అక్షరం కవిత .
గోదావరి రచయితల సంఘం కోసం రాసినది. (వాట్సప్).
8/9/2020
శీర్షిక .
అక్షరాలు ఆత్మబంధువులు.
---------------------------------------
అక్షరాలు ఆత్మ బంధువులు.
పురానేతిహాసాల చరిత్రలకు సాక్షి పత్రాలు
మన సాహిత్య సంపదల పుాల సరాలు.
మన భాషా సంస్కృతులకు పుట్టినిల్లు.
మనం మాట్లాడే మాటలకు మంత్రాలు అక్షరాలు.
అక్షరాల అభ్యాసనతో ఆకాసాన్నందుకోగలవు.
ఆక్షరాల తీపి పొందికతో, మాటలల్లి
హృదయాలు చుారగొనగలవు.
అవే అక్షరాలతో హాలాహలం సృష్టించగలవు.
అక్షరాస్యతతో జ్ఞానభండారానికి చేరువౌతావు.
ఉజ్జ్వల భవిష్యత్తుకు పునాదులు అక్షరాలు.
నిరక్షరాస్యత జీవితానికి ఒక శాపం.
అక్షరాలు అవనిలో జ్ఞానులిచ్చిన అమృత భాండాలు.
ఇల అవి అన్నిటికీ మించిన నిధి -నిక్షేపాలు .
---------------------------------------------------------------
రచన, శ్రీమతి.
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
హైదరాబాదు .తెలంగాణ .
8097622021.
---------------------
.
హామీ...
ఈ ," అక్షరాలు ఆత్మబంధువులు" అనే కవిత,
ఏ మాధ్యమునందుా ప్రచురితం కాని-
నా స్వీయ రచన.
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
హామీ...
ఈ కవిత,
ఏ మాధ్యమునందుా ప్రచురితం కాని-
నా స్వీయ రచన.
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
No comments:
Post a Comment