గొరసం వారు నిర్వహిస్తున్న ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా కవితల పోటీ
అంశం: ప్రపంచ జనాభా పెరుగుదల - నష్టాలు
శీర్షిక: జన నియంత్రణ నిశ్ఛయం .
ప్రక్రియ: సున్నితం
41.
రోజురోజుకుా పెరిగే జనబాహుళ్యం
ఇక్కట్ల బాటలో ప్రగతిరధం.
కేంద్ర ప్రణాళికలకు అవరోధం.
చుాడచక్కని తెలుగు సున్నితంబు॥
42.
జనభారంతో తరుగుతున్న భుాభాగం.
వనసంపదలు కరువౌతున్న దుర్భాగ్యం
ప్రదుాషణ వైపరీత్యాలతో ప్రకృతి.
చుాడచక్కని తెలుగు సున్నితంబు॥
43.
ఆహార వనరులు అంతంతమాత్రం.
నియంత్రణలేని జనుల పోరాటం.
ఆకలి చావులు అనునిత్యం.
చుాడచక్కని తెలుగు సున్నితంబు॥
44..
కాలుష్యంతో పొడిబారిన మేఘం..
కురవని చినుకుకై జనారాటం.
తడిలేనిమట్టితో రైతన్నల పోరాటం .
చుాడచక్కని తెలుగు సున్నితంబు॥
45.
మందులేని మహమ్మారుల వీరవిహారం.
ప్రాణవాయువు కరువైన శాపం
అవగాహనలేని ఆచరణల లోపం.
చుాడచక్కని తెలుగు సున్నితంబు॥
రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
హామీ :
ఈ రచన నా సొంతమని దేనికీ అనువాదం అనుకరణ కాదు అని హామీ ఇస్తున్నాను.
No comments:
Post a Comment