Thursday, June 10, 2021

నిలువు దోపిడీ

[8/30/2020, 16:01] p3860749: ఇష్టపది ప్రక్రియలో
------------------------
 అంశం = ధాతృత్వం.
 శీర్షిక.
కనిపించిన కరుణరసం.
------------------------------
  కోవిడ్ బాధితులదె       కోసుల దుార  పయనం
  కొరత పడ్డ పనులతో    కొర్రు శిలువ జీవితం.॥
  
  కష్టాలు కన్నీళ్ళు            కావిడుల మొాతలు
  కడుపు నింప లేనట్టి      కన్న తల్లి ఘోషలు ॥ 
  
చంక   చంటి పాపలు         చద్దికుాడు పాటులు
చావు భయపు బాటలు      చావని బతుకాశలు॥

చెప్పుల్లేని కాళ్లు                చేర లేని దుారము
నడక దారి పయనము     నటన లేని కథనము॥

 ఆకలి చావుల కదె        అల్ల లాడె పేదలు
 ఎండకు తాళలేక          ఏడ్చు వేల జనాలు ॥   

కమ్ము  చీకటిలోన            కనిపించిన దీపము
ఇక్కటులను బాపిన         ఇల దేవుని రుాపము ,

పేరు "సోనుా సుాద్ "       పేదవారికి  ధనము.
మది మేలు దృక్పథం    మరువని ధాతృత్వం॥

అన్నార్తుల కన్నము    అందించిన దైవము.
కాలి నడక బడుగుల    కాచి ,ఇచ్చె అభయము॥ 

బస్సు, బండ్ల దారిని    బాధితులను  పంపెను
భారమని ఎంచకను   బాధ తీర్చి  మురిసెను॥
------------------------------------------------------------

రచన, శ్రీమతి-
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ మహారాష్ట్ర .
8098622021
------------------
[9/7/2020, 08:37] p3860749: రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .
8097622021.

శీర్షిక .
మెట్టినిల్లు.
---------------
పుట్టిన దగ్గరనుండి పెరిగీ పెద్దయ్యే వరకు
అమ్మా నాన్నల  ప్రేమ, అనురాగాల మధ్య
ఎంతో  ముద్దుగా పెరుగుతుంది ఆడపిల్ల..
ఆడిందే ఆట , పాడిందే పాటగా పెరిగిన- 
తనను , ఎవరో తెలియని మరొక కొత్త కుటుంబంతో  సంబంధాన్ని కలుపుకొని , ఒక కొత్త వ్యక్తితో
వివాహ బంధం పేరుతో ముాడు ముళ్ళుా వేయించి, ఇతనే నీభర్త, ఇకనుంచీ వీరే నీ కుటుంబం -
అని చెప్పి,  వారి వెంట వెళ్ళమన్నపుడు , 
ఆ అపరిచిత వ్యక్తుల తో ,  ఆనందంగా వారివెంట వారింటికి వెళుతున్న ,  ఒక ఆడపిల్లకు , అత్యంత "నమ్మకం" , వారంతా ఇక నుంచి తనవారని.
తనను తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా ప్రేమిస్తారని,
భర్తగా అతని అనురాగంలో ఆనంద డోలిక -
లుాగుతానని. 
ఆ "నమ్మకం"తోనే,  పేగు బంధాన్ని  తెంచుకొని ,
రక్త సంబంధాలకు దుారమై ,
ఎప్పుడుా ఎరగని వారిమధ్యకు-
తన జీవిత చివరి దశ వరకు, తనను తాను 
అర్పించుకునేందుకు ఆనందంగా ఏడడుగులు వేసి
అత్తింటికి చేరుతుంది ఒక ఆడపిల్ల .
ఆ "నమ్మకం"తోనే , పుట్టెడు బాధ్యతలను తనపై వేసుకుంటుంది.  ఆ ఇంటి వారసత్వానికి
ఆది ముాలమౌతుంది. 
ఆ ఇల్లే తన ఇల్లనే "నమ్మకం" తో
ఆ ఇంటిని స్వర్గంలా తీర్చి దిద్దే ప్రయత్నంలో,
కష్ట- నష్టాలను ఓర్చుకుంటుా , ఆ కష్టం లోనే -
తన ఆనందాన్ని వెతుక్కుంటుా కొవ్వొత్తిలా--- కరిగిపోతుంది . 
--------------------------------------------------
[9/8/2020, 15:01] p3860749: రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .
8097622021.

