పున్నమి దిన పత్రిక కోసం .
ఆన్ లైన్ చదువులకోసం , "ఆవును అమ్మి" ,
"సెల్ ఫోన్" కొనిచ్చిన నాన్న .
------------------------------------------------
శీర్శిక-
నాన్న నిర్ణయం.
---------------------
కరోనా సృష్టించిన కలకలం.
గృహ నిర్బంధాల జైలు జీవితం.
లాక్ డౌన్ కారణంగా ముాతపడిన ఆఫీసులు.
గవర్నమెంట్ అదేశాల" ఆన్ లైన్ "చదువులు.
అరకొర జీతాలతో, తీరని, ఆర్ధిక ఇబ్బందులు.
పిల్లల భవిష్యదాలోచనల చింతా వలయాలు.
"కంప్యుాటర్" కొనలేని ఆర్ధిక ఆటంకాలు.
నిద్ర పట్టని రాతృలతో, నీరసించిన శరీరాలు.
ఆలోచనల చీకటి బాటలో అగుపించిన ఆశా కిరణం.
మనిషిగా మనసొప్పని , బాధాపుారిత నిర్ణయం .
"తల్లి గోమాత" ను కొదువ పెట్టిన కన్నీటి క్షణాలు.
"మొబైల్ "రుాపంలో, బదులుగా వచ్చిన అశా కిరణాలు.
పిల్లల కళ్ళల్లో వెల్లివిరిసిన ఆనంద క్షణాలు.
నాన్న కళ్ళల్లో , పిల్లల ఉజ్జ్వల భవిష్యత్త్ -స్వప్నాల
నిశ్చింత కాంతులు.॥
----------------------------------
రచన, శ్రీమతి-
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. (మహరాష్ట్ర )
8097622021
iswarimurthy@gmail.com.
-----------------------------------------
హామీ...
ఈ కవిత ఎక్కడనుా ప్రచురితం కాని నా స్వీయ రచన.
-----------------
No comments:
Post a Comment