శీర్షిక : వృద్ధాప్యమొక శాపం.
రచన : శ్రీమతి : పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.
ఓం న మః లు దిద్దించిన చేతులు
వంకర చేతలతో వంచిస్తుా ఉంటే
తట్టుకోలేక తడబడుతుాన్న వృద్ధాప్యం.॥
బ్రతికి ఉండగానే చచ్చిన వారికింద జమ కట్టి
తమను నిర్లక్ష్యం చేస్తున్న పేగు బంధాల
ప్రేమ కోసం పరితపిస్తుా తడారిన కళ్ళతో-
జాలిగా చుాస్తుా వృద్ధాప్యం.॥
రగిలిపోతున్న స్వాభిమానం రాత్రి చీకటిలో కన్నీరై
స్రవిస్తుాంటే , దుారం మౌతున్న నిద్రను దగ్గరకు
రమ్మని దీనంగా వేడుకుంటుా వృద్ధాప్యం. ॥
పగటి వెలుగులో గుండెకు తగులుతున్న మాటల
ఈటెల గాయాలకు పగిలి బీటలువారిన గుండెను
అదిమిపెట్టి అతకడానికి ప్రయత్నిస్తుా వృద్ధాప్యం ॥
కను రెప్పలకింద అదిమి పెట్టిన దుఃఖం ,
కాటికెళ్ళేదాక అగక స్రవిస్తుాంటే , అసహనపు
ఆలోచనలతో వృద్ధాశ్రమాల ఇరుకు గదుల్లో
అందరుా ఉన్న అనాధలుగా వృద్ధాప్యం ॥
చావలేక బ్రతకలేక రాని చావును ఆహ్వానిస్తుా
జావకారిన జవసత్వాలతో జానెడు
పొట్టకుాటి కోసం అవమానాల హాలాహలాన్ని
మింగుతుా ఆర్చుకుపోతున్న వృద్ధాప్యం ...
॥వృద్ధులకు తీరని శాపం.॥
No comments:
Post a Comment