27/9/2020.
రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .
8097622021
----------------------
శీర్షిక .
మా రాయలసీమ మాట-
సంగీత -సాహిత్య బాట.
-------------------------------
పల్లవి:
----------
అష్ట దిగ్గజాల వెలుగు కృష్ణ దేవరాయ లేలు
మా రాయల సీమిదీ ఘన సంస్కృతి మాది॥
అను పల్లవి:
-----------------
అల్లసాని పెద్దన, కందుకుారి , నంది తిమ్మన
రుద్ర కవి, ధుర్జటి , సాహిత్య ఘనుల పురమిది॥
॥ అష్ట దిగ్గజాల॥
1.చరణం:
---------------
ఒంటి మిట్ట లో జనిన పోతనా మాత్యుడుా
భాగవతము రచియించిన భాగవోత్తముడుా
యొాగి వేమన్న రచన, బ్రహ్మం గారి రచనలుా
మా వరం, పుర బలం , సీమ చరితయే ఘనం ॥
॥ అష్ట దిగ్గజాల॥
2.చరణం.:
---------------
శ్రీశైలం , కాళహస్తి , యాగంటి మహానంది-
లేపాక్షి , మంత్రాలయ , నారసింహహోబలం-
భక్తి నిండు ఆలయాల వేద మంత్ర పెన్నిధి
నిండియున్న పురమిదీ మా రాయలసీమిదీ..
॥ అష్ట దిగ్గజాల॥
3.చరణం:
---------------
కాకర శ్రీ త్యాగరాజు , తాళ్ళపాక అన్నమయ్య
తరిగొండ వెంగమాంబ , రాళ్ళపల్లనంత క్రిష్ణ -
ఆదిగ గల , సాహిత్య -సంగీతకారు లేలినదీ
సత్య -ధర్మాల నెలవు , మా రాయలసీమిదీ.॥
॥ అష్ట దిగ్గజాల॥
4. చరణం.
-----------------
బళ్ళారి రాఘవులుా రామకృష్ణాచార్యులు
ఆధ్యాత్మిక గురువులుా తత్త్వ జ్ఞాన వేత్తలుా
రంగస్థల ప్రముఖులా రసము లేలు తళుకులా
విశ్వ జ్ఞాన భాండమై విలసిల్లిన సీమిదీ
మా రాయల సీమిదీ.... ॥ అష్ట దిగ్గజాల॥
----------------------------------------------------------
No comments:
Post a Comment