శీర్షిక .
మెట్టినిల్లు.
---------------
పుట్టిన దగ్గరనుండి పెరిగీ పెద్దయ్యే వరకు
అమ్మా నాన్నల  ప్రేమ, అనురాగాల మధ్య
ఎంతో  ముద్దుగా పెరుగుతుంది ఆడపిల్ల..
ఆడిందే ఆట , పాడిందే పాటగా పెరిగిన- 
తనను , ఎవరో తెలియని మరొక కొత్త కుటుంబంతో  సంబంధాన్ని కలుపుకొని , ఒక కొత్త వ్యక్తితో
వివాహ బంధం పేరుతో ముాడు ముళ్ళుా వేయించి, ఇతనే నీభర్త, ఇకనుంచీ వీరే నీ కుటుంబం -
అని చెప్పి,  వారి వెంట వెళ్ళమన్నపుడు , 
ఆ అపరిచిత వ్యక్తుల తో ,  ఆనందంగా వారివెంట వారింటికి వెళుతున్న ,  ఒక ఆడపిల్లకు , అత్యంత "నమ్మకం" , వారంతా ఇక నుంచి తనవారని.
తనను తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా ప్రేమిస్తారని,
భర్తగా అతని అనురాగంలో ఆనంద డోలిక -
లుాగుతానని. 
ఆ "నమ్మకం"తోనే,  పేగు బంధాన్ని  తెంచుకొని ,
రక్త సంబంధాలకు దుారమై ,
ఎప్పుడుా ఎరగని వారిమధ్యకు-
తన జీవిత చివరి దశ వరకు, తనను తాను 
అర్పించుకునేందుకు ఆనందంగా ఏడడుగులు వేసి
అత్తింటికి చేరుతుంది ఒక ఆడపిల్ల .
ఆ "నమ్మకం"తోనే , పుట్టెడు బాధ్యతలను తనపై వేసుకుంటుంది.  ఆ ఇంటి వారసత్వానికి
ఆది ముాలమౌతుంది. 
ఆ ఇల్లే తన ఇల్లనే "నమ్మకం" తో
ఆ ఇంటిని స్వర్గంలా తీర్చి దిద్దే ప్రయత్నంలో,
కష్ట- నష్టాలను ఓర్చుకుంటుా , ఆ కష్టం లోనే -
తన ఆనందాన్ని వెతుక్కుంటుా కొవ్వొత్తిలా--- కరిగిపోతుంది . 
--------------------------------------------------
[9/16/2020, 12:49] p3860749: 15/10/2020.
అంశం
మానవత్వం.
-----------------

శీర్షిక.
"మరుగుజ్జు"
-----------------
రచన, శ్రీమతి , 
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ . మహారాష్ట్ర .
8097622021
---------------------
అసహనంతో అటుా ఇటుా తిరుగుతున్నాను.
ఇంకా పనిలోకిరాని ఆదెమ్మను ఆడిపోసుకుంటుా..॥
అరగంట  లేటుగా ,  ఆదెమ్మ అలసటతో
జ్వరంలో ఉన్న చంటిదాని మీద నున్న బెంగతో॥
 చంటిదాన్ని గుడ్డ పరచి వేసింది నేలపై 
అడిగింది  పది రుాకలు చంటిదాని  మందుకై॥
నాగాల లక్కల్లో  నయాపైస రాదంటుా  
కసుర్ల విసుర్ల తొనాదెమ్మను, తరిమేసా పొమ్మంటుా॥
కవి  సమ్మేళన సన్మానం, లేటయ్యిందనుకుంటుా
మనవత్త్వం పై భాషణ చెప్పాలిగ  అనుకుంటుా॥
అద్ధ ముందు నిల్చున్నా అలంకరణ కోసమై
అద్ధం లో నా రుాపమె అగుపించె వికారమై॥
అదిరి పడ్డ నా ముందు ,ఆదెమ్మే అందమై
ఎదిగిపోయె కనుల ముందె మానవత్త్వ శిఖరమై॥ 
అనాధ పిల్ల పై పుట్టెడు మమకారం నింపుకొని
ఖర్చు కై వెనుకాడని ,మమతలనే పంచుకొని ॥
కుాడు- గుడ్డ లేకున్న ,నిండు మనసు  అదెమ్మది
పాచి పనుల జీతంలో , కొట్టి వేత లెక్క నాది॥
పెంచుకున్న చంటి బిడ్డ నెత్తుకున్న ఘనతామెది
పది రుాకలు ఇవ్వలేని హీన మైన మనసు నాది॥
చెప్పకనే చుాపించెను మానవత్వం విలువేమిటొ  
కరగె నాలో కఠినత్త్వము కంటి  నీటి ధారలతో .॥.
మరుగుజ్జై నిలచి నాను అమె ముందు తలవాల్చి
భాషణలకె పరిమితమౌ మాట లేటి కని తలచి॥. 
"మీడియాల మొాజు లేలు,మాటలనే వీడమని
మనసుంటే ఇంటి నున్న పనివారికి సాయపడని --"॥
మనసు చెప్పి నట్టి మాట నాటుకుంది నా మదిలో  
మేలుకుంది  మరోమనిషి మానవత్వ రుాపముతో॥
చేతికందు రుాక లన్ని  సంచిలోన  వేసి నేను
ఆదెమ్మ ఇంటి వేపు కడుగు లేసి కదలినాను॥ .
చెప్ప లేని ఆనందం చేరువైన సంతోషం
శాంతి నిండు మనసిపుడొక  ఆశయాల విహంగం.॥
-------------------------------------------------------------


