Thursday, June 10, 2021

కొత్త పద్య ప్రక్రియ : పద్య చంద్రిక

* ఉషోదయ సాహితీ వేదిక
చిత్తూరు జిల్లా భాకరాపేట వారు రూపొందించిన నూతన పద్య ప్రక్రియ పద్యచంద్రిక*
       *************

*పద్యచంద్రిక*

*ఇది పద్యప్రక్రియ ఇందులో 4 పాదాలు ఉండును*

*ప్రతి పాదములో 6 గణాలు ఉంటాయి*

*ప్రతి పాదములో మూడవ గణము యొక్క మొదటి అక్షరముకు యతిస్థానము కలదు*

*నాలుగు పాదాల్లో  ప్రాసనియమoను గలదు*

*ప్రతి పాదములో 1 3 5 స్థానాల్లో మూడు మాత్రలను కలిగి ఉండును*

*2 4 6 గణములులో  ఆరు మాత్రలు వచ్చేలా రాయాలి*

*పద్యచంద్రిక*

1. వినుము నామొరలను వేంక టేశ్వరుడా నన్ను కరుణించుము

కనుము బాధలనో కంట తిరుమలగిరి వాస శరణుశరణు

అనుది నముదలతును అచ్యు తాముకుంద చక్రి ప్రణతులిడుదు

జనులు నిత్యమునిను చక్క గాగొలుతురు శౌరి కాపాడుము!!

2.పసిడి నవ్వులుతో
 పరవశమొనరించి నన్ను మురిపించుము

కసిగ మాటలతో కంట
 తడినేపెట్టినా శుభముకాదు

 వసియె వాడిపోవు వసుధ లోనప్రగతి నిజముతెలుసుకోను

మసియె బారిపోక మలుచు యువతబతుకు ఇలన గురువుగాను


 3.శుభము లనివ్వగా సోమ శేఖరహర నతులు గొనరండూ

యభయ మందించర నాది శంకరభువి యనఘ భవానీశ

విభవ సారహరే విరుల పూజ లందు శివా నమామ్యహమ్

శుభము గూర్చుమురా శూలి పరమేశ్వర జనుల కీవెప్పుడూ.

*పద్యచంద్రిక బిరుదులు
*పద్య చంద్రిక కిరీటి* 
1️⃣0️⃣0️⃣
*పద్యచంద్రిక మయూరి* 

2️⃣0️⃣0️⃣

*పద్యచంద్రిక సమ్రాట్*

3️⃣0️⃣0️⃣




*పద్యచంద్రిక రూపకర్త*
*ధనాశి ఉషారాణి*
  చిత్తూరు జిల్లా
    భాకరాపేట

*పద్యచంద్రిక పర్యవేక్షకులు*
*శ్రీ మట్టా సూర్యనారాయణ గారు*

No comments:

Post a Comment