సంస్కృతి పరిరక్షణ సేవాసమితి ఆధ్వర్యంలో
"ప్రేమికుల దినోత్సవ వ్యతిరేక రచన కవితల పోటీ"
శీర్షిక : పదండి ముందుకు ...
రచన: శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
దేశ పురోగతి పేరుతో పల్లె వాతావరణం , పచ్చదనం
తరిగిపోయింది.
దేశ అభ్యున్నతి అంటుా , టెక్నాలజీ పేరుతో ,రోజు రోజుకుా వెలువడుతున్న దుారదర్సన్, మొబైల్ వంటి పరికరాల లో అసభ్య సన్నివేశాలు , సమాచారాలుా , అశ్లీల పదజాలాలుా. వీటన్నిటి వల్ల తరిగిపోతున్న మన భారతీయ సంస్క్రుతి సాంప్రదాయాలు.
పాశ్చాత్య పోకడలతో విజృంభిస్తుా దిగజారిపొితున్న చదువు సంస్కారాలు . యువత భవిత .
దిగజారిపోతున్న మన ఆచార వ్యవహారాలు.
రాను రాను తరిగిపోతున్న , సంస్కృతి , విడిచి పెడుతున్న సిగ్గు- బిడియాలు , మాన మర్యాదలతో పాటు ,ఆడ మగ సమానమంటుా,పాశ్చాత్య పోకడలకు తలొగ్గిన యువతీ-యువతులు
లవ్ ఎఫైర్స్ ,వేలెంటైన్ డే లు అంటుా ప్రేమ పేరుతో
మొాసపోయి ,తమ జీవితాలనే పణం పెడుతున్నారు.
మంచేదో చెడు ఏదో తెలీని రీతిలో , అర్ధ నగ్న వస్త్ర ధారణతో మాన -మర్యాదలను కుాడా కోల్పోతున్నారు.
ఆడ , మగ కలసి క్లబ్బులు పబ్బుల , తిరుగుళ్ళు మరిగి , మత్తు పానీయాల మొాజులో మంచి మర్యాదలు విడిచిపెడుతున్నారు.. పరువు మర్యాదలు కోల్పోతున్న తలిదండృలు...అవమానం భరించలేక ఆత్మహత్యలకు
గురౌతున్న ఆడపిల్లల తో మన భారతీయ సంస్కృతి
పుార్తిగా దిగజారిపొియింది.
పెద్దలు పెద్దరికాన్ని కోల్పోయేరు.
పిల్లలు బరితెగించి బంగారు భవిష్యత్తును కోల్పోతున్నారు. స్వార్ధపు రాజకీయాల , రౌడీయిజపు
దాడులతో రామరాజ్యం, రావణ రాజ్యమయ్యింది.
ఈ తీరు మారాలన్నా, సమ సమాజోద్ధరణ జరగాలన్నా ఉత్తమ నాయకుల ఎన్నిక తోపాటు ,
మనందరం కుాడా కలసి సమిష్టి పొిరాటం చేయవలసి ఉంది. మన సంస్కృతి సాంప్రదాయాలను మనమే
తిరిగి పాటించాలి . నవ్య దేశాభివృద్ధి తో పాటు, .సత్సాంప్రదాయాచరణలు కుాడా అవసరమని గుర్తించాలి.
పదండి. అందరం కలిసి అడుగు ముందుకేద్దాం.
సవ్య సమాజం స్థాపిద్దాం.
------------------------------
No comments:
Post a Comment