శీర్షిక.
శ్రీ కృిష్ణ శరణం మమ .
-----------------------------
అసురులను దునుమాడ అమ్మ , దేవకి బ్రోవ
అష్టమీ గర్భాన అవతరించితి వీవు
నందు నింటను పెరిగి , వెన్న మీగడ మరగి
ఆట పాటల దేలు , ఆనంద వరదుడవు ||
శీల, యశోదమ్మ మురిపాలు దీర్చేవు
వేల బ్రహ్మాండముల నోట జుాపేవు.
లీల , ఆడుట కేగి , అసుర ముాకల గుాల్చి
పాలు , వెన్నలు దోచి ,పలు వెతల దీర్చేవు ||
పుాతనాదుల గుాల్చి , పురము బ్రోచిన గ్వాల
గోప బాలుర గాచు , గోవర్దనోద్ధరా
కాళింది మడుగులో కేళి నాట్యములాడి
కాళీయు మద మణచు వేణు గానవిలోల ||
కంసారి ఖలు దమన , పాప సంతరణా
కుబ్జ శాప విమొాచ కరుణ హృదయా భరణ
కుార్మి, కుచేల వర , స్నేహ భావాచరణ..
దుష్ట దమనా , కృష్ణ, శిష్ట పరిపాల ఘన ||
బాల రుపీ గ్వాల, నంద గోకుల బాల
మాదు మురిపెము దీర్చు ,ముద్దు గోపాలా
జన్మాష్టమీ వేడ్క, జేయ బుానితిమయ్య
చిన్ని పదముల తోడ, చిందులేయుచు రార ||
--------------------------------------------------------
రచన, శ్రీమతి
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహరాష్ట్ర.
8097622021
iswarimurthy@gmail.com
-----------------------------------------
హామీ....
ఈ కవిత ఏ మాధ్యమునందుా ప్రచురితం కాని నా స్వీయ రచన.
-------------------
No comments:
Post a Comment