భేరీ సాహిత్య వేదిక.
Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/EeQH1KzbZCB1VgIaePAQFh
*నూతన సాహిత్య ప్రక్రియ: సాహిత్య సృజన*
*నియమాలు:*
1. ఇది వచన కవిత.
2. ప్రతి కవిత యందు ఐదు పాదాలుండ వలయును.
3. ప్రతి పాదమునందు నాలుగు పదాలుండ వలయును.
4. 1,3 పాదములందు ఆది, అంత్యప్రాస....2,4 పాదములందు ఆది, అంత్యప్రాస ఉండవలెను.
5. ఐదవ పాదం తప్పనిసరిగా *తెలుగుకు వెలుగు సాహిత్య సృజన* అనే మకుటం ఉండాలి.
6. ఉపమానముంటే మంచిది,తప్పనిసరి కాదు.
7. విషయం ఏదైనా హృద్యంగా రాయాలి.
8. రోజుకి ఐదు కవితలు మాత్రమే రాయాలి.
*కవులకు పురస్కారాలు:*
1. 100 కవితలకు--- సృజన శ్రీ బిరుదు
2. 200 కవితలకు--- సృజన దీప్తి బిరుదు
3. 300 కవితలకు--- సృజన ద్రష్ట బిరుదు
4. 400 కవితలకు--- సృజన శ్రేష్ట బిరుదు
5. 500 కవితలకు--- సృజన రత్న బిరుదు
6. 1000 కవితలకు--- సృజన సామ్రాట్ బిరుదు
*ఉదాహరణ*
1. తెలుగు నందు నవ్య కవులు
అక్షర సేద్యం చేయు చుండె
పొలము నందు రైతు బిడ్డలు
అరక పట్టి దున్ని చుండె
తెలుగుకు వెలుగు సాహిత్య సృజన
2. కలము తోడ కవితలు రాయగ
చక్కనైన సాహిత్య సంపద పండును
హలము తోడ పొలము దున్నగ
నిక్కమైన తిండిగింజలు నిండును
తెలుగుకు వెలుగు సాహిత్య సృజన
*రూపకర్త:*
*జామి సత్యనారాయణ*
*తెలుగు ఉపాధ్యాయుడు*
*లక్కవరపుకోట గ్రామం*
*విజయనగరం జిల్లా*
*నిర్వహణ:*
*శ్రీ భేరీ మధుసూదన్*
*మాధవ నగర్*
*కర్నూల్*
24-07 -2020
శుక్రవారం(శుభం)
********************
ప్రియమైన కవులు/కవయిత్రి లు....
తెలుగుబాషాని ప్రేమిస్తూ
మీకున్న అభిమానాన్ని ప్రపంచానికి చాటించ
ఎన్ని ప్రక్రియలున్నా...అన్నింటిని రాస్తూ.. మీ ప్రతిభాపాటవాలు కనపరుస్తున్న మీకు హృదయ పూర్వక నమస్సులు
💐సాహిత్య సృజన(జామి సత్యనారాయణ)💐
ప్రక్రియలో మీరు రాయవలసిన అంశాలు
******
(1)దైవం
(2)గురువు
(3)తల్లి
(4)తండ్రి
(5)అనాధాలకి చేయూత ప్రభుత్వాల బాధ్యత
(6)వృద్దులు చివరి దశలో ఏమి ఆశిస్తారు?
(7)ఆడది అనాధ ఎందుకు?
(8)భార్య బాధితులుగా ఎందుకు తయారవుతారు?
(9)ప్రభుత్వ పథకాలు ఎలా ఉంటే మేలు?
(10)తెలుగు భాష మసకబారునా...మీరుండగా?
-----భేరి💐సాహితి వేదిక
No comments:
Post a Comment