Wednesday, May 5, 2021

రవీంద్రనాథ్ ఠాగూర్

తెలుగు భారత ఎస్.వి ఫౌండేషన్  జనదీపిక  ఆద్వర్యం లో..
అంశం : రవీంద్రనాధ్ ఠాగూర్ .
శీర్షిక : జాతీయ గీత కర్త.

రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.

 ప్రక్రియ : ఆటవెలది పద్యాలు.

రచన లెన్నొ చేసి  రంజింప జేసేటి
సార సద్గు ణాల సత్య వాది
ఘనపు కీర్తి నిడెను కావ్య గీతాంజలి
నోబులు బహుమతిని  ఒసగి రంత॥

మాన వత్వ మున్న మంచి మనిషితడు.
కావ్య రచన జేయు  కళల ప్రియుడు
పద్య, వ్యాస రచన బహుప్రీతిగాజేయు
కవివ రేణ్యు డితడు ఘను డతండు ॥

విశ్వ భారతనెడు విశ్వవిద్యాలయం
స్థాప నతడు జేసె స్థాన కళకు
సర్వ మతము లన్ని ససమాన మనిచాటు
 శ్రీని  కేత నమ్ము  సర్వులకును ॥

ఉత్త మంబు లైన  ఉచ్ఛ సందేశముల
 "గోర" నామ రచన కోరి జేసె.॥
 నాటకంబు లెన్నొ నవలలింకెన్నియొా
 రాసినట్టి ఘనుడు రవిగ వెలిగె ॥
 
 జనగణమన గీతి  జాతీయమాయెను.
 జనులు మెచ్చ నొందె  జగతి కీర్తి.
 అతని కీర్తు లెల్ల అవనిలో ఘనములు 
 ఘన రవీంద్రు డితడు గవుర వుండు ॥


హామీ :
ఈ ఆటవెలది పద్యములు ఏ మాధ్యమునందునుా 
ప్రచురుతములు కాని నా స్వీయ రచనలు.

No comments:

Post a Comment