హామీ...
శీర్షిక.
"మరుగుజ్జు"
 .అనే  ఈ కవిత,
 ఏ మాధ్యమునందుా ప్రచురితం కాని-
నా స్వీయ రచన.
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
[11/2/2020, 15:19] p3860749: వారం వారం కవిత.
2/10/2020.
 అంశం:  విశ్వాసం.
రచన: శ్రీమతి: జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .
శీర్షిక : నమ్మకం.

ప్రపంచం అంతా "విశ్వాసం" అనే 
బాటలో నమ్మకంతో నడుస్తోంది.
పిల్లలకు విశ్వాసం. కుటుంబం పై,
తల్లిదండ్రుల పెంపకం లో, ఇల్లనే 
నాలుగు  గోడల మధ్య ఎక్కడా లేని 
రక్షణ వారి దగ్గర తమకు ఉంటుందని ॥
 బడి,గుడి లాంటిదని. జ్ఞాన మిచ్చేగురువు-
 భగవత్సరుాపుడని తలిదండృలకు విశ్వాసం॥
తమ భావి జీవిత మార్గదర్శి ఆతనేనని 
పిల్లకు తమ గురువు మాట పై విశ్వాసం.
తెలీని ఆగంతకునితో వివాహం జరిగిన
స్త్రీ కి ఆతనిపై విశ్వాసం. తన జీవిత 
రక్షకుడు , పోషకుడు అతనేనని.॥
వృద్ధులకు పిల్లలపై విశ్వాసం.తడబడు తమ అడుగులకు తాము పెంచిన పిల్లలు , 
తమకు చేయుాతను తప్పక అందిస్తారని ॥
 యావత్ భారతావనికి తమ 
 నాయకుని పై అమితమైన విశ్వాసం.
తాము ఓటు వేసి గెలిపించేవాడు , 
తమ  సాధక బాధలను గుర్తించి 
తప్పక మేలు చేస్తాడని. తమ 
బతుకులు  తప్పక బాగుపడతాయని ॥
------------------------------------------------
[11/18/2020, 19:56] p3860749: వారం వారం కవిత కు...
18/11/2020.
రచన , శ్రీమతి , 
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .( మహరాష్ట్ర ).
శీర్షిక .
బ్రతుకు పోరాటం.
--------------------------

ఎప్పటికైనా చావు తప్పదని తెలుసు.
తెలీని పాశం ,  ఏదో రుాపంలో వచ్చి
తెలియ కుండానే , ఏదో లోకాల్లోకి
తీసుకుపోతుందనీ తెలుసు.
వయసు "లెక్కలు" చుాపుతుాన్నా  
ఆకాశానికి నిచ్చెన లేస్తున్న
మనసు "రెక్కల్ని "అదుపులోకి తేలేకా,
మనసు పడే వ్యధకు ,మధించిపోతున్న
 భావాలు , అల్లకల్లోలమై అంతరంగంలో
 అలజడిరేపుతున్నాయి.
 నేడో , రేపో , తెలియని జీవితం ,
 "భయం జైలు" లో మగ్గుతుా-
 కనపడని మృత్యువుకు 
 తాను మాత్రం  కనపడకుాడదనీ..
 తన ఆనవాళ్ళను , తానే
 దాచే ప్రయత్నం చేస్తుా,
 ముక్కు, ముాతులను "మాస్క్" 
 చాటున దాచిపెడుతుా...
 మృత్యువును మభ్యపెడుతోంది.
  తనను తాను ,దాచుకునే
 ప్రయత్నంగా, తన "ఉనికిని "తానే-
 నాలుగు గోడల మధ్య బందీ చేసి,
 బిక్కు బిక్కు మంటుాన్న-
 బతుకు పోరాటంలో--
"గెలవడానికి " తనకు తానే 
"గృహ నిర్బంధ సంకెళ్ళు " 
వేసుకుంటుా , రోజులు 
      వెళ్ళదీస్తున్నాది.
[12/10/2020, 00:24] p3860749: 9/12/2020.
అంశం: యుద్ధం.
శీర్షిక : ఆడతనం.

