వారం వారం కవిత లో...
అంశం : దోపిడీ.
శీర్షిక : నిలువు దోపిడీ.
కాల గమనంలో మారుతున్న
మనుషుల అంతరంగాల
మానసిక బలహీనతల దోపిడీ ॥
వివేకం కోల్పోతున్న యువతను
పెడబారి పట్టించి భావి భారత
భవితను దోచుకుంటున్న
డ్రగ్ మాఫియాకోరుల దోపిడీ ॥
కల్తీ బాసల తో నోట్లకు ఓట్ల కొనుగోలునీ
కల్తీ విక్రయాలతో జనాల నమ్మకాన్ని
సొమ్ము చేసుకుంటున్న సత్తా , --
తొత్తుల సాధింపుల దోపిడీ॥
వావి వరుసలు మరచిన
కామాంధుల వికృతి చేష్టలకు
పసి నుండి ముసలి వరకు గల
అబలల మాన-ధన దోపిడీ..॥
లేని రోగాన్ని ఆపాదించి
వైద్యం పేరుతో అంగాంగాలను
అమ్ముకుంటున్న వక్ర ఆలోచనగల
వైద్య దేవుళ్ళ దోపిడీ ॥
కరోనా కాటుకు ఊపిరందక...
ఆక్సిజన్ కరువై అంతమౌతున్న
జనాల చితిమంటలకు వెలకట్టి
విస్తృతంగా దోచుకుంటున్న
కార్చిచ్చు రేపిన కన్నీటి దోపిడీ ॥
అధికార బలంతో న్యాయానికి
రెక్కలు విరిచి సామాన్యుల
బ్రతుకు భారాన్ని పెంచిన
చచ్చు రాజకీయాల చిచ్చు
వేటల నిలువు దోపిడీ ॥
-----------------------------
రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.(మహరాష్ట్ర )
08097622021.
---------------.
హామీ : నా ఈకవిత ఏ మాధ్యమునుండీ
ప్రచురితం కాని నా స్వీయ రచన.
No comments:
Post a Comment