25/9/2020.
రచన శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్, మహారాష్ట్ర .
8097622021.
iswarimurthy@gmail.com
శీర్షిక
భుా సితార.
----------------
ఒక భుా సితార మింటి కెగసింది.
వసంతం తన దారి మరిచింది.
రాగాల కోయిల , శృతి తప్పింది.
మేరు గిరి హృదయం గతి తప్పింది.॥
ప్రకృతి పడతి అడుగు తడబడింది.
సంద్రం కన్నీరై పొంగింది.
భువినొక మధుర గానం ముాగబోయింది.
దివి నుండి భువి కేతెంచిన గాన గంధర్వుడు.
తన వారి చెంతకు తిరిగి వెళ్ళేడు.॥
తన ప్రతిభా సంపదంతా మనకు వదలి.
మరచిపోలేని మధుర గాన సుధలు పంచి,
కీర్తి శిఖరాగ్రాల నేలే కేతనాన్ని ఎగురవేసి..
మనందరినీ వదిలి మరో లోకానికి..॥
నవరసాలు పలికించే తన గళ మాధుర్యంతో
గాంధర్వ లోకాన్ని జయించడానికి...
దేవ గణాదులను మైమరపించడానికి..
గానామృతాన్ని పంచడానికి...॥
పండితారాద్యుల గాన గాంధర్వుడు...
ఆనంద లోకాలకు అక్షర
సుమ సుగంధ రధాన్నెక్కి
పయనమయ్యేడు పరలోకాలకు
మనల్ని వదలి పోతున్న ఆతని
కిదే నా అక్షరాశృ నివాళి. ॥
---------------------------------------------------
No comments:
Post a Comment