5/07/2021
మెట్రో ఉదయం జాతీయ తెలుగు దినపత్రిక
మరియు ఉదయ సాహితీ వేదిక కర్నూల్ ,& హైదరాబాద్ సంయుక్తంగా నిర్వహిస్తున్న
కవితల పోటీ...
క్రమ సంఖ్య : 127.
అంశం : నేటి రాజకీయం.
రచన : శ్రీమతి: పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ : మహారాష్ట్ర .
శీర్షిక : రాజకీయ రణరంగం.
డెభ్భై సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో
అస్తవ్యస్తమైన రాజకీయ వ్యవస్థ..
ఎదుగూ బొదుగుా లేని ఆర్ధిక పరిస్థితి.॥
సమర్ధత లేని అసమర్ధతల వైపరీత్యాలకు
చితికిపోయిన మధ్య తరగతి జీవితం.
నిరక్షరాస్యత నిండిన అమాయక
జీవితాల ఆశలుడిగిన అంతరంగం.॥
ప్రజల కలల సాకారానికి మాయా శ్రీకారం .
మాటల మంత్రాలతో చిత్తైన జనబాహుళ్యం.
వెరసి ...ఎన్నుకోబడిన బి.జె.పి.నాయకత్వం.॥
నోటు బందీతో మొదలైన రాజకీయ వైఫల్యం .
ప్రజల జీవితాలపై పడిన జి.ఎస్.టిల భారం.
గేస్,పెట్రోల్ డీజల్ ధరల పెంపుతో అట్టుడికిన-
ప్రజా జీవితం, ప్రజలకు బి.జె.పి.పై దిగజారిన గౌరవం॥
రోజుకో" స్కామ్ "తో ,ప్రజల సొమ్ము దోపిడీ.
రాజకీయ కుంభకోణాలతో దిగజారిన దేశం గతి .
న్యాయమడిగితే శిక్ష. ఎదురు తిరిగితే హత్యలతో
వేల కుటుంబాలు రోడ్డు కెక్కిన పరిస్థితి.॥
వాక్ స్వాతంత్ర్యం లేని వరుస దురాగతాలు .
కామాంధుల రాక్షసత్వానికి అబలల ఆగని
కన్నీటి చావులు.
కరోనా కలకలం లో వలస కుాలీల కన్నీటి దారి
ఉలికు పలుకు లేని కేంద్ర నిర్లక్ష్య వైఖరి .
అవినీతి నిర్ముాలన పేరుతో అరాచకాల ప్రభావం
రచ్చకెక్కుతున్న రాజకీయాలతో విసిగి వేసారిన జనం.
నల్లధన నిర్ముాలన సాకుతో ఆర్ధిక స్థితి బలహీనం.
సత్తా తొత్తులకు రుణమాఫీ చేసిన చీకటి రాజకీయం.॥
(నే)రాలుా ఘోరాలు నిండిన నేటి రాజకీయం .
(టి.)వి ఛానల్స్ లో నిండిన అసత్య సమాచారం.
డబ్బుకు అమ్ముడుపోయిన దరిద్రపు జాడ్యం.ో
భావితర విసాశనానికి మార్గదర్శకం.॥
(రా)బందుల రాక్షసత్వం నిండిన రాజకీయం.
(జ)లగల్లా ప్రజల రక్తం పీల్చే పైశాచిక పాలనం.
(కీ)ళ్ళు విరిపి, ముంత చేతికిచ్చిన ముష్టి రాజకీయం.
(యాం)త్రిక జీవితానికి ఎదురీదుతున్న దీన జనం.
యజ్ఞ భుామియైన భారతావనికిది తీరని శాపం॥
హామీ:
నా ఈ కవిత ఏ మాధ్యమునందునుా ప్రచురితంకాని స్వీయ రచన.
No comments:
Post a Comment