పెన్నా రచయితల సంఘం వారి ఆధ్వర్యంలో.
అంశం
స్నేహబంధం
శీర్షిక.
అపుార్వ బంధం.
------------------------
అన్ని బంధాలకుా అతీతమైనది స్నేహం.
కుల మత బేధాలెరుగని ఆత్మానుబంధం.
చిన్న తనపు చిలిపి జ్ఞాపకాలైనా, పెద్దరికపు
బరువు-బాధ్యతలనైనా ,మనసువిప్పి
చెప్పుకోగలిగిన ఏకైక బంధం , స్నేహ బంధం.
కష్టం వస్తే నేనున్నాననే "ధైర్యం" స్నేహం.
సుఖాల బాటలో పుాల "పరిమళం" స్నేహం.
కలిమి - లేములకు "అతీతం " స్నేహం.
నీ-నా తేడాలెరుగని "నిర్మలత్వం "స్నేహం.
కల్లా-కపటం ఎరుగని అనురాగపు".సిరి" స్నేహం.
రెండు అంతరాత్మల "ఆదర్శ బంధం" స్నేహం.
ఎప్పటికీ మారని "మమతల "మల్లెతీగ స్నేహం.
ఒకరి కష్టం,మరొకరికి కంట-నీరు తెప్పించేది స్నేహం .
నీ గౌరవం, "నా గౌరవంగా" తలచేది స్నేహం.
తప్పటడుగుల బాటలో "తట్టి "లేపేది స్నేహం.
అబద్ధాలు-అరోపణల బాట లో "నమ్మకం" స్నేహం.
ఒంటరివైన క్షణం లో "ఒదార్చే హస్తం" స్నేహం.
ఎంత దుారంలో ఉన్నా,దగ్గరి తనపు ఆశ్వాసన స్నేహం.
ఊపిరున్నంతవరకు నీకై నేనంటుా నిలిచే "బాస"- స్నేహం.
-------------------
రచన, శ్రీమతి ,
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. (మహరాష్ట్ర )
8097622021.
-------------------------------
హామీ..
నా ఈ కవిత ఎచటనుా ప్రచురితం కాని-
నా స్వీయ రచన.
-----------------------
No comments:
Post a Comment