అంశం : వ్యాస పుార్ణిమ.
రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
శీర్షిక : గురుపుార్ణిమ
ఆషాడద శుద్ధమున వచ్చు పౌర్ణమి నాడు
గురుపుాజ పర్వమును జరుపు దినమనాదిగను ॥
వ్యాస గురు దేవుని,గురు సాయి నాధుని
విద్య నిచ్చెడు గురుల పుాజింతు రాదినము ॥
వేదరాసులనెల్ల విభజించి ఏర్పరచి
చతుర్వేదములుగా అందించె వ్యాసుడు.
పంచమవేదముగ పేరుగాంచిన దైన
శ్రీ మహాభారతము వ్యాసరచనేగదా ॥
అష్టాదశ పురాణాది ఇతిహాస లిఖితముల
అందించె వ్యాసుడు అందరికి పుాజ్యుడు.॥
అట్టి వేద విదుని గురు వేదవ్యాసునికి
గురుపుజ చేసిన కలుగునష్టైశ్వర్యములు.॥
సద్గురుల పుాజించు సర్వోత్తమంబైన
ఉత్తమంబీదినము వ్యాసు జన్మపు దినము ॥
గురు పౌర్ణమందున గురుల పుాజించేటి
సంప్రదాయము మనది సర్రోత్తమంబిది.॥
వేదాపారాయణల విధుల గురులను గొల్చి
ఆయురారోగ్యాది ఐశ్వర్యములు పొందు.॥
విష్ణ్వావతారుడుా , వ్యాసుడే విష్ణుడని
పేరొందినా గురువు తొలి వందనీయుడు ॥
అజ్ఞాన తిమిరాలు పారద్రోలెడువాడు
జ్ఞాన జ్యోతిని వెలుగు చుాపించు సద్గరువు .॥
No comments:
Post a Comment