అంశం:ఐచ్ఛికం
తేది: 23/7/2021
మ సా క: 21
〰️〰️〰️〰️〰️〰️
పి యస్ యస్ లక్ష్మీ,టీచర్
విశాఖ
శీర్షిక: విజయ గాధలు
ప్రక్రియ: ముక్తపదగ్రస్త అలంకారం(ఒక వాక్యం లో చివర విడిచిన పదంతో రెండవ వాక్య మొదటన వాడటం)
ఈ మాసపు కవిత సం: 15
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
బాల బాణుని వెలుగు
వెలుగు నింపు జగతిన
జగతిన ఉండునా ఏ దృష్యం?
ఏ దృష్యం అయినా తక్కువే!
తక్కువే వేడిమి ఉన్నా
ఉన్నా కాస్త సమయం ఎంతో
ఎంతో మందికి హాయి నిచ్చె
నిచ్చె చూసినంతగ తృప్తి
తృప్తితీర చెట్ల మాటునుండి చూడ
చూడముచ్చటగ నుండు పసిబిడ్డలా
పసిబిడ్డల నవ్వే మదినింపు ఉల్లాసం
ఉల్లాసం మనిషి కెపుడు ఆమ్లజనియే!
ఆమ్లజనియే లేకున్నా జీతం సున్నా!
సున్నాతో మొదలు పెట్టువాని విజయం
విజయం కే విజయకేతనమగు ఇలను!
ఇలను వీరి జీవనమే విజయగాధలగు!!
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
స్వీయకవిత.
No comments:
Post a Comment