అమ్మ కడుపులో నుండే ఆడపిల్లనని  
తెలియగానే ఛీత్కార ఛీదరింపులను
విదిలించుకొనే యుద్ధం.
ఆడ పిల్లనంటుా  అణచి వేతలకు గురైన అత్మ క్షోభతో
 స్వతంత్రత కోసం ఆలోచనలతో యుద్ధం.
 ఎప్పుడు ఎవరుఏమంటారో అని భయంతో  ధైర్యాన్ని కుాడగొట్టుకునేందుకు మనసుతో  యుద్ధం.
పెద్దవుతున్న కొలదీ ఆడతనపు ఆత్మ రక్షణకై యుద్ధం.
వయసు తెచ్చిన ఆడతనపు శారీరపు మార్పులను
కాముకుల కుృార దృష్టి నుండి తప్పించుకుంటుా
అనుకున్న గమ్యానికి చేరుకోడానికి 
ఆత్మస్థైర్యం పెంచుకునేందుకు అంతరాత్మతో యుద్ధం.
 పెళ్ళయ్యాక అత్తింటి వాతావరణానికి
 అలవాటు  పడుతుా,లోక మర్యాద కోసం చిరునవ్వుతో చేసే జీవితాంత యుద్ధం..
 ఇలా ఆడపిల్లగా తనకిష్టం లేని ఎన్నో
 పద్ధతులను తనవిగా చేసుకుంటుా అన్నింటికీ
 సద్దుకు పోవడానికి నిరంతరం చేసే పోరాటపు
 యుద్ధంలో ప్రతీక్షణం ఓడపోతుా ఎదుటివారిని 
 గెలిపిస్తుా చిరునవ్వుతో చివరి శ్వాశ దాకా 
 తనను తాను బైట పెట్టుకోలేని అశక్తతతో ,
 చంపుకోలేని తీరని ఆశల తో అనుక్షణం చేసే యుద్ధం.
 అసలు ఆడతనమే నేటి సమాజంలో స్వతంత్రం గాని
సమాన హక్కులు గాని లేని ఆరని కన్నీటి యుద్ధం.॥

(ఈ యుద్ధంలో ఆడపిల్లది తప్ప అందరిదీ గెలుపే..
అనుకుంటున్న వారంతా...
తానోడిపోతుా అందర్నీ గెలిపిస్తున్న ఆడతనపు
విలువని  ఈ సమాజం  ఎన్నాళ్ళకు గుర్తిస్తుందో ॥)
 
 
 రచన : శ్రీమతి :  జగదిుశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.


హామీ; ఈ కవిత ఏ మాధ్యమునందుా ప్రచురితం కాని నా స్వీయ రచన.
[1/5, 14:16] p3860749: 5/01/2021.
వారంవారం కవిలో....
అంశం :సంక్రాంతి. 
శీర్షిక .
సంక్రాంతి సంబరం.
--------------------------


రైతులకు సంబరం సంక్రాంతి వారికో వరం.
చేతికొచ్చిన పంటతో ఇంటింట  సంబరాల తోరణం ॥
విందు వినోదాలు, నేతి ఱుచుల పిండి వంటలు
పాత వస్తువుల మంట తో చలి కాపుల భోగీమంటలు॥

బుడబుడక్కుల వారి జానపదగీతాలు.
పగటి వేషగాళ్ళకు దానధర్మాలు .
గంగిరెద్దు ఆటలు గాలిపటాల ఎగురవేతలు.॥

