Wednesday, February 17, 2021

వసంతపంచమి....

సరిగ్గా 302 సంవత్సరాల క్రితం నేటి వసంత పంచమి రోజున 14 సంవత్సరాల ముక్కుపచ్చలారని ముద్దుబిడ్డడు "వీర హకీకత్ రాయ్ బలిదానమైన రోజు".
            1719వ  సంవత్సరంలో జన్మించిన హకీకత్ రాయ్ ఫారసీ భాష మాధ్యమంగా చదువుకోడానికి స్థానిక మదర్సా వెళ్తుండేవాడు. మదర్సాలో చదువుకుంటున్న మొత్తం విద్యార్థులలో ఇతడే అత్యుత్తమ విద్యార్థి అయినందున అతనితోపాటు చదివే ముస్లిం విద్యార్థులు ఈర్ష్యాసూయలతో రగిలి పోతూ ఉండేవారు.
            ఒకరోజు ముస్లిం విద్యార్థులందరూ కలిసి  బాలుడైన హకీకత్ రాయ్  దగ్గరికి వచ్చి భవాని మాత గురించి ఆపశబ్దం పలికారు, అవమానిస్తూ హేళన చేశారు. దానికి జవాబుగా మీరిలా భవానీమాతను అవమానించడం సబబు కాదని, ఒకవేళ నేనే ఈ విధంగా బి బి ఫాతిమా గురించి మాట్లాడితే మీకేమనిపిస్తుంది అంటూ ప్రశ్నించాడు.

        ఈ మాటతో మరింత రెచ్చిపోయిన ముస్లిం విద్యార్థులు విషయాన్ని చిలువలు పలవలు చేసి బీబీ ఫాతిమాను అవమానిస్తూ మాట్లాడినాడనీ ప్రచారం చేయసాగారు. ఈ విషయం పాఠశాలను నడిపే మౌల్వీ దగ్గరికి వెళ్ళింది అతడు స్థానిక 'ఖాజీ' దగ్గరికి విషయాన్ని చేరవేశాడు. ఇంకేం రాజస్థాన్లో ముస్లిం శాసనం నడుస్తున్న ఆ సమయంలో.., విషయం మతం రంగు పులుముకున్నది, చివరికి 14 సంవత్సరాల బాలుడు హకీకత్ రాయ్ ను విచారణకై పిలిపించి నీవు తప్పు చేశావని దీనికి శిక్షగా ఇస్లాంను స్వీకరించాలనీ హుకుం జారీ చేశారు. హుకుంను అనుసరించి ధర్మ పరివర్తన చెంది ముస్లింగా మారడానికి అంగీకరించలేదు, దానితో అతనికి అనేక విధాలుగా నచ్చ చెబుతూ ప్రలోభం కూడా చూపినప్పటికీ  ససేమిరా అన్నాడు.

   అతని ధర్మనిష్ఠ చూసి మతం మారలేదని ఆగ్రహోదగ్రుడై న ఖాజీ శిరచ్ఛేదనానికి ఆజ్ఞ ఇచ్చాడు.

     సరిగ్గా 302 సంవత్సరాల క్రితం 1734 వ సంవత్సరం వసంత పంచమి రోజు ధర్మంకోసం ప్రాణం ఇవ్వడానికి సైతం వెనుకకు జంకని, మడమతిప్పని వీరుడు హకీకత్ రాయ్ యొక్క శిరచ్ఛేదం చేశారు.      

        చిన్నతనంలోనే వివాహమైన కారణంగా అతని చిన్నారి పత్ని  లక్ష్మి సైతం హకీకత్ రాయ్  తో పాటు చితిమంటల్లోనే కూర్చుండి నేటి వసంత పంచమి రోజున తల్లి స్వరూపమైన సరస్వతీదేవి జన్మించిన రోజున బలిదానం అయిపోయింది.

      ఇలా ధర్మ రక్షణ కోసం ప్రాణాలిచ్చిన "వీరహకీకత్ రాయ్ అతని భార్య వీరబాల లక్ష్మీబాయి"  యొక్క అమర గాధను కూడా ఈరోజు స్మరణకు తెచ్చుకోవాలి.    
                           🙏 🙏 🙏

No comments:

Post a Comment