దోబుాచులాడబోకు ముద్దుల కన్నా
నిను చుాడకుండ ఉండలేను నమ్మర కన్నా...॥
చిలికి వెన్న , పాలు , పెరుగు నైవేద్యముగా..నీకు
కలిపి తెచ్చినాను , కల్ల కాదుర కన్నా....॥ 2 ॥
చిత్తములో నీ రుాపు చిన్మయానందమౌ...
జ్యోతిగా నిలిపితిని చుాడర కన్నా...॥
ఆ జ్యోతి వెలుగు తోటలో , భక్తి నిండు పుాలు తెచ్చి
పుాజ సేయ వచ్చినాను చుాడర కన్నా..॥
మనసు నిండు వసంతమై, గొంతుపాడె కోయిలై
భక్తి గీతి భావ భరిత సంగీతమై...॥ నా
నోట పలుకు భావ గీతి నీదు మురళి పాట రీతి
వినిపించర వేడుకగా వరదా కన్నా...॥
నీ పదములె నా పలుకై, నా జీవము నీకొరకౌ
నిండు నుారు వసంతాల వరమిడు కన్నా..॥..నీ..
పదముల చిరు అడుగుల సడి ,
మురిపాల మువ్వల సిరి...
నా ఊపిరి లయగా నువు నిలుపర కన్నా...॥
దోబుాచులాడబోకు ముద్దుల కన్నా
నిను చుాడకుండ ఉండలేను నమ్మర కన్నా...॥
----------------------------------------------------------
రచన , శ్రీమతి ,
పుల్లాభట్ల.. జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.
------------
No comments:
Post a Comment