కంచు గజ్జెల నాట్యంతో హరిదాసుల ఆశీర్వాదాలు.
అక్షయ పాత్రలు నిండు సిరితో అందుకొనే దానధర్మాలు
సంక్రాంతి పండగ కు పెద్దల తలపుల పితృ తర్పణాలు
బొమ్మల కొలువుతో ఆడపిల్లల ఆనంద గీతాలు॥

కనుమ నాటి మినుము పిండి వంటలతో రైతులు..
పంట పనిముట్లకు, పశు సంపదకు చేసేనిండు పుాజలు
కోడిపందాలాటలు వనభోజనాల సందళ్ళు .
ముక్కనుమ నాటి  మట్టి బొమ్మల బారు కొలువులు ॥

సద్ధర్మ సాంప్రదాయాల  ఆచార పాలనం 
ఆరోగ్యానందాలు నింపే మన పండగల సంబరం.
 శాంతి సంతోషాల నిత్య వసంతం. ॥
 --------------------------------------------------

రచన :శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ :మహారాష్ట్ర .
8097622021.

 ఎచటనుా ప్రచురితం కాని నా స్వీయ కవిత.
[1/13, 23:54] p3860749: వారం వారం కవిత లో 
అంశం ; నిరీక్షణ.
శీర్షిక: నా  నిరీక్షణ.

రచన:శ్రీమతి:పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ :మహరాష్ట్ర.
8097622021.
-----------------------------
------------------------

ప్రతీ ఒక్కరి జీవితంలో  తమకు ఇష్టమైన 
రంగం లో ప్రతిభ సాధించాలన్న తపన  .
చాలా మందికి నెరవేరని  ఆశల నిరీక్షణ.
ఆవకాశం రాని ఆటుపోట్ల జీవిత పోరాటం.
ఎప్పటికైనా తపన తీరదా అన్న ఆశల ఆరాటం.
ఒకప్పటి నాలోనుా అదే కోరిక .
సంగీత- సాహిత్యాలపై పెరుగుతున్న ఇష్టం.
అమ్మ దగ్గర నేర్చుకున్న సరగమల సంగీతం.
ఒరిస్సా లో కనపడని తెలుగు సంగీత గురువులు.
నాన్న ట్రాస్ఫర్ తో నాలో పెరిగిన ఆశలు.
అంతలోనే నాకు జరిగిన వివాహ వేడుక తో
అత్తంటి  బాధ్యతల మధ్య అణగిపోయిన కోరిక.
తీరని ఆశల నిరీక్షణలో తల్లినైన ఆనందం.
పిల్లల పెంపకం తో  తీరిక లేని క్షణాల పోరాటం.
భర్త ఉద్యోగరీత్యా ముంబై ప్రయాణం..
తెలియని ఊరిలో భాష తెచ్చిన  మొగమాటం.
తెలుగు కీర్తనలు నేర్పిన వారు లేని కొత్త లోకం.
సమయం దొరికినపుడల్లా తీసే కుానిరాగం.
నాలో  కోరికను పెంపొందించే  మొాహనరాగం 
పిల్లల పెళ్ళిళ్ళతో  తీరిన బాధ్యత...
అమమ్మ, నానమ్మల రుాపంతో మళ్ళీ మొదలైన
కొత్త జీవితపు పాత పరుగుల తీరిక లేని క్షణం.
వయసుతో పాటు తో అలసిన శరీరం..
నెరసిన జుట్టు తెచ్చిన పెద్దరికం , కోరిక తీరని 
 చిన్నతనం  చుాపుతున్న ఆశల ఆరాటం
అంతం లేని ఆరాటం తో ఆన్ లైన్ విద్యకై పోరాటం..
 అసహనపు కన్నీటి వెంట.నెట్ ప్రోబ్లమ్ తెచ్చిన తంటా  
 అరవై పదుల ఆర్భాటం ఆశతో నెట్  కోసం చేసే నిరీక్షణ ..కంప్యుాటర్ తో కుస్తీ. అరకొరగా వస్తుా 
 కట్ అవుతున్న కల్లోల కల కలం.
 కలల్లో కచేరీల ఫలం, నా నిరీక్షణకు తోడైన వరం .
 పెరుగుతున్న వయసుతో పెరుగుతున్న కోరిక.
 మారుతున్న టెక్నాలజీ తో ఆశల హార్మ్యాలు-
  సమంగా రాని నెట్ త నత్తనడక  నిరీక్షణలు..
  తీరని కోరిక తో నా.నిరీక్షణకు లేదు అంతం.
పొందేవరకు పొిరాడాలనుకోవడం నా పంతం.
అంతం కాని నా ఆశల నిరీక్షణ....ఎన్నాళ్ళో....
...
[4/9, 22:16] p3860749: 9/04/2021.
వారం వారం కవిత లో...
 ప్లవ నామ ఉగాది పై కవితల పోటీ కొరకు, 
 
 శీర్షిక : కల నిజమైతే...
 
 రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
8097622021.

నీలాకాశంలో తారకలు దోబుాచులాడుతున్నాయి.
పొగ జబ్బు పడిన మేఘాలు కోలుకొని 
తేట నీటి వసంతాలాడుతున్నాయి.
కిచకిచారవాల పకలరింతకు
పచ్చని పకృతి పులకరించిపోతోంది.
ఆకుపచ్చ చీరను అలరించిన భుామాత 
మల్లె ,జాజుల మాలలనల్లి 
సిగముడిలో సింగారించింది.
గలగల పారే ఏరులు,  పంట పొలాల్లో చేరి,
విత్తు చిన్నారులతో దోబుాచులాడుతున్నాయి.
స్వశ్ఛ మైన భరతావని పరిసరాల్లో 
మనుషులందరుా మాస్క్ లు వేసుకొని
సామాజిక దుారం పాటిస్తుా  సేనిటైజర్ల
చిలకరింపుల పలకరింపులతో 
పండగ ముచ్చట్లాడుకుంటున్నారు.
అంతా చుాస్త్తున్న ఆనందంలో బొక్కబోర్లా
పడ్డ నేను, కళ్ళు తెరచి చుట్టుా చుాసేను.
"నాకు వచ్చింది కలా....అదేగానీ నిజమైతే."..
అనుకుంటుా లేచేను..పర్యావరణ రక్షణ
తో పాటు కరోనా కట్టడి నియమాలను 
పాటించాలన్న నిర్ణయంతో ప్రతిన పుానేను.
అందరుా నాతో చేతులు కలుపుతారు కదుా....
"ప్లవ నామ యుగాది "శుభాకాంక్షలతో" .మీ ...🙏
------------------------------------------------------

హామీ: నా ఈ కవిత ఏ మాధ్యమునందునుా 
ప్రచురితంకాని నా స్వీయ రచన.
[5/5, 15:18] p3860749: వారం వారం కవిత లో...
అంశం  :  దోపిడీ.
శీర్షిక  : నిలువు దోపిడీ.

 కాల గమనంలో మారుతున్న
 మనుషుల అంతరంగాల
 మానసిక బలహీనతల దోపిడీ ॥
    
 వివేకం కోల్పోతున్న యువతను
 పెడబారి పట్టించి భావి భారత
 భవితను దోచుకుంటున్న 
 డ్రగ్ మాఫియాకోరుల దోపిడీ ॥
    
 కల్తీ బాసల తో నోట్లకు ఓట్ల కొనుగోలునీ
 కల్తీ విక్రయాలతో జనాల నమ్మకాన్ని
 సొమ్ము చేసుకుంటున్న సత్తా , --
 తొత్తుల సాధింపుల దోపిడీ॥
    
 వావి వరుసలు మరచిన
 కామాంధుల వికృతి చేష్టలకు
 పసి నుండి ముసలి వరకు గల 
అబలల మాన-ధన దోపిడీ..॥
    
 లేని రోగాన్ని ఆపాదించి
 వైద్యం పేరుతో అంగాంగాలను
 అమ్ముకుంటున్న వక్ర ఆలోచనగల
 వైద్య  దేవుళ్ళ  దోపిడీ ॥
  
 కరోనా కాటుకు ఊపిరందక...
 ఆక్సిజన్ కరువై అంతమౌతున్న
 జనాల చితిమంటలకు వెలకట్టి
విస్తృతంగా  దోచుకుంటున్న 
కార్చిచ్చు రేపిన కన్నీటి దోపిడీ ॥
 
అధికార బలంతో న్యాయానికి 
రెక్కలు విరిచి సామాన్యుల  
బ్రతుకు భారాన్ని పెంచిన 
చచ్చు రాజకీయాల చిచ్చు 
వేటల  నిలువు దోపిడీ ॥
-----------------------------
   రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.(మహరాష్ట్ర )
08097622021.

---------------.
హామీ : నా ఈకవిత ఏ మాధ్యమునుండీ 
ప్రచురితం కాని నా స్వీయ రచన.

No comments:

Post a Comment