కవి మిత్రులందరికీ శుభ సాయంత్రం
నా పేరు గోగులపాటి కృష్ణమోహన్
ఎలాంటి స్వార్థం లేకుండా సమాజంలో కళ్ల ముందు జరుగుతున్న సంఘటనలకు స్పందించి కలాన్ని కదిలించే వారే కవి...
ఏమి ఆశించకుండా రచనలు చేసే కవులకు అప్పుడప్పుడు వచ్చే ప్రశంసలు అభినందనలు కొంత ఉత్తేజాన్ని కలిగిస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
కాకపోతే ఇటీవలికాలంలో పలు సమూహాలుగా ఏర్పడి వాటిలో వాసి కన్నా రాసికే ప్రాధాన్యతనిస్తూ నిర్వహిస్తున్న పోటీలలో కవులు పాల్గొంటూ ప్రశంసలు పొందటంతో పాటు బిరుదులు కూడా పొందటం మనం చూస్తున్నాం.
కాకపోతే వచ్చిన సమస్య ఆ బిరుదులు గతంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించిన కవులు పొందిన బిరుదులు కావడం బాధాకరం...
ఇక ఇచ్చి పుచ్చుకునే వారి అర్హతల గురించి నేను మాట్లాడ దలుచుకోలేదు...
*ఎందుకంటే అర్హతకు కొలమానాలు అంటూ ఏమీ లేవు...*
కాకపోతే పుచ్చుకునే వారు కొద్దిగా ఆలోచించండి...
బిరుదులతో మనకు మనకు పెద్దగా ఒనగూరేది ఏమీ లేదు
ఒక రోజు పత్రికల్లో మన వార్త వస్తుందేమో కానీ మన కన్నా ముందు ఎంతోమంది ప్రతిభావంతులు సాహితీ మూర్తులు ఎలాంటి బిరుదులు లేకుండా కొనసాగుతుండగా... వారి ముందు సాహిత్యంలో ఓనమాలు దిద్దుకున్న మనకు పెద్దపెద్ద బిరుదులు వాడుకోవడం అనేది అలాంటి మహనీయులను అవమానపరిచినట్టే అవుతుంది అని నా భావన
అందుకే సహృదయులైన కవి మిత్రులందరూ ప్రశంసలు అభినందనలు వరకు ఆమోదించి ఇలాంటి బిరుదులను పెద్ద మనసుతో తిరస్కరిస్తూ కొంచెం దూరం పెడితే.. ఇచ్చే వారు కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించే అవకాశం ఉంటుంది.
కవి మిత్రులు అన్యదా భావించకుండా బిరుదుల కోసం పాకులాడకుండా సమాజానికి ఉపయోగపడే చక్కటి కవనాలను అందిస్తూ... బిరుదుల స్వీకరణ పై ఆలోచించి తగు నిర్ణయం తీసుకొని మంచి విలువలతో కూడిన సాహిత్యాన్ని భావితరాలకు అందిస్తారని ఆశిస్తూ
మీ శ్రేయోభిలాషి,
సాహితీ మిత్రుడు
*గోగులపాటి కృష్ణమోహన్*
9700007653
No comments:
Post a Comment