ఇస్టపదులు.
------------------
రచన , శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర.
8097622021.
----------------------
ఇష్టపది.
శీర్షిక.
శీర్షిక సైనికుడు.
----------------------
దేశమును రక్షింప అహరహము కష్టించి-
ప్రాణముల నర్పించు త్యాగముార్తులు వీరు.||
ఎండ-వానల నిలచి. నిదుత ఆకలి మరచి-
భార్య-పిల్లల. విడచి బహు దుారమేగెదరు ||
శాంతి భద్రత నిలుప సరిహద్దులో నిలచి,
తల్లి భారతి ఋణము తీర్చకొను యోధులు ||
శత్రు-సేనాక్రమణ , తిరుగుబాటుల రణము
ఇరు పక్ష పోరులో ప్రాణాలె అర్పణము ||.
------------------------------------------------------------
శీర్షిక.
స్నేహం.
------------
పిల్లైన పెద్దైన -రాజైన పేదైన.
అందరును కోరేది స్నేహమొకటేకదా ||
కష్టాలె కలచినను కన్నీళ్ళు నిండినను,
తోడుగా నిలిచేది స్నేహమొక్కటె గదా ||
జాతి మతములు లేవు ధనము సాటికి రాదు,
స్నేహమును మించినది లేదు ఇలలో నెపుడు ||
నీడ నిచ్చెడి చెట్టు , అమ్మ ప్రేమకు రెట్టు,
స్వశ్ఛమైన సు హితుడు ఇలను స్నేహితుడొకడు ||
____________________________________________
------------------------------------------------------------------
No comments:
Post a Comment