9/12/2020.
అంశం: యుద్ధం.
శీర్షిక : ఆడతనం.
అమ్మ కడుపులో నుండే ఆడపిల్లనని
తెలియగానే ఛీత్కార ఛీదరింపులను
విదిలించుకొనే యుద్ధం.
ఆడ పిల్లనంటుా అణచి వేతలకు గురైన అత్మ క్షోభతో
స్వతంత్రత కోసం ఆలోచనలతో యుద్ధం.
ఎప్పుడు ఎవరుఏమంటారో అని భయంతో ధైర్యాన్ని కుాడగొట్టుకునేందుకు మనసుతో యుద్ధం.
పెద్దవుతున్న కొలదీ ఆడతనపు ఆత్మ రక్షణకై యుద్ధం.
వయసు తెచ్చిన ఆడతనపు శారీరపు మార్పులను
కాముకుల కుృార దృష్టి నుండి తప్పించుకుంటుా
అనుకున్న గమ్యానికి చేరుకోడానికి
ఆత్మస్థైర్యం పెంచుకునేందుకు అంతరాత్మతో యుద్ధం.
పెళ్ళయ్యాక అత్తింటి వాతావరణానికి
అలవాటు పడుతుా,లోక మర్యాద కోసం చిరునవ్వుతో చేసే జీవితాంత యుద్ధం..
ఇలా ఆడపిల్లగా తనకిష్టం లేని ఎన్నో
పద్ధతులను తనవిగా చేసుకుంటుా అన్నింటికీ
సద్దుకు పోవడానికి నిరంతరం చేసే పోరాటపు
యుద్ధంలో ప్రతీక్షణం ఓడపోతుా ఎదుటివారిని
గెలిపిస్తుా చిరునవ్వుతో చివరి శ్వాశ దాకా
తనను తాను బైట పెట్టుకోలేని అశక్తతతో ,
చంపుకోలేని తీరని ఆశల తో అనుక్షణం చేసే యుద్ధం.
అసలు ఆడతనమే నేటి సమాజంలో స్వతంత్రం గాని
సమాన హక్కులు గాని లేని ఆరని కన్నీటి యుద్ధం.॥
(ఈ యుద్ధంలో ఆడపిల్లది తప్ప అందరిదీ గెలుపే..
అనుకుంటున్న వారంతా...
తానోడిపోతుా అందర్నీ గెలిపిస్తున్న ఆడతనపు
విలువని ఈ సమాజం ఎన్నాళ్ళకు గుర్తిస్తుందో ॥)
రచన : శ్రీమతి : జగదిుశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.
హామీ; ఈ కవిత ఏ మాధ్యమునందుా ప్రచురితం కాని నా స్వీయ రచన.
No comments:
Post a Comment