శీర్షిక .
గుడ్ బై కరోనా........
----------------------
విధ్వంసానికి నిలయమైన విశ్వంలో
మరో వింత మురికి బాంబు.
కాలదు, పేలదు , వాలదు..
గాలిలో ఘొారంగా కలిసిపోయే
" గ్రహ ఘరానా"
అందరినీ అల్లుకుపోయే
విషపు వికారి "కరోనా".
అడ్డు ఆపుా లేని ఆగడాలతో ,
అమానుష అరిష్టాన్ని శ్రుష్టిస్తోంది.
"కరోనా" , పేరుతో కార్చిచ్చు రగిలిస్తుా..
కను రెప్ప పాటులో,జనాలను కబళిస్తోంది.
విగతజీవుల ,వీర విహారి.
మందు లేని ఈ, మహమ్మారి.
దగ్గు, తుమ్ము , జ్వరం దీని పరం.
చేయిా చేయిా కలుపుతే చాలు ."భయం భయం."॥
భయంకర చర్యల ,బహు దుారపు బాటసారి"కరోనా"
"చైనా" లో పుట్టిన దుర్గంధపు దుష్ట కణం , " కరోనా"
ప్రపంచ యాత్రలో , నరులపై దాడితో..
మానవ ప్రపంచంలో చిచ్చు రేపే అలజడి."కరోనా ".
కుళ్ళిన శవాల గుట్టలతో, పై నివాసం....
దుర్గంధపు మ్రుత కణాల తో ఆవాసం.."కరోనా ".॥
చంపడం దీని లక్ష్యం , అన్న మాటకు
ఇప్పటి వినాస విన్యాసాలే సాక్ష్యం.
మానవాళి మనసుల్లో , మట్టికొట్టుకు పోయిన-
ఆచార వ్యవహారాల నిర్లక్ష్యాలకి నిదర్శనం."కరోనా".
పాశ్ఛాత్యపు పోకడలతో, దిగజారిన నైతిక
విలువల నియమొాల్లంఘనల "యమపాశం".కరోనా ".
శ్రుష్టి కార్యాల కంపరపు చర్యల కాలుష్యం "కరోనా".
అసౌచం, అసుచులకు, అర్ధం చెప్పిన" అద్దం , కరోనా".
జాతి, మత, కుల విభేదాల -స్వదేశ-విదేశాల
మారణహోమపు మ్రుత కణం " కరోనా."
చాప క్రింది నీరులా చేరువౌతున్న-
పరదేశపు పాప పంకిలం " కరోనా".
గుట్టలుగా పోగవుతున్న, విగతజీవుల
మ్రుతకణాల ముద్దు బిడ్డ.."కరోనా.."॥
ఇప్పటికైనా కళ్ళు తెరవండి.
మన ఆచార -వ్యవహారాలుా,
సుచి- సుభ్రతలు పాటించండి.
మడి , తడి, శుచి సుభ్రతల వెనుకనున్న
అంతర్గత ఆరోగ్య రక్షణా సుాత్రాలను గమనించండి.
మత భేదాల మారణ హోమాలు, ఆపండి
తల్లి-తండ్రులు , ఆడ బిడ్డల కన్నీటి
శాపాలకు గురి కాకండి.
వింత కోరికల సంయమనాన్ని పాటించండి.
వీధి వంటకాల విలయ తాండవానికి
"స్వస్థి", పలకండి.
"అందరుా బాగుండాలి. అందరిలో మనముండాలి",
అనే ఆలోచనతో మందడుగు వేయండి.
చెప్పండి కరోనాకు..."టా- టా..
ఇక ,సమతా- మమతలే..ఇంటా- బయటా..
--------------------------------------------------------
రచన, శ్రీమతి,
పుల్లాభట్ల..జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.
8097622021.
-------------
No comments:
Post a Comment