Wednesday, July 28, 2021

ష్ట్రీట్ పోలీస్

చిత్ర కవిత. ష్ట్రీట్ పోలీసు జాగాలో  కుక్క

రచన : శ్రీమతి పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ .మహారాష్ట్ర .


1.
దొమ్మి చేసి సొమ్ము దోచేటి పోలీసు
నియమ మెరుగ డతడు  నీతి బాట
లంచ గొండి యౌ,కు లక్షణానఘు కన్న
కుటిల  బుద్ధి లేని  కుక్క మిన్న ॥
2.
నియమ పాల నమ్ము నిత్యక ర్తవ్యమౌ
పోలి సులవి నీతి    పొరలు చుండ ,
రాజ కీయ నీతి  రచ్చకెక్కుట జుాచి
గద్దె నెక్కె కుక్క ఘనము కాదె ॥
3.
కుక్క నియమ మేలి కుటిలనీ తినిబాప
మనిషి కీర్తి నీతి మహిని నిలుప
గద్దె నెక్కి నిలచె ఘనమైన రీతిలో
కార్య భార మేలె, సౌర్య మొప్ప ॥
4.
మాన వతను మరచి మనిషేలు గతిజుాచి
భవిత చరిత దలచి భయము తోడ
మనిషి బుద్ది తరుగ మసలుబా టనునిల్చి
 జాగి లమ్ము జేసె జాగ రమ్ము ॥
5.
భుామి జనుల గాచు  బుద్ధిహీను డతడు 
యుాని ఫార మున్న(అ)యొాగ్యు డతడు
మనిషి లంచ ములకు మహినిదా సుడుకాగ
విధిని తాను జేసె వీధి కుక్క  ॥

   

No comments:

Post a Comment