాతంత్య్రానంతరం మన పాలకుల వల్ల కూడా గరిమెళ్లకు చెప్పుకోదగ్గ సహాయం లభించలేదు.స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా మన పాలకుల వల్ల ఆయనకు ఎలాంటి మేలూ జరగలేదు. స్వాతంత్య్రోద్యమ కాలంలో జనాలను ఉర్రూతలూగించే పాట రాసినందుకైనా ఆయనకు ఎలాంటి ప్రభుత్వ సత్కారాలూ దక్కలేదు.దిక్కులేని పరిస్థితుల్లో కొంతకాలం మద్రాసు వీధుల్లో భిక్షాటన చేస్తూ బ్రతికాడు.ఏ పనీ చేయలేని దయనీయమైన పరిస్థితుల్లో ఆయన యాచనతో రోజులను వెళ్లదీశారంటే, ఆయన పట్ల మన పాలకులు ఏ స్థాయిలో నిర్లక్ష్యం ప్రదర్శించారో అర్థం చేసుకోవచ్చు.చరమ దశలో దుఠ్భర దారిద్య్రాన్ని అనుభవించిన గరిమెళ్ల 1952 డిసెంబర్‌ 18వ తేదీన మద్రాసులో ఆకలిచావుకు గురయ్యాడు. ఆయన అంత్యక్రియలు ఒక అనాధ శవంలా జరిపారు. ఆయన మరణం తర్వాత మేలుకొన్న మన ఘనత వహించిన పాలకులు శ్రీకాకుళంలో ఆయన విగ్రహాన్ని నెలకొల్పి దేశభక్తిని చాటుకున్నారు. 
ఆర్ధిక దారిద్ర్యం ఉద్భవించినా, భావ దారిద్యం లేని గొప్ప వ్యక్త గరిమెళ్ళ సత్యనారాయణ . వీరి రచన "మా కొద్దీ తెల్ల దొరతనం" భారతీయ జన హృదయాలలో చిరకాలం నిలచియుంటుంది.

No comments:

Post a Comment