Monday, August 10, 2020

గోదావరీ రచయితల సంఘం లో నా కవిత. శీర్షిక .. చేనేత- మన వరదాత.

రచన, శ్రీమతి,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.  మహారాష్ట్ర.
8097622021.
------------------
శీర్షిక
చేనేత, మన వరదాత.
------------------------------
మన భారత దేశం సంస్కృతి, సద్ధర్మ
సాంప్రదాయాలకు నిలయం.
కట్టు ,బొట్టు ,ఆచార ,వ్యవహారాలకు ఆలయం.
స్త్రీలు కట్టే చీర కట్టు,  నుదుటి బొట్టు...
మన దేశ గౌరవాన్ని ఇనుమడుంప జేసే చిహ్నాలు.
ప్రశస్థ మైన  చేనేతి నుాలు బట్ట, అన్ని కాలాలకుా
 అనువైన రీతిలో ఆదరింపబడే వస్త్ర రాజం.
 అటువంటి అందమైన మగ్గపు చీరల
 చేనేత పరిశ్రమలు నేడు ముాలపడుతున్నాయి.
 పాశ్ఛత్య పోకడల పరుగుల్లో ఆడతనం 
 హద్దులు దాటింది.
 అందమైన చీర కట్టుకు బదులు , అరకొర బట్టల
 ఆనందం అలవాటయ్యింది.
 నుాలు చీరల విలువ కార్ఖానాల్లో ఖైదీ అయిపోయింది.
 పట్టు బట్టల  వాడకం పనికిరాని దయ్యింది.
 చేయి తిరిగిన చేనేత కార్మికుల
  కష్టానికి దక్కని ఫలితం..వారి జీవితాలు
  దుఃఖ భరితం .
  నుాలు వడికే రాట్నాలకు ముాత పడింది.
  పవిత్ర భారత దేశం, స్వాతంత్ర్యం వచ్చిన
  తరువాత కుాడా ,పాశ్ఛత్య వస్తు 
  వ్యామొాహానికి  బందీయై....
  మనదైన సంసృతిని  విస్మరించింది. 
 మహాత్మా గాంధీ కలల సౌధం నేలకుాలింది.
 ఆనాడు పవిత్ర పతాకం మధ్యలో ఉండే 
 రాట్నం గుర్తు.
 ఏనాడో పెకిలించబడి , ధర్మ చక్రాన్ని ప్రతిష్టంచుకుంది.
 ఐతేనేం...ధర్న చక్రం , తిరుగుతునే ఉంటుంది.
 తిరిగి నుాలు రాట్నాల సందడితో , 
 భరతమాత చిరునవ్వులు చిందిస్తుంది.
 చేనేత శ్రామికుల కన్నీరు తుడుస్తుంది.
 ---------------------------------------------------
-చేనేత కార్మిక దినోత్సవం సందర్భంగా...నా
-ఈ కవిత వారికే అంకితం.
--------------------------------------

No comments:

Post